
మీ చిన్నారి ఎక్కువ సమయాన్ని తన ఊయల (బేబీ కాట్) లోనే గడుపుతుంది. మీ శిశువుకు సురక్షితమైన ఊయల (బేబీ కాట్) కొనేందుకు ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది.
ఊయల (బేబీ వుడెన్ కాట్)లో పగుళ్లు వచ్చిన బార్స్(అడ్డంగా ఉండే చెక్కలు) లేదా తప్పిపోయినవి ఉండకూడదు. పై భాగంలో ఉన్న బేబీ కాట్ (ఊయల) రైలు ఎత్తు దాని దిగువ భాగంలో ఉన్న మ్యాట్రిసెస్ సపోర్ట్ నుంచి కనీసం రెండు ఫీట్ల దూరంలో ఉండాలి.
ఊయల అంచులకు ఎటువంటి ఫ్యాన్సీ నాబ్స్ ఉండకుండా చూసుకోవాలి. ఎలాంటి విధమైన నాబ్స్ ఉన్నా కానీ వాటిని మీరు తొలగించాలి. మీ శిశువుకు ఎటువంటి గాయాలు కాకుండా రఫ్ అంచులను సాండ్ డౌన్ (చెక్కను స్మూత్ చేయడం) చేయాలి.
ఊయల (బేబీ కాట్) లో హార్డ్‌వేర్ బోల్ట్స్, మరియు స్క్రూలు ఎటువంటి పదునైన అంచులు లేకుండా మీ చిన్నారికి ఎటువంటి గాయాలు కాకుండా ఫిట్ చేయాలి. ఊయల చెక్క ఎటువంటి పగుళ్లు, చీలికలు లేకుండా ఉండాలి. చౌకగా లభిస్తున్న వాటిని ఎప్పుడూ ఉపయోగించొద్దు. ఏదైనా భాగాన్ని భర్తీ చేయాలని అనుకున్నా కానీ నేరుగా తయారీదారు నుంచే ఆర్డర్ చేయండి.
ఊయల (వుడెన్ బేబీ కాట్) కు వేసే రంగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దీనిని కలర్ కంటే ఎక్కువగా పరిగణించండి. ఇంతకు ముందు తయారు చేసిన ఊయలకు వేసిన పెయింట్ లీడ్ (సీసం) కలిగి ఉంది. అది శిశువుకు చాలా ప్రమాదకరమైనది. మీకు పెయింట్ వేసేటపుడు ఆ పెయింట్‌లో లీడ్ (సీసం) ఉందని అనుమానం కలిగితే వెంటనే ఆ ప్యాక్‌ను తనిఖీ చేయండి. పెయింట్ నాణ్యత గురించి మరింత తెలుసుకోండి.
శిశువు ఊయల లోపల పరుపు (మ్యాట్రిసెస్) సరిగ్గా సరిపోయేలా చూసుకోండి. శిశువు ఊయల భద్రతను నిర్ధారించేందుకు టూ ఫింగర్ టెస్ట్ (ఒక రకమైన పరీక్ష, మ్యాట్రిసెస్కు మరియు ఊయలకు మధ్య గ్యాప్ తనిఖీ చేసేందుకు చేస్తారు) చేయండి. ఊయల మరియు పరుపు మధ్య మీ రెండు వేళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే పరుపు ఊయలకు సరిగ్గా సరిపోలేదని అర్థం. బేబీ ఊయలను తయారు చేయడం మీకు ఎంత కష్టం అవుతుందో ఆ ఊయల మీ శిశువుకు అంత సౌకర్యవంతంగా ఉంటుంది.
వాడే పరుపు (మ్యాట్రిసెస్) కొత్తదైతే దానిని వాడే ముందు ప్లాస్టిక్‌ను విసిరిపారేయండి. పరుపు (మ్యాట్రిసెస్) ధృడంగా ఉందని నిర్ధారించుకోండి. ధృడంగా లేని పరుపు (మ్యాట్రిసెస్) SIDS(ఆకస్మిక శిశు డెత్ సిండ్రోమ్) ప్రమాదాన్ని పెంచుతుంది. పరుపు (మ్యాట్రిసెస్) ధృడత్వాన్ని మీరే స్వయంగా పరీక్షించండి.
ప్లష్ టాయ్స్ (జంతువు ఆకారంలో ఉండే ఖరీదైన బొమ్మలు) లేదా సాఫ్ట్ బెడ్డింగ్‌ను చెక్కలో మీ శిశువుతో ఎప్పుడూ ఉపయోగించకండి. వాటితో పాటు ఊయలతో పాటు వచ్చే మెత్త కూడా ఉంటుంది. ఇవి శిశువుకు ఊపిరాడకుండా చేసే ప్రమాదం ఉంది.
అటువంటి పరికరాలు మ్యాట్రిసెస్ (పరుపు) నుంచి మీ శిశువుకు పైకి లేపగలవు (లిఫ్ట్). గట్టిగా మరియు చదునుగా ఉండే ఉపరితలం ఉత్తమమైనది. మీ చిన్నారి కోసం సరైన ఊయల (బేబీ కాట్) ఎంచుకోవడం కోసం మరింత శ్రద్ధ, ప్రయత్నం అవసరం. కానీ మీరు కేవలం రంగు, బట్ట, ఇంకా పూర్తి లుక్ గురించి ఆలోచించి భద్రత గురించి మర్చిపోవద్దు.
Baby Cot for babies in telugu, What to look in a baby cot for your baby in telugu, Wooden baby cot features in telugu, How to select best baby cot for your baby in telugu.
Also Read In:
English: How to Ensure Your Baby’s Safety While Sleeping in a Wooden Baby Cot?
Bengali: How to Ensure Your Baby's Safety While Sleeping in a Wooden Baby Cot in Bengali?
Tamil: How to Ensure Your Baby's Safety While Sleeping in a Wooden Baby Cot in Tamil?

Baby Wooden Cot with Rocker & Wheel






This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |