hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Postnatal Care arrow
  • ప్రసవానంతర స్టెరిలైజేషన్: విధానం & సమస్యలు arrow

In this Article

    ప్రసవానంతర స్టెరిలైజేషన్: విధానం & సమస్యలు

    Postnatal Care

    ప్రసవానంతర స్టెరిలైజేషన్: విధానం & సమస్యలు

    3 November 2023 న నవీకరించబడింది

    స్టెరిలైజేషన్ అంటే ఏమిటి?

    స్టెరిలైజేషన్ అనేది శాశ్వతంగా జనన నియంత్రణ చేసే ఒక ప్రక్రియ. ఇది ఫెలోపియన్ ట్యూబ్‌లను అడ్డుపడటం ద్వారా ఫలదీకరణాన్ని నిరోధిస్తుంది. స్టెరిలైజేషన్ అనేది ఇతర గర్భనిరోధక పద్ధతుల నుండి భిన్నంగా ఉంటుంది. ఇది శాశ్వత ప్రక్రియ. గర్భనిరోధకం యొక్క ఇతర పద్ధతులు భవిష్యత్తులో గర్భధారణకు అనుమతిస్తాయి. అయితే స్టెరిలైజేషన్ ఆ అవకాశాన్ని ఇవ్వదు. అయితే.. స్టెరిలైజేషన్‌లో హార్మోన్ల ప్రభావం ఉండదు. స్టెరిలైజేషన్ అనేది సాధారణంగా వారికి (ఎక్కువ) పిల్లలు అక్కర్లేదని ఖచ్చితంగా భావించే వ్యక్తులకు సిఫార్సు చేస్తారు. ఈ వ్యాసంలో ప్రసవానంతర స్టెరిలైజేషన్ అంటే ఏమిటి? అది ఎలా చెయ్యబడుతుంది? దాని ప్రయోజనాలు ఏమిటి? కొన్ని సాధారణ ప్రసవానంతర స్టెరిలైజేషన్ సమస్యల గురించి చర్చిస్తాము.

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ అంటే ఏమిటి?

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ అనేది సిజేరియన్ ద్వారా జన్మనిచ్చిన వెంటనే స్త్రీకి (లేదా యోని డెలివరీ అయిన 8 నుండి 12 గంటలలోపు) చేసే శస్త్రచికిత్స. ఇది గర్భనిరోధకం కోసం చేసే శాశ్వత ప్రక్రియ. ప్రసవానంతర స్టెరిలైజేషన్ యొక్క అత్యంత సాధారణ రకాన్ని ట్యూబల్ లిగేషన్ అంటారు. ఈ శస్త్రచికిత్సలో ఫెలోపియన్ ట్యూబ్‌లను ముడి వెయ్యడం లేదా కత్తిరించడం జరుగుతుంది. ఇది అండాశయాల నుండి గర్భాశయానికి గుడ్లు ప్రయాణించకుండా నిరోధిస్తుంది. ప్రసవానంతర స్టెరిలైజేషన్ అనేది గర్భధారణను నివారించడానికి చేసే సురక్షితమైన మరియు ప్రభావవంతమైన మార్గం. ఈ శస్త్రచికిత్సను ఎంచుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రణాళిక లేకుండా గర్భం దాల్చటానికి కారణాలు ఏమిటి? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది, వాటిలో ముఖ్యమైనవి కొన్ని:

    • ఇది 10 సంవత్సరాల వ్యవధిలో 1.85% వైఫల్యం రేటుతో అత్యంత ప్రభావవంతమైన గర్భనిరోధకం.
    • ఇది గర్భనిరోధకం యొక్క శాశ్వత మార్గము. కాబట్టి మీ జీవితాంతం ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు.
    • ఇది తల్లి చనుబాలివ్వడానికి అడ్డుపడదు.
    • మీరు వాడుతున్న గర్భనిరోధకాన్ని ఇక మీదట వాడనవసరం లేదు. దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది.
    • ప్రసవించిన వెంటనే ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి వేచి ఉండే అవసరం ఉండదు.
    • ఇది సురక్షితమైన మరియు అతి తక్కువ ఇన్వేసివ్ శస్త్రచికిత్స.
    • దీనికి సాధారణ చెక్ అప్‌లు లేదా నిర్వహణ అవసరం లేదు.

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ ఎలా జరుగుతుంది?

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ అనేది శస్త్రచికిత్సా ప్రక్రియ. ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్‌లు మూసుకుపోయి గుడ్లు గర్భాశయంలోకి చేరకుండా నిరోధించబడతాయి. వైద్యులు పొత్తికడుపు కోత లేదా లాపరోస్కోపిక్ (కీహోల్ సర్జరీ) ద్వారా ఈ ప్రక్రియను చేయవచ్చు. ఇతర ప్రసవానంతర స్టెరిలైజేషన్ పద్ధతులలో ఫెలోపియన్ ట్యూబ్‌లలో కాయిల్స్ లేదా క్లిప్‌లు వంటి పరికరాలు ఉంచబడి ఉంటాయి. ఈ పద్ధతులు గుడ్లు వెళ్ళకుండా నిరోధించేందుకు అడ్డంకులను కలిగించడం ద్వారా ఇవి పని చేస్తాయి (అటువంటి ప్రక్రియలు చాలా వరకు నిలిపివేయబడ్డాయి).

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ యొక్క వివిధ పద్ధతులు ఏమిటి?

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ చేసేందుకు వివిధ విధానాలు ఉన్నాయి. ప్రతి పద్దతికి వాటి వాటి ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఉన్నాయి. అత్యంత సాధారణ పద్ధతి ట్యూబల్ లిగేషన్ అనే శాశ్వత గర్భనిరోధక పద్ధతి. ఇది సాధారణంగా జనరల్ అనస్థీషియా ఇవ్వడం ద్వారా చెయ్యబడుతుంది. ఫెలోపియన్ ట్యూబ్‌లను చేరుకునేందుకు పొత్తికడుపుకు ఒక చిన్న కోత చెయ్యబడుతుంది. ట్యూబ్‌లకు ముడివెయ్యబడతాయి లేదా కత్తిరించబడతాయి కాబట్టి గుడ్లు వాటి గుండా ప్రయాణించలేవు. యోని డెలివరీ అయిన 8 నుండి 12 గంటలలోపు ట్యూబల్ లిగేషన్ ప్రక్రియ చెయ్యబడుతుంది. అలాగే శిశువు సిజేరియన్‌లో పుట్టినప్పుడు, ఇది సి-సెక్షన్ సమయంలో నిర్వహించబడుతుంది. ప్రసవానంతర స్టెరిలైజేషన్ యొక్క కొన్ని నాన్-సర్జికల్ పద్ధతులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కాపర్ IUD. IUD అనేది డెలివరీ తర్వాత గర్భాశయంలోకి చొప్పించబడిన తాత్కాలిక గర్భనిరోధకం. ఇది గర్భాశయ లైనింగ్‌లో తాపజనక ప్రతిస్పందనను కలిగించడం ద్వారా పనిచేస్తుంది. దీని వల్ల గుడ్లు ఇంప్లాంట్ చేయడం కష్టతరం చేస్తుంది.

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి?

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ వల్ల కొన్ని సంభావ్య దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి:

    • పొత్తి కడుపు నొప్పి.
    • ఇన్ఫెక్షన్.
    • వికారం.
    • మైకము.
    • రక్తస్రావం.
    • రక్తం గడ్డకట్టడం.
    • ట్యూబల్ లిగేషన్ సిండ్రోమ్ (పెల్విక్ నొప్పి, ఋతు క్రమరాహిత్యాలు మరియు ఇతర లక్షణాలకు కారణమయ్యే అరుదైన పరిస్థితి).

    మొత్తంమీద, ప్రసవానంతర స్టెరిలైజేషన్ అనేది భవిష్యత్తులో కలిగే గర్భాలను నివారించడానికి చేసే సురక్షితమైన మరియు ప్రభావవంతమైన మార్గం. ఈ విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, మీ అవసరాలకు ఇది సరిపోతుందని ధృవీకరించుకునేందుకు వైద్యునితో చర్చించండి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతర రక్తస్రావం యొక్క కారణాలు మరియు రకాలు ఏమిటి?

    ప్రసవానంతర స్టెరిలైజేషన్‌తో సంబంధం ఉన్న సమస్యలు ఏమిటి?

    ప్రసవానంతర స్టెరిలైజేషన్ ప్రక్రియ శాశ్వత గర్భనిరోధక పద్ధతి. కాబట్టి స్త్రీలు ఈ ప్రక్రియలో పాల్గొనే ముందు తమకు ఇక పిల్లలు అక్కర్లేదని నిర్ధారించుకోవాలి. ఇన్ఫెక్షన్ మరియు రక్తస్రావం వంటి శస్త్రచికిత్సతో సంబంధం కలిగి ఉన్న కొన్ని ప్రసవానంతర స్టెరిలైజేషన్ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కూడా చాలా అవసరం. కాకపోతే.. ఈ ప్రమాదాలు సాధారణంగా చాలా తక్కువగా ఉంటాయి. మొత్తం ప్రక్రియ సురక్షితంగా పరిగణించబడుతుంది.

    స్టెరిలైజేషన్‌ను ఎప్పుడు నివారించాలి?

    ప్రసవానంతర స్టెరిలైజేషన్లు ప్రధానంగా అదనపు గర్భాలు లేదా సిజేరియన్ ప్రక్రియల తర్వాత కలిగే భయం కారణంగా చెయ్యబడతాయి. అయితే.. మహిళలు ఈ ప్రక్రియకు ఎందుకు దూరంగా ఉండాలి అనే దానికి కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక స్త్రీకి ఇంతకుముందు గర్భధారణ సమస్యలు ఉన్నా లేదా అది స్త్రీకి మొదటి బిడ్డ అయినా పరిస్థితిలో, ప్రసవానంతర స్టెరిలైజేషన్ ప్రక్రియకు ఆమె సరైన అభ్యర్థి కాకపోవచ్చు. అంతే కాకుండా.. ప్రసవ సమయంలో తల్లి సమస్యలు ఎదుర్కొన్నా లేక తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా, ప్రసవానంతర స్టెరిలైజేషన్‌ను నివారించడం మంచిది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.