
మొదటి ఐదేళ్లలో పిల్లల మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ సమయంలో ఆరోగ్యకరమైన అభివృద్ధిని ఎలా సాధించాలి? దీనికి అసలు సమాధానం మీకూ, మీ పిల్లలకు మధ్య సరైన ఇంటరాక్షన్ ఉండటమే. ఎందుకంటే మీరు పిల్లలతో ఇంటరాక్ట్ అయిన ప్రతీసారి, వారి కళ్లల్లో వెలుగులు నింపడమే కాదు, వారి మెదడుపై కూడా ప్రభావం చూపిస్తారు. బాల్యంలో మీ ఇంటరాక్షన్ సానుకూలంగా ఉంటే, అనుబంధాలను పెంచుతుంది. అది వారిలో ఆసక్తి పెంచడమే కాదు, జీవితకాలంపాటూ నేర్చుకోవడానికి వారిని సిద్ధం చేస్తుంది.
మీ పిల్లల కోసం ఇక్కడ ఉన్న కొన్ని యాక్టివిటీస్‌ని మీరు ప్రయత్నించవచ్చు.
మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల్లో ఒకరి పేరును గెస్ చేయమని అడగాలి. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి కొన్ని హింట్స్ ఇవ్వాలి. పిల్లల్లో క్లూస్ అన్నీ జోడిస్తూ క్రిటికల్ థింకింగ్ అభివృద్ధి చేయడానికి ఈ యాక్టివిటీ సాయపడుతుంది.
పండ్ల గురించి వారిని అడగండి. ‘యాపిల్ తియ్యగా ఉంటుందా?’, ‘ఆరెంజ్ పుల్లగా ఉంటుందా?’ లాంటివి వారికి తెలియకపోయినా, వాటి రుచి ఎలా ఉందో పిల్లలు తమ సొంత మాటల్లో చెప్పేలా ప్రోత్సహించాలి. ఈ ఎక్సర్‌సైజ్‌తో పిల్లల్లో రీజనింగ్ స్కిల్స్, వొకాబులరీ పెరుగుతుంది.
చేతులు కడుక్కునేప్పుడు లేదా స్నానం చేసేప్పుడు వేడి నీళ్లు, చల్ల నీళ్ల గురించి పిల్లలకు చెప్పాలి. రెండింటినీ కలిపితే నీళ్లు వెచ్చగా ఎలా అయ్యాయో చెప్పాలి. సబ్బుతో చేతులు శుభ్రంగా ఎలా మారుతాయి, టవల్‌తో తుడుచుకుంటే చేతులు పొడిగా ఎలా అవుతాయనేవి చెప్పాలి. ఇలా ఏవి ఎలా పనిచేస్తాయో చెప్పడం ద్వారా, రోజూ ఎలా శుభ్రంగా ఉండాలో పిల్లలు నేర్చుకుంటారు.
మీ పిల్లలు పైకి ఎక్కుతున్నప్పుడు లేదా కిందకు దిగుతున్నప్పుడు చేతులు పట్టుకొని ఇద్దరూ కలిసి మెట్లను లెక్కపెట్టాలి. ఈ ఎక్సర్‌సైజ్ వల్ల వారికి అంకెల గురించి తెలుస్తుంది. బేసిక్ మ్యాథ్స్ నేర్చుకోవడం ఇక్కడే ప్రారంభం అవుతుంది.
ఆహారం తినిపించేప్పుడు ఆహారానికి సంబంధించిన చిన్న రైమ్ మీరే క్రియేట్ చేయండి. అందులో మీ పిల్లల ఫేవరెట్ ఫుడ్ ఉండాలి. రైమ్‌తో పాటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు.
పైన చెప్పిన యాక్టివిటీస్‌తో నేర్చుకోవడం అనేది వినోదంగా ఉండటమే లక్ష్యంగా చేసుకోవాలి. పిల్లల్లో కాగ్నిటీవ్ డెవలప్‌మెంట్‌తో పాటు భాషాభివృద్ధికి ఉపయోగపడుతుంది.
Games and activities for your kids in telugu, games for your baby in telugu, brain development games for your baby, brain development activities in telugu.
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |