


Baby Clothes
26 February 2026 న నవీకరించబడింది
కాలం మారుతుంది కాబట్టి, చంటి పిల్లల అవసరాలకు తగ్గట్టుగా శీతాకాలంలో అవసరమైన దుస్తులను సిద్ధం చేసి ఉంచడం చాలా ముఖ్యం. చలికాలం తల్లిదండ్రులకు సవాలుగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు వెచ్చగాను, సుఖంగాను ఉండేలా చలికాలపు దుస్తులపై ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ చూపవలసి ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంటుంది కనుక, మీ చిన్నారుల కోసం చలికాలపు దుస్తులు కొనడానికి ఇది సరైన సమయం. కానీ పిల్లలు చాలా వేగంగా ఎదుగుతారు కాబట్టి ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యాన్సీ జాకెట్‌లు, అందమైన మిట్టెన్స్ స్టైలిష్ కార్డిగాన్స్ లాంటి ఎన్నో రకాలు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉన్నాయి. అయితే మీ చిన్నారి కోసం సరైన చలికాలపు దుస్తులను ఎన్నుకునేటప్పుడు మీరు చూసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని మీకు తెలుసా? మీ పిల్లల కోసం చలికాలపు దుస్తులను కొనడానికి సరైన సమయం ఏమిటనే దాని గురించి మీరు ఆలోచించాలి. మీ చిన్నారి కోసం చలికాలపు దుస్తులను కొనడానికి మీ కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
వెచ్చగా అనిపించేలా ఉంటూ చాలా వేడిగా అనిపించకుండా ఉండేవే చంటిపిల్లలకు తగిన చలికాలపు బట్టలు. మీరు చాలా కాలం పాటు చల్లగా ఉండే ప్రాంతంలో ఉంటున్నట్లయితే మందపాటి స్వెటర్లు, కార్డిగాన్స్ కొనడం మంచిది. డౌన్ కోట్లు, బొచ్చు ఉన్న బూట్లు కూడా చాలా బాగుంటాయి. చంటిపిల్లల శరీర ఉష్ణోగ్రత త్వరగా మారుతూ ఉంటుంది కాబట్టి, వాతావరణానికి తగ్గట్టుగా మీ చిన్నారికి తగిన దుస్తులను ఎంచుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, వాతావరణం చల్లగా ఉన్నా కూడా, మీ చిన్నారి ఎక్కువ సమయం ఇంటి లోపలే ఉంటే, చాలా ఎక్కువ పొరలు ఉండేవి లేదా చాలా దళసరిగా ఉండే దుస్తులు వేయడం అనవసరం. అలాగే, బయట వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు తేలికపాటివి తక్కువ పొరలుండేవి వేయడం మంచిది. చంటిపిల్లలు ఉష్ణోగ్రత మార్పులకు చాలా ప్రభావితం అవుతారు. పెద్దల మాదిరిగానే చలిని తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళకి సరైన దుస్తులు వేయడం చాలా ముఖ్యం. మీ చిన్నారి వణుకుతోందో లేదో చూసి తనకు చాలా వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా అని చెప్పవచ్చు. దానిని బట్టి ఆ దుస్తులు వేయాలని అర్థం చేసుకోవచ్చు.
శీతాకాలంలో మీ చిన్నారి కోసం వార్డ్‌రోబ్‌ని సిద్ధం చేయడానికి, వెచ్చగా, చల్లగా ఉండే రోజులకు సరిపడా బట్టలు మీ వద్ద ఉండేలా చూసుకోండి. బట్ట మీద బట్ట వేయడం మంచిది, దానివల్ల మీరు బయట వెచ్చగా లేదా చల్లగా ఉన్నదా అనే దానిపై ఆధారపడి లేయర్‌లను పెంచవచ్చు లేదా తీసివేయవచ్చు. మీ చిన్నారికి సరైన చలికాలపు దుస్తులను ఎన్నుకునేటప్పుడు చూసుకోవలసిన విషయాలు:
1. కంఫర్ట్: చంటిపిల్లల బట్టలు చాలా బిగుతుగా గానీ, అతుక్కొన్నట్లు గానీ లేదా బరువుగా గానీ ఉండకుండా సరైనవి ఎంచుకోండి. బెల్ట్‌లు, కుచ్చులు, గంటలు, ఎక్కువ కుచ్చిళ్ళు వాటిని ఎంచుకోవద్దు, ఎందుకంటే అవి చంటిపిల్లకు చాలా అసౌకర్యంగా ఉంటాయి. వాళ్ళ బట్టలు వేయడానికి, తీయడానికి సులువుగా ఉండాలి. వాళ్ళు పరిగెత్తడం, ఆడటం వంటివి చేయడానికి వీలుగా ఉండాలి.
2. మీరు జాకెట్, హూడీ, స్వెటర్ లేదా కార్డిగాన్ కొంటే, ఆ బట్టలు వాళ్ళ వయస్సుకు తగినవిగా ఉండాలి. ఆ ప్రొడక్ట్ కి ఇచ్చిన సైజుల కొలతలను చూడండి. దానిపై ఏ వయసు వాళ్ళకి తగిన సైజనేనది రాసి ఉంటుంది. దాన్ని పరిశీలించి, అందులో మీ చిన్నారిని ఊహించుకోండి. అది తనకు సరిపోతుందో లేదో ఆలోచించుకోండి. వాళ్ళు వేగంగా పెరుగుతారు కాబట్టి కొద్దిగా వదులుగా ఉండే దుస్తులనే ఎంచుకోండి. ఆ వయస్సులో ఉన్న పిల్లలతో పోలిస్తే మీ చిన్నారి కొద్దిగా పెద్దగా ఉంటే, ఆ తరువాతి సైజు తీసుకోండి.
3. పొరలు పొరలుగా బట్టలు వేయండి: అన్ని వయసుల వాళ్ళకీ బట్టలపై బట్టలు వేయడం మంచిది. ఇది చల్లని వాతావరణం నుండి మీ చిన్నారిని రక్షించడానికి అత్యంత ఉపయోగకరమైన మార్గాలలో ఒకటి. చలికాలంలో మీ చిన్నారికి మస్లిన్ స్వాడిల్ వంటి వాటిని వేయండి. సాధారణ ప్యాంటుతో పాటు వచ్చే జాకెట్‌లు, మరికాస్త వెచ్చదనం కోసం కవరింగ్‌గా టాప్ వేయండి. ఎక్కువ వెచ్చదనాన్ని అందించడానికి స్వెటర్లు, ఫాక్స్ ఫర్ కోట్‌లను కూడా వేయవచ్చు. మరీ ఎక్కువగా బట్టలు వేయడం వల్ల జరిగే మంచి కంటే చెడే ఎక్కువ. మీ చిన్నారి ఒంటి వేడి చూస్తూ ఉండండి. వాళ్ళు వేసుకున్న అన్ని పొరల క్రింద చెమట పడకుండా చూసుకోండి.
4. బేబీ క్యాప్స్: మీరు సరిగా చూసుకోకపోతే చలిగాలులు మీ చిన్నారిని అనారోగ్యానికి గురి చేస్తాయి. మీ చిన్నారుల తలపై ఏమీ లేకుండా ఉంటే, ఈ చల్లటి గాలుల వల్ల వాళ్ళు ఏడవటం, చివరికి ఒళ్ళు వేడెక్కుతుంది. ఇలా జరగకూడదంటే వాళ్ళకి టోపీలు లేదా హుడ్ వేయాలి. అది ఉన్నితో చేసిన పిల్లల టోపీ కావచ్చు, లేదా జాకెట్ హుడ్ కావచ్చు. బోలెడు రంగులు, డిజైన్‌లతో ఎన్నో అకాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. లేదంటే మీరే అల్లుకోవచ్చు. ఈ టోపీలు మీ చిన్నారి యొక్క తలను, చెవులను అవసరమైనంత మేర కవర్ చేస్తాయి.
5. స్ట్రోలర్‌లలో కొద్ది మార్పులు చేయండి: పిల్లలకు స్వచ్ఛమైన గాలి అవసరం, చల్లటి వాతావరణంలో ఇంటి లోపల అంతా కలిసి ఉండలేరు. కాబట్టి మీరు జిప్పర్‌తో స్ట్రోలర్ చుట్టూ ఒక షీట్ లేయర్‌ని జోడించి మీ స్ట్రోలర్‌లో కొద్ది మార్పు చేయవచ్చు. ఇది మీ చలికాలపు జాబితాలో తప్పనిసరిగా ఉండాలి.
6. కార్ సీట్ చిట్కాలు: చలికాలంలో మీ చిన్నారికి దుస్తులు వేయడం సవాలుతో కూడుకున్నది. అయితే మరొక ముఖ్యమైన సమస్య మీ చిన్నారిని కారు సీటులో బట్టల పొరలతో అమర్చడం. చలికాలపు చలికి గురికాకుండా మీ చిన్నారిని కారు సీటులో అమర్చడానికి సులభమైన మార్గం ముందుగా జాకెట్ లేదా దుప్పటిని తీసివేయడం. మీ చిన్నారి సౌకర్యవంతంగా, కారు సీటులో అమరిన తర్వాత, కవర్ చేయడానికి మీరు ఏదైనా కప్పవచ్చు.
7. సాక్స్, చేతి తొడుగులు: చంటిపిల్లల చేతులకి, కాళ్ళకి చల్లగాలి తగులుతూ ఉంటుంది. శీతాకాలంలో మీ చిన్నారి తరచుగా అనారోగ్యం పాలు అవడానికి అసలు కారణం ఇదే. చలికాలంలో ఇంటి లోపల ఉన్నా లేకపోయినా సాక్స్‌లు, చేతి తొడుగులు వేసుకునేలా చూసుకోండి. దీనివల్ల చేతులు, కాళ్ళు వెచ్చగా ఉంటాయి. బూట్లు వేసే ముందు సాక్స్ వేయడం పిల్లలను వెచ్చగా ఉంచడానికి మంచి మార్గం. అంతేకాకుండా, చేతి తొడుగులు చిన్నారి చలికాలపు దుస్తులలో ఎంతో ముఖ్యమైనవి మాత్రమే కాదు, చంటిపిల్లల చేతులను శుభ్రంగాను, బ్యాక్టీరియా నుండి సురక్షితంగాను కూడా ఉంచుతాయి.
8. అల్లిన దుస్తులు, ఉన్ని దుస్తులు: చలికాలపు దుస్తులను తయారు చేయడానికి ఉపయోగించే వస్త్రం ఏమిటనేది శీతాకాలంలో మీ చిన్నారికి బట్టలు వేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం. చలికాలంలో ఉన్ని బట్టలు, వేసవిలో కాటన్ బట్టలు అనువైనవి. మీరు ఉన్ని దుస్తులను ఆన్‌లైన్‌లో కొనవచ్చు లేదా వాటిని ఇంట్లోనే అల్లుకోవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: బిడ్డలకు బట్టలు ఎంచుకొనే ముందు గుర్తుంచుకోవలసిన అంశాలు!
మీ చిన్నారి కోసం చలికాలపు దుస్తులను కొనడానికి అనువైన సమయం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు. ఇది సరిగ్గా శీతాకాలానికి ముందు. కాబట్టి దీనివల్ల డబ్బు ఆదా అవుతుంది. శీతాకాలానికి ముందు మీరు కొత్త వార్డ్‌రోబ్ కలిగి ఉండేలా చూసుకోవచ్చు. శీతాకాలం చివరిలో మీ చిన్నారి కోసం చలికాలపు దుస్తులను కొనడం వలన మీ డబ్బు కూడా ఆదా అవుతుంది. ఎందుకంటే ఇలాంటప్పుడు బట్టలు సేల్‌లో దొరుకుతాయి. మీ చిన్నారికి అవసరమైన సమయానికి అవి తాజాగా ఉంటాయి.
పిల్లల చలికాలపు దుస్తులపై డబ్బు ఆదా చేయడానికి, వేసవి ప్రారంభంలో లేదా చలికాలం మధ్య రోజులలో దుస్తుల అమ్మకాలపై ఓ కన్నేసి ఉంచండి, అప్పుడు తక్కువకి దొరుకుతాయి. పిల్లలు చాలా త్వరగా పెరుగుతారు కాబట్టి కొత్త దుస్తులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉండటానికి పిల్లల బట్టలు కొనేటప్పుడు ఒక సైజు పెద్దవి కొనడం కూడా మంచిది. మీరు ఎక్కువ ఖర్చు చేయడానికి సరిపడా డబ్బు లేకుంటే తక్కువకి దొరికే దుకాణంలో బట్టలు కూడా కొనవచ్చు. ఈ దుకాణాలలో పిల్లల చలికాలపు దుస్తులు చాలా ఉంటాయి. కొత్త బట్టలు కొనే బదులు ఇవి చాలా చౌకగా ఉంటాయి. లేదంటే మీరు ఇంట్లో ఉన్నవాటిని కూడా తిరిగి ఉపయోగించుకోవచ్చు. గత సంవత్సరం మీరు వాడిన జాకెట్ మీ వద్ద ఉండి ఉంటే, అది ఈ శీతాకాలంలో కూడా వాడటానికి సరిపోయేంత పెద్దదిగా ఉండి ఉండవచ్చు. చివరిగా మరొక్కమాట, ఆన్‌లైన్‌లో చాలా ట్యుటోరియల్‌లు దొరుకుతున్నాయి. మీ చిన్నారి కోసం కొత్త స్వెటర్ మీరే అల్లవచ్చు, దానివల్ల మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది.
నాణ్యత ఎలా ఉందో చూడటానికి ఫాబ్రిక్ కంటెంట్, అది ఎంత బాగా తయారు చేయబడిందో చూడటం మంచి పధ్ధతి. మంచి నాణ్యత గల పిల్లల దుస్తుల మందంగా, మరింత మన్నికైన బట్టలతో తయారు చేయబడి ఉంటాయి. అయితే, ఇది అన్ని పిల్లల దుస్తుల విషయంలో నిజం కాదు. కొన్ని పిల్లల బట్టలు సన్నని బట్టతో తయారు చేయబడి ఉంటాయి, తక్కువ రోజులు మన్నుతాయి. కానీ మంచి నాణ్యత గల దుస్తులు. కొన్ని పిల్లల బట్టలపై అనేక రకాల అలంకారాలు ఉంటాయి. వీటి నాణ్యత సాధారణ దుస్తుల కంటే తక్కువగా ఉండటం వలన అవి మన్నికైనవి కావు. దుస్తులను దేనితో తయారు చేశారో తెలుసుకోవడానికి ట్యాగ్‌లు చూడాలి. మంచి నాణ్యత గలవి, ఖరీదైన దుస్తులు చాలా కాలం పాటు ఉంటాయి. కాబట్టి ఇది మీ చిన్నారి వయస్సుకి, సైజుకి సరిపోయేవి చూసుకోవాలి.
ప్రతి చిన్నారికి వాళ్ళ చలికాలపు దుస్తులలో అవసరమైన ఎన్నో రకాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని:
మీ చిన్నారికి చలికాలపు బట్టలు కొనడానికి సరైన సమయం వాళ్ళకి అవి అవసరమవడానికి కొన్ని రోజుల ముందు. తరువాత బాధపడే బదులు మీ చిన్నారి కోసం శీతాకాలంలో అవసరమైన వాటిని సిద్ధం చేసి ఉంచుకొని సురక్షితంగా ఉండటం మంచిది. మీ చిన్నారి చలికాలంలో వెచ్చగాను, పొడిగాను ఉండాలి, కాబట్టి ముందుగా వాటిని కొని పెట్టుకోవాలి. సరైన ఫాబ్రిక్ ఎంచుకోవడం కూడా ముఖ్యం. శీతాకాలానికి ఉన్ని దుస్తులు అనువైనవి. బయటి వాతావరణాన్ని బట్టి మీరు వాటిని వేయడానికి లేదా తీయడానికి మీ చిన్నారి దుస్తులలో వీటిని చేర్చడం చాలా అవసరం.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips





హిప్నోబర్తింగ్: అర్థం & ప్రయోజనాలు (Hypnobirthing: Meaning & Benefits in Telugu)

తామరకు టాప్ 5 కారణాలు మరియు లక్షణాలు

ప్రెగ్నెన్సీ (గర్భధారణ) తర్వాత సెక్స్ (Sex After Pregnancy in Telugu)

నార్మల్ డెలివరీ.. యోనీ ద్వారా సురక్షిత ప్రసవానికి చిట్కాలు (Tips for a Safe Normal Delivery in Telugu)

శిశువులకు ప్లష్ బాల్ యొక్క టాప్ 5 ప్రయోజనాలు (Top 5 Benefits of Plush Balls for Babies in Telugu)

రెక్టోసెల్: కారణాలు, లక్షణాలు & చికిత్స

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |