hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore

Lowest price this festive season! Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Precautions arrow
  • గర్భధారణ సమయంలో కిందకి వంగడం ఎప్పుడు ఆపాలి? (When To Stop Bending During Pregnancy in Telugu?) arrow

In this Article

    గర్భధారణ సమయంలో కిందకి వంగడం ఎప్పుడు ఆపాలి? (When To Stop Bending During Pregnancy in Telugu?)

    Pregnancy Precautions

    గర్భధారణ సమయంలో కిందకి వంగడం ఎప్పుడు ఆపాలి? (When To Stop Bending During Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భవతులు ఎక్కువగా వంగకూడదనే సలహా ఇవ్వడం మీరు చాలా సార్లు వినే ఉంటారు. గర్భధారణ సమయంలో వంగడం వారి పిల్లలకు హాని కలిగిస్తుందని చాలా మంది గర్భిణీలు విశ్వసిస్తారు. మీరు కూడా అలాగే ఆశ్చర్యపోతే.. ఈ ఆందోళనలకు సమాధానం తెలుసుకునేందుకు ఇది చదవండి.

    గర్భధారణ సమయంలో వంగడం సురక్షితమేనా? (Is Bending Safe During Pregnancy in Telugu?)

    మీరు ఎటువంటి సమస్యలు లేకుండా గర్భధారణను ఎంజాయ్ చేస్తున్నట్లయితే వంగడం వల్ల తల్లి లేదా బిడ్డ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు. పిండం చుట్టూ ఉండే ఉమ్మనీరు శిశువుకు ఒక రక్షణ కవచంలా ఉండి రక్షిస్తుంది. అయినప్పటికీ బేబీ బంప్ వలన మీరు వంగడం కష్టమవుతుంది. ముఖ్యంగా తర్వాతి దశల్లో..

    గర్భం యొక్క ఏ దశలలో వంగడం సురక్షితం? ఏ దశలలో వంగడం సురక్షితం కాదు? (At Which Stages Bending is Safe and Not?)

    నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు సరైన విధంగా ఉంటే గర్భధారణ సమయంలో వంగినా కానీ ఎటువంటి సమస్య ఉండదు. వెన్నుముక లేదా మోకాళ్ల ద్వారా వంగడం కంటే మీ తుంటి ద్వారా వంగడం ఎప్పుడూ మంచిది. అయినప్పటికీ రోజులో ఎక్కువ సార్లు వంగే అవసరం ఉన్న ఉద్యోగాల వలన ప్రతికూల జనన ఫలితాల ప్రమాదాలు పెరుగుతాయి. మీ మొదటి త్రైమాసికంలో పిండం పరిమాణంలో చాలా చిన్నదిగా ఉండడం వలన దాని మీద ఎటువంటి ప్రభావం పడకుండా మీరు స్వేచ్ఛగా వంగగలుగుతారు. అయినప్పటికీ మీరు గర్భధారణ సమయంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే ఎక్కువగా వంగకుండా ఉండమని మీ వైద్యుడు మీకు సలహా ఇవ్వొచ్చు. రెండో త్రైమాసికంలో కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చు. అయితే ఇది కొంచెం అసౌకర్యంగా ఉండవచ్చు. మూడో త్రైమాసికంలో మీ పెద్ద బేబీ బంప్ మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో మార్పును తీసుకురావచ్చు. మీరు కిందికి వంగి ఉంటే మీరు బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి మీరు వంగవలసి వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి.

    గర్భవతిగా ఉన్నపుడు వంగడం వల్ల కలిగే పరిణామాలు (Consequences While Bending During Pregnancy in Telugu)

    మీ రోజువారీ ఫిజికల్ యాక్టివిటీలు ఇందుకు కారణం కాదు. అయినప్పటికీ మీకు గర్భధారణ సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే లేదా శారీరక శ్రమను కలిగించే ఉద్యోగం ఉంటే ఇది మిమ్మల్ని ఎక్కువ ప్రమాదంలో పడేస్తుంది.

    • పెరుగుతున్న శిశువు మీ పొత్తి కడుపు కండరాలను మరింత బలహీనపరిచి వాటి మీద అదనపు ఒత్తిడిని కలగజేస్తాయి. ఫలితంగా మీకు వెన్ను నొప్పి వస్తుంది. వంగడం వల్ల ఈ వెన్ను నొప్పి మరింత అధికం అవుతుంది.
    • వంగడం వలన గుండెల్లో మంట, గ్యాస్ర్టోఎఫోసాగియల్ రిఫ్లక్స్​ను తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా గర్భం తర్వాతి దశలలో..
    • మూడో త్రైమాసికంలో వంగడం వలన రక్తం అనేది అకస్మాత్తుగా తలపైకి పారుతుంది. ఇది మైకానికి దారి తీస్తుంది.
    • గర్భధారణ సమయంలో ఎక్కువ బరువులు ఎత్తడం లేదా ఎక్కువ సేపు నిలబడి ఉండడం వలన మీకు ముందస్తు ప్రసవం లేదా గర్భస్రావం జరిగే ప్రమాదం పెరుగుతుంది.
    • గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల వెన్నముక కీళ్లు, లిగమెంట్స్ అనేవి పెరుగుతున్న శిశువుకు అనుగుణంగా వదులుగా మారుతాయి. ఇది మస్క్యులోస్కెలటల్ (ఎముకలు, కీళ్లు, కండరాలకు సంబంధించిన నొప్పి) ఇంజురీకి కారణం అవుతుంది.
    • గర్భం యొక్క తర్వాతి దశలలో శరీర బరువు, పరిమాణంలో మార్పులు భంగిమ, సమతుల్యతలో మార్పులకు కారణం అవుతాయి. ఇవి మీరు పడిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ గర్భం యొక్క రెండవ త్రైమాసికం చివరిలో అవసరం అయ్యే స్కాన్ లు

    గర్భధారణ సమయంలో వంగినపుడు కడుపు నొప్పికి గల కారణం ఏమిటి? (Reason Behind the Stomach Pain While Bending During Pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో వంగేటపుడు కడుపు నొప్పి చిన్న కండరాల గాయం లేదా ఒత్తిడి కారణంగా సంభవించవచ్చు. హార్మోన్లు గర్భధారణ సమయంలో కండరాలను సడలించి కీళ్లను వదులు చేస్తాయి. అప్పుడప్పుడు వంగడం వలన ఎటువంటి సమస్యలు తలెత్తకపోయినా కానీ.. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు గర్భధారణ సమయంలో ఎక్కువగా వంగకూడదు.

    గర్భధారణ సమయంలో కిందికి వంగేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Precautions to Take During Pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో సురక్షితంగా ఎలా వంగాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి.

    • నేల నుంచి దేనినైనా తీసేందుకు ముందు మీ మోకాళ్లను కిందికి వంచి చతికిలపడండి. మీరు కిందపడిపోయే ప్రమాదాన్ని ఈ భంగిమ తగ్గిస్తుంది. వెనకాల వైపు శ్రమను ఇది తగ్గిస్తుంది.
    • మీరు కూర్చున్నపుడు, లేచేటపుడు జాగ్రత్త వహించండి. జర్క్​తో నిలబడడం నివారించండి.
    • బరువైన వస్తువులను ఎత్తకుండా ఉండండి. బరువుగా ఉన్న వస్తువులను ఎత్తడం వల్ల మీ వీపుపై ఒత్తిడి పడుతుంది. పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.

    గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన శరీర భంగిమలను మెయింటేన్ చేసేందుకు చిట్కాలు (Tips to Maintain Healthy Posture During Pregnancy in Telugu)

    మీరు నిలబడి ఉన్నా లేదా కూర్చుని ఉన్నా లేదా డ్రైవింగ్ చేస్తున్నా ఎటువంటి ఒత్తిడి కలగకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన శరీర భంగిమను మెయింటేన్ చేయడం చాలా అవసరం.

    • కూర్చున్నపుడు వెన్నముక మరియు భుజాలను నిటారుగా ఉంచండి. స్లంపింగ్​ను(జారినట్టు కూర్చోవడం నివారించండి. మీ వెనుకభాగం కుంగిపోకుండా ఉండేందుకు మీ పెల్విస్​ను ముందుకు జరపండి. మీ పాదాలు నేలను తాకుతున్నాయని నిర్దారించుకోండి. మీ పాదాలను క్రాస్ చేయకండి. (కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం) ఎందుకంటే ఇది మీ రక్తప్రసరణను దెబ్బతీస్తుంది.
    • మీరు నిలబడి ఉన్నపుడు మీ పాదాలను దూరంగా, మీ పిరుదులను టక్ చేయండి. మీ భుజాలు మరియు మోకాళ్లను రిలాక్స్​గా ఉంచండి. వెన్నుముకను వంచకుండా ఉంచండి. వీపును వంచడం నివారించండి.
    • డ్రైవింగ్ చేస్తున్నపుడు మీ వీపుకు సపోర్ట్​ను అందించేందుకు చుట్టిన టవల్ లేదా చిన్న దిండును ఉపయోగించండి. మీ బేబీ బంప్, స్టీరింగ్ మధ్య తగినంత గ్యాప్​ ఉండేలా చూసుకోండి.

    ఉద్యోగం చేసేందుకు కావాల్సిన ఫిజికల్ అవసరాలు (Physical Requirements for Job)

    శారీరక శ్రమను డిమాండ్ చేసే ఉద్యోగం.. ముందస్తు జననం, గర్భస్రావం, గర్భధారణ సమయంలో గాయం వంటి ప్రమాదాలను పెంచుతుంది. ఉద్యోగం యొక్క ఫిజికల్ డిమాండ్లు కింది విధంగా ఉండవచ్చు.

    • ఎక్కువ సేపు నిల్చొని ఉండడం
    • బరువులను మోయడం
    • మీ నడుమును ఉపయోగించి పదే పదే వంగడం

    మీరు కనుక శారీరక శ్రమను డిమాండ్ చేసే ఉద్యోగం చేస్తుంటే కింది వాటిని తప్పకుండా నివారించండి:

    • వంగడం, స్వ్కాట్టింగ్(కాళ్ల మీద శరీర బరువు మొత్తం వేసి వంగడం)
    • ఓవర్​హెడ్ ఎత్తడం
    • నేల నుంచి బరువైన వస్తువులను ఎత్తడం
    • 3 గంటలకు పైబడి నిరంతరంగా నిల్చోవడం

    గర్భవతిగా ఉన్నపుడు నివారించాల్సిన ఇంటి పనులు (Avoid These Household Tasks During Pregnancy in Telugu)

    మీరు ఇంట్లో ఉన్నప్పటికి కూడా కొన్ని శ్రమతో కూడిన ఇంటి పనులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇవి మీతో పాటుగా మీ బిడ్డ ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయి. మీరు గర్భవతిగా ఉన్నపుడు ఈ ఇంటి పనులు చేయడం నివారించండి.

    • ఫర్నిచర్ లేదా బరువైన వస్తువులను ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించడం మానుకోవాలి.
    • ఎక్కువ సమయం పాటు నిల్చోవడం మానేయాలి.
    • బట్టలు ఉతకడం, ఇంటిని శుభ్రం చేయడం, ఫ్లోర్​ని క్లీన్ చేయడం కోసం పదేపదే వంగడం మానేయండి
    • బ్యాలెన్సింగ్ లేదా క్లైంబింగ్
    • రసాయనాలతో కూడిన క్లీనింగ్ ప్రొడక్టులను ఉపయోగించడం

    Tags:

    Bending during pregnancy in telugu, Is bending safe during pregnancy in telugu, When can pregnants stop bending during pregnancy, Problems of bending during pregnancy in telugu, bending in third trimester of pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.