This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

టీ ట్రీ వలన మీ చర్మానికి కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు (Five excellent tea tree benefits for your skin in Telegu)

Pregnancy
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Dec 7, 2023
టీ ట్రీ వలన మీ చర్మానికి కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు (Five excellent tea tree benefits for your skin in Telegu)
Likes3 Likes|
Read time5 min

మెలలేయుకా ఆల్టర్నిఫోలియా అనేది టీ ట్రీ శాస్త్రీయ నామం. ఈ చెట్టు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మ సమస్యలను తగ్గించేందుకు ఈ నూనెను వాడతారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దీనిని ఇంటిని శుభ్రం చేసేందుకు మరియు చుండ్రును నివారించేందుకు కూడా వాడుతారు. ఈ ఆయిల్​ తక్కువ ధరలో లభిస్తుంది. సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.

టాపికల్ (చర్మం పైన చేసే చికిత్సలు) ట్రీట్మెంట్లు చేసే బదులు మీరు టీ ట్రీ ఆయిల్ ఉపయోగించొచ్చు. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది జెర్మ్స్, వైరస్​లను తొలగిస్తుంది. టీ ట్రీ ఆయిల్​ను స్వీయ సంరక్షణ కోసం ఆయుర్వేద పద్ధతిలో కూడా ఉపయోగించొచ్చు. టీ ట్రీ ఆయిల్ ముఖం, చర్మం, జుట్టు కోసం అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

టీ ట్రీ ఆయిల్ ఉపయోగాలు మరియు ప్రయోజనాలు

1. చుండ్రు జుట్టు రాలడాన్ని టీ ట్రీ ఆయిల్ తగ్గిస్తుంది

చుండ్రు ఉన్నా జుట్టు రాలినా కానీ ఒక రకమైన ఇబ్బందిగా ఉంటుంది. యాంటీ ఫ్లేకింగ్, యాంటీ ఫంగల్ స్టెయిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వలన టీ ట్రీ కిట్ డాండ్రఫ్​ను తగ్గించి జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. టీ ట్రీ ఆయిల్ అనేది అనేక ఆయుర్వేద ఉత్పత్తులు, కాస్మొటిక్ ప్రొడక్ట్స్​లో ఒక మెయిన్ ఇంగ్రిడియెంట్ (తయారీకి వాడే పదార్థం). ఇది డ్రై స్కిన్​ను రిపేర్ చేయడంలో, చుండ్రును తగ్గించడంలో, జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది. టీ ట్రీ ఆయిల్ 4 వారాల ట్రయల్​లో 41 శాతం చుండ్రు ఉపశమనాన్ని పెంచింది. జుట్టు రాలడం, దురదగా ఉండడం వంటి లక్షణాలను కూడా తగ్గిస్తుంది.


2. టీ ఆయిల్ వలన చర్మ ప్రయోజనాలు

టీ ట్రీ ఆయిల్ చర్మ సంరక్షణ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. టీ ట్రీ ఫేసియల్ కిట్​తో మొటిమలకు చికిత్స చేయొచ్చు. ఎందుకంటే ఇది క్లాగ్స్​ను తొలగిస్తుంది. ఇరిటేషన్​ను తగ్గిస్తుంది. ఎరుపును కూడా తగ్గిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. టీ ట్రీ ఆయిల్ ఉపయోగించిన వారి ముఖాల మీద తక్కువ జిడ్డు మరియు పెద్ద రంద్రాలు(చెమటను శోషించుకునేవి) కనిపిస్తాయి. టీ ట్రీ ఫేస్ కేర్ కిట్‌లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మీ చర్మాన్ని తెల్లగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి. మీ చర్మాన్ని తేమగా చేసేందుకు, మంటను, చికాకును తగ్గించేందుకు మీ సబ్బులు మరియు లోషన్లలో టీ ట్రీ స్కిన్ ఫ్యూరిఫయింగ్ కిట్​ను ఉపయోగించండి. రింగ్ వార్మ్ చికిత్స వేగవంతం చేసేందుకు టీ ట్రీ ఆయిల్ యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

3. మీరు చేతులను క్రిమి రహితంగా ఉంచుకోవాలనుకుంటే ఈ ఆయిల్ వాడండి

కమర్షియల్ ప్రొడక్టులకు బదులుగా టీ ట్రీ ఆయిల్​తో తయారైన హ్యాండ్ సానిటైజర్లను ఉపయోగించొచ్చు. టీ ట్రీ ఆయిల్​ను ఉపయోగించడం వలన చర్మం మీద ఉన్న సూక్ష్మక్రిములు చంపబడతాయి. ఆయిల్​లో ఉండే యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల ఇది సంభవిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. టీ ట్రీ ఆయిల్​లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటుగా యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉన్నాయని తేలింది. టీ ట్రీ ఆయిల్​ను హ్యాండ్ వాష్​కు జతచేయడం వలన దాని సామర్థ్యాన్ని పెంచొచ్చు.

4. టీ ట్రీ ఆయిల్ యొక్క కీటకాలను నాశనం చేసే లక్షణం

టీ ట్రీ ఆయిల్​కు ఉన్న అనేక లక్షణాలలో కీటకాలను నాశనం చేయడం ఒకటి. దీని విలక్షణమైన వాసన కారణంగా మరియు కెమికల్ మేకప్ వల్ల ఇది అద్భుతమైన కీటకనాశినిగా పని చేస్తుంది. DEET (కీటకనాశనుల్లో ఉపయోగించే ప్రధాన పదార్థం) ను ఉపయోగించడం కంటే టీ ట్రీ ఆయిల్​ను ఉపయోగించడం వలన దోమలు ఎక్కువగా ఫెండెడ్ ఆఫ్ (లొంగిపోవడం) అవుతాయి.

5. నాచురల్ డియోడ్రెంట్​గా(సెంట్​) టీ ట్రీ ఆయిల్ ఎఫెక్టివ్​గా ఉండొచ్చు

మీ చెమటకు ఎటువంటి వాసన లేదని మీరు గ్రహించారా? చెమట గ్రంధులపై ఉండే సూక్ష్మజీవుల వలన చర్మం దుర్వాసన వస్తోంది. టీ ట్రీ ఆయిల్​లోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాల వలన న్యాచురల్ డియోడ్రంట్​గా ఉపయోగించొచ్చు. ఇది కమర్షియల్ యాంటీ పెర్స్పిరెంట్లు మరియు డియోడ్రంట్లకు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది : మీ చర్మం మీద మొటిమలను వదిలించుకునేందుకు టాప్ 5 సహజ మార్గాలు

ఈ నూనె వల్ల కలిగే ప్రమాదాలు మరియు సైడ్ ఎఫెక్టులు

టీ ట్రీ ఆయిల్​ను ఉపయోగించడం మంచిది. కానీ కొంత మంది సున్నితమైన చర్మం ఉన్న వారు కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండొచ్చు. గాయాల దగ్గర, దద్దుర్లు ఉన్నచోట, చికాకు కలిగించే చర్మం దగ్గర దీనిని అప్లై చేసేటపుడు జాగ్రత్తగా ఉపయోగించండి. మొటిమలతో బాధపడే వారు డ్రైనెస్, మంట, లేదా ఎరుపుగా కావడం వంటి వాటిని అనుభూతి చెందితే టీ ట్రీ ఆయిల్​ను ఉపయోగించకుండా ఉండాలి. మీరు మొదటిసారి నూనెను ఉపయోగిస్తుంటే దానిని టెస్ట్ చేయాలి. ఎటువంటి ఎలర్జీలు రాకుండా కాపాడుకోవచ్చు. మీరు మీ ముఖానికి నూనెను రాసుకుంటే.. మీ కళ్లకు దూరంగా ఉంచండి. ఇది దద్దుర్లు, దిక్కుతోచని స్థితి, అస్థిరతను కలిగించవచ్చు. ఇది విషంగా మారొచ్చు. ఈ ప్రొడక్టును తీసుకునే ముందు మీరు గర్భవతిగా ఉన్నారా? లేదా ఏవైనా వైద్యపరమైన సమస్యలు ఉన్నాయా అని మీ వైద్యుడిని సంప్రదించాలి.

Tags

Five excellent tea tree benefits for your skin in Tamil

Five excellent tea tree benefits for your skin in English

Five excellent tea tree benefits for your skin in Bengali

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.