hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • New Mom arrow
  • కొత్తగా తల్లి అయినవారికి టైం మానేజ్మెంట్ ఎలానో తెలుసుకోండి..! (Time Management For New Moms in Telugu) arrow

In this Article

    కొత్తగా తల్లి అయినవారికి టైం మానేజ్మెంట్ ఎలానో తెలుసుకోండి..! (Time Management For New Moms in Telugu)

    New Mom

    కొత్తగా తల్లి అయినవారికి టైం మానేజ్మెంట్ ఎలానో తెలుసుకోండి..! (Time Management For New Moms in Telugu)

    31 July 2023 న నవీకరించబడింది

    ఓ వైపు పిల్లల్ని చూసుకుంటూ, మరోవైపు కుటుంబాన్ని నడిపించడం అంటే తక్కువ సమయంలో ఎక్కువ బాధ్యతల్ని నిర్వర్తించడమే. ఇప్పటికే తల్లులుగా బాధ్యతల్ని మోస్తున్నవారికి కూడా ఇది కాస్త భారంగానే ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూల్‌గా ఉండేందుకు ఈ టైమ్ మేనేజ్‌మెంట్ టిప్స్ ఫాలో అవండి. సమయాన్ని చక్కగా నిర్వహించే తల్లిగా మీరు ఎలా ఉండొచ్చో తెలుసుకోండి

    1. అన్నీ నోట్ చేసుకోండి (Write It Down)

    మీ మెదడులో రకరకాల పనుల గురించి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ క్రమబద్ధంగా, ఆర్గనైజ్డ్‌గా ఉంచడం అవసరం. అందుకే ప్రతీది రాసుకోవాలి.

    ఇందుకోసం మీరు నోట్‌బుక్ ఉపయోగించవచ్చు లేదా డిజిటల్ పద్దతిలో నోట్ చేసుకోవచ్చు. టూ డు లిస్ట్ ప్రిపేర్ చేసేందుకు అనేక యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్‌లో టెంప్లేట్స్ కూడా ఉంటాయి. రోజు, వారం, నెల ఇలా వేర్వేరుగా మీ వివరాలను సార్ట్ చేసేందుకు ఈ టెంప్లేట్స్ ఉపయోగపడతాయి. ఒక పని పూర్తి కాగానే దాన్ని కొట్టేయడం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.

    కొత్తగా అమ్మ అయిన ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన టాప్ 5 విషయాలు

    2.ఇతరుల సాయం తీసుకోవడం (Out Source Tasks)

    ఇతరులకు అప్పగించగలిగే పనులను తెలుసుకోగలిగితే మీకు చాలా సమయం ఆదా అవుతుంది. మీ భాగస్వామికి లేదా పనిమనిషికి ఈ పనులు అప్పగించవచ్చు:

    • వంట చేయడం
    • సరుకులు తీసుకురావడం
    • బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం
    • ఇంటిని శుభ్రం చేయడం

    3. ‘నో’ అని చెప్పడం నేర్చుకోండి (Learn to Say ’No’)

    ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు కాదు అని చెప్పడం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఓ విషయం గుర్తుంచుకోండి. ప్రతీసారి సరే అని చెప్పుకుంటూ పోతే, ఆ పని సరిగ్గా జరగనప్పుడు వారు అసంతృప్తికి గురవుతారు. అందుకే మీ ప్రియారిటీస్ తెలుసుకొని కాదు అని చెప్పడం నేర్చుకోండి.

    4.ఆర్ట్ ఆఫ్ టైమ్ మేనేజ్‌మెంట్ (Art of Time Management - Time )

    కాబోయే తల్లులకు టైమ్ మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా ఓ సవాల్. కానీ అసాధ్యమేమీ కాదు. పాజిటీవ్ మైండ్‌సెట్‌తో, చేయాల్సిందే అనే వైఖరితో ప్రారంభించాలి. ఆ రోజులో మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనులను లిస్ట్‌లో టాప్‌లో పెట్టుకొని పూర్తి చేయాలి. వాటి కోసం రోజంతా సమయాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు సరైన సమయం కేటాయిస్తేనే ముఖ్యమైన పనులు పూర్తి చేయగలరు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. మీరు సంతోషకరమైన తల్లి కావడానికి, అనుకున్నది సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది.

    Tags:

    Time management for new moms in telugu, new mom life styel in telugu, how to manage things as new mom in telugu, new mom jobs in telugu, plan everything as new mom in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.