hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Caring for your Newborn arrow
  • నవజాత శిశువు కోసం శీతాకాలంలో అవసరమయ్యే 17 వస్తువులు! arrow

In this Article

    నవజాత శిశువు కోసం శీతాకాలంలో అవసరమయ్యే 17 వస్తువులు!

    Caring for your Newborn

    నవజాత శిశువు కోసం శీతాకాలంలో అవసరమయ్యే 17 వస్తువులు!

    3 November 2023 న నవీకరించబడింది

    కొత్త శిశువు రాక అనేది ఏ తల్లిదండ్రులకైనా ఎల్లప్పుడూ ఉత్తేజకరమైన సమయం. కానీ శీతాకాలపు నెలలలో ఒక చిన్న పిల్లవాడిని ప్రపంచంలోకి స్వాగతించే వారికి, వారు సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉన్నారని ధృవీకరించుకోవడానికి కొన్ని అదనపు విషయాలు అవసరం. అందుకే మీకోసం నవజాత శిశువు కోసం అవసరమైన 17 వింటర్ అవసరాలను సమర్పిస్తున్నాము.

    1. డైపర్లు

    చలికాలంలో శిశువుకు తడి చాలా అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, నవజాత శిశువు శీతాకాలపు నిత్యావసరాలలో డైపర్లు లేదా న్యాపీలను ఉంచుకోవడం ఒక ముఖ్యమైన భాగం. సరైన డైపర్‌ను ఎంచుకునేటప్పుడు నాణ్యత, ధర మధ్య సమతుల్యతను కనుగొనడానికి ప్రయత్నించండి.

    2. సౌకర్యమైన ప్యాంటు

    చలికాలంలో శిశువులకు సంబంధించిన ఎసెన్షియల్స్ పరంగా, హాయిగా ఉండే ప్యాంటు తప్పనిసరి, ఎందుకంటే అవి రోజంతా వెచ్చగా ఉంచడంతో పాటు సౌకర్యవంతంగా ఉంటాయి. శిశువు చర్మానికి చికాకు కలిగించని సున్నితమైన ఎలాస్టిక్ వెయిస్ట్ బ్యాండ్ తో సూపర్ సాఫ్ట్‌గా ఉండే ప్యాంటును ఎంచుకోండి.

    3. తేలికైన జాకెట్లు/కార్డిగాన్స్

    తేలికైన జాకెట్ లేదా కార్డిగాన్ బిడ్డను చాలా బరువుగా లేదా స్థూలంగా లేకుండా బయట వెచ్చగా ఉంచడానికి సహాయం చేస్తుంది. నవజాత శిశువు కొరకు శీతా కాలంలో ఉంచుకోవాల్సిన నిత్యావసరాలలో ఇది ముఖ్యమైన భాగం. మీరు ఒక సాధారణ ఉన్ని జాకెట్ లేదా కార్డిగాన్‌ని ఎంచుకోవచ్చు లేదా హుడ్ కోట్ వంటి కొంచెం స్టైలిష్‌ జాకెట్‌నైనా ఎంచుకోవచ్చు.

    4. బట్టలు మరియు ఉపకరణాలు

    చలికాలంలో పొడవాటి చేతులు ఉన్న బాడీ సూట్‌లు, థర్మల్ ప్యాంటు మరియు టీ-షర్టులు, ఉన్ని సాక్స్‌లు, టోపీలు ఉంచుకోవాలి. ఒకవేళ బయట చల్లగా, లోపల తడిగా ఉంటే వాటర్‌ప్రూఫ్ జాకెట్ వంటి దుస్తులను ధరించడం సూచింపబడుతున్నది.

    5. సాక్స్

    పైన పేర్కొన్న అంశాలకు వివరణగా, శీతాకాలంలో నవజాత శిశువులకు సాక్స్ అవసరం. పర్ఫెక్ట్ పెయిర్‌ని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి: పత్తి లేదా ఉన్ని వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన సాక్స్‌లను ఎంచుకోవాలి. సాక్స్‌లు శరీరానికి హత్తుకునేలా సరిగ్గా సరిపోయేలా చూసుకోండి.

    6. స్లీప్ ఎసెన్షియల్స్

    నిద్రకు అవసరమైన విషయాలకొస్తే, శీతాకాలంలో శిశువులకు ఈ క్రింద ఇవ్వబడిన విషయాలు అవసరం: వెచ్చని దుప్పటి మరియు నిద్రపోయే బొంత. దీనికి ప్రత్యామ్నాయంగా, స్లీపింగ్ బ్యాగ్‌ని ఎంచుకోవచ్చు .

    7. బూటీలు

    శిశువుకు శీతాకాలపు అవసరాల విషయానికి వస్తే, బూటీలను ఉంచుకోవడం మర్చిపోవద్దు. బూటీలు జారిపోకుండా మంచి పట్టు ఉండేలా చూసుకోండి. అలాగే, సులభంగా ధరించగలిగేలా మరియు తీసివేయడానికి వీలుగా ఉండే వాటిని చూడండి.

    8. చలి కాలపు టోపీలు

    చలి నుండి రక్షించడానికి శీతాకాలంలో నవజాత శిశువులకు చలి కాలపు టోపీ అవసరం. శిశువు యొక్క సున్నితమైన చర్మాన్ని రక్షించే కాటన్ వంటి మృదువైన, గాలి పీల్చుకునే లాంటి పదార్థంతో తయారు చేయబడిన వాటి కోసం చూడండి.

