
తల్లి పాలు ఇచ్చేటప్పుడు ఉండాల్సిన రెండు అత్యంత ముఖ్యమైన విషయాలు; మొదటిది ఓర్పు, రెండవది తేలికపాటి ప్యాడెడ్ నర్సింగ్ బ్రా! మీ రొమ్ముల పరిమాణం మారుతూ ఉంటాయి కాబట్టి, మీరు పాలు ఇవ్వడానికి వీలుగా, సౌకర్యవంతంగా ఉండే బ్రా ను ఎంచుకోవాలి. అంతేకాకుండా పాలు కారినప్పుడు ఇబ్బంది పడకుండా మీకు మెటర్నిటీ బ్రా కూడా అవసరం కావచ్చు.
నేడు మీకు ఆన్‌లైన్‌లో అనేక మెటర్నిటీ బ్రా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మీరు సాధారణ వాటిని లేదా ప్లస్-సైజ్ వాటిని ఎంచుకోవచ్చు! ఈ ఎంపికలన్నీ మీరు చాలా సాఫీగా మాతృత్వాన్ని ఆస్వాదించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ బ్రా లు చాలా స్టైలిష్ ప్యాటర్న్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. అయితే తొలగించగల నర్సింగ్ క్లిప్‌లతో వచ్చే ప్రసూతి బ్రా లను మీరు కొనుగోలు చేయడం మంచిది.
తేలికపాటి ప్యాడెడ్ వైర్‌ఫ్రీ నర్సింగ్ బ్రా ను కొనుగోలు చేయడానికి ముందు.. మీరు అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా ను ఎంచుకునేటప్పుడు మీరు సాధారణంగా పరిగణించే అంశాలపై మళ్ళీ ఒకసారి దృష్టి సారించండి. మీరు గర్భధారణ సమయంలో ఊహించని విధంగా రొమ్ము పరిమాణంలో మార్పులను గమనించిన వెంటనే మీరు ఈ బ్రా లను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా చనుబాలు ఇచ్చే తల్లులకు, ప్యాడెడ్ మెటర్నిటీ బ్రాలను ఉపయోగించడం ఎప్పుడూ సులభం కాదు!
రొమ్ము నుండి పాలు కారడాన్ని నివారించడానికి పూర్తి కవరేజీ ఉన్న తేలికపాటి ప్యాడెడ్ బ్రా ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది. ఎందుకంటే ఈ ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా లు పాలు కారడాన్ని చాలా వరకు నివారించగలవు. అంతేకాకుండా అవసరమైన సర్దుబాట్లు చేయడానికి మీరు నర్సింగ్ క్లిప్‌లను కూడా ఉపయోగించవచ్చు. సాధారణంగా చాలా మంది తల్లులు పాలు ఇచ్చేటప్పుడు సులభంగా తీయగల ప్రసూతి బ్రాలను ఎంచుకుంటారు
ప్రసూతి బ్రా రకాలలో 'ఒక-సైజ్-అందరికీ సరిపోతుంది' (వన్-సైజ్-ఫైట్స్-ఆల్) అనే ఎంపిక లేదు. నిజానికి మీకు సరిపోయే మెటర్నిటీ బ్రా మరొక మహిళకు సరిపోకపోవచ్చు. కాబట్టి మీరు ఉత్తమమైన తేలికపాటి ప్యాడెడ్ నర్సింగ్ బ్రా ను కొనుగోలు చేసే ముందు అనేక విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీకు సరిగ్గా సరిపోయే, పాలు కారే అవకాశాన్ని నివారించే బ్రా అవసరం.అంతేకాకుండా ఈ బ్రా లు మీ బిడ్డకు పాలివ్వడాన్ని కూడా సులభతరం చేస్తాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ బ్రా వేసుకోవడం ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడు?
ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా ను కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు కింద పేర్కొనబడ్డాయి.
మీరు కొనుగోలు చేసే ముందు దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రాథమిక అంశం ఇది. మెటర్నిటీ బ్రా లను చాలా కాలం పాటు ధరించాల్సి ఉంటుంది కాబట్టి.. సరైన వాటిని ఎంచుకోవడం మంచిది. వాస్తవానికి, మీరు ఈ అంశాన్ని మరింత ఆచరణాత్మకంగా పరిగణించి చూడవచ్చు. మీరు ఏ బ్రా ధరించి హాయిగా నిద్రపోగలిగితే, అటువంటి బ్రా ను ఎంచుకోవడానికి ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఎంపిక.
ఫోమ్ కప్పులను కలిగి ఉండే మెటర్నిటీ బ్రా లు సాధారణంగా ఉత్తమమైన ఎంపిక. అదే విధంగా ముందు భాగంలో మౌల్డ్ కప్పులను కలిగి ఉన్న స్ట్రాప్‌లెస్ మెటర్నిటీ బ్రా లను కూడా మీరు ఎంచుకోవచ్చు. ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా లు లీకేజీ అయ్యే సమయంలో తల్లి పాలను పీల్చుకుంటాయి. అలాగే ఈ బ్రా లు తల్లి పాలివ్వడానికి అవసరమైన మద్దతును కూడా అందిస్తాయి.
కొన్ని అంగుళాల ఎక్స్‌టెండర్‌లను కలిగి ఉండే మెటర్నిటీ బ్రా ను ఎంచుకోండి. ఇటువంటి బ్రా లు సాధారణంగా సర్దుబాటు చేసే విధంగా ఉంటాయి. అలాగే ఇవి మీ రొమ్ములు సులుభంగా శ్వాస తీసుకునే వీలు కల్పిస్తాయి. నిజానికి మీ తేలికపాటి ప్యాడెడ్ బ్రా లోని హుక్స్ కూడా సౌకర్యం విషయంలో ఒక అంశంగా లెక్కించబడుతుంది.
గర్భిణీ తల్లులు సాధారణంగా వేడి ఆవిరుల సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి మీ సున్నితమైన చనుమొనలను సురక్షితంగా ఉంచడానికి, సాధారణంగా ఊపిరి తీసుకోవడానికి సులువుగా, మృదువుగా ఉండే వస్త్రాన్ని ఎంచుకోమని సలహా ఇస్తారు. కాటన్ వంటి వస్త్రాలు మీ ఛాతీ ప్రాంతాన్ని చల్లగా ఉంచడంలో మీకు సహాయపడతాయి. అంతేకాకుండా ఇటువంటి వస్త్రాలు మీ చనుమొనలపై కూడా చాలా సున్నితంగా ఉంటాయి.
వైర్‌లెస్ బ్రా మీ చర్మ కణజాలాలను నొక్కుకునేలా లేదా కుంచించేలా చేయదు. అయితే అండర్ వైర్ బ్రా లు మాస్టిటిస్ లేదా వక్షోజాల నాళ వ్యవస్థ బ్లాక్ ఏర్పడే సమస్యలను కూడా కలిగిస్తాయి. మీరు అలాంటి సమస్యలను నివారించాలనుకుంటే.. సాధారణంగా మృదువైన, సౌకర్యవంతమైన వైర్‌లెస్ బ్రా లను ఎంచుకోవడం మంచిది.
విభిన్న స్టయిల్స్ లేదా ప్యాటర్న్‌లను కలిగి ఉన్న ప్రసూతి బ్రా లను కూడా మీరు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ప్రసూతి స్పోర్ట్స్ బ్రా లు రాత్రిపూట కారుతున్న చనుబాలును పీల్చుకుంటాయి కాబట్టి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాకుండా సాగే గుణం ఉన్న వస్త్రం, కప్పులను కిందికి లాగడాన్ని తల్లికి సులభతరం చేస్తుంది. చాలా అనువుగా ఉండే, మీ చర్మానికి ఇబ్బంది కలగకుండా ఉండే బ్రా స్టయిల్స్‌ను కొనుగోలు చేయండి. కాటన్ నర్సింగ్ బ్రాలు సాధారణంగా ఉత్తమ ఎంపిక.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ము పాలు కారకుండా ఎలా ఆపాలి?
ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా అనేది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి ఇలాంటి బ్రా లు చనుబాల లీకేజీని నివారిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీ తేలికపాటి ప్యాడెడ్ వైర్‌లెస్ బ్రా ను అనేక ఇతర అవసరాలకు కూడా అనుగుణంగా ఉండేలా ఎంచుకోవాలి. ఈ విధంగా మీరు సాఫీగా మాతృత్వాన్ని ఆస్వాదించడంలో ఇవి ఖచ్చితంగా సహాయపడతాయి!
Tags:
Maternity bra during pregnancy in telugu, maternity bra benefits in telugu, advantages of maternity bra in telugu, Why pregnants need to wear maternity bra in telugu, does maternity bra helps in milk leakage in telugu.
Also Read in:
English: Can A Padded Maternity Bra Prevent Breastmilk Leakage?



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |