This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో బెస్ట్ డైట్ ప్లాన్ ఇదే! (What Is the Best Diet Plan That You Must Consume During Pregnancy in Telugu)

Diet & Nutrition
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భధారణ సమయంలో బెస్ట్ డైట్ ప్లాన్ ఇదే! (What Is the Best Diet Plan That You Must Consume During Pregnancy in Telugu)
Likes2 Likes|
Read time6 min

గర్భధారణ కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం (Best Food During Pregnancy in Telugu)

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. గర్భధారణ సమయంలో ఇది ఎంతో ముఖ్యమైనది. శిశువు అభివృద్ధిని ఇంకా పెరుగుదలను కాబోయే తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో సహా ఆరోగ్యకరమైన యాంటెనాటల్ డైట్ (గర్భధారణ సమయంలో తీసుకొనే ఆహార విధానం) కీలక పాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలు, గింజలు, ధాన్యాలు, నూనెలు ఇంకా ప్రొటీన్ల సమతుల్యమైన ఆహారం తీసుకొంటే అవి కాబోయే తల్లులు తమ పుట్టబోయే బిడ్డ అత్యంత ఆరోగ్యకరంగా తయారయ్యేలా అందించే అమృతాహారాలు అవుతాయి.

గర్భధారణ సమయంలో ఆహారం (Pregnancy Diet in Telugu):

కాబోయే తల్లులు సమతుల్యమైన ఇంకా మంచి ఆహారం తీసుకుంటున్నారని ఎలా తెలుసుకోవచ్చు? గర్భవతుల ఆహారంలో శిశువు ఇంకా తల్లి, ఇద్దరి కోసం అన్ని పోషకాలను కలిగిన ఆరోగ్యకరమైన ఆహారాలు ఉండాలి. శిశువు పెరిగేకొద్దీ, తల్లి కాబోయేవారు అనేక రకాల పోషకాలను తినాలి. వాటిని త్రైమాసికాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. గర్భిణీ స్త్రీ సరైన ఆహారాన్ని తీసుకుంటుందని తెలుసుకొనేందుకు వైద్యునితో సంప్రదింపులు తప్పనిసరి. అయినప్పటికీ.. మెజారిటీ ప్రెగ్నెన్సీ డైట్‌లు క్రింద పేర్కొన్న ముఖ్యమైన పోషకాలపైనే దృష్టి పెడతాయి:

ఐరన్-సమృద్ధిగా ఉన్న ఆహారాలు (Iron-Rich Foods)

కణజాలాలకు ఆక్సిజన్‌ను సరఫరా అందించే హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి సంక్రమంగా జరిగేందుకు ముఖ్యంగా మహిళలు ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలనే సలహాలు కోకొల్లలుగా వినేవుంటారు. ఈ ముఖ్యమైన పోషకం గర్భధారణ సమయంలో మరింత అవసరం అవుతుంది. ఎందుకంటే తల్లి శరీరం శిశువుకు కూడా అధిక ఆక్సిజన్ సరఫరాను చేయవలసి ఉంటుంది కాబట్టి. గర్భిణీ స్త్రీలలో ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. అది తరచుగా వచ్చే తలనొప్పి ఇంకా అలసటలకు కారణమవుతుంది. గర్భధారణ సమయంలో ఐరన్ లోపంతో తలెత్తే తీవ్రమైన అనీమియా కేసులలో అకాల జననం లేదా తక్కువ బరువుతో బిడ్డ పుట్టవచ్చు. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలలో చేపలు, చికెన్, కొవ్వు లేని మాంసము ఇంకా బీన్స్ ఉన్నాయి.

ప్రోటీన్-సమృద్ధిగా ఉన్న ఆహారాలు (Protein-Rich Foods)

శిశువు అవయవాలు ఇంకా కణజాలాల ఆరోగ్యకరమైన పెరుగుదలకు ప్రోటీన్ ఎంతో అవసరం. సిఫార్సు చేయబడిన రోజువారీ తీసుకోవాల్సిన ప్రోటీన్ (RDA) రోజుకు కనీసం 71 గ్రాములు. ఈ సూక్ష్మ పోషకాలు తల్లి గర్భాశయం ఇంకా ఛాతీ కణజాల ఆరోగ్యానికి కూడా అవసరామౌతాయి. అంతేకాకుండా.. రక్త సరఫరాను వృద్ధి చేసేందుకు ప్రోటీన్ అవసరం; అందువల్ల, ప్రోటీన్లను తీసుకోవడం అనేది ప్రతి త్రైమాసికంలో పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ డైట్‌లో చేర్చడానికి ఆరోగ్యకరమైన ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలలో చికెన్, నట్స్, పీనట్ బటర్, కాటేజ్ చీజ్, సాల్మన్ మరియు బీన్స్ ఉన్నాయి.

విటమిన్ డి-అందిచే ఆహారాలు (Vitamin D-Rich Foods)

విటమిన్ డి అనేది పుట్టబోయే బిడ్డ ఎముకలు ఇంకా దంతాల పెరుగుదలకు తీసుకోవలసిన మరో కీలకమైన పోషకం. శరీరపు సంపూర్ణ రోగనిరోధక శక్తిని మెరుగుపరచేందుకు కూడా ఇది చాలా అవసరమౌతుంది. ఇది కాబోయే తల్లులకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకొనేందుకు కూడా దోహదపడుతుంది. విటమిన్ D అందించే ఉత్తమ సహజ వనరు సూర్యరశ్మి, అయితే.. పెరుగుతున్న కాలుష్యం ఇంకా హానికరమైన UV కిరణాలు దీనికి ఆటంకం కలిగించడం వల్ల వ్యతిరేక ఫలితాలు అందుకోవచ్చు. అందువల్ల, విటమిన్ డి-రిచ్ యాంటీనాటల్ డైట్‌లో సాల్మన్ వంటి క్రొవ్వు వున్న చేపలు, పాలు, గుడ్లు వంటి ఆహారాలు ఉంటాయి

కాల్షియం-అందించే ఆహారాలు (Calcium-Rich Foods)

ప్రెగ్నెన్సీకి ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారాల లాగానే, గర్భధారణ సమయంలో కాల్షియం ఎక్కువుండే ఆహారపు అవసరం కూడా రెట్టింపు అవుతుంది. తల్లీబిడ్డల ఎముకల బలోపేతానికి కాల్షియం ఎంతో అవసరం. గ్రీక్ పెరుగు వంటి కొన్ని కాల్షియం-రిచ్ ఫుడ్స్, ప్రోబయోటిక్ బాక్టీరియా ఉండటం వల్ల కాబోయే తల్లి జీర్ణవ్యవస్థకు మంచి చేస్తుంది. గర్భధారణ సమయంలో కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలలో పాలు, బ్రోకలీ, కేల్ చీజ్, సాల్మన్, పాలకూర ఇంకా నారింజ రసం ఉన్నాయి.

ఫోలేట్ ఇంకా ఫోలిక్ యాసిడ్-కలిగివున్న ఆహారాలు (Folate and Folic Acid-Rich Foods)

ఇది ఒక రకమైన విటమిన్ బి. ఫోలేట్ అనేది గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకం. ఎందుకంటే ఇది మెదడు ఇంకా వెన్నుపాము లోపాల వల్ల ఎదురయ్యే తీవ్ర పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ అనేది బలవర్థకమైన ఆహారాలు ఇంకా సప్లిమెంట్లలో కనిపించే ఫోలేట్‌ను కృత్రిమంగా తయారుచేసిన రూపం ఇంకా ఇది అకాల జననం జరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫోలేట్-సమృద్ధిగా దొరికే పదార్థాలలో ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు, బఠానీలు, సిట్రస్ పండ్లు, కాయధాన్యాలు మరియు ఎండిన బీన్స్ ఉన్నాయి. గర్భధారణ కోసం ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలలో బలవర్థకమైన తృణధాన్యాలు కూడా ఉంటాయి.

గర్భంతో ఉన్నప్పుడూ తినకూడని ఆహారాలు (Foods to Avoid in Pregnancy in Telugu)

తల్లి కాబోయే వారు గర్భధారణ సమయంలో హానితలపెట్టే ఆహారాల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. తల్లి కాబోయే వారి ఆరోగ్య చరిత్ర ఇంకా ఇతర ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా వీటిలో కొన్నివేరుగా ఉండవచ్చు. అయితే.. ఆరోగ్య నిపుణులు ఖచ్చితంగా దూరంగా ఉంచాలని సిఫార్సు చేసే ఆహారాలు:

పాదరసం స్థాయిలు అధికంగా ఉన్న సీఫుడ్ (Seafood high in mercury levels)

సీఫుడ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మరియు ప్రోటీన్‌లు దొరికే మంచి మూలం అయితే, పుట్టబోయే పిల్లల మెదడు ఇంకా సంపూర్ణ ఆరోగ్యం సక్రమంగా అభివృద్ధి చెందడం కోసం దోహదపడేవే అయినా, చాలా రకాల చేపలు అధిక పాదరసం స్థాయిలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అవి నేరుగా శిశువు నాడీ వ్యవస్థకు హాని కలుగిస్తాయి. అలాంటి వాటిలో బిగీ ట్యూనా, స్వోర్డ్ ఫిష్, కింగ్ మాకేరెల్ ఇంకా టైల్ ఫిష్ ఉన్నాయి.

సరిగ్గా ఉడకని మాంసాలు మరియు గుడ్లు (Undercooked meats and eggs):

సరిగ్గా ఉడకని మాంసాలు ఇంకా గుడ్లు ఏ రూపంలో తీసుకున్నా కూడా తీవ్రమైన బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్ కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇది తల్లి ఇంకా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

మితిమీరిన కెఫిన్ (Excess Caffeine):

కాఫీ మరియు టీలలో కెఫిన్ ఉంటుంది కాబట్టి అవి తీసుకోవడం పరిమితం చేయాలని లేదా మానేయాలని ఆరోగ్య సంరక్షణ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కెఫిన్ గర్భాశయంలోని రక్త నాళాలు మరియు మాయను అతిగా ముడుచుకునేలా చేస్తుంది, తద్వారా పిండానికి రక్త సరఫరా తగ్గిపోతుంది. ఇది ప్రసవ సమయంలో మరిన్ని సంక్లిష్టతలను కలిగిస్తుంది, శిశువు జననం లేదా పెరుగుదలకు హాని కలిగించే అవకాశాలను పెంచుతుంది

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ(గర్భధారణ) సమయంలో వీధి ఆహారాలు తీసుకోవచ్చా?

ముగింపు (Conclusion):

గర్భధారణ సమయంలో తీసుకొనే ఆహారాన్ని కనిపెట్టుకొని ఉండటం వల్ల అది పుట్టబోయే బిడ్డ ఇంకా తల్లి ఆరోగ్య విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన గర్భధారణను అనుభూతించడానికి వైద్యుని సిఫార్సు ప్రకారం ఆహారాన్ని తీసుకోవడం ఇంకా వద్దన్నవి నివారించడం ఎంతో ముఖ్యం.

Tags:

Pregnancy diet plan during pregnancy, best foods to eat during pregnancy, foods to avoid during pregnancy in telugu, street foods during pregnancy in telugu.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.