


Conception
3 November 2023 న నవీకరించబడింది
నేటి ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడితో, చాలా మంది హార్మోన్ల అసమతుల్యతలను కలిగివున్నారు, ఇది వంధ్యత్వానికి దారితీస్తుంది. అటువంటి సందర్భాలలో, వైద్యులు దంపతులకు IVF చికిత్స చేయించుకొనేందుకు సిఫార్సు చేయవచ్చు. IVF, దీనిని ఇన్-విట్రో ఫర్టిలైజేషన్ అని కూడా పిలుస్తారు, ఇది స్త్రీలకు గర్భదారణకి సహాయపడుతుంది. IVF ప్రక్రియలో శుక్రకణాలు మరియు అండం స్త్రీ శరీరం వెలుపల ఒక టెస్ట్ ట్యూబ్‌లో ఫలదీకరణం చెందించబడతాయి.
IVF అనేది స్త్రీలకు గర్భాన్ని కలిగించే ఒక కృత్రిమ ప్రక్రియ. ఇది ఒక పిండకణాన్ని ఉత్పత్తి చేయడానికి ఆండాన్ని మరియు శుక్రకణాలను కృత్రిమంగా ఫలదీకరణం చెందించే ప్రక్రియ. పిండకణం మార్పిడికి సిద్ధమైన తర్వాత, గర్భం కోరుకున్న స్త్రీ శరీరం లోపల ఉంచబడుతుంది. తర్వాత ఆ మహిళ సాధారణంగా IVF మందులను వాడవలసి ఉంటుంది, కాబట్టి ఆమె శరీరం గర్భాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంచాలి.
IVF క్రింది సందర్భాలలో సూచించబడుతుంది:
శాశ్వతంగా గర్భం రాకుండా ఉండేందుకు ట్యూబల్ లిగేషన్ అని పిలువబడే ప్రక్రియలో ఫెలోపియన్ ట్యూబ్‌లు కత్తిరించబడతాయి లేదా నిరోధించబడతాయి. మీ ట్యూబ్‌లను నిరోధించిన తర్వాత ఎవరైనా గర్భం దాల్చాలనుకొంటే ట్యూబల్ లిగేషన్ రివర్సల్ సర్జరీ కంటే IVF ఉత్తమ ఎంపిక అవుతుంది.
ఫెలోపియన్ ట్యూబ్‌లో అడ్డుగా ఏదైనా ఉండటం లేదా ట్యూబుకి గాయం అయినప్పుడు, అండం ఫలదీకరణం చెందడం లేదా పిండం గర్భాశయానికి ప్రయాణిచడం సవాలుగా మారుతుంది. అటువంటి సందర్భంలో, IVF సిఫార్సు చేయబడుతుంది.
ఫైబ్రాయిడ్లు అనేవి గర్భాశయంలో ఉండే నిరపాయమైన కణితులు. 30 నుండి 40 ఏళ్లలోపు మహిళల్లో ఇవి అతి సాధారణం. ఫైబ్రాయిడ్లు ఫలదీకరణం జరిగిన ఆండాన్ని గర్భాశయంలో సరిగ్గా అమరకుండా నిరోధించవచ్చు.
అండోత్సర్గము అప్పుడప్పుడు లేదా అసలు జరగనట్లయితే ఫలదీకరణం కొరకు తక్కువ అండాలు అందుబాటులో ఉంటాయి.
అనేక కారణాల కోసం పరీక్షించినప్పటికీ కారణం తెలియకపోవడాన్ని వివరించలేని వంధ్యత్వం అంటారు.
మీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపించే క్యాన్సర్ చికిత్సను మీరు తీసుకోబోతున్నట్లయితే IVF ఒక మంచి ఎంపికగా ఉండవచ్చు. స్త్రీలు తమ అండాశయాలను ఆండాల కోసం సంరక్షించుకోవచ్చు, తర్వాత వాటిని ఫలదీకరణం చేయకుండా శీతలీకరించవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా, అందాలను ఫలదీకరణం చెందించి కూడా శీతలీకరించి నిల్వ చేయవచ్చు.
తక్కువ సంఖ్యలో ఉన్న శుఖ్రకణాల, పరిమిత కదలిక (పేలవమైన చలనశీలత) లేదా పరిమాణం ఇంకా రూపాలలో అసాధారణతలు కలిగి ఉంటే, అండాన్ని ఫలదీకరణం చెందించడంలో సమస్యలుండవచ్చు. వీర్యంలో అసాధారణతలు ఉన్నట్లు తెలిస్తే వంధ్యత్వ నిపుణుడితో సంప్రదింపులు జరపడం అవసరం.
గర్భాశయ లైనింగ్ ఇంప్లాంట్‌లను పోలిన కణజాలం గర్భాశయం వెలుపల వ్యాపించినప్పుడు ఇది అభివృద్ధి చెందుతుంది, ఇది తరచుగా అండాశయాలు, గర్భాశయం మరియు ఫెలోపియన్ ట్యూబ్‌లను దెబ్బతీస్తుంది.
మీరు లేదా మీ జీవిత భాగస్వామి మీ బిడ్డకు జన్యుపరమైన సంక్రమణను కలిగించే ప్రమాదం ఉన్నట్లయితే మీరు IVFకి అర్హులు. అన్ని జన్యుపరమైన సమస్యలు గుర్తించబడనప్పటికీ, అండాలు సంగ్రహించిన మరియు ఫలదీకరణం చేసిన తర్వాత నిర్దిష్ట జన్యుపరమైన సమస్యల కోసం తనిఖీ చేయబడతాయి. ఎటువంటి సమస్యలు లేని పిండాలను గర్భాశయంలో ఉంచవచ్చు.
IVF అనేది బహుళ-దశల, కష్టతరమైన ప్రక్రియ. ఇందుకు సగటున నాలుగు నుండి ఆరు వారాలు పడుతుంది. ఇది అండాన్ని తిరిగి సంగ్రహించే ముందు నుండి ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్ధారించబడే వరకు సమయాన్ని కలిగి ఉంటుంది. సంతానోత్పత్తి సమస్యలు లేదా దంపతులకు ముందునుంచి ఉన్న వైద్య పరమైన సమస్యల వంటి వివిధ కారణాల వల్ల ప్రజలు IVFని ఎంచుకుంటారు. కొందరు వ్యక్తులు ముందు తీసుకున్న సంతానోత్పత్తి చికిత్సలు వారికి పని చేయకపోతే లేదా వారు సంతానోత్పత్తి వయస్సును దాటినట్లయితే IVF ను చేయించుకోవాలని అనుకుంటారు. IVF అనేది స్వలింగ జంటలకు కూడా ఆచరణీయమైన ప్రక్రియ.
భారతదేశంలో IVF ధర రూ. లక్ష నుండి 3 లక్షల మధ్య ఉంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు, హార్మోన్లు, మందులు, కన్సల్టేషన్ ఛార్జీలు, ఈ ప్రక్రియ ఇంకా చికిత్సానంతర పరిచర్యలు ఉంటాయి.
ఇన్-విట్రో ఫర్టిలైజేషన్ అంటే స్త్రీ శరీరం వెలుపల శుక్రకణాలు మరియు అండాల మధ్య జరిగే కృత్రిమ గర్భధారణ. సహజంగా పిల్లలు పుట్టని జంటలు, స్వలింగ జంటలు లేదా ఒంటరి తల్లిదండ్రులు ఈ విధానాన్ని అవలంబిస్తారు. శుక్రకణాలు లేదా అండం దంపతులవి లేదా దాతవి కావచ్చు. దాత విషయంలో అన్నీ విషయాలు పూర్తిగా అనామకంగా ఉండేలా చూస్తారు. మీరు IVF గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, ఈరోజే మీ వైద్యుడిని సందర్శించండి.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |