Scans & Tests
3 November 2023 న నవీకరించబడింది
నాన్-ఇన్వాసివ్(శరీరంలోకి పరికరాలను ప్రవేశపెట్టకుండా) ప్రినేటల్ టెస్టింగ్ (NIPT టెస్ట్)ని తరచుగా నాన్-ఇన్వాసివ్ ప్రినేటల్ స్క్రీనింగ్ (NIPS) అని కూడా పిలుస్తారు. ఇది శిశువు నిర్దిష్ట జన్యుపరమైన అసాధారణతలతో జన్మించే అవకాశాన్ని నిర్ధారించే ఒక ప్రక్రియ. ఈ పరీక్షలో గర్భిణీ స్త్రీ రక్తంలో ప్రసరించే చిన్న DNA ముక్కలను విశ్లేషిస్తారు. జీవకణ కేంద్రకంలో ఉండే DNA వలె కాకుండా.. ఈ ముక్కలను సెల్-ఫ్రీ DNA (cfDNA) అని పిలుస్తారు ఇంకా అవి కణాల లోపల ఉండకుండా స్వేచ్ఛగా రకంలో తేలియాడుతూ ఉంటాయి. ఈ చిన్నముక్కలు సాధారణంగా DNA బిల్డింగ్ బ్లాక్స్(నిర్మించే భాగాలు) (బేస్ పెయిర్స్) కంటే తక్కువగా ఉంటాయి. మృతకణాల నుండి DNAతో సహా వేరుపడినప్పుడు ఇవి రక్తప్రవాహంలోకి విడుదలైనప్పుడు ఉద్భవిస్తాయి.
NIPT గర్భ పరీక్ష అనేది చాలా ఖచ్చితమైన నిర్ధారణ పరీక్ష. శిశువుకు జన్యుపరమైన అస్తవ్యస్తత కలిగే అవకాశముందో లేదో తెలుసుకోవడానికి ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో డౌన్స్ సిండ్రోమ్ ఇంకా ఇతర క్రోమోజోమ్ తేడాలు లాంటివి కూడా ఉన్నాయి. NIPT గర్భ పరీక్ష అనేది గర్భధారణలోని మొదటి త్రైమాసికంలో సులువుగా చేయగలిగే రక్త పరీక్ష లాంటిది. శిశువు ఆరోగ్యాన్ని తెలుసుకొనేందుకు వివిధ రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఏ పరీక్షను ఎంచుకోవాలో తల్లి నిర్ణయించుకోవాలి. గైనకాలజిస్ట్‌తో లేదా జెనెటిక్ కౌన్సెలర్‌తో గాని అందుబాటులో ఉన్న ఎంపికల గురించి మాట్లాడటం మంచిది. గర్భవతిగా ఉన్నప్పుడు.. వారి రక్తప్రవాహంలో ఆమె జీవకణాలు ఇంకా మాయలోని కణాలలో నిల్వ చేయబడిన cfDNA మిశ్రమం ఉంటుంది. మాయ అనేది గర్భాశయంలోని కణజాలం, ఇది పిండానికి తల్లి రక్త సరఫరాను సంధానం చేస్తుంది. ఇలాంటి కణాలు గర్భావధి కాలమంతటా తల్లి రక్తప్రవాహంలోకి వదలబడుతాయి. మాయ కణాలలోని DNA సాధారణంగా గర్భస్థ పిండం DNAకి సరిపోలి ఉంటుంది. మాయ నుండి తీసుకున్న cfDNAని విశ్లేషించడం వలన పిండానికి హానికలిగించే కొన్ని రకాల జన్యుపరమైన అసాధారణతల నిర్ధారణకు అవకాశం లభిస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అనెన్స్‌ఫాలీ: కారణాలు, లక్షణాలు, ప్రమాదం & చికిత్స
గర్భధారణ సమయంలో.. తల్లిలోని ఈ DNA ముక్కలు లేదా మాయ లేదా పిండం DNA నుండి వచ్చి చేరినవై ఉంటాయి. ప్రామాణిక NIPT పరీక్షలో సాధారణ పరిమాణంలోని గర్భస్థ పిండం DNA నుండి గుర్తించదగిన వ్యత్యాసామున్న గర్భాలను గుర్తించవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది పుట్టబోయే బిడ్డకు కొన్ని పుట్టుకతో వచ్చే అసాధారణతలను సికిల్ సెల్‌ను అభివృద్ధి చేసే అవకాశాన్ని తెలుసుకొనేలా కాబోయే తల్లికి అవకాశమిస్తుంది. అయినప్పటికీ.. NIPS పరీక్షను చేయించుకొనే సరైన సమయం ఏదనే విషయంపై విస్తృతమైన చర్చ కొనసాగుతోంది. కొంతమంది నిపుణులు దీనిని 9-10 వారాల గర్భధారణ సమయంలో చేయించుకోవచ్చని చెబుతారు. కొందరు దీనిని 13-14 వారాలలో సిఫార్సు చేస్తారు. సాధారణంగా.. ప్రయోగశాల ఆధారంగా, NIPT పరీక్ష తరచుగా గర్భధారణలోని 10వ వారం తర్వాత ఇంకా సాధారణంగా 24 వారాల ముందు ఎప్పుడైనా చేస్తారు.
తల్లి రక్తంలో దాదాపు 10% సెల్-ఫ్రీ DNA (cfDNA) పిండం నుండి చేరినదై ఉంటుంది. ఇది NIPT పరీక్ష ద్వారా విశ్లేషించబడుతుంది. సాధారణంగా.. NIPT ఫలితాన్ని పొందడానికి 2 వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. గర్భిణీ స్త్రీ చేయి నుండి తీసిన ఒక ట్యూబ్ రక్తంతో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షా ఫలితాల వల్ల, గర్భానికి ప్రమాదావకాశాలు తక్కువగా ఉన్నాయా లేదా క్రింద కనబరిచిన క్రోమోజోమ్ సమస్యలు కలిగి ఉండే ప్రమాదం ఎక్కువగా ఉందా అనేది నిర్ణయించవచ్చు,
NIPT చాలా సున్నితమైన పరీక్ష. NIPS పరీక్ష 99% కంటే ఎక్కువ శాతం డౌన్స్ సిండ్రోమ్ కేసులను గుర్తించగలదు. అయితే ఇది రోగనిర్ధారణ పరీక్ష కాదు. కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. జన్యు వైవిధ్యాల వల్ల హాని కలిగే అవకాశం ఉందో లేదో ఇది తెలియజేస్తుంది. కానీ ఇది సాధారణంగా ఖచ్చితమైన సమాధానాన్ని ఇవ్వబోదు. అయితే ఎంతో మంది తల్లిదండ్రులు, ఈ స్క్రీనింగ్ పరీక్షల వల్ల పొందే సమాచారం తరువాత వారు రోగనిర్ధారణ పరీక్షను చేయించుకోవాలసిన అవసరం ఉందా లేక లేదా అని నిర్ణయించుకొనేందుకు దోహదపడుతుంది.
Noninvasive Prenatal Testing in Telugu, What is Noninvasive Prenatal Testing in telugu, Noninvasive Prenatal Testing during pregnancy in telugu, why Noninvasive Prenatal Testing required during pregnancy in telugu.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |