hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Best Foods arrow
  • ప్రెగ్నెన్సీ సమయంలో కివి పండు తినటం: మీరు తెలుసుకోవాల్సిన ప్రతీ విషయం ఇదిగో! (Benefits of Eating Kiwi Fruit During Pregnancy in Telugu) arrow

In this Article

    ప్రెగ్నెన్సీ సమయంలో కివి పండు తినటం: మీరు తెలుసుకోవాల్సిన ప్రతీ విషయం ఇదిగో! (Benefits of Eating Kiwi Fruit During Pregnancy in Telugu)

    Pregnancy Best Foods

    ప్రెగ్నెన్సీ సమయంలో కివి పండు తినటం: మీరు తెలుసుకోవాల్సిన ప్రతీ విషయం ఇదిగో! (Benefits of Eating Kiwi Fruit During Pregnancy in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    ప్రెగ్నెన్సీ సమయంలో కివి పండు తినటం వలన లాభాలు (Benefits of Eating Kiwi Fruit During Pregnancy in Telugu)

    కడుపుతో ఉన్నప్పుడు- ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలాగే తినే ఆహార రకాల గురించి చాలా అప్రమత్తంగా ఉండటం సరైన పని. కివి పండుని చైనీస్ ఉసిరి రకాలలో ఒకటిగా భావిస్తారు, ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

    ప్రెగ్నెన్సీ సమయంలో కివి పండు తినవచ్చా? (Is it Okay to Consume Kiwi Fruit During Pregnancy in Telugu)

    కివి పండు ప్రెగ్నెన్సీ సమయంలో తినగలిగే చాలా మంచి పండు. కేవలం కివి పండుతో అలర్జీ ఉంటే మాత్రమే అది తినకుండా ఉండవచ్చు. పుప్పొడి ఇంకా లేటెక్స్ లతో అలర్జీ ఉన్నవారు సాధారణంగా కివి పండుతో కూడా అలర్జీకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ అలర్జీ లక్షణాలలో చర్మంపై ర్యాష్లు, పెదవులు వాయడం ఇంకా ఇతర సాధారణ అలర్జీ లక్షణాలు ఉంటాయి. ఈ పండులో విటమిన్లు A,C,E, ఇంకా K, ఫోలేట్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో చక్కెర శాతం కూడా తక్కువగా ఉంటుంది, అందుకని ఆరోగ్యకరమైన స్నాక్ గా తినవచ్చు. రోజుకి రెండు మూడు కివి పండ్లు తినడం ఖచ్చితంగా సురక్షితమైనదే.

    కడుపుతో ఉన్నప్పుడు కివి పండు తినటం వలన వచ్చే లాభాలు (Benefits of Eating Kiwi Fruit During Pregnancy in Telugu)

    కడుపుతో ఉన్నప్పుడు రకరకాల వేవిళ్ళు అంటే ఏవైనా ఇష్టమైన పదార్థాలు తినాలన్న బలమైన కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే గర్భం యొక్క ప్రతిదశలో సరైన ఆహారం తినడం కూడా చాలా ముఖ్యం. గర్భవతిగా ఉన్న మహిళ ప్రెగ్నెన్సీ సమయంలో రోజూ కివి పండ్లని తినడం వలన వచ్చే లాభాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

    1. మొదటి ట్రైమిస్టర్ సమయంలో: (During the first trimester:)

    గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి ట్రైమిస్టరులో కివి పండ్లు తినటం చాలా బావుంటుంది, ఎందుకంటే దానిలో ఈ కింది అవసరమైన పోషకాలు ఉంటాయి: ఈ పండులో ఫోలేట్ తక్కువ మొత్తంలో ఉంటుంది. బిడ్డ యొక్క న్యూరల్ ట్యూబ్ లోపం నివారించడానికి ఫోలేట్ చాలా ముఖ్యమైనది. ఆడవారు గర్భం దాల్చడానికి ముందు ఇంకా తర్వాత తగినంత పోలిక్ యాసిడ్ ని శరీరంలో కలిగి ఉండాలి. ఒంట్లో ఫోలిక్ యాసిడ్ స్థాయి 400 MCG గా ఉండాలి. కివి పండులో దాదాపుగా 15-20 MCG ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. రోజుకి రెండు కివి పండ్లు తినటం మీ ఆరోగ్యానికి సాయపడుతుంది. శరీరం ఐరన్ ను పీల్చుకోవడానికి విటమిన్ C అవసరం. కివి పండులో దాదాపు 70MCG విటమిన్ C ఉంటుంది. కడుపుతో ఉన్న మహిళలు ఐరన్ ని పీల్చుకోగలగడం చాలా ముఖ్యం, ఎందుకంటే తల్లికి, బిడ్డకి ఐరన్ అవసరం. ఐరన్ న్యూరో ట్రాన్స్మిటర్లని తయారు చేయడంలో సహాయపడుతుంది. ఇవి సమాచారాన్ని చేరవేసే రసాయన నిర్మాణాలు. ఇవి లేకుండా శరీరం పనిచేయలేదు. కివిలో కాల్షియం కూడా తక్కువ మొత్తాలలో ఉంటుంది. తల్లీబిడ్డలు ఇద్దరికీ ఎముకల బలాన్ని రక్షించుకోవటం చాలా ముఖ్యం. కివి పండులో దాదాపు 2౦ – 25 MCGల కాల్షియం ఉంటుంది. ప్రత్యేకించి, లాక్టోస్ లేదా డైరీ పదార్థాలు పడనివారికి ఇది చాలా అద్భుతమైనది.

    2. రెండవ ట్రైమిస్టరు సమయంలో: (During the second trimester)

    కివి పండ్లలో లెక్కించదగ్గ మొత్తంలో పీచుపదార్థం ఉంటుంది. కివి పండ్లలో దాదాపు 2 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఇది ప్రేగు కదలికలకి సాయపడుతుంది. సాధారణంగా కడుపుతో ఉన్నప్పుడు మలబద్ధకం నుండి విరేచనాల వరకూ రకరకాల ప్రేగు కదలికలు అనుభవంలోకి రావచ్చు. హార్మోన్ల స్థాయిలలో అదే పనిగా హెచ్చుతగ్గులు వీటికి కారణమని చెప్పవచ్చు. గర్భం 2వ ట్రైమిస్టరులోకి కొనసాగినప్పుడు, విటమిన్ A, జింక్, కాల్షియం, ఐరన్, అయోడిన్, అలాగే ఒమేగా-౩-ఫ్యాటీ యాసిడ్ల అవసరం పెరుగుతుంది. కివిలో దాదాపు 2 MCGల విటమిన్ A అలాగే ఇతర పోషకాల యొక్క అతి తక్కువ మొత్తాలు ఉంటాయి. కివి పండు విటమిన్ E యొక్క ముఖ్యమైన వనరు అని చెప్పవచ్చు, ఈ విటమిన్ తల్లీబిడ్డల శరీరంలో కణాలు నాశనం అవకుండా కాపాడుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.

    3. మూడవ ట్రైమిస్టరు సమయంలో: (During the third trimester)

    మూడవ ట్రైమిస్టరులో గర్భవతిగా ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ కారణంగా వచ్చే తర్వాత స్థాయి ఆరోగ్య సమస్యలతో డీల్ చేస్తూ ఉంటారు, కడుపుతో ఉన్నప్పుడు వచ్చే డయాబెటిస్ అందులో ఒకటి. కివి పండులో గ్లూకోజ్ తక్కువ స్థాయిలో అంటే దాదాపు 1 టేబుల్ స్పూన్ అంత మాత్రమే ఉంటుంది. ఈ పండుని తీపి తినాలనిపించే కోరికని తగ్గించటానికి ప్రత్యామ్నాయంగా తినవచ్చు. కివి పండులో విటమిన్ K కూడా ఉంటుంది, ఇది ఆరోగ్యం సరికావడంలో అలాగే రక్తం గడ్డకట్టడంలో అవసరం.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట అంటే ఏమిటి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

    ప్రెగ్నెన్సీ సమయంలో కివి పండు తినడం వలన వచ్చే చెడు ప్రభావాలు (Side Effects of Kiwi Fruit During Pregnancy in Telugu)

    ముందు చెప్పినట్లుగా, కొంతమందికి కివి పండ్లు అలెర్జీని కలిగిస్తాయి. ఈ అలెర్జీ కివి పండుని కొన్నిసార్లు తిన్నాక లేదా మీకు ఇదివరకే లేటెక్స్ లేదా పుప్పొడికి సంబంధించిన అలెర్జీ ఉంటే అభివృద్ధి చెందుతుంది.

    • మీకు ఒకవేళ కివి పండు తిన్నప్పుడు నోట్లో అలాగే గొంతులో దురదగా అన్పిస్తే, దద్దుర్లు వస్తే, వాపు వస్తే లెదా ఏదైనా నొప్పి, వాంతులవంటివి వస్తే తినడం మానేయాలి.
    • కొన్నిసార్లు నోటి అలెర్జీలు కూడా రావచ్చు. నోరు జలదరించటం, వాపులాంటి లక్షణాలు కూడా రావచ్చు. కొన్ని కేసులలో, ఆస్తమా, దద్దుర్లు కూడా మొదలవ్వచ్చు.
    • కివి పండ్లలో పుష్కలంగా విటమిన్ C లభిస్తుంది. కానీ అది క్లోమగ్రంథికి హాని కలిగించవచ్చు. అది కొలెస్ట్రాల్ పెరుగుదలని ప్రేరేపించి, నష్టాన్ని కలిగించవచ్చు.

    ఫంగస్ వ్యతిరేక మందులతో కలిపినప్పుడు, ఇది ఎడిక్టివ్ ఎఫెక్ట్ను చూపిస్తుంది. నిజజీవితంలో ఈ కాంబినేషన్ ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. మీ ఆహారంలో ఏదైనా కొత్త పదార్థం లేదా పండ్లను చేర్చుకునేటప్పుడు మీ గైనకాలజిస్ట్ ను అలాగే డైటీషియన్ను సంప్రదించడం మంచిది. వారు ప్రెగ్నెన్సీ సమయంలో మీ ఆరోగ్యానికి ఏది మంచిదో మెరుగైన సలహాని అందిస్తారు. కడుపుతో ఉన్నప్పుడు ఏమేం తింటున్నారో, ఖచ్చితంగా, జాగ్రత్తగా చూడడం ముఖ్యం. ఈ సమయంలో శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. కివి పండు బిడ్డ ఎదుగుదలకు సహాయపడే చాలా పోషకాలను అందించడంలో ఉపయోగపడుతుంది. ఏదైనా పరిమితిగా తినకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని ఆరోగ్యకరమైన ఆహారం అయినా, అనారోగ్యకరమైన ఆహారమైనా అన్నీ మితంగానే తినాలి.

    Tags:

    Kiwi during pregnancy in telugu, Benefits of eating Kiwi during pregnancy in telugu, Side effects of eating Kiwi during pregnancy in telugu, Nutritional value of Kiwi fruit during pregnancy in telugu. Kiwi fruit benefits during pregnancy In English, Kiwi fruit benefits during pregnancy In Hindi, Kiwi fruit benefits during pregnancy In Tamil, Kiwi fruit benefits during pregnancy In Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.