    9. బేబీ మిట్టెన్స్

    నవజాత శిశువు శీతాకాలపు అవసరాల విషయానికి వస్తే, చేతి తొడుగులు తప్పనిసరి. అవి శిశువుల చేతులను వెచ్చగా ఉంచడమే కాకుండా వారు వారి ముఖాన్ని గోకకుండా నిరోధిస్తాయి. చకచకా వెయ్యడానికి మరియు తీయడానికి వెల్క్రో లు ఉన్న ఒక జతను మీ అవసరాల్లో ఉంచుకోండి.

    10. ఆల్-టెర్రైన్ స్ట్రోలర్

    శిశువుకు అవసరమైన చలికాలపు వస్తువులలో ముఖ్యమైన భాగం, మంచు, ఇసుక మరియు ఇంకే భూభాగాన్నైనా హ్యాండిల్ చేయగల పెద్ద చక్రాలు కలిగిన ఆల్-టెరైన్ స్ట్రోలర్‌ల కోసం చూడండి. అందులో నిల్వ చేసుకునే స్థలం పుష్కలంగా ఉందని, సులభంగా నడపగలిగేలా ఉందని ధృవీకరించుకోండి.

    11. సూర్య రశ్మి నుండి రక్షణ

    చలికాలంలో వెచ్చని బట్టలు ముఖ్యమైనవి అయితే.. చలికాలంలో పిల్లలకు సన్‌స్క్రీన్ మరియు లిప్‌బామ్ కూడా అవసరం. కనిష్టంగా 15 SPF ఉన్న సన్‌స్క్రీన్‌తో సూర్యుని హానికరమైన కిరణాల నుండి పిల్లలను రక్షించండి.

    12. గట్టిగా చుట్టే దుప్పటి

    ఏ శిశువుకైనా శీతాకాలపు దుప్పటి తప్పనిసరి. చిన్న పిల్లవాడిని వెచ్చగా మరియు సుఖంగా ఉంచడానికి అవి సరైనవి. అనేక విభిన్న శైలులు మరియు బ్రాండ్‌ల స్వెడిల్ దుప్పట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు సరైన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

    13. హాయిగా ఉండే బేబీ బ్లాంకెట్

    మార్కెట్లో చాలా విభిన్న శైలుల బేబీ దుప్పట్లు ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడ ప్రారంభించాలో తెలుసుకోవడం కష్టం. మీకు ఏమి కావాలో అన్న విషయం తెలియకపోతే, క్లాసిక్ తెల్లటి దుప్పటిని సురక్షితంగా ఎంచుకోండి. కానీ కొంచెం సృజనాత్మకతతో ఎంచుకోవాలి అనుకునేవారికి, అక్కడ ఇతర ఎంపికలు పుష్కలంగా ఉంటాయి.

    14. హ్యూమిడిఫైయర్

    బయట వాతావరణం చల్లగా మరియు పొడిగా ఉన్నప్పుడు, ఇంటి లోపల గాలి సౌకర్యంగా ఉండదు. తక్కువ తేమ స్థాయిలు స్థిర విద్యుత్, పొడి చర్మం, సైనస్ చికాకులు మరియు శ్వాసకోశ సమస్యల వరకు అన్నింటికీ కారణమవుతాయి. టోటల్ హౌస్ హ్యూమిడిఫైయర్ ఇంట్లో సౌకర్యవంతమైన తేమ స్థాయిని ఉంచడానికి సహాయపడుతుంది. ఇది పిల్లలకి మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.

    15. బేబీ కారియర్

    శీతాకాలంలో బేబీ క్యారియర్ చాలా అవసరం. కొత్తగా తల్లిదండ్రులు అయిన వారికి మార్కెట్లో వివిధ రకాల క్యారియర్‌లు దొరుకుతాయి. ప్యాడెడ్ స్ట్రాప్స్ మరియు శిశువు కోసం సౌకర్యవంతమైన సీటుతో ఉన్న క్యారియర్ కోసం వెదకండి. శిశువును చల్లని వాతావరణం నుండి రక్షించడానికి క్యారియర్‌కు హుడ్ లేదా కవర్ కూడా ఉండేలా చూసుకోండి.

    16. బెడ్ రూమ్ థర్మామీటర్

    కొన్నిసార్లు, గది ఉష్ణోగ్రతను నిర్ధారించడం కష్టం. అంతేకాకుండా, చల్లని వాతావరణం పెద్దల కంటే చిన్న పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల, చల్లని వాతావరణం గురించి తెలుసుకునేందుకు, గడ్డకట్టే ఉష్ణోగ్రత నుండి శిశువును రక్షించడానికి బెడ్‌రూమ్ థర్మామీటర్‌ను ఉంచుకోండి.

    17. బేబీ వింటర్ వేర్ ఫుల్ స్లీవ్స్ రోంపర్

    చలికాలంలో చిన్నారులను వెచ్చగా ఉంచేందుకు రోంపర్ సరైనది. చలిని దూరంగా ఉంచడానికి ఫుల్ స్లీవ్‌లు, హై-నెక్ కాలర్‌ని కలిగి ఉండే మరియు రోజంతా శిశువును సౌకర్యవంతంగా ఉంచే మృదువైన, హాయిగా ఉండే పదార్థంతో తయారు చేయబడిన రోంపర్‌ను కొనుక్కోండి.

    ముగింపు

    ఈ 17 శీతాకాల అవసరాలను మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా చలి నెలల్లో పిల్లల సంరక్షణ కోసం సిద్ధం కండి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.