Diapering
3 November 2023 న నవీకరించబడింది
అప్పుడే అమ్మా నాన్న అయినవారికి తమ బిడ్డకి సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా ముందుగానే ఆలోచించి తీసుకోగల నిర్ణయం ఒకటి ఉంది అదే.. డిస్పోజబుల్ డైపర్ గురించి ఆలోచించటం. ఈరోజుల్లో తల్లిదండ్రులకి అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందుకని పసిపిల్లలకి ఏది మంచిదో నిర్ణయించడం చాలా కష్టం. గుడ్డతో చేసిన డైపర్లు vs డిస్పోజబుల్ డైపర్లు వీటిలో ఏది ఎంచుకోవాలి అనేది కొత్తగా తల్లిదండ్రులైన వారి మధ్య జరిగే ఒక సాధారణమైన చర్చ. చాలామంది తల్లిదండ్రులు డిస్పోజబుల్ న్యాపీలను ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి వాడటం సులభమని వారు భావిస్తున్నారు. అయినప్పటికీ.. పసిపిల్లలకి డిస్పోజబుల్ డైపర్లను ఉపయోగించే విషయంలో కొన్ని సురక్షిత విధానాల సమస్యలు ఉన్నాయి. డిస్పోజబుల్ డైపర్ల యొక్క లాభాలు, నష్టాలు అలాగే వాటిని ఎంతకాలం ఉపయోగించాలో ఈ ఆర్టికల్లో వివరించబడింది.
సగటుగా అయితే.. అప్పుడే పుట్టిన పసిపిల్లలు 2-3 వారాల పాటు డైపర్లని ధరిస్తారు, తర్వాత వారు సైజు 1 డైపర్‌లు లేదా "ప్రీమీ" డైపర్‌లకు మారతారు. పసిపిల్లలు తర్వాత పెద్ద సైజు డైపర్లకి వెళ్ళడానికి వారి బరువు అలాగే పొడవు వంటి చాలా అంశాలు వాటిని ప్రభావితం చేస్తాయి. సాధారణంగా.. చిన్న వయస్సులో ఉన్న పిల్లలు.. పెద్ద వయస్సు పిల్లలకంటే త్వరగా ఎదిగి డైపరు సైజులని మారుస్తుంటారు. ఎందుకంటే వారికి అటూ ఇటూ కదలటానికి ఎక్కువ స్థలం అవసరం.
డిస్పోజబుల్ న్యాపీలు 3 కిలోల పైబడ్డ బరువు ఉన్న పిల్లల నుండి 5.4 కిలోల వరకు బరువు ఉండే పసిపిల్లలకు(8 నుండి 14 పౌండ్లు) సరిపోయేలా డిజైన్ చేయబడ్డాయి. చాలా మంది పసిపిల్లలు కొన్ని వారాల్లోనే ఆ బరువును చేరుకుంటారు. కానీ.. కొంతమంది పిల్లలు డెలివరీ సమయానికి ముందుగానే లేదా చిన్నసైజులో పుడతారు. అలా వారు మూడు వారాల కంటే ఎక్కువ కాలంపాటు అప్పుడే పుట్టిన పిల్లలకి వాడే డిస్పోజబుల్ డైపర్లను ధరించవలసి ఉంటుంది. పుట్టగానే మొదటి కొన్ని నెలలు.. పసిబిడ్డ యొక్క డైపర్ బరువు అనేది బాబు లేదా పాప ఎలా పెరుగుతోంది ఇంకా మొత్తంమీద ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఉపయోగించబడుతుంది. కాబట్టి పసిపిల్లలు, ఎదుగుదల ఛార్టుపై కింద విలువ దగ్గర ప్రారంభమైతే.. ఆ బాబు లేదా పాప తదుపరి సైజు డైపర్‌కి వెళ్లడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. కొంతమంది పిల్లలకి ఇతరులకన్నా తరచుగా డైపర్లు మార్చవలసి ఉంటుంది. అలాగే వారి టాయిలెట్ షెడ్యూల్ని క్రమం తప్పకుండా అర్థం చేసుకోవటం కోసం పసిపిల్లల డిస్పోజబుల్ డైపర్‌లపై ఒక కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం.
ఇదివరకు అమ్మానాన్నలకి తమ బిడ్డలకు ఏడాది వయస్సు వచ్చేసరికి డైపర్ అలవాటుని నెమ్మదిగా ఆపేసే పద్ధతి ఉండేది. ఇది ఎందుకంటే ఆ కాలాలలో.. చాలామంది తల్లిదండ్రులు తిరిగి వాడగలిగే క్లాత్ డైపర్ల పై ఆధారపడేవారు. అందుకని సహజంగానే.. వాటిని ఉతకడం ఒక సమస్యగా ఉండేది. డిస్పోజబుల్ డైపర్ల కారణంగా కొంతమంది అమ్మానాన్నలు తమ బిడ్డలకి డైపర్లని 24 నెలల వయస్సు వచ్చేవరకూ వాడుతున్నారు. మరికొంతమంది అయితే మూడేళ్ళ వయస్సు వచ్చేవరకూ కూడా! కానీ ప్రామాణిక పద్ధతి ప్రకారం.. మూడేళ్ల వరకూ వాడటం అనేది మరీ ఎక్కువ అవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకి 18 నెలల వయస్సు వచ్చాక టాయిలెట్ శిక్షణ మొదలుపెట్టవచ్చు. అలా వారు ఒకవేళ డిస్పోజబుల్ డైపర్ని మానేయటానికి మానసికంగా సిద్ధంగా లేకపోయినా.. సమయం వచ్చినప్పుడు టాయిలెట్ని ఉపయోగించగలగాలి.
ఎవరికీ డైపర్లని మార్చటం నచ్చదు – అవి దుర్వాసనతో, చికాకుగా ఉంటాయి. డిస్పోజబుల్ న్యాపీలు తల్లిదండ్రులకి లాభకరమైనవి ఎందుకంటే ఈ డైపర్లని మార్చే ప్రక్రియని ఇవి వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా మీ పిల్లలు అటూ ఇటూ మెలికలు తిరుగుతూ, కదలకుండా ఉండనివారైతే ఇవి మరింత ఉపయోగపడతాయి. అంతేకాక.. డిస్పోజబుల్ డైపర్ల వలన దద్దుర్లు, ఇతర చర్మ సంబంధ మంటలు, ర్యాషెస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది.
1. డిస్పోజబుల్ డైపర్లతో లాభాలు (Disposable Diapers Pros in Telugu)
డిస్పోజబుల్ డైపర్లతో ఈ కింది ప్రయోజనాలు ఉంటాయి:
2. డిస్పోజబుల్ డైపర్లతో నష్టాలు (Disposable Diapers Cons in Telugu`)
పసిపిల్లలకి వాడే డిస్పోజబుల్ డైపర్లతో నష్టాలు కూడా ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద లోపాలు కింద ఇవ్వబడ్డాయి.. చదవండి.
లోపాలు ఉన్నా కూడా తల్లిదండ్రులకి సౌకర్యవంతంగా ఉంటాయి కాబట్టి డిస్పోజబుల్ డైపర్లకి పాపులారిటీ ఎక్కువగా ఉంది. స్పష్టంగా వీటి లాభాలు నష్టాల కంటే ఎక్కువగా ఉన్నాయి. డైపరు ఎప్పుడు మార్చాలి అన్న చిన్న అవగాహన ఉంటే చాలు బిడ్డని వీటితో సంతోషంగా ఉంచవచ్చు. పసిపిల్లల పరిశుభ్రత, ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని ఇలాంటి ఆర్టికల్స్ కోసం మై లో కుటుంబ బ్లాగుని చెక్ చేయండి.
Tags:
Disposable diapers in telugu, Cons of disposable diapers in telugu, Pros of disposable diapers in telugu, can babies wear disposable daipers long time in telugu, when to stop disposable diapers in telugu, how to discard disposable diapers in telugu
Adjustable & Reusable Cloth Diaper - Red & Blue - Pack of 2
Oeko-Tex Certified | Prevents Rashes
₹ 898
5
(5)38505 Users bought
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |