
మెటర్నటీ లెగ్గింగ్‌లు ప్రతి గర్భవతి వార్డ్ రోబ్‌లో ఖచ్చితంగా ఉండాలి. కంఫర్ట్ కోసం ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రతి స్త్రీ గర్భధారణ ప్రయాణం ప్రత్యేకమైనది. ఇది అనేక సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఈ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వాటి వల్ల కొన్ని సార్లు సౌఖ్యంగా ఉండడం వీలుపడదు. మీ పెరుగుతున్న శరీరం వలన సాధారణంగా మీరు రోజూ ధరించే దుస్తులు ఉపయోగానికి రావు. మీరు అప్పుడు మెటర్నటీ లెగ్గింగ్స్‌కు మారాల్సి వస్తుంది. మీకు సరైన సౌకర్యాన్ని అందించే లెగ్గింగ్లను ఎంచుకోవడం కొంత కష్టంతో కూడుకున్న పనే. సరైన దానిని ఎంచుకునే ముందు మీకు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్లు మరియు మీ అవసరాలను దృష్టిలో ఉంచుకోండి. ఇక్కడ మేము కొన్ని అంశాల గురించి లోతుగా చర్చిస్తాం. అత్యంత సౌకర్యవంతంగా ఉండే మెటర్నటీ లెగ్గింగ్‌ను ఎంచుకోవడంలో ఆ పాయింట్స్ మీకు సహాయపడతాయి. గర్భం తర్వాత కూడా ఇవి మీకు ఉపయోగపడతాయి.
గర్భవతిగా ఉన్నపుడు మెటర్నటీ లెగ్గింగ్స్‌ను ఎంచుకోవడం చాలా ఫన్‌గా ఉంటుంది. ప్రతి స్త్రీ ఈ దశలో కనీసం రెండు జతల మెటర్నటీ లెగ్గింగ్స్ అయినా కానీ కలిగి ఉండాలి. వాటిని స్టైలిష్‌గా ఉండేలా చూసుకోవాలి. మీకు సౌకర్యవంతంగా ఉండే లెగ్గింగ్స్ కోసం వెతుకుతున్నపుడు మీరు పరిగణించాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు కొనుగోలు చేసే లెగ్గింగ్స్ మీరు విశ్రాంతి తీసుకునేందుకు కూడా ఉపయోగపడాలి.
ఏ సీజన్లోనైనా ధరించేలా సాగే గుణంకల ఫాబ్రిక్ను ఎంచుకోండి. మీరు ఎంచుకున్న ఫాబ్రిక్ బిగుతుగా లేకుండా గాలి ప్రసరణ జరిగేలా ఉండాలి. కొన్ని ఉతుకుల తర్వాత పల్చబడి రక్తపు మరకలు కనిపించేలా ఉన్న మెటీరియల్స్‌ను ఎంచుకోకూడదు. ప్రతి లెగ్గింగ్ యొక్క ఫాబ్రిక్ వివరాలు డిస్క్రిప్షన్లో అందించబడ్డాయి. కావున వాటిని ఒకసారి పరిశీలించండి.
సరైన విధంగా ఉండే మెటర్నటీ లెగ్గింగ్స్‌ను ఎంచుకునేటపుడు బెల్లీ ప్యానెల్ (నడుం పట్టీ) అనేది మీ బొడ్డు పైన కానీ కింద కానీ ఉండేలా చూసుకోండి. కొన్ని లెగ్గింగ్స్ మందమైన బెల్ట్‌ను కలిగి ఉంటాయి. కొన్ని లెగ్గింగ్స్ సన్నని బెల్ట్‌ను కలిగి ఉంటాయి. మీకు ఎక్కువ సౌకర్యవంతంగా ఉండే వాటిని ఎంచుకోండి. మీ పొత్తి కడుపు పెరుగుతున్నా కొద్దీ నడుం పట్టీ అనేది మీ పొత్తి కడుపు మీద రుద్దకుండా ఉండేలా ఎంచుకోండి. మీకు సరిగ్గా సరిపోని లెగ్గింగ్స్ త్వరగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి లెగ్గింగ్ ఎంచుకునేటపుడే సరైన వాటిని ఎంచుకోవాలి. లెగ్గింగ్స్ వెతుకుతున్నపుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఇది. సరైన జత లెగ్గింగ్స్ మీకు ఎటువంటి బాధ కలిగించకుండా సరైన విధంగా సరిపోతాయి. మీరు పైన ధరించన టాప్ లేదా షర్ట్‌తో ఇవి మీకు అందమైన లుక్‌ను అందిస్తాయి. కొంత మంది స్త్రీలు బెల్లీ లెగ్గింగ్స్‌ను ఇష్టపడతారు. అవి వారికి ప్రసవం తర్వాత మరియు మూడో త్రైమాసికంలో కూడా కవరేజ్‌ను అందిస్తాయి. ఎవరికైనా బొడ్డు దురద ఉంటే లేదా బొడ్డు మీద ఎటువంటి ఒత్తిడిని వారు తట్టుకోలేకపోతే సాధారణగా ప్యానెల్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఈ రోజుల్లో లెగ్గింగ్స్ వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. మీరు ఎంచుకునే లెగ్గింగ్ మీ పెరుగుతున్న పొట్టకు అనువుగా ఉండేలా చూసుకోండి. దానిని ధరించి వదిలేసిన తర్వాత మీ పొట్టమీద ఎలాంటి మరకలను వదిలిపెట్టకుండా చూసుకోవాలి. ఫుల్ టైట్‌గా ఉండే వాటిని ఎంచుకోకండి. మీరు సైజ్‌ను ఎంచుకునే ముందు మీ పొట్ట మరియు తుంటి భాగాన్ని కొలవండి. ఆ తర్వాతే సైజ్ సెలెక్ట్ చేసుకోండి.
వేర్వేరు పరిమాణాలు ఉన్నందున లెగ్గింగ్స్ కూడా వివిధ లెంగ్త్స్‌లో మీకు లభిస్తాయి. మనకు సౌకర్యంగా ఉండేలా ఆంకిల్ లెంగ్త్ (చీలమండవరకు వచ్చేవి) లేదా పూర్తిగా పొడవు ఉన్న వాటిని ఎంచుకోవచ్చు. కొన్ని ఫాబ్రిక్స్ ఉతికిన తర్వాత సింక్ (కుచించుకుపోవడం) అవుతాయి. కావున మీకు పూర్తిగా మీ కాళ్లను కవర్ చేసే లెగ్గింగ్ కావాలంటే కొంచెం పొడవాటి లెగ్గింగ్స్ తీసుకోవడమే మంచిది.
మీరు ఎంచుకునే మెటీరియల్ చూసేందుకు చక్కగా మరియు గాలి ప్రసరణ జరిగేలా ఉండాలి. కానీ ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇలా మందంగా లేనివాటిని అన్ని సీజన్లలో సౌకర్యవంతంగా ధరించేందుకు వీలుంటుంది. ఇవి స్మాల్ బంప్స్‌ను స్మూత్ చేస్తాయి.
గర్భందాల్చిన కొన్ని నెలల వరకు రెగ్యులర్ లెగ్గింగ్స్ ధరించవచ్చు. కానీ అవి గర్భవతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడలేదు కాబట్టి మెటర్నటీ లెగ్గింగ్స్‌కు వెళ్లడం ఉత్తమం. మెటర్నటీ లెగ్గింగ్స్ మీ పొత్తి కడుపు మీద ఎక్కువ బిగుతుగా ఉండకుండా సాగుతాయి. ఇవి పొట్ట మీద ఎటువంటి మరకలను మిగల్చవు. (టైట్ కావడం వల్ల) ఇవి మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
మీ సౌకర్యం మీద ఆధారపడి మెటర్నటీ లెగ్గింగ్స్‌ను మొదటి త్రైమాసికం నుంచి ధరించొచ్చు. ఇవి ఎటువంటి అడ్డుగోడలు లేకుండా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. కొంత మంది మహిళలు మొదటి త్రైమాసికంలో తమ సాధారణ దుస్తులను ధరించేందుకు ఇష్టపడతారు. నాలుగో నెల ప్రారంభమైన తర్వాత మాత్రమే మెటర్నటీ దుస్తులను ధరించేందుకు ఇష్టపడతారు. స్త్రీలు విభిన్న శరీరాలు మరియు విభిన్న రకాలైన సౌకర్యాలను కలిగి ఉంటారు కాబట్టి మీ సౌకర్యం ఆధారంగా ఎంచుకోండి.
లెగ్గింగ్స్ అనేవి ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్న దుస్తులు. వీటిని గర్భవతులుగా ఉన్న వారు సులభంగా ధరించొచ్చు. వారు వర్కౌట్స్ చేసేటపుడు కూడా వీటిని ధరించొచ్చు. ఇంట్లో చేసే రోజూవారీ కార్యక్రమాలకు కూడా వీటిని ధరించేందుకు వీలుగా ఉంటాయి.
మెటర్నటీ లెగ్గింగ్స్ కేవలం గర్భధారణ సమయంలో మాత్రమే కాకుండా ప్రసవం తర్వాత కూడా వీటిని ధరించొచ్చు. గర్భధారణ తర్వాత స్త్రీ శరీరం ఎన్నో మార్పులకు గురైనా కానీ ఈ లెగ్గింగ్స్ సౌకర్యవంతంగానే ఉంటాయి.
లెగ్గింగ్స్ అనేవి దుస్తులలో ఒక గమ్మత్తైన రకం. కానీ సరైన సమాచారంతో వెళ్తే మాత్రం ఒకరు ఏది ఎంచుకోవాలని ఈజీగా నిర్ణయం తీసుకోవచ్చు. లెగ్గింగ్స్ గురించి పూర్తి సమాచారం కొరకు మైలో స్టోర్‌ను సందర్శించండి. ఇక్కడ లెగ్గింగ్స్ గురించిన అన్ని వివరాలు మీకు లభిస్తాయి. గర్భవతులుగా ఉన్న వారు మెటర్నటీ లెగ్గింగ్లను ధరించడం ఉత్తమం. ఏ మహిళైనా ఉత్తమంగా సరిపోయే లెగ్గింగ్లను ఎంచుకునేందుకు కొంత రీసెర్చ్ చేయడం అవసరం.
Maternity Leggings in telugu, Maternity Leggings models in telugu, Maternity Leggings for pregnants in telugu, Why Maternity Leggings are comfortable in telugu, How Maternity Leggings are best choice for pregnant ladies in telugu.

Maternity Leggings - M - Black
Comfortable | Soft & Gentle on the Skin | Ideal for Pre & Post Delivery






This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |