
ప్రెగ్నెన్సీ సమయంలో అలాగే ఆ తర్వాత కూడా మీరు తిరిగి త్వరగా మీ మునుపటి స్థితికి రావటానికి మీ శరీరంపై దృష్టిపెట్టాలని గుర్తుంచుకోవాలి. ఒక బిడ్డని కని ఇంటికి తీసుకురావడం అనేది అత్యంత సంతోషకరమైన, ఉప్పొంగిపోయే అనుభవం అని చెప్పవచ్చు. వారికి పాలివ్వడం అయితే పూర్తిగా మరో కథ. మీరు మీ ఇంట్లో, బట్టల అలమరలో, జీవనశైలిలో చాలా విషయాలని మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్తగా తల్లయ్యాక షాపింగ్ చేసేటప్పుడు, పాలివ్వడానికి సాయపడే మంచి నర్సింగ్ బ్రాలు అలాగే మెటర్నిటీ ప్యాంటీలు మీ లిస్టులో పైన ఉండాలి.
మీ శరీరంలో వచ్చే మార్పులు, మీ పొట్ట పెరగటం వలన క్రమంగా మీ పాత ప్యాంటీలు అలాగే బ్రాలని వేసుకోవటం అసాధ్యంగా మారుతుంది. గర్భం దాల్చిన మొదట్లో, మీరు మామూలుగా వేసుకునే ప్యాంటీలతో సౌకర్యంగానే అన్పించవచ్చు. కానీ నెలలు నిండుతున్నకొద్దీ.. అది కష్టంగా, అసౌకర్యంగా మారుతుంది. ప్రసవం తర్వాత సరైన ప్యాంటీలని ఎంచుకోవడం ఒక ముఖ్యమైన వ్యాయామంలాంటిది ఎందుకంటే అది తర్వాత మీ జీవితంలో సెక్సీగా ఉండేలా అలాగే శరీరాన్ని టోన్డ్‌గా ఉంచడంలో సాయపడుతుంది. ఈ కాలం మహిళలు వ్యక్తిగత జీవితాన్ని, వృత్త్తిపరమైన జీవితాన్ని సమానమైన నైపుణ్యంతో బ్యాలెన్స్ చేస్తున్నారు. అందుకని కేవలం మన అజ్ఞానం, అజాగ్రత్తల కారణంగా బాధపడాలి అని అనుకోము. ప్రెగ్నెన్సీ మన జీవితాలని, శరీర సైజుని, బరువులని మారుస్తుంది. అందుకని మీకు ఈ సమయంలో కొత్త బట్టల సెట్ ఎలా అవసరమో కొత్త లోదుస్తుల సెట్ కూడా అవసరం. ప్రసవం సమయం దగ్గరయ్యేకొద్దీ మీ స్తనాలు సున్నితంగా మారిపోతాయి. అలాగే మీ పొట్ట కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి సరిగ్గా సరిపోని, బిగుతైన లోదుస్తులు వేసుకోవటం చాలా చికాకుగా మారుతుంది.
మెటర్నిటీ లోదుస్తులు పెరుగుతున్న మీ పొట్టకి ఫిట్ అయ్యేలా, సరైన భాగంలో కదలకుండా నిలబడి ఉండేలా అలాగే మీ మామూలు లోదుస్తుల కంటే మీకు ఎక్కువ సౌకర్యంగా ఉండేలా రూపొందించబడతాయి. నెలలు నిండుతున్న కొద్దీ, మీ మామూలు ప్యాంటి యొక్క నడుము పట్టీ టైట్ అయిపోయి, నొప్పి కలిగించే ప్రదేశంలో బిగుసుకుని ఇబ్బంది పెడుతుంది. కానీ డెలివరీ తర్వాత మెటర్నిటీ ప్యాంటీలు మీ శరీర స్థితిని బట్టి అలవాటు అయ్యేలా రూపొందించబడతాయి. బిడ్డ ఉన్న మీ పొట్ట బంప్ పెరిగేకొద్దీ మీరు మామూలుగా వాడే లోదుస్తులు సాగిపోవచ్చు. అలా తర్వాత వాడటానికి పనికిరావు. అదే మెటర్నిటీ లోదుస్తులు కేవలం మీరు గర్భవతిగా ఉన్నప్పుడే కాదు; ప్రెగ్నెన్సీ తర్వాత లేదా డెలివరీ తర్వాత కూడా వాడుకోవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు వెజైనా నుండి స్రావం లేదా డిశ్చార్జి ఎక్కువగా ఉండటాన్ని మీరు గమనిస్తారు. ఈ సమయంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే రిస్కు ఉంది కాబట్టి, ప్రెగ్నెన్సీ కాలం అంతా గాలి ఆడే కాటన్ మెటర్నిటీ ప్యాంటీలని ఎంచుకోవడమే మంచిది.
మీరు ఎంపిక చేసుకోవటానికి మెటర్నిటీ లోదుస్తులలో కొన్ని రకాల స్టైలులు కింద ఇవ్వబడ్డాయి :
మెటర్నిటీ ప్యాంటీలు ప్రధానంగా గర్భవతులకి సరైన సౌకర్యాన్ని అందించటానికి డిజైన్ చేయబడ్డాయి. ప్రెగ్నెంట్ మహిళల శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని, మెరుగైన కదలిక, స్ట్రెచ్ అయ్యేవిధంగా ఇవి తయారుచేయబడతాయి. ఇవి గర్భ సమయంలో కావల్సిన సపోర్టుని అందిస్తాయి. ఈ విధంగా తల్లులకి సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి, ఇటీవల భారతదేశంలో మెటర్నిటీ లోదుస్తుల వాడకం పెరిగింది. పెల్విక్ కండరాలపై ఒత్తిడి తగ్గించడానికి మెటర్నిటీ ప్యాంటీలు సాధారణంగా మెత్తని, ప్రీమియం కాటన్ వంటి మెటీరియళ్లతో తయారుచేయబడతాయి. చాలామంది తల్లులు నడుము పై వరకూ వచ్చే హై-వెయిస్టెడ్ కాటన్ ప్యాంటీలని కొనడానికి ఇష్టపడతారు. ఈ ప్యాంటీలు తగినంత సౌకర్యాన్ని అందిస్తాయి. అలాగే మీ పొట్టపై సరిగ్గా ఫిట్ అయ్యేలా సులభంగా సాగదీయవచ్చు.
మీరు మామూలుగా వేసుకునే ప్యాంటీలతో అసౌకర్యంగా అన్పించడం మొదలైన వెంటనే మెటర్నిటీ ప్యాంటీలని కొనాలి. గర్భానికి సంబంధించిన ప్రారంభ లక్షణాలు చాలా త్వరగా కన్పిస్తాయి. మొదటి కొన్ని వారాలలో.. మీరు స్పష్టమైన తేడాని అనుభవించవచ్చు.
ఒకవేళ మీకు ఈ విషయంలో గందరగోళంగా అన్పిస్తే, మీకు సరైన మెటర్నిటీ బట్టలని ఎంచుకోవటానికి సాయపడే ఒక సింపుల్ గైడ్ ఇక్కడ ఇవ్వబడింది, చదవండి.:
1. సరైన సైజుని ఎంచుకోండి.
మెటర్నిటీ ప్యాంటీలని కొనేటప్పుడు గుర్తుంచుకోవల్సిన విషయాలలో ఇది ముఖ్యమైన అంశం. మీకు సరైన సైజు ఏదో తెలుసుకోవడానికి, కొన్ని లెక్కలని ఖఛ్చితంగా ఉపయోగించాలి. అది సవాలుతో కూడుకున్న పని కావచ్చు. మీకు డెలివరీకి మిగిలి ఉన్న వారాల సంఖ్యని అలాగే మీరు పెరగగలిగే బరువుని అంచనా వేయండి. కావల్సినంత సౌకర్యంగా ఉండటానికి మీ లెక్క కన్నా ఒక సైజు పెద్ద లోదుస్తులే ఎంచుకోవటం మంచిది.
2. మీ ఆకృతిని బట్టి ఆలోచించండి
తర్వాత ఆలోచించాల్సిన ముఖ్య విషయం మీ ఆకృతి అలాగే మీ నడుము రకం. ప్రెగ్నెన్సీ ప్యాంటీలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నడుము కిందగా వచ్చే లోవెయిస్ట్ ప్యాంటీలు, మరొకటి నడుము పైవరకూ వచ్చే హై వెయిస్ట్ ప్యాంటీలు. హై వెయిస్ట్ మెటర్నిటీ ప్యాంటీలు మీ బేబీ బంప్ పొట్టని పూర్తిగా కవర్ చేస్తాయి. అయితే లోవెయిస్ట్ మెటర్నిటీ ప్యాంటీలు బంప్‌కి కింద వరకే వస్తాయి. అందుకని, మీ ఆకృతి అలాగే సౌకర్యం స్థాయి ఆధారంగా మీరు ఏ మెటర్నిటీ ప్యాంటీలనైనా ఎంచుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో బెస్ట్ మెటర్నిటీ ప్యాంటీలని వెతికి చాలా ఆప్షన్లని కనుగొనవచ్చు.
3. ఒంటికి సరిపడే మెటీరియల్ ఎంచుకోండి
ప్రెగ్నెన్సీ సమయం మొత్తంలో శుభ్రమైన, గాలి ఆడే, సాగే గుణం ఉన్న బట్టలని వేసుకోవటం చాలా మంచిది. అలా మీకు సౌకర్యంగా ఉండి, బట్టల వలన చికాకు కలగకుండా ఉంటుంది. అన్ని రకాల బట్టలలో, కాటన్ ఇంకా మైక్రోఫైబర్ ఆధారంగా తయారుచేసే బట్టలు మేటి ఆప్షన్లని చెప్పవచ్చు. కాటన్, ఎలాస్టెన్ ఇంకా వెదురుతో చేసిన మెటర్నిటీ ప్యాంటీలు పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి. మెటర్నిటీ ప్యాంటీలను కొనేటప్పుడు హై-వెయిస్ట్ అంటే నడుము పై వరకు వచ్చే కాటన్ మెటర్నిటీ ప్యాంటీలను కొనవచ్చు. వీటితో వాసన రాదు అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణంతో ఉంటాయి కాబట్టి వెజైనా నుండి వచ్చే స్రావాల కారణంగా చికాకు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
4. మన్నిక గురించి ఆలోచించండి
ఇది కూడా లెక్కలోకి తీసుకోవలసిన ముఖ్యమైన విషయం. మెటర్నిటీ ప్యాంటీలను కొనేటప్పుడు మీరు ఎక్కువ కాలం ఉండే, మన్నికైన ప్యాంటీల కోసం వెతకాలి. తప్పనిసరిగా గుడ్డతోపాటుగా, ప్యాంటీలు సాగే గుణాన్ని కలిగి ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేయాలి. మన్నికైన మెటర్నిటీ ప్యాంటీలను కొంటే అవి త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం ఉంటాయి.
5. వెన్నుకి సపోర్టునిచ్చే లోదుస్తులని తీసుకోండి
వెన్ను భాగానికి సంబంధించి వచ్చే సపోర్టు కోసమైతే మెటర్నిటీ ప్యాంటీలను కొనడం చాలా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో వీపు యొక్క కింద భాగంలో చాలా ఒత్తిడి పడుతుంది. కాబట్టి బడ్జెట్లోనే వచ్చే మెటర్నిటీ ప్యాంటీలను కొనడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఎలాగో వీటిని తక్కువ కాలం మాత్రమే వాడగలరు, మీ ప్యాంటీల సైజు కూడా త్వరగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ మీకు సి-సెక్షన్ జరిగినట్లయితే, మీకు డెలివరీ అయిన తర్వాత నొప్పిగా అన్పించవచ్చు కాబట్టి వదులుగా ఉండే ప్యాంట్లు వేసుకోవటం మంచి ఆలోచన. నడుముకి పైవరకూ వచ్చే హై వెయిస్ట్ లోదుస్తులు వేసుకోవడం మంచిది. అప్పుడు అవి మీ గాయానికి రాపిడి తగలకుండా చూసుకుంటాయి. ఒకవేళ మీకు సి-సెక్షన్ ఆపరేషన్ జరిగినట్లయితే కాటన్ లోదుస్తులు వేసుకోమని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారు.
మీరు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఆకర్షణీయంగా ఉండే విధంగా మెటర్నిటీ లోదుస్తులు ఇదివరకు కాలంలో వాటికన్నా ఇప్పుడు చాలా మారాయి. బరువు పెరగటం ఇంకా స్ట్రెచ్ మార్క్స్ లాంటి వచ్చే చాలా శారీరక మార్పుల కోసం, మారుతున్న మీ ఆకృతి ఇంకా మీ గురించి మీరు సెక్సీగా ఫీలవడానికి కూడా కొన్ని అందమైన లోదుస్తులు కొనడం సాయపడవచ్చు. ప్రస్తుతకాలంలో మెటర్నిటీ లోదుస్తులు అందమైన శైలులు, లేసులతో, పుష్కలంగా అనేక రకాల డిజైన్లు, రంగులలో అందుబాటులో ఉన్నాయి. మెటర్నిటీ లోదుస్తులకి, డెలివరీ ముందైనా, తర్వాతైనా కాటన్ అలాగే సహజ పదార్థాలతో తయారైన బట్టలు చాలా మంచివి. ఎందుకంటే వాటిల్లో గాలి ఆడుతుంది. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు సౌకర్యంగా ఉండటం చాలా ముఖ్యం.
Yes
No

















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |