
తమ అండాలతో గర్భం దాల్చకుండా పిల్లలను కోరుకునే మహిళలకు ఎగ్ డొనేషన్ ప్రక్రియ అనేది ఒక వరం. చాలా మందిలో పుట్టినప్పటి నుంచి అండాశయాల సమస్య ఉంటుంది. మోనోపాజ్ (పీరియడ్ ఆగిపోయే ప్రక్రియ), హర్మోన్ల చికిత్సకు అండాశయ ప్రతిస్పందన సరిగా లేకపోవడం లేదా మునుపటి IVF చికిత్సలలో తక్కువ ఎగ్ లేదా ఎంబ్రియో క్వాలిటీ కానీ కారణం కావొచ్చు. తల్లి వయసు కారణంగా గుడ్డు నాణ్యత తక్కువగా ఉండడం అందువల్ల ఎగ్ డొనేట్ చేయడం సాధారణం. 37 సంవత్సరాల తర్వాత స్త్రీ ఎగ్స్ క్వాలిటీ గణనీయంగా తగ్గుతుంది.
గర్భం దాల్చేందుకు ఒక స్త్రీ (డోనర్) తన అండాలను మరొక స్త్రీకి (రిసీవర్) అందజేసినపుడు సాధారణంగా ఎగ్ డొనేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎగ్ డొనేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు సింగిల్ సైకిల్లో ఎక్కువ అండాలను ఉత్పత్తి చేసేందుకు డోనర్‌కు మందులు ఇస్తారు. ఈ అండాలను బయటకు తీసేందుకు సూది ద్వారా అల్ట్రాసౌండ్ ప్రోబ్ అనేది యోని కణజాలంలోకి చొప్పించబడుతుంది. ఆ తర్వాత గుడ్లు అండాశయాల నుంచి మనకు కనిపిస్తాయి. అండాలను వెలికి తీసిన తర్వాత వాటిని ఎంబ్రియాలజిస్ట్ (నిపుణుడు) పరీక్షిస్తాడు. ఆ తర్వాత స్పెర్మ్ అనేది మగ భాగస్వామి స్పెర్మ్ బ్యాంక్ నుంచి అండాలలోకి చొప్పించబడుతుంది. ఈ పద్ధతిని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అని పిలుస్తారు.
సాధారణ ఇన్ విట్రోఫెర్టిలైజేషన్ (IVF) అండాశయ స్టిములేషన్ (ఉద్దీపన)ను కలిగి ఉంటుంది. ఫలదీకరణం కోసం ఆరోగ్యకరమైన అండాలను ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించబడింది. డోనర్ IVF సైకిల్స్ సక్సెస్ కాకముందు స్త్రీ వేరే స్త్రీ నుంచి అండాలను పొందాల్సి ఉంటుంది. ఆ స్త్రీ తెలిసిన వ్యక్తయినా కావొచ్చు. లేదా IVF క్లీనిక్‌లో కలిసిన అనామక వ్యక్తి అయినా కావొచ్చు. డోనర్ ఎగ్ ద్వారా IVF చేయించుకునేందుకు గతంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు IVF ప్రక్రియ ఫెయిల్ అయి ఉండాలి.
ఏదేమైనప్పటికీ పరిశోధనలు చెప్పే విషయం ఏమిటంటే.. డోనర్ ఎగ్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడం వలన డోనర్ ఎగ్ IVF ఖర్చు లేదా ఇన్ఫర్టిలిటీ చికిత్స ఖర్చును తగ్గించవచ్చు. అందుకోసమే కొంత మంది మహిళలు IVFను ప్రిఫర్ చేస్తారు. ఒక స్త్రీ డోనర్ ఎగ్స్‌ను ఎంచుకునేందుకు గల కారణాలు…
ఒకటి కంటే ఎక్కువ అండాలను ఉత్పత్తి చేసేందుకు ఎగ్ డోనర్‌కు హార్మోన్స్ ఇవ్వబడతాయి. సాధారణంగా మహిళలు నెలకు ఒక అండాన్ని ఉత్పత్తి చేస్తారు. కానీ ఒకటి కంటే ఎక్కువ హార్మోన్లను డెవలప్ చేసేందుకు ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి. ఆమె గుడ్లు అనేవి పరిపక్వ దశకు చేరుకొని.. రిట్రైవ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నపుడు ఆమె ఫర్టిలిటీ డాక్టర్ స్టెప్-బై-స్టెప్ ఎగ్ డొనేషన్ ప్రక్రియను ప్లాన్ చేస్తాడు. ఎగ్ డోనర్‌ను మత్తులో ఉంచుతూ ఆమె వైద్యుడు ఆమెలో పరిపక్వం చెందిన అండాలను అల్ట్రాసౌండ్ గైడెడ్ నీడిల్ ద్వారా ఒక్కొక్కటిగా సేకరిస్తాడు. గ్రహీత భాగస్వామి స్పెర్మ్ లేదా డోనర్ స్పెర్మ్ ద్వారా అండాలు ప్రయోగశాలలో ఫలదీకరణం చేయబడతాయి. ఒకటి కంటే ఎక్కువ అండాలను ఫలదీకరణం చేస్తారు. దీనిని డోనర్ ఎగ్ ద్వారా IVF ప్రాసెస్ అని పిలుస్తారు. ఎంబ్రియో (ఫలదీకరణం చెందిన గుడ్డు) గ్రహీత యొక్క గర్భాశయంలో అమర్చబడుతుంది.
ఒక స్త్రీకి నార్మల్ IVF చికిత్సలో ఎటువంటి సమస్యలు ఉంటాయో.. ఎగ్ డొనేషన్ ప్రక్రియలో కూడా అవే ప్రమాదాలు ఉంటాయి. అండాశయాలను ఉత్తేజపరిచేందుకు ఉపయోగించే ఔషధాల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎగ్ డోనర్స్ అవగాహన కలిగి ఉండాలి. డోనర్ OHSS (ఓవరిన్ (అండాశయ) హైపర్ స్టిములేషన్ సిండ్రోమ్) పొందే అవకాశం ఎక్కువగా ఉంది. డోనర్స్ సాధారణంగా చాలా చిన్నవారు మరియు ఎక్కువ ఫర్టైల్ కలిగినవారు కాబట్టి ఈ సమస్య వస్తుంది. IVF చేయించుకుంటున్న వంధ్యత్వం కలిగిన మహిళ కంటే ఎగ్ డొనేషన్ చేసే మహిళలకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
డోనర్స్ OHSS వార్నింగ్ సైన్స్ గురించి పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. అవసరమైతే తక్షణ చర్య కూడా తీసుకోవాలి. అరుదైన పరిస్థితులలో చికిత్స చేయని OHSS మహిళ సంతానానికి, ఆమె ప్రాణానికి కూడా హాని కలిగిస్తుంది. గర్భవతి కావాలని ఆశిస్తూ డోనర్ ఎగ్ IVF చికిత్స తీసుకున్న మహిళలకు మల్టీపుల్ ప్రెగ్నెన్సీలు అనేవి సాధారణ ప్రమాదం. మల్టీపుల్ ప్రెగ్నెన్సీ ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు కొన్ని ఎంబ్రియోస్ను ట్రాన్స్ఫర్ చేయండి. మీ పరిస్థితికి ఒకే పిండం అనేది సరిగ్గా ఉంటుందో లేదో మీ IVF నిపుణుడితో చర్చించి నిర్ణయం తీసుకోండి.
డోన్ ఎగ్ IVF అనేది ఫ్రెష్ ఎంబ్రియోను బదిలీ చేసినపుడు 55.9 శాతం, ఫ్రోజెన్ ఎంబ్రియోను బదిలీ చేసినపుడు 40.2శాతం బర్త్ రేటును కలిగి ఉంటుంది. సక్సెస్ రేట్లు అనేవి మీరు ఏ IVF చికిత్స మీదైతే ఆధారపడతారో వాటిని బట్టి ఉంటుంది. మీరు.. ఇతర సంతానం లేని జంట అండాలను పంచుకోవాలని నిర్ణయించుకుంటే.. మీ గర్భధారణ రేటు సగటు కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబసభ్యుడు లేదా సన్నిహితుడైన వ్యక్తిని ఎగ్ డొనేషన్ కోసం ఉపయోగించినట్లయితే అదే సూత్రం వర్తిస్తుంది. వీరిని ఎంచుకుంటే వారు ఉత్తమ డోనర్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు.
ఇండియాలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్స ఖర్చు రూ. 60,000 నుంచి రూ. 80,000 వరకు ఉంటుంది. అంతే కాకుండా ఈ డోనర్ ఎగ్ ఖర్చులో అవసరమైన అన్ని రకాల మందులు ఉంటాయి. అయినప్పటికీ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్స కొరకు చాలా మంది జంటలు రూ. 5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే వారికి మల్టీపుల్ రౌండ్స్ IVF సైకిల్స్ అవసరం.
IVF చేయించుకుంటే మీలో సక్సెస్ రేట్ ఎంత ఉంటుందనే విషయాన్ని వైద్య నిపుణులను అడిగి తెలుసుకోండి. వంధ్యత్వం (ఇన్ ఫెర్టిలిటీ) ఉన్నప్పటికీ గర్భం ధరించడం, ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడం ఇప్పటికీ సాధ్యమే. డోనర్ ఎగ్‌ను మీ భాగస్వామి స్పెర్మ్‌తో ఫలదీకరణం చెందించిన తర్వాత మీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం ద్వారా కూడా ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీని సాధించవచ్చు.
What is egg donor method in telugu, Egg donor method in telugu, Benefits of Egg donor method in telugu, When should we consider Egg donor in telugu, Financial details of Egg donor in telugu, Success rate of egg donor in telugu.



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |