This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భిణీ స్త్రీలకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ (KCR) కిట్ ద్వారా రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తుంది

Pregnancy
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భిణీ స్త్రీలకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ (KCR) కిట్ ద్వారా రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తుంది
Likes66 Likes|
Read time3 min

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు, శిశు మరణాలను తగ్గించేందుకు ఇంకా ఆడపిల్ల అని తెలియగానే చేసే భ్రూణ హత్యలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2017-18లో గర్భిణీ స్త్రీల కోసం కేసీఆర్(KCR) కిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించే గర్భిణీలకు కేసీఆర్(KCR) కిట్ కింద రూ.15,000 విలువ చేసే నిత్యావసర వస్తువులను అందిస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వం రూ. 12,000 విలువైన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఈ ఆర్థిక సహాయాన్ని మూడు దశల్లో అందిస్తారు. ఒక వేళ ఆడపిల్ల పుడితే అదనంగా రూ. 1,000 ఆర్థిక సహాయం అందజేస్తారు.

కేసీఆర్​ కిట్ లక్ష్యాలు, అర్హత ప్రమాణాలు, ప్రయోజనాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

కేసీఆర్ కిట్ ప్రధాన ఉద్దేశం ఏమిటి?

కేసీఆర్ కిట్ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం:

  • ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్ ప్రసవాలకు బదులు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడం
  • శిశు మరణాల రేటును మరియు ఆడపిల్ల అని తెలిసినపుడు జరిగే భ్రూణ హత్యలను తగ్గించడం
  • తల్లి మరియు బిడ్డ ఇద్దరి శ్రేయస్సును మెరుగుపర్చడం
  • తల్లి మరియు బిడ్డకు కావాల్సిన పోషకాహారానికి సహాయం చేయడం.

కేసీఆర్​ కిట్ పథకం పొందేందుకు అర్హతలు ఏమిటి?

కింద పేర్కొన్న అర్హతలున్న గర్భిణీ స్త్రీలు కేసీఆర్​ (KCR) కిట్ పథకం ద్వారా ప్రయోజనాలను పొందొచ్చు.

  • తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే గర్భిణీ స్త్రీలు
  • లబ్ధి పొందాలి అని అనుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలి. ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవిస్తే ఈ పథకం వర్తించదు.
  • లబ్ధిదారులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆధార్ కార్డును కలిగి ఉండాలి.
  • లబ్ధిదారులు గరిష్టంగా రెండు డెలివరీల వరకు మాత్రమే ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.

కేసీఆర్ కిట్ పథకం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

కేసీఆర్ కిట్ పథకం గర్భిణీ స్త్రీలకు మరియు వారి శిశువులకు ఈ కింది ప్రయోజనాలను అందిస్తుంది.

  • కేసీఆర్​ కిట్​లో రూ.15,000 విలువ చేసే 16 రకాల నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అవి బేబీ ఆయిల్, డైపర్స్, తల్లి మరియు బిడ్డకు ఉపయోగపడే విధంగా సోప్స్, పౌడర్, షాంపూ, దోమతెర, డ్రస్సులు, హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకు ఆట వస్తువులు, చీరలు, టవల్స్, న్యాప్​కిన్స్, మరియు శిశువు కోసం బెడ్ వంటివి ఉంటాయి. ఈ సామగ్రి 3 నెలల వరకు సరిపోతుంది.
  • కేవలం కిట్ మాత్రమే కాకుండా ఒక వేళ ఆడపిల్ల పుడితే రూ.13,000 మగపిల్లాడు పుడితే రూ.12,000 మూడు విడతల్లో తల్లికి ప్రభుత్వం అందజేస్తుంది.
  • ఐదున్నర నెలలలోపు తల్లి 2NC చెకప్స్ పూర్తి చేయించుకోవాలి. అప్పుడు రూ. 3,000 అందించబడుతుంది.
  • రూ. 4,000 డెలివరీ తర్వాత అందించయబడుతుంది. ఆడపిల్ల పుడితే రూ. 5,000 అందిస్తారు.
  • మొదటి నెల వ్యాధి నిరోధక టీకాలు వేసిన తర్వాత రూ. 2,000 అందిస్తారు.
  • 2వ నెల వ్యాధి నిరోధక టీకాలు వేయించిన తర్వాత రూ. 3,000 అందిస్తారు.

కేసీఆర్ కిట్ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

కేసీఆర్ కిట్ పథకం కోసం గర్భిణీలు ఆన్​లైన్​లో మరియు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ కొరకు గర్భిణీ స్త్రీలు https://kcrkit.telangana.gov.in/ అధికారిక పోర్టల్​ను సందర్శించి పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆఫ్​లైన్ రిజిస్ట్రేషన్ కోసం గర్భిణీ స్త్రీలు తమ సమీపంలోని పబ్లిక్ హెల్త్ సెంటర్​ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

ఇప్పటి వరకు కేసీఆర్​ కిట్ పథకంలో 38,68,401 మంది గర్భిణులు మరియు తల్లులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం 13,00,780 కు పైగా కేసీఆర్ కిట్లను లబ్ధిదారులకు అందజేసింది. కేసీఆర్ (KCR) కిట్ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే NC చెకప్స్ మరియు రోగనిరోధక వ్యవస్థలో గణనీయమైన మార్పు కనిపించింది.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.