hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Journey arrow
  • ప్రెగ్నెన్సీ సమయంలో లో దుస్తులు ధరిస్తే చర్మం ఎందుకు దురద పెడుతుంది? (Why Wearing Bra Can be Itchy During Pregnancy in Telugu?) arrow

In this Article

    ప్రెగ్నెన్సీ సమయంలో లో దుస్తులు ధరిస్తే చర్మం ఎందుకు దురద పెడుతుంది? (Why Wearing Bra Can be Itchy During Pregnancy in Telugu?)

    Pregnancy Journey

    ప్రెగ్నెన్సీ సమయంలో లో దుస్తులు ధరిస్తే చర్మం ఎందుకు దురద పెడుతుంది? (Why Wearing Bra Can be Itchy During Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భం దాల్చిన సమయంలో మహిళలను ఎక్కువగా చికాకు పెట్టే అంశం దురదలు. సాధారణంగా ప్రెగ్నెన్సీతో స్త్రీల హార్మోన్లలో, శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వాటిలో బరువు పెరగడం, అలసట, అస్వస్థత, వికారం వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఎక్కువ దురదల సమస్య వేధిస్తుంది. యోని, బ్రెస్ట్‌ వద్ద కూడా దురదలు వస్తాయి. బ్రెస్ట్‌ ప్రాంతంలో దురద ఉంటే మెత్తని బ్రాని కొనుగోలు చేయడంతో సమస్య తగ్గుతుంది. చాలా సందర్భాల్లో మహిళలు శరీరంలో ఊహించని భాగాల్లో దురదను అనుభవించొచ్చు.

    ప్రెగ్నెన్సీ సమయంలో ధరించే బ్రా వలన దురద వస్తుందా? (Does Wearing Bra Can Make Your Skin Itchy in Telugu?)

    ప్రెగ్నెంట్ వుమెన్ ధరించే బ్రా వలన కొన్ని సార్లు తీవ్రమైన దురదను అనుభవించొచ్చు. బ్రెస్ట్‌ దురదగా అనిపిస్తే చర్మం స్ట్రెచ్ అయిందని అర్థం. అంతే కాకుండా బ్రెస్ట్‌ పరిమాణంలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. బ్రెస్ట్‌ పరిమాణంలో ఎక్కువ మార్పును గమనించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో చేయాల్సిందల్లా మెత్తని లైట్ వెయిట్ నర్సింగ్ బ్రా కొనుగోలు చేయడం.

    బ్రెస్ట్‌లో కొవ్వు అనేది పేరుకుపోతుంది, క్షీరగ్రంథులు (బిడ్డకు పాలిచ్చేందుకు ఉపయోగపడేవి) అభివృద్ధి చెందుతాయి. శిశువు రాకకోసం శరీరం సిద్ధమవుతున్న దశలుగా వీటిని గుర్తించాలి. బ్రెస్ట్‌ వద్ద దురద, లేదా సెన్సిటివ్ నిపుల్స్ అనుభవించొచ్చు. చాలా సందర్భాల్లో ఈ దురద అనేది అరియోలా (నిపుల్స్ చుట్టూ ఉండే ప్రాంతం) వరకే పరిమితం అయి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో దురద అనేది మొత్తం బ్రెస్ట్‌లకు వ్యాపిస్తుంది. అటువంటి సమయంలో తేలికగా ఉండే ప్యాడెడ్ వైర్​ఫ్రీ నర్సింగ్ బ్రా ఉపయోగకరంగా ఉంటుంది.

    హార్మోన్ల హెచ్చుతగ్గుల వలన చర్మం ఎలాస్టిసిటీ (స్థితిస్థాపకత) మారుతుంది. అందువల్ల శరీరం చర్మం చుట్టూ దురద కలుగుతుంది. బొడ్డు, తొడలు, భుజాలు, బ్రెస్ట్‌, మొదలయిన ప్రదేశాలలో తీవ్రమైన దురదను అనుభవించొచ్చు.

    ప్రెగ్నెన్సీ సమయంలో అందరూ బ్రెస్ట్‌ వద్ద దురదను అనుభవిస్తారా? (Do Everyone Feel Itchy During Pregnancy in Telugu?)

    ప్రెగ్నెన్సీ సమయంలో అందరు స్త్రీలు దురదను అనుభవించరు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడైనా దురద సంభవించొచ్చని తెలుసుకోవడం ముఖ్యం. నిజానికి ఊహించిన దానికంటే ఎక్కువగా కూడా దురదలు రావొచ్చు. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సాధారణ దశ. దురద భరించలేనంతగా ఉంటే వైద్యుడిని సంప్రదించొచ్చు. మరింత సౌకర్యం కోసం బెస్ట్ లైట్లీ ప్యాడెడ్ నర్సింగ్ బ్రా వినియోగించవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరం దురదలను భరించడం శారీరకంగా, మానసికంగా సవాలు. ప్రసవం తర్వాత ఈ దురదలు తగ్గుతాయి. దురదను తగ్గించుకునేందుకు కొన్ని రకాల చికిత్సలను తీసుకోవాలి. శరీరంలోని హార్మోన్ స్థాయిలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం వలన దురదతో పాటుగా శరీరం మీద కొన్ని సాగిన గుర్తులను కూడా గమనించొచ్చు. నిజానికి ఈ సాగిన గుర్తులు పొట్ట, పిరుదులు, చేతుల మీద కూడా కనిపించవచ్చు. ఈ సాగిన గుర్తులను బ్రెస్ట్‌ మీద కూడా గమనిస్తే ఫుల్లీ కవరేజ్ లైట్లీ ప్యాడెడ్ బ్రా ధరించడం మేలు .

    దురద నుంచి ఉపశమనం ఎలా పొందాలి? (How to Get Relief From Itchiness?)

    దురద వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం సహాయకరంగా ఉన్నప్పటికీ.. చికాకు తగ్గించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని ఇంటి చిట్కాలు చర్మం మరింత మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతాయి. ఇవి చర్మానికి ఉపశమనాన్ని అందజేస్తాయి. చికాకును అదుపులో ఉంచుతాయి. అటువంటి కొన్ని చికిత్సలు ఇవే..

    మాయిశ్చరైజ్ (Moisturise)

    రోజంతా హైడ్రేట్​గా ఉండేలా చూసుకోవాలి. కొన్ని శరీర ప్రాంతాలలో తేమ ఉండకుండా చూసుకోవాలి. హార్మోన్ లెవల్స్​ హెచ్చుతగ్గులకు లోనవుతున్నడు స్కేలీ ఎపిడెర్మిస్​ను అనుభవించొచ్చు. ఈ సమయంలో ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం మేలు చేస్తుంది. దురద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నూనె లేదా క్రీమ్ రాస్తే ఉపశమనం కలుగుతుంది.

    వదులుగా ఉండే దుస్తులు ధరించాలి (Wear loose dress)

    బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వలన శరీరంపై దద్దుర్లు ఏర్పడొచ్చు. అందువల్ల శరీరానికి గాలి బాగా తగిలేలా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. వదులుగా ఉండే దుస్తులు శరీరాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుతాయి. బ్రెస్ట్‌ వద్ద దురదగా ఉంటే ఉపశమనం పొందేందుకు లైట్ వెయిట్ ప్యాడెడ్ బ్రా కొనుగోలు చేయడం మంచిది. బిగుతుగా ఉండే దుస్తులు చర్మాన్ని వేడిగా ఉంచుతాయి. ఇది ఒక రకమైన దురదకు దారితీస్తుంది.

    దురద నుంచి ఉపశమనం పొందేందుకు మెడికేటెడ్ క్రీమ్ ఉపయోగించాలి (Use Medicated Creams)

    దురద నుంచి తక్షణ ఉపశమనాన్ని అందించేందుకు నేడు మార్కెట్లో అనేక సంఖ్యలో క్రీములు ఉన్నాయి. ఈ క్రీములు కాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందేందుకు ముఖ్యమైన నూనెలతో తయారు చేసిన కాటన్ ప్యాడ్లను కూడా ఉపయోగించొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో నోటి ద్వారా తీసుకునే మందులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే ఈ మందులు బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపించవచ్చు.

    ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి (Eat Fiber Rich Foods)

    కొన్ని సార్లు తినే ఆహారాలు చర్మాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. పేగులను సురక్షితంగా ఉంచుకునేందుకు పండ్లు, కూరగాయలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో సురక్షితమైన ఫైబర్ సప్లిమెంట్ గురించి తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించండి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ లేదా తల్లి పాలిచ్చే సమయంలో సరైన సైజు మరియు ఖచ్చితంగా ఫిట్ అయ్యే మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా పొందడానికి అనుసరించాల్సిన టాప్ 5 టిప్స్

    డెలివరీ తర్వాత కూడా దురదలు ఉంటే.. (If Its Itching Even After Delivery?)

    ప్రెగ్నెన్సీ సమయంలో దురద చాలా అసౌకర్యంగా, చికాకుగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బ్రెస్ట్‌ ప్రారంతంలో దురద ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డెలివరీ తర్వాత దురద సాధారణంగా పోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా దురద అలాగే వైద్యుడిని సంప్రదించండి.

    Tags:

    Wearing bra during pregnancy in telugu, Does wearing bra can make you feel itchy in telugu, Bra makes you feel itchy during pregnancy, Maternity bra during pregnancy in telugu, itchiness during pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.