This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ఫేస్ క్రీమ్ కొనేముందు ఏం చూడాలి?

Pregnancy
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Feb 10, 2026
ఫేస్ క్రీమ్ కొనేముందు ఏం చూడాలి?
Likes2 Likes|
Read time6 min

మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏదైనా ఉందంటే అది చర్మమే. అయినా చాలామంది దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు. చర్మ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. వేడి, వెలుతురు, గాయాలు, ఇన్ఫెక్షన్ లాంటి వాటి నుంచి చర్మం రక్షణగా నిలుస్తుంది. కాబట్టి, శరీరంలో అత్యంత సున్నితమైన చర్మాన్ని సంరక్షించుకోవడం, చర్మం విషయంలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత మంచిది. అయినా మంచి అలవాట్లు చేసుకోవడానికి ఇది ఆలస్యమేమీ కాదు. ఇప్పటి తరం తమ ఆరోగ్యం, మంచి చర్మరక్షణ విషయంలో చాలా చైతన్యంతో ఉన్నారు. మంచి చర్మ సంరక్షణ అలవాటు చేసుకుంటే కాలుష్యం, ఇతర నష్టాలు, పర్యావరణ కారకాలతో సంబంధం లేకుండా మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది.

మంచి స్కిన్ కేర్ రొటీన్ ఎలా రూపొందించుకోవాలి?

సరైన స్కిన్ కేర్ రొటీన్ మెయింటైన్ చేయాలంటే మీరు రోజూ కాస్త డెడికేషన్ చూపించడం అవసరం. మంచి చర్మం రాత్రికి రాత్రే రాదు. చాలా జాగ్రత్తలతో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటే సరిపోదు. మంచి ఫలితాల కోసం వాటిని సరిగ్గా ఉపయోగించడం తెలియాలి.

స్కిన్ కేర్ రొటీన్ విషయంలో 2 ప్రాథమిక, సులభమైన దశలు ఉన్నాయి. అవి శుభ్రపర్చడం, మాయిశ్చరైజ్ చేయడం. మీ చర్మంపై ఉన్న మురికి, మలినాలు, మేకప్ తొలగించడానికి సున్నితమైన క్లీన్సర్ అవసరం. తద్వార రంధ్రాలను క్లియర్‌గా ఉంచడానికి, మొటిమల బారిన పడకుండా చర్మాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఉదయం ఓసారి, రాత్రి ఓసారి చర్మాన్ని శుభ్రపర్చుకోవాలి.

డ్రై, ఆయిలీ, రెండింటి కలయిక అయిన వేర్వేరు చర్మాల రకాలకు సరిపడే క్లీన్సర్స్ మార్కెట్లో అనేకం అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, మార్కెట్లో కనిపించిన క్లీన్సర్ గుడ్డిగా తీసుకోకుండా మీ చర్మానికి సూట్ అయ్యేది ఎంచుకోవాలి. మీ చర్మాన్ని పరీక్షించి, మీ స్కిన్ టైప్ ఏదో తెలుసుకునేందుకు డెర్మటాలజిస్ట్‌ (చర్మ వ్యాధి నిపుణులు)ను సంప్రదించడం మంచి ఆలోచన. ఒకేసారి రకరకాల ప్రొడక్ట్స్ అప్లై చేస్తే మీ చర్మం డ్యామేజ్ అవుతుంది. మీ చర్మానికి ఏది బాగుంటుందో కనుక్కోవడం కష్టం అవుతుంది.

ఇక క్లీన్సింగ్ తర్వాత రెండో స్టెప్ విషయానికి వస్తే మీ ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయడం. ఫేస్ మాయిశ్చరైజర్స్ తేమ, పోషకాలతో మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. మీ చర్మానికి, పర్యావరణం వల్ల కలిగే చర్మ సమస్యలకు మాయిశ్చరైజర్స్ అడ్డుగోడగా నిలుస్తాయి.

అన్ని రకాల చర్మాల రకాలకు సింగిల్ మాయిశ్చరైజ్ ఉండదు. ఉదాహరణకు డ్రై స్కిన్ ఉన్నవారు ఆయిల్ బేస్డ్ ఫేస్ క్రీమ్స్ ఉపయోగించాలి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు వాటర్ బేస్డ్ ఫేస్ క్రీమ్స్ ఉపయోగించాలి.

ఫేస్ క్రీమ్ కొనే ముందు ఏఏ పాయింట్స్ గుర్తుంచుకోవాలి?

1. సన్ ప్రొటెక్షన్:

మీ చర్మం రకంతో సంబంధం లేకుండా, కనీసం SPF 30 ఉండే, సన్‌స్క్రీన్‌లా పనిచేసే మాయిశ్చరైజర్‌ను ప్రతీ డెర్మటాలజిస్ట్ సూచిస్తుంటారు. ఈ సన్ స్క్రీన్ సూర్యుని నుంచి వచ్చే హానికరమైన ప్రభావాల నుంచి రక్షణగా నిలుస్తుంది. తద్వార సన్‌బర్న్, అకాల వృద్ధాప్యం లాంటివాటిని నివారిస్తుంది. మాయిశ్చరైజర్స్ ఆయిల్, వాసన లేకుండా ఉండాలి.

2. యాంటీఆక్సిడెంట్స్

గ్రీన్ టీ, చామంతి, దానిమ్మ, విటమిన్ సీ, ఈ, ఏ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫేస్ క్రీమ్స్ ఉపయోగిస్తే మీ చర్మం ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అందులో పవర్‌ఫుల్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రకాశవంతం చేసే ఆక్సిడెంట్‌గా విటమిన్ సీ గురించి చెప్తుంటారు. ఇది మీ శరీరాన్ని ప్రకాశవంతంగా మార్చడం మాత్రమే కాదు, ర్యాడికల్ డ్యామేజీ తగ్గించి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

3. చర్మంపై జిడ్డుగల మొటిమలు

మీది జిడ్డు చర్మమా? లేక తరచూ మొటిమలు వస్తుంటాయా? అయితే నాన్ కొమెడోజెనిక్ ఉన్న, రంధ్రాలు మూసుకుపోని ఫేస్ క్రీమ్ ఎంచుకోండి. సువాసనలు లేని హైపోఅల్లెర్జనిక్ ఫేస్ క్రీమ్ ఉపయోగించండి. సువాసనలు మీ చర్మానికి చికాకు కలిగించడమే కాదు, మొటిమలకు కారణం అవుతాయి. సలిసిలిక్ యాసిడ్, హ్యాలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ లాంటివి ఉన్న ఫేస్ క్రీమ్ మొటిమలపై పోరాడుతుంది.

4. పొడి చర్మం

హ్యాలురోనిక్ యాసిడ్, డైమెథికోన్ ఎక్కువగా ఉన్న ఫేస్ క్రీమ్ ఉపయోగిస్తే మీ చర్మం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంటుంది. పొడి చర్మానికి గ్లిజరిన్ చాలా అవసరం. గ్లిజరిన్‌తో మీ చర్మంపై తడి ఏర్పడుతుంది. మీ చర్మం హైడ్రేడెట్‌గా ఉండేందుకు సాయపడుతుంది. పొడి చర్మానికి విటమిన్ సీ కూడా ఉపయోగపడుతుంది.

5· సున్నితమైన చర్మం

సువాసనలు లేని హైపోఅల్లెర్జనిక్ ఫేస్‌క్రీమ్ తీసుకోవాలి. సున్నితమైన చర్మం కాస్మెటిక్ ప్రొడక్ట్స్, పర్యావరణ కారకాలకు వేగంగా స్పందిస్తుంది. సున్నితమైన చర్మానికి ఫేస్ క్రీమ్ చాలా కీలకం. ఇది చికాకును తగ్గించడమే కాకుండా, చర్మంపై ఉండే పైపొరను రీస్టోర్ చేస్తుంది.

6. తామర

తామరకు జన్యుపరమైన, పర్యావరణ ఒత్తిడి, ఇతర అంశాలు కారణం అవుతాయి. పెట్రోలాటమ్ లేదా పెట్రోలియం జెల్లీ ఉన్న మందపాటి ఫేస్ క్రీమ్ అప్లై చేయాలి. పెట్రోలియం జెల్లీ మాయిశ్చరైజింగ్‌గా పనిచేయడమే కాకుండా, ఎరుపును, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

ఫేస్ క్రీమ్ ఎంచుకునే సమయంలో ఎలాంటి అంశాలను వదిలేయాలి?

ఫేస్ క్రీమ్ కొనేప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. అందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అంటే పదార్థాల గురించి పట్టించుకోరు. ఫేస్ క్రీమ్ కొనేప్పుడు వెనుకవైపు ఉన్న లేబుల్ చదవడం తప్పనిసరి.

  1. సువాసనలు ఉన్న ఫేస్ క్రీమ్ కొనొద్దు. అందులో ఎలాంటి హానికర కెమికల్స్ ఉండకూడదు.
  2. ఆయిల్, వ్యాక్స్, షీ బట్టర్ లాంటి పదార్థాలు ఉన్న ఫేస్ క్రీమ్ ఎవాయిడ్ చేయాలి. వీటితో రంధ్రాలు మూసుకుపోతాయి. మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతాయి. మీ శరిరానికి సరిపోయేది మీ మొహానికి మంచిది అనుకుంటే పొరపాటే.
  3. స్టెరాయిడ్ క్రీమ్స్ ఎక్కువగా ఉపయోగిస్తే మీ చర్మం పల్చబడటానికి, మరింత సున్నితంగా మారడానికి కారణం కావొచ్చు.
  4. మీరు ప్రత్యేకంగా ఫేస్ క్రీమ్ ఉపయోగిస్తున్నట్టైతే, జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం ఆక్సైడ్ ఉన్న సన్‌స్క్రీన్ తీసుకోండి. ఈ సన్‌స్క్రీమ్‌తో మొటిమలు పగిలిపోకుండా జాగ్రత్తపడొచ్చు.

ఫేస్ క్రీమ్ సరిగ్గా అప్లై చేయడానికి టిప్స్

  1. పల్లీ లేదా బఠాణి సైజ్‌లో మీ అరచేతిలోకి ఫేస్ క్రీమ్ తీసుకోవాలి.
  2. మీ అరచేతిలోనే మాయిశ్చరైజర్‌ని వెచ్చగా చేయండి.
  3. మీ చెంపలపై గుండ్రంగా అప్లై చేయండి. ఆ తర్వాత నుదుటిపై, మొహంలోని ఇతర భాగాలపై అప్లై చేయండి.
  4. మెడవైపు మృదువుగా ఒత్తిడి కలిగిస్తూ ఫేస్ క్రీమ్ అప్లై చేయండి.
  5. ఫేస్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత రెండు నిమిషాలు వెయిట్ చేయాలి. మీరు తర్వాతి స్టెప్‌లోకి వెళ్లడానికి ముందు మీ చర్మం ఫేస్ క్రీమ్‌ను పీల్చుకుంటుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: టీ ట్రీ వలన మీ చర్మానికి కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు

ముగింపు

సీజనల్‌గా వచ్చే మార్పులు మీ చర్మంపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే సరైన ప్రొడక్ట్స్ ఉపయోగించడం తప్పనిసరి. చలికాలంలో మీ చర్మాన్ని ఎక్కువగా హైడ్రేట్ చేయడం అవసరం. వేసవిలో ఆయిల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉపయోగించాలి.

ఇతరులు మీలో మొదట గుర్తించేది మీ మొహాన్నే. ఆరోగ్యకరమైన డైట్, స్కిన్ కేర్ రొటీన్ ద్వారా మీరు నిత్యం యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంటారు. ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.

“చికిత్స కన్నా నివారణ మంచిది” అని చెబుతుంటారు. ఎలాంటి సమస్యలనైనా ముందుగానే నివారించడం మంచిది. క్రమశిక్షణతో ఉంటూ, మీ రొటీన్ పాటించాలి. తద్వార ఆటోమెటిక్‌గా ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ మీ సొంతం అవుతుంది.

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.