This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

డెలివరీ తర్వాత స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి? ఈ టిప్స్ మీకోసమే!

Baby Care
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
డెలివరీ తర్వాత స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి? ఈ టిప్స్ మీకోసమే!
Read time5 min

డెలివరీ తర్వాత స్కిన్ కేర్ (చర్మ సంరక్షణ)

ప్రసవం అనేది స్త్రీ జీవితంలో ఒక మధురమైన అనుభూతి. ఈ సమయం మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ప్రసవం తర్వాత మీ చర్మంలో మార్పులు కనిపించడం సర్వసాధారణం. ప్రసవం తర్వాత మీరు చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మీరు గర్భధారణకు ముందు మీ చర్మం మీద ఉండే కాంతిని తిరిగి పొందుతారు.

ప్రసవానంతర చర్మ మార్పులకు కారణం ఏమిటి?

మానవశరీరంలోని అతి పెద్ద అవయవం చర్మం. మీ కడుపులో చిన్నారి పెరిగే సమయంలో మీ చిన్నారికి అనువుగా ఉండేందుకు మీ చర్మం స్ట్రెచ్ అవుతుంది. ప్రసవానంతర చర్మ మార్పులకు కొన్ని కారణాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో చర్మ మార్పులకు కారణాలు కింది విధంగా ఉన్నాయి.

  • హార్మోన్ల మార్పులు
  • మీ చర్మ నిర్మాణంలో మార్పు
  • రక్తనాళాల్లో మార్పులు
  • గ్రంథులలో పరివర్తన.
  • గర్భధారణ సమయంలో కొన్ని చర్మవ్యాధులు ఉండవచ్చు.

గర్భధారణ సమయంలో గుర్తించబడిన చర్మ సమస్యలు ప్రసవానంతరం కూడా కంటిన్యూ అవుతాయి. అయితే ప్రసవానంతరం మీ చర్మం మీద అకస్మాత్తుగా మొటిమలు వస్తాయి. ప్రసవం తర్వాత కొనసాగే చర్మ సమస్యల విషయంలో అతిగా ఆలోచించకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొంతకాలం తర్వాత చర్మసమస్యలు అవే పరిష్కరించబడతాయి.

బిడ్డ పుట్టిన తర్వాత స్కిన్ (చర్మం) ఆకృతి (టెక్చర్​) ఎందుకు మారుతుంది?

మీరు మీకు పుట్టబోయే చిన్నారిని చేతుల్లో పట్టుకోవాలని వెయిట్ చేస్తున్నపుడు గర్భధారణ సమయంలో మీ శరీరంలో భారీ మార్పులకు లోనవుతుంది. వాటి ప్రభావం మీకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా కనిపిస్తుంది. గర్భం దాల్చిన తర్వాత మీరు మొటిమలు రావడాన్ని గమనించవచ్చు. చర్మం పొడిగా మారడం పొలుసులుగా మారడం కూడా గమనిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే సాధారణ చర్మ మార్పులలో స్ట్రెచ్ మార్క్స్ ఒకటి. గర్భధారణ సమయంలో మీ శరీరం ఒత్తిడిలో ఉంటుంది. అంతే కాకుండా మీ శరీరంలో హార్మోన్ల మార్పులు కూడా సంభవిస్తాయి. మీరు గర్భవతిగా ఉన్నపుడు బిడ్డను మోయడం వలన కలిగే అలసట కూడా.. ప్రసవానంతరం మీ చర్మం ఆకృతిని మార్చే కారకాల్లో ఒకటి.

ప్రసవానంతరం వచ్చే ముఖ్యమైన చర్మ సమస్యలు

ప్రసవానంతర దశలో చర్మ సమస్యలు సాధారణం. గర్భధారణ సమయంలో మీ శరీరంలో జరిగిన రసాయనిక చర్యలు మీ శరీరంపై గుర్తులను వదిలేస్తాయి. ప్రసవానంతరం ప్రధానంగా ఉండే చర్మ సమస్యలు:

1. మెలస్మా

గర్భధారణ సమయంలో మీ శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మెలస్మాకు కారణం అవుతుంది. దీని ద్వారా డార్క్ స్పాట్స్ వస్తాయి. ఈ స్థితిలో మీ చర్మంపై మెలనోసైట్స్ ట్రిగ్గర్ (ప్రేరేపించబడతాయి) అవుతాయి. నల్లమచ్చల సమస్యను తగ్గించుకునేందుకు సూర్యుడితో ప్రత్యక్ష సంబంధాన్ని తగ్గించుకోవడం మంచిది. ఒక వేళ ఈ రోజుల్లో సూర్యరశ్మి తగలకుండా ఉండడం సాధ్యం కాకపోతే.. మీరు పాలిషింగ్ కిట్లు లేదా సున్నితంగా ఉండే స్క్రబ్​లను కూడా ఉపయోగించొచ్చు.

2. డెర్మాటిట్స్​ (ఒక రకమైన చర్మ దురద)

గర్భధారణ సమయంలో మీ శరీరంలో సంభవించే హార్మోన్ల మార్పుల వలన సాధారణంగా డెర్మాటిట్స్ (ఒక రకమైన చర్మ దురద) వస్తుంది. దీని వలన మీ ముఖం మీద ఎరుపు రంగులో పొరలుగా ఉండే పాచెస్ ఏర్పడతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు షియా బటర్, ప్రీంరోజ్ ఆయిల్, జోజోబా సీడ్ ఆయిల్ వంటి ఓదార్పునిచ్చే (సూతింగ్​) ప్రొడక్టులను మీరు ఉపయోగించొచ్చు. ఈ పదార్థాలు మీ చర్మానికి పునఃజీవనాన్ని అందజేస్తాయి.

3. స్పైడర్ ఆంజియోమాస్ (ఎరుపు రంగులో ఒక మొటిమ అయి అక్కడి నుంచి చాలా చోట్లకు వ్యాపించడం)

మీరు గర్భం దాల్చిన తర్వాత మీ ముఖంపై కొన్ని సాలీడు వంటి గుర్తులను కూడా కనుక్కోవచ్చు. రక్తనాళాలను విస్తరించే మీ సిరలపై ఒత్తిడి దీనికి కారణం కావొచ్చు. చాలా సందర్భాల్లో ఈ మరకలు (గుర్తులు) వాటంతట​ అవే వెళ్లిపోతాయి. ఒక వేళ ఆ మరకలు తొలిగిపోకపోతే మీరు వైద్యుడిని సంప్రదించవచ్చు. లైరా లేజర్ ద్వారా వైద్యులు ఈ మరకలను తొలగిస్తారు.

4. మొటిమలు

గర్భధారణ సమయంలో మీ శరీరం అత్యధిక స్థాయిలో ప్రొజెస్టిరాన్​ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా శరీరంలో ప్రొజెస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది తరచుగా తైల గ్రంథుల నుంచి స్రావాన్ని రిలీజ్ చేస్తుంది. చర్మరంధ్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇవి మీ ముఖంపై మొటిమలు వచ్చేలా చేస్తాయి. మీరు మొటిమల నుంచి విముక్తి పొందేందుకు సల్ఫర్ కలిగిన క్లెన్సింగ్ మిల్క్​ను ఉపయోగించాలి.

5. పఫ్ఫీ(ఉబ్బిన) & డార్క్(కళ్లకింద నలుపు రంగులోకి మారడం) కళ్లు

గర్భధారణ సమయంలో మరియు మీ ప్రసవానంతర సమయంలో కళ్లు ఉబ్బితే మీరు ఎక్కువగా అలసిపోయారని అర్థం. పెప్టైడ్స్ ఉన్న కొన్ని రకాల క్రీమ్స్​ను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

డెలివరీ తర్వాత మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు సులభమైన మార్గాలు

ప్రసవానంతర చర్మ సంరక్షణ కోసం కొన్ని అనుకూలమైన మార్గాలు కింద ఇవ్వబడ్డాయి:

  • వీలైనంత వరకు ప్రత్యక్షంగా సూర్యకాంతి తగలకుండా చూసుకోండి. ఒక వేళ మీరు తప్పసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే.. సన్​స్క్రీన్ లోషన్ చర్మానికి అప్లై చేసుకుని వెళ్లండి.
  • మీరు నీటిని తీసుకోవడం పెంచండి. అది మిమ్మల్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్​గా ఉంచడంలో సహాయపడుతుంది. హార్మోన్ల బ్యాలెన్స్​ను రక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
  • మీరు మీ చర్మానికి రోజులో కొన్నిసార్లైనా క్లెన్సర్ మరియు మాయిశ్చరైజర్ (మురికిగా ఉంటే శుభ్రం చేసేవి) అప్లై చేయాలి. చర్మం జిడ్డు (ఆయిల్​నెస్​) నివారించేందుకు రోజులో కనీసం రెండుసార్లయినా ముఖాన్ని కడగాలి.
  • మీ రోజు వారి 8 గంటల నిద్ర సమయాన్ని అస్సలుకే విస్మరించవద్దు.
  • మీ రోజువారీ ఆహారంలో పచ్చని ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన చర్మాన్ని కలిగి ఉండడం కోసం సరైన సమయంలో హెల్తీ డైట్ తీసుకోవడం అవసరం.
  • ప్రసవానంతరం స్ట్రెచ్ మార్క్స్ అనేవి సాధారణం. ప్రసవానంతరం ఈ సమస్యను అధిగమించి చర్మాన్ని కాపాడుకునేందుకు విటమిన్ E ఉన్న నూనెలను వాడండి. అంతే కాకుండా మీరు విటమిన్ లోపాన్ని కూడా ఫేస్ చేయొచ్చు. అందుకోసం మీరు మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు నడక మరియు యోగా వంటి వ్యాయామాలను కూడా ప్రారంభించవచ్చు. మీ వలన సాధ్యమయ్యే సమస్యలను నివారించేందుకు మీ వైద్యుడి నుంచి సలహాను తీసుకోవడం ఉత్తమం.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో చర్మ సంరక్షణ - అనుసరించాల్సిన చిట్కాలు

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.