hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

Article continues after adveritsment

  • Home arrow
  • Pregnancy Journey arrow
  • గర్భధారణ సమయంలో మెంతులు: దుష్ప్రభావాలు & ప్రయోజనాలు arrow

In this Article

    గర్భధారణ సమయంలో మెంతులు: దుష్ప్రభావాలు & ప్రయోజనాలు

    Pregnancy Journey

    గర్భధారణ సమయంలో మెంతులు: దుష్ప్రభావాలు & ప్రయోజనాలు

    3 November 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    తల్లి కావాలని ఆశించే వ్యక్తిగా, గర్భధారణ సమయంలో ఎటువంటి ఆహారాలు తింటే ఉత్తమ పోషకాలు అందుతాయోనని అనుకుంటున్నారా? గర్భం అనేది స్త్రీ జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిని కలిగించే కాలం. అటువంటి సమయంలో తాను తినే తిండి విషయంలో ఎటువంటి రిస్క్​ కూడా తీసుకోకూడదు. కావున కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఏమి జరుగుతుందనే విషయంలో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు, నిజానిజాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మెంతులు లేదా మేతిని తమ గర్భధారణ సమయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది గర్భధారణ ప్రయాణంలో కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. కావున దీనిని నివారించాలని ప్రాచీనకాలం నుంచి సూచిస్తూ వస్తున్నారు. ప్రకృతి వైద్యులు మరియు వైద్యులు మెంతుల గురించి మాట్లాడుతూ.. ఇది బలమైన మూలిక. ఇది స్త్రీ శరీరంలో సంకోచాలను ప్రేరేపిస్తుంది. ఇది ముందస్తు డెలివరీకి లేదా గర్భస్రావానికి కూడా దారి తీయొచ్చు. కావున మెంతులను గర్భధారణ సమయంలో తీసుకోకుండా ఉండాలని మేము సూచిస్తాం. ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే మెంతి ఆకులు, లేదా మెంతి పరాటాను కూడా ఈ సమయంలో తినడం మంచిది కాదు.

    గర్భధారణ సమయంలో మెంతులను మీరు తీసుకుంటే ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఉంది. మీరు గర్భధారణ సమయంలో మేతి పరాట లేదా మేతి ఆకులను తినొచ్చా అని ఆశ్చర్యపోతున్నారా? అవి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

    గర్భధారణ సమయంలో మెంతులు (మేతి) తీసుకోవడం సురక్షితమేనా?

    మీ పీరియడ్​ను ప్రేరేపించేందుకు మెంతులు లేదా మేతి పరాట తినమని మీ ఇంట్లోని పెద్దలు చెప్పడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మెంతి గింజల నుంచి వచ్చే జ్యూస్ తాగడం వల్ల లేదా మెంతి టీని తాగడం వల్ల కూడా కొందరిలో పీరియడ్స్​ ప్రేరేపించబడతాయి. కానీ గర్భధారణ సమయానికి వచ్చే సరికి మెంతులు తీసుకోవడం అనేది డిఫరెంట్​గా ఉంటుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో మెంతులు తీసుకోవడం మానేస్తారు. ఎందుకంటే గర్భవతులు మెంతులను తీసుకోవడం వలన తీవ్రమైన పురిటి నొప్పులు అప్పుడప్పుడూ గర్భస్రావాలు కూడా వాటిల్లే ప్రమాదం ఉంది. మెంతులను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన నెలలు నిండకుండానే ప్రసవం, లేదా గర్భస్రావాలు తలెత్తాయని చాలా మంది మహిళలు పేర్కొంటున్నారు. మెంతులను ఎక్కువగా తీసుకోవడం వల్ల పిండంలో పుట్టుకతో వచ్చే లోపాలు, నవజాత శిశువుల లోపాలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు కూడా సంభవిస్తాయి. మెంతులను తీసుకోవడం వలన పునరుత్పత్తి విషపూరితం అవడం, పిండంలో కూడా సమస్యలు వస్తాయి. గర్భధారణ సమయంలో మెంతులు లేదా మేతిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం తగ్గించాలి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి?

    గర్భధారణ సమయంలో మెంతుల వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్

    కేవలం తక్కువ మోతాదులో మెంతిని తీసుకున్నపుడు మాత్రమే గర్భధారణ సమయంలో ఇది సురక్షితం. గర్భధారణ సమయంలో మెంతిని తినడం వలన గర్భవతులకు దుష్ర్పభావాలు కలగవచ్చు. తరచుగా వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్​. గర్భధారణ సమయంలో మెంతులు లేదా మెంతికూరను ఎక్కువగా తీసుకోవడం వలన పుట్టే బిడ్డ వైకల్యంతో జన్మించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెంతులను ఉపయోగించడం వల్ల తల్లి కావాలని ఆశిస్తున్న స్త్రీలో సంకోచాలు కూడా వచ్చే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో ఎక్కువగా మెంతిగింజలను తినడం వలన పుట్టబోయే శిశువులో ఒక రకమైన శరీర దుర్వాసన వస్తుందని చాలా మంది చెబుతారు.

    గర్భవతిగా ఉన్నపుడు మెంతులు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు

    మెంతి గింజలను తీసుకోవడం వల్ల తలెత్తే పురిటి నొప్పులు దుష్ప్రభావంగా ఉంటాయి. కానీ కొంత మంది స్త్రీలలో ఎవరికైతే లేబర్​ను ప్రేరేపించాల్సి వస్తుందో అటువంటి వారికి మెంతి గింజలు తినడం వలన ప్రయోజనం కలుగుతుంది. చాలా ఏళ్లుగా మెంతులు గర్భవతిగా ఉన్న మహిళలకు సంకోచాల ద్వారా లేబర్​ను ప్రేరేపించడం మాత్రమే కాకుండా లేబర్ నొప్పిని తగ్గించేందుకు మరియు ఉపశమనానికి కూడా ఉపయోగించబడుతున్నాయి. గర్భధారణ సమయంలో మెంతులు తీసుకోవడం వలన స్త్రీలకు లేబర్ ప్రాసెస్ చాలా తేలికగా పూర్తవుతుంది.

    గర్భవతిగా ఉన్నపుడు మెంతులు ఎంత మోతాదులో ఉపయోగించడం సురక్షితం?

    మీరు గర్భవతిగా ఉన్నపుడు మెంతిని వినియోగించకుండా ఉండమని వైద్యులు మరియు ప్రకృతి వైద్యులు సూచిస్తారు. గర్భధారణ సమయంలో మెంతి గింజలను లేబర్​ను ప్రేరేపించేందుకు, అవి పురిటి నొప్పులకు కారణం అవుతాయి. అది మాత్రమే కాకుండా మెంతులు తీసుకోవడం వల్ల గర్భస్రావం, అకాల ప్రసవం జరిగే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గర్భధారణ సమయంలో మెంతికి దూరంగా ఉండాలని స్త్రీలు సలహా ఇస్తారు. ఏదేమైనా వైద్యుడి సలహా తీసుకున్న తర్వాత చాలా అరుదుగా కొద్ది మొత్తంలో మాత్రమే మెంతులు తీసుకోవాల్సి ఉంటుంది.

    గర్భధారణ సమయంలో నేను ఎప్పుడు మెంతులు తీసుకోవడం ప్రారంభించాలి?

    గర్భధారణలో ఉన్నపుడు సాధారణంగా 37వ వారం తర్వాత మాత్రమే మెంతులను తీసుకుంటారు. ఎందుకంటే మెంతి గింజలు లేబర్‌ను ప్రేరేపించి పురిటి నొప్పులకు కారణం అవుతాయి. ఈ కారణం చేత మహిళలు తమ గర్భధారణ ప్రారంభదశలో వీటిని తీసుకోవద్దని సలహా ఇస్తారు. మెంతి గింజలు పాలిచ్చే తల్లులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి పాల ఉత్పత్తిని పెంచుతాయని అందరూ విశ్వసిస్తారు. కావున శిశువు జన్మించిన తర్వాత తమ పాల ఉత్పత్తిని పెంచుకునేందుకు మహిళలు మెంతి ఆకులు, మెంతి గింజలు, మెంతి పరాటాను తీసుకుంటూ ఉంటారు.

    గర్భవతిని కావాలని నేను ఆశిస్తున్నపుడు మెంతి టీ తీసుకోవచ్చా?

    సాధారణంగా గర్భధారణ సమయంలో మెంతి ఆకులు, గింజలు లేదా మెంతి టీని కూడా తీసుకోవద్దని సూచిస్తారు. ఎందుకంటే తల్లి కావాలని ఆశించే స్త్రీలలో ఇది లేబర్​ను ప్రేరేపిస్తుందని నమ్ముతారు. మెంతులు బలమైన మూలికా లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి స్త్రీలలో గర్భస్రావాలు, నొప్పులు(సంకోచాలు), అకాల ప్రసవానికి దారి తీస్తాయి. గర్భధారణ సమయంలో మెంతి టీ మాత్రమే కాకుండా మెంతి పరాట కూడా తీసుకోకుండా ఉండడం మంచిది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.