

Baby Care
21 January 2026 న నవీకరించబడింది
పగటిపూట కొన్ని గంటలు మాత్రమే నిద్రపోవచ్చు, కానీ పిల్లల మూడ్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే ఏడుపు, చికాకును తగ్గిస్తుంది. పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ పగటిపూట నిద్రపోయే పిల్లలు తక్కువ సార్లు అనారోగ్యానికి గురవుతారు. వారు పెరిగేకొద్దీ స్థూలకాయానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే మెరుగైన దృష్టిని కలిగి ఉంటారు. రాత్రి నిద్రలో కొరత ఏర్పడితే కూడా పగటిపూట నిద్ర భర్తీ చేస్తుంది. మొత్తం నిద్రలో కొంచెం కొరత ఏర్పడినా పిల్లలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. చురుకుదనాన్ని తగ్గిస్తుంది, అలసటను పెంచుతుంది.
మీ బిడ్డ వేగంగా ఎదిగే కొద్దీ, బాబు/పాప పాకడం, ఘన ఆహారాన్ని తినడం నేర్చుకునేటప్పుడు మార్పులు ఉంటాయి, అలాగే నిద్ర విధానంలో కూడా అదే రకంగా ఉంటుంది. నిద్ర విధానంలో మార్పును గుర్తించడానికి, మారిన అవసరాలకు అనుగుణంగా సమయాన్ని మళ్లీ సర్దుబాటు చేయడానికి నిద్ర వేళల్లో అలసటకు సంబంధించి ఏవైనా సంకేతాలు ఉన్నాయా అని గమనించండి.
వారాంతాల్లో, వారంలోని మిగిలిన రోజులలో నిద్ర వేళల్లో మార్పులు ఉంటే, మీ శిశువు కొంచెం గజిబిజిగా ఉండవచ్చు. డే కేర్ సెంటర్‌లో వేరొక దినచర్య, ఇంట్లో నిద్రపోయిన సమయాలు వేరుగా ఉండటం కూడా కారణం కావచ్చు. నిర్ణీత సమయంలో అరగంట వ్యవధిలోపే మీ పిల్లల కోసం స్థిరమైన నిద్ర సమయాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నించండి.
ఒకవేళ మీరు మీ పిల్లల అలసట సంకేతాలను గుర్తించకపోతే, బాబు/పాపలో అలసట అధిక స్థాయికి వెళ్లవచ్చు. ఈ సందర్భంలో, వారు కృత్రిమ శక్తి స్థితిని అనుభవించవచ్చు, దీని ఫలితంగా గజిబిజి, విసుగు, ఏడుపు కలగవచ్చు.
ఈ పరిస్థితిని పరిష్కరించడానికి, మీ పిల్లలకు నిద్ర వచ్చే సమయాలను ట్రాక్ చేయడం నేర్చుకోండి. సాధారణ నిద్ర సమయం దగ్గర పడుతుండగా, ప్రవర్తన లేదా హావభావాలలో ఏదైనా మార్పు ఉందేమో గమనించండి. అటువంటి మార్పునకు సంబంధించిన సంకేతాలను చూసిన వెంటనే మీ బిడ్డను నిద్రపుచ్చడానికి ప్రయత్నించండి.
పిల్లలు పగటిపూట సాధారణంగా 1-2 గంటల వరకు నిద్రపోతారు. అయితే పగటిపూట అంత కంటే ఎక్కువ సేపు నిద్రపోతే, రాత్రి ఆలస్యంగా నిద్రపోతారు. ఇలాంటి సందర్భంలో, నిద్ర వేళలను సరి చేయడానికి, అలాగే క్రమంగా ఉంచడానికి మధ్యాహ్న నిద్ర సమయాన్ని తగ్గించండి.
Day time naps for kids in telugu, Nap Schedule for your baby in telugu, Baby nap schedule in telugu, How long nap schedule lasts in telugu.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











సి-సెక్షన్ తర్వాత బరువు తగ్గడం: తక్షణ చిట్కాలు మరియు డైట్ ప్లాన్

కడుపుతో ఉన్నప్పుడు ఉల్లిపాయలు తినడం: ప్రయోజనాలు & దుష్ప్రభావాలు

రొమ్ము వాపు గురించి మరింత తెలుసుకోండి- కారణాలు, చికిత్స, లక్షణాలు (Know More About Breast Engorgement- Causes, Treatment & Symptoms in Telugu)

గర్భధారణ సమయంలో క్యారెట్: ప్రయోజనాలు & నష్టాలు | Carrot During Pregnancy: Benefits & Disadvantages in Telugu

పసిబిడ్డతో ప్రయాణాలు: ముఖ్యమైన భద్రతా చిట్కాలు (Traveling with a Newborn: Important Safety Tips in Telugu)

గర్భధారణప్పుడు యాపిల్ : గర్భధారణప్పుడు యాపిల్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు (Apple In Pregnancy: Benefits of Eating Apples During Pregnancy)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |