
1. హైపర్ట్రోపిక్ మరకలు Hypertrophic scars: ఇవి పైకి కనిపిస్తూ ఎరుపు రంగులో ఉంటాయి. కానీ గాయం సరిహద్దును దాటి ఇవి వ్యాపించవు.
2. కెలాయిడ్ మరకలు Keloid scars: ఇవి కూడా పైకి కనిపిస్తూ ఎరుపు రంగులోనే ఉంటాయి. కానీ అసలు గాయం సరిహద్దును దాటి వ్యాపిస్తాయి.
3. ఆట్రోపిక్ మచ్చలు Atrophic scars: ఇవి వంపులు వంపులుగా ఉండి గుంటలుగా కనిపిస్తాయి.
4. కాంట్రాక్చర్ మచ్చలు Contracture scars: ఇవి కాలిన గాయాల వల్ల ఏర్పడతాయి. అంతే కాకుండా ఇవి చర్మం కదలికలను పరిమితం చేస్తాయి. ఎందుకంటే ఇవి గట్టిగా మరియు కట్టిపడేసినట్లు ఉంటాయి.
మరక వల్ల ఏదైనా నొప్పి కలిగితే ఏ రకమైన మచ్చ కణజాలం ఏర్పడిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాలలో మచ్చ కణజాలం ఏర్పడిన ప్రదేశంలో ఒత్తిడి మరియు టెన్షన్ వల్ల నొప్పి ఏర్పడవచ్చు. ఇతర సందర్భాలలో మరక ఏర్పడడం వల్ల ఆ ప్రాంతంలో వాపు రావడం వల్ల నొప్పి సంభవించవచ్చు.
C-సెక్షన్ వల్ల కలిగిన మరకతో(కుట్లు వేసిన ప్రదేశం) వచ్చే లక్షణాలు ఒక్కొక్కరి ఒక్కోలా ఉండొచ్చు. మరక (కుట్లు వేసిన ప్రదేశం) తీవ్రత మరియు దాని రకాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉండొచ్చు. కొన్ని సాధారణ లక్షణాలు:
1. ఆ ప్రాంతంలో చర్మం సున్నితంగా అవడం లేదా అసౌకర్యం కలగడం
2. మంటగా అనిపించడం
3. కూర్చున్నపుడు, నిలబడ్డపుడు, పడుకున్నపుడు తీవ్రమైన నొప్పి.
4. ఆ ప్రాంతంలో ఒత్తిడి కలిగినపుడు నొప్పి.
5. ఆ ప్రాంతంలో వాపు
6. బిగుతుగా అనిపించడం వలన ఆ ప్రాంతంలో ఇబ్బంది కలగడం
7. ఆ ప్రాంతంలో ఎరుపుగా అవడం లేదా రంగు మారడం
పైన పేర్కొన్న లక్షణాలలో దేనినైనా ఎదుర్కొంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ లక్షణాలు అనేవి మన శరీరంలో ఏదో తప్పుగా జరిగితే కనిపిస్తాయి. మచ్చకణజాలం నొప్పిని గుర్తించడంలో మరియు దానికి తగిన ఉత్తమ చికిత్సను సిఫారసు చేయడంలో వైద్యుడు మీకు సహాయం చేస్తాడు.
ఏర్పడ్డ మచ్చలో నొప్పి అనేది వివిధ కాలాల్లో సంభవిస్తుంది. ఇది సెన్సరీ (ఇంద్రియ) నరాలు కారణంగా సంభవిస్తుంది. అలా మచ్చ ఏర్పడినపుడు నొప్పి మరింత బాధాకరంగా ఉంటుంది.
స్కేర్ ట్రీట్మెంట్ చికిత్స చరిత్రలో అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో అత్యంత సాధారణ రకాలు ఈ కింద పేర్కొనబడ్డాయి.
· X-రే థెరపీ;
· లిక్విడ్ నైట్రోజన్తో క్రయోడెస్ట్రక్షన్
· మైక్రోవేవ్ థెరపీ
· ఫిజియోథెరపీ (ఎలక్ట్రోఫోరేసిస్, హైడ్రోకార్టిసోన్ లేదా కాంట్రాటుబెక్స్ ఫోనోఫోరేసిస్);
· స్టెరాయిడ్ ఇంజెక్షన్లు (డిప్రోస్పాన్, కెనలాగ్-40);
· కంప్రెషన్ (కంప్రెషన్ అండర్వేర్, మాస్క్‌లు, సిలికాన్ వన్ జెల్ ప్లేట్స్ ధరించడం);
· వివిధ రకాల పిల్స్, (ఒక విధమైన ఫేస్ క్రీమ్స్) మెకానికల్ మరియు కెమికల్ రెండూ..
A1. c-సెక్షన్ డెలివరీ చేయించుకున్న మహిళల్లో దాదాపు 30 శాతం మంది తమ సర్జరీ మరకల వల్ల ఏదో ఒక నొప్పితో భాదపడుతున్నారని అంచనా.
A3. c-సెక్షన్ వల్ల ప్రోలాప్స్, మూత్రాశయం లేదా పేగు పని చేయకపోవడం వంటివి సంభవించే అవకాశం ఉంది. పై లక్షణాలను ఎదుర్కొంటున్న మహిళలు నివారణ మరియు చికిత్స కోసం తమ వైద్యునితో మాట్లాడాలి. దీని నివారణ కోసం వైద్యుడు ఫిజికల్ థెరపీ, మందులు లేదా శస్త్రచికిత్సలను సిఫారసు చేయొచ్చు.
Tags
Why are C-section scars a problem years later and what can you do about it in Bengali




This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |