This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

న్యూ బార్న్ ట్విన్స్ (నవజాత కవలలు)ను పెంచడం గురించి మీకు తెలియని 7 విషయాలు (7 Things You Didn't Know About Raising Newborn Twins in Telugu)

Twins & Triplets
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Dec 7, 2025
న్యూ బార్న్ ట్విన్స్ (నవజాత కవలలు)ను పెంచడం గురించి మీకు తెలియని 7 విషయాలు (7 Things You Didn't Know About Raising Newborn Twins in Telugu)
Likes2 Likes|
Read time3 min

అప్పుడే పుట్టిన పసిబిడ్డ సంరక్షణ చాలా పెద్ద పని. అదే మరొక బిడ్డ కూడా చేరితే, పెంచడం దాదాపు అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ ఇంతకుముందు మీకు తెలియని విషయాలను గుర్తించగలిగితే.. మీ మానసిక ప్రశాంతను కాపాడుకుంటూ కవల పిల్లల్ని విజయవంతంగా చూసుకోవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నన్సీలో కవలలు పుట్టే అవకాశాలను ఏ అంశాలు పెంచుతాయి?

కవల పిల్లలను పెంచడం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు (Things You Need to Know About Raising Twins in Telugu)

1. మీరు వారిద్దరి నిద్ర షెడ్యూలును ఏకం చేయవచ్చు: (Make a Single Sleep Schedule for Both)

మీ కవల పిల్లల కునుకు ఇంకా నిద్ర సమయాలని ఏకం చేయటం అత్యవసరం. లేకపోతే మీరు ఎప్పుడు చూసినా పాలు పడుతూనే ఉండాల్సి వస్తుంది. ఒక బిడ్డ పడుకున్నప్పుడు మరొక బిడ్డ ఆకలితో సిద్ధంగా ఉంటుంది.

2. మీరు వారిద్దరిని ఒకేచోట పడుకోనివ్వచ్చు: (Let Them Sleep At Same Place)

ఒకసారి మీ పాపాయిలకు రాత్రంతా పడుకొనే అలవాటు వచ్చేశాక, ఒకరినొకరు రాత్రి నిద్ర లేపకుండా ఉండాలని ఇద్దరినీ వేర్వేరు చోట్ల పడుకోబెట్టాలని మీకు అనిపించవచ్చు. కానీ ఇద్దరూ మరొకరి ఏడుపుకి అలవాటు పడేలా ఒకచోటనే పడుకోబెట్టవచ్చు. ఈ విధంగా, వారు పూర్తిగా నిశ్శబ్దంపై ఆధారపడకుండా ఎలాంటి పరిస్థితులలోనైనా నిద్రపోవటం నేర్చుకుంటారు.

3. మీరు ఇద్దరి కోసం ఒకేవిధమైన వస్తువులు తేనక్కర్లేదు: (No Need of Buying Same Kind of Products)

కవల పిల్లలు ఉన్నంత మాత్రాన మీరు ఏ వస్తువునైనా రెండుగా తీసుకురానక్కర్లేదు. మీకు మీ బిడ్డలకి ఏం ఇష్టముంటాయో అప్పుడే తెలీదు. అందుకని వివిధ వస్తువుల కాంబినేషన్లు ప్రయత్నించవచ్చు. కానీ ఉయ్యాలలు, కారు సీట్లు లేదా ఇతర పసిపిల్లల అత్యవసర వస్తువులు అవన్నీ రెండుగా కొనితీరాలి.

4. మీరు ఎవరినైనా సాయానికి పిలవవచ్చు: (Ask Anyone for Help)

కవల పిల్లలను చూసుకోవడం అంటే చాలా పనులతో కూడి ఉంటుంది. మీరు సాయం కోసం ఎవరినైనా అంటే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరినైనా ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు పిలవవచ్చు. మీరు పాపాయిలను చూసుకుంటున్నప్పుడు మీ స్నేహితుడిని వంట చేయనివ్వండి లేదా మీరు కిరాణా సరుకులు తెస్తున్నప్పుడు మీ స్నేహితురాలిని పిల్లలను చూసుకోమనండి.

5. బట్టల విషయానికొస్తే మీరు జిప్పులున్న బట్టలని ప్రయత్నించవచ్చు: (Try Zipper Dresses)

మీకు కవల పిల్లలు ఉంటే, మొదటి నెలల్లో జిప్పరు ఉన్న బట్టలని ఎంచుకుంటే వారిని తయారుచేయడం చాలా సులభం. పని త్వరగా అవుతుంది. ఇద్దరు పిల్లలను ఒకేసారి పెంచేటప్పుడు ప్రతి సెకెండ్ విలువైనది కాబట్టి ఈ విధంగా బట్టలను వెతుక్కునే సమయం, శ్రమ తగ్గుతుంది.

6. పాలిస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో స్తనాన్ని వంతులవారీగా అందించాలి: (Give One Breast to Each One by One)

మీరు ఒకవేళ తల్లిపాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటే, మీ కవల పిల్లలకి వంతులవారీగా ఒక్కో స్తనంతో పాలుపడితే, ఇద్దరికీ సమాన మొత్తాల్లో పాలు అందించేలా చూడవచ్చు.

7. భిన్నత్వాన్ని గుర్తించండి: (Recognise the Differences Between The Twins)

గుర్తుంచుకోండి.. మీ కవల పిల్లలు ఎంత సారూప్యతను కలిగి ఉంటారో అంత భిన్నంగా కూడా ఉంటారు. మీ పిల్లల మధ్య తేడాలను పోల్చకుండా ఎల్లప్పుడూ ప్రోత్సహించండి. ప్రతి బిడ్డకు తన సొంత బలాలు, బలహీనతలు ఉంటాయి. కవల పిల్లలు కూడా దానికి అతీతం కాదు. ఎప్పుడూ ‘నీ అన్నయ్య సరిగ్గా ప్రవర్తిస్తున్నాడు, నీకేమైంది?’ అనవద్దు.

Tags:

Twins facts in telugu, Unknown facts about twins in telugu, Raising new born twins in telugu, Tips to raise new born twins in telugu.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.