
మొదటి సారి బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో స్త్రీలు చాలా మార్పులకు లోనవుతారు. ఊహించని చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అందులో బిడ్డకు పాలు ఇవ్వడం ఒకటి. పగలు, రాత్రి బిడ్డను చూసుకుంటూ.. శరీరంలో కలిగే మార్పులను గుర్తిస్తున్నప్పుడు అయోమయానికి గురవుతారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, సరైన పద్ధతిలో తల్లిపాలు పట్టడం వల్ల తీవ్రమైన నొప్పి, పుండ్లు పడడం, వాపు లేదా చనుమొనల్లో పగుళ్లు వంటి సమస్యలను దూరం చేయవచ్చు. ముందుగా బిడ్డకు పాలు ఇవ్వడంలో సరైన పద్ధతి ఏంటో తెలుసుకోవాలి. మొదట, చనుమొనల నొప్పి గురించి.. అందుకు గల కారణాలు గురించి తెలుసుకోండి.
చనుమొనల నొప్పికి అత్యంత సాధారణ కారణం శిశువు భంగిమ సరిగ్గా ఉండకపోవడం. తల్లి, బిడ్డ ఇద్దరూ సరైన పద్ధతిలో ఎలా ఉండాలో తెలుసుకునేందుకు ప్రతిసారీ జాగ్రత్తగా సాధన చేయాలి. బిడ్డ నోటికి చనుమొనలను ఎలా కూర్చుంటే.. సౌకర్యవంతంగా అందించగలుగుతున్నారనేది తప్పక చెక్ చేసుకోవాలి. ఈ అంశంలో సూచనలు అవసరం అనిపిస్తే నిపుణులను సంప్రదించాలి.
స్త్రీలలో కనిపించే మరొక సమస్య చనుమొనలు పొక్కడం. ఇది ప్రధానంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. బిడ్డకు పాలు పట్టిన తర్వాత చనుమొనలపై తేమ అలాగే ఉంచేయడంతో ఈ సమస్య ఎదురవుతుంది. బిడ్డకు పాలు పట్టిన ప్రతిసారి చనుమొనలను నీటితో కడుక్కోవాలి. వాటిపై తేమను శుభ్రంగా ఉన్న మృదువైన టవల్‌తో తుడవాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: చనుమొనలపై తెల్లటి మచ్చలు: లక్షణాలు, కారణాలు & చికిత్స
రాపిడి కూడా చనుమొనల నొప్పికి కారణం కావచ్చు. చనుమొనలకు చాలా తరచుగా ఒరిపిడి కలగడం వలన, అవి పొడిబారి చిట్లిపోతాయి. బిడ్డకు తరచుగా పాలు పడితే ఈ సమస్య ఎదురవుతుంది. బిడ్డకు తల్లిపాలు ఇచ్చే సమయాల గురించి తెలుసుకొనేందుకు వైద్యుడిని సంప్రదించడం మేలు. బిడ్డకు ఎక్కువగా పాలు పట్టడం కంటే ఆకలిని అర్థం చేసుకుని పాలు ఇవ్వడం ముఖ్యం. చనుమొనలు పుండ్లు పడటానికి ఇంతకంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చు. కానీ ఇవి చాలా సాధారణంగా కనిపించే సమస్యలు. అన్నింటికంటే ప్రధానంగా చనుమొనల నొప్పికి ఉపశమనం ఎలా పొందాలి?
సమస్యను అర్థం చేసుకున్నప్పుడు, దానిని సమర్థంగా పరిష్కరించుకోవచ్చు . బిడ్డకు పాలు ఇచ్చేందుకు సరైన భంగిమ తెలియకపోతే.. సరైన భంగిమేదో తెలుసుకోవడంపై శ్రద్ధ చూపాలి. బిడ్డ నోటిని తగినంత పెద్దగా తెరిచేలా చూసుకోవాలి. కేవలం చనుమొనను మాత్రమే నోటికి అందించకుండా బ్రెస్ట్ మొత్తం నోటిలోకి చొప్పించాలి. అప్పుడే చనుమొనలు నొప్పి పెట్టకుండా ఉంటాయి. అనుభవం ఉన్న తల్లులను, వైద్యులను కలిసి వారి సూచనలు తెలుసుకోండి. ఈ సూచనలు అన్నీ పాటించడం, సక్రమంగా పాలు ఇవ్వడం అలవాటు కాక కష్టమనిపిస్తే చింతించాల్సిన అవసరం లేదు. కొంచెం సాధనతో పరిస్థితులపై అవగాహన పెంచుకోవచ్చు. అదే విధంగా చనుమొనలపై మంచి మాయిశ్చరైజర్‌ని పూయాలి. ఉపశమనమిచ్చే క్రీమ్‌ను పూయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం దక్కుతుంది. ప్రశాంతమైన అనుభూతిని పొందుతారు. అయితే ఏ మాయిశ్చరైజర్ వాడితే మంచిదో తెలుసుకోండి?
ఒరిపిడిని తగ్గించడానికి, మైలో కేర్ నిపుల్ బటర్ క్రీమ్‌ను ప్రయత్నించవచ్చు, ఇది చనుమొనలకు ఉపశమనం అందిస్తుంది. సమస్యను నయం చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది పసుపు, షే బటర్, కోకో బటర్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, కలేన్ద్యులా, విటమిన్ ఇ ఇంకా సేంద్రియ బీస్వాక్స్ వంటి సహజసిద్ధ పదార్ధాలతో తయారు అయింది. ఈ క్రీమ్‌లో ఉన్న ఇంకో సుగుణం ఏంటంటే.. ఇందులో హానికరమైన రసాయనాలు లేవు. అలా అని ధ్రువీకరణ కూడా పొందింది. ఇది శిశువులకు కూడా సురక్షితం.
అదే విధంగా చనుమొనలను ఐసింగ్ చేయడానికి లేదా గోరువెచ్చని నీటితో మసాజ్ చేసేందుకు కూడా ప్రయత్నించవచ్చు. ఐస్‌ను అప్లై చేయడం వల్ల కాసేపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటితో మసాజ్ చేయడం వల్ల నొప్పి, మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రెండు పద్ధతులు భిన్నమైనవే కానీ కాస్తంత హాయిని కలిగిస్తాయి.
Sore nipples during breast feeding in telugu, nipple butter cream for sore nipples in telugu, why nipples feel sore during breastfeeding in telugu, breast feeding issues in telugu, Why Do Nipples Get Sore While Breastfeeding and How to Soothe Them in English, Why Do Nipples Get Sore While Breastfeeding and How to Soothe Them in Tamil, Why Do Nipples Get Sore While Breastfeeding and How to Soothe Them in Hindi, Why Do Nipples Get Sore While Breastfeeding and How to Soothe Them in Bengali.



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |