
సారాంశం




ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ఏవి పడితే అది అన్నీ తినలేరు. మీకు ఏ కాంప్లికేషన్ ఉన్నా, లేకపోయినా ఏ వంటకంలోని పదార్థాలైనా మీకు లేదా మీ పెరుగుతున్న బిడ్డకి అపాయకరమైతే, మీ డాక్టరు చాలా రకాల పదార్థాలని తినకుండా, తాగకుండా మిమ్మల్ని నియంత్రిస్తారు. ఏ పదార్థం అయినా హానికరం ఎప్పుడు అవుతుంది అంటే అది గర్భస్రావం, భారీగా రక్తస్రావం, కడుపులో నొప్పులు అలాగే ప్రసవం ముందుగానే వచ్చేయడం వంటి కాంప్లికేషన్లకు దారితీసినప్పుడు అనే కోణంలో చెప్పబడతాయి. అందుకని, మీరు కడుపుతో ఉన్నట్టయితే ఏం తింటున్నారో ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి తినాలి. అలాగే మీ గైనకాలజిస్టు నిషేధించిన ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. అలా మనం ఆందోళన చెందే ఆహార పదార్థాలలో ఒకటి : వాల్ నట్స్. ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లని తినడం వలన ఎంత సురక్షితం, ఏ ప్రమాదాలు వస్తాయన్న ఆందోళనలతో చాలా గందరగోళం ఏర్పడి వుంది కాబట్టి వాటి గురించి మనం ఈ ఆర్టికల్లో వివరంగా చర్చిస్తాం. వాల్ నట్స్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు, చాలా ఇతర పోషకపదార్థాలు ఎక్కువగా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో వాల్ నట్స్ ని ప్రమాదకరం చేసేది ఏంటి, లేకపోతే అది కేవలం ఒక అపోహేనా? ఇక్కడ చర్చిద్దాం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం? దీని అర్థం ఏమిటి? మీరు వైద్యుడిని సంప్రదించాలా?
వాల్ నట్స్ ని హిందీలో ఆక్రోట్స్ అని కూడా పిలుస్తారు. వీటిని ప్రెగ్నెన్సీ సమయంలో తినడం పూర్తిగా సురక్షితమని పరిగణిస్తారు. ఇందులో ఉండే పోషకాహార భాగం పిండం సరిగ్గా ఎదగడంలో చాలా సహాయపడుతుంది. సాధారణంగా, డాక్టర్లు కడుపుతో ఉన్నవారిని వారి డైట్లో భాగంగా రెండు వాల్నట్లని తినమని సూచిస్తారు. కడుపుతో ఉన్నప్పుడు వాల్నట్లని తినడం తల్లి బిడ్డ ఇద్దరికీ లాభదాయకం అనే చెప్పాలి. అంతేకాక, వాల్నట్లను రకరకాల పద్ధతుల్లో సులభంగా తినవచ్చు. వాటిని పచ్చిగా తినవచ్చు లేదా వాటిని ఉపయోగించి స్మూతీలు, గ్రనోలా బార్లు అలాగే మరెన్నో వంటకాలని ప్రయత్నించవచ్చు.
వాల్నట్లని మీ ఆహారంలో చేర్చుకునే ముందు, ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్ల వల్ల వచ్చే లాభాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లు తినడం వల్ల వచ్చే ప్రధానమైన లాభాల్లో ఒకటి, వాటిల్లో ఎక్కువ శాతం ఉండే ఒమేగా-3 అలాగే ఒమేగా-6 ఫ్యాటియాసిడ్లు అందడం. ఇవి కాబోయే తల్లి యొక్క గుండె ఆరోగ్యానికి, ఇంకా పిండం యొక్క నరాల ఎదుగుదలకి చాలా అవసరం. ఉదాహరణగా చెప్పాలంటే వాల్నట్లు పిండం మెదడు యొక్క మెనింజెస్ అభివృద్ధిని ప్రోత్సహించి, నాడీ పెరుగుదలని మెరుగుపరుస్తాయి.
వాల్నట్లలో జింకు, మెగ్నీషియం నుండి రాగి వరకూ చాలా ఖనిజలవణాలు ఉన్నాయి. ఇవి గర్భవతిగా ఉన్న మహిళలకు అలాగే ఎదుగుతున్న పిండానికి లాభదాయకమని నిరూపించబడ్డాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లలో ఉండే ఖనిజలవణాల వల్ల వచ్చే కొన్ని లాభాలు కింద ఇవ్వబడ్డాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో సోంపు గింజలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు
విటమిన్ E లేదా టోకోఫెరాల్ ఎక్కువ మొత్తంలో ఉన్నందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లను తినవచ్చు. విటమిన్ E ని ఎక్కువ ప్రభావంతమైన యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటిగా గుర్తిస్తారు. ఇది తల్లీబిడ్డ ఇద్దరిలో కణజాలాలలో ఆక్సీకరణం వల్ల జరిగే నష్టాలని తగ్గిస్తుంది. పిండం ఆరోగ్యకరంగా ఎదిగేలా చూస్తూ, శరీరంలో ఏదైనా మ్యుటేషన్ లేదా క్యాన్సర్ పెరగడాన్ని నివారిస్తుంది.
కడుపుతో ఉన్న మహిళలు తరచుగా మలబద్ధకం, ఉబ్బరం, పొట్టలో పుండ్లు అలాగే IBS ( ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్) లతో బాధపడతారు. అందుకనే చాలామంది డాక్టర్లు ప్రధానంగా రెండవ ట్రైమిస్టరు మధ్య నుండి పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు. అదృష్టవశాత్తూ, వాల్నట్లలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకనే అవి ఆడవారికి సురక్షితమైనవిగా చెప్పబడతాయి. పీచు పదార్థం పెద్ద పేగులో కదలిక సరిగ్గా ఉండడానికి సాయపడుతుంది అలాగే ఉబ్బరం, మలబద్ధకాలనుండి ఉపశమనం అందిస్తుంది.
వాల్నట్లలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు మహిళలకు ఎంతో లాభం చేకూరుస్తాయి. అవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి HDL స్థాయి పెరిగేలా చేస్తాయి. ఫలితంగా, కడుపుతో ఉన్న మహిళల గుండె ఆరోగ్యం సరైన స్థాయిలో చక్కగా ఉంటుంది.
కడుపుతో ఉన్నప్పుడు ఆహారంలో వాల్నట్లని చేర్చుకోడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సప్లిమెంటులాగా ఇంకో పదార్థంతో లేకుండా కేవలం పచ్చిగా వాల్నట్ ని తినడం మీకు ఒకవేళ నచ్చకపోతే, ఈ కింది పద్ధతులు మీరు గర్భవతిగా ఉన్నప్పటి డైట్లో వాల్నట్ను సులభంగా చేర్చుకోడానికి సాయపడవచ్చు.
కడుపుతో ఉన్నప్పుడు వాల్నట్లని తినడం వల్ల ఎలాంటి ముఖ్యమైన రిస్కులు లేవు. ఏది ఎలా ఉన్నా, ఏ పదార్థం అయినా పరిమితి దాటి తినకుండా ఉండడమే మంచిది. అందువల్ల వాల్నట్లను కూడా మితంగానే తినాలి. ఒకవేళ వాల్నట్లతో మీకు అలర్జీ ఉంటే వాటికి దూరంగా ఉండాలి. వాల్నట్లని తినడం వల్ల కడుపునొప్పి, దద్దుర్లు వచ్చినట్టయితే వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించడం మంచిది.
ఈ ఆర్టికల్ ప్రెగ్నెన్సీ సమయంలో వాల్నట్లను తినడం వల్ల కలిగే లాభాలు ఇంకా అవకాశం ఉన్న రిస్కుల గురించి వివరించింది. కడుపుతో ఉన్నవారికి వాల్నట్లతో ఏ అలర్జీ లేనప్పుడు అవి వారికి ఎటువంటి ప్రమాదాన్ని కలిగించవు. అయితే, తల్లీబిడ్డ ఇద్దరి ఆరోగ్యాలని దృష్టిలో పెట్టుకొని, పోషకాలతో నిండిన ఈ వాల్నట్ను మితంగా తీసుకోవడమే మంచిది. వాల్నట్లలో పిండం సరిగ్గా ఎదగడానికి, ముఖ్యంగా నరాలు చక్కగా పెరగడానికి, తల్లి యొక్క జీర్ణక్రియ అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడడానికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి.
Walnuts during pregnancy in telugu, Walnuts benefits during pregnancy in telugu, can pregnants eat Walnuts during pregnancy in telugu, risks of eating Walnuts during pregnancy in telugu, Is Walnut safe during pregnancy in telugu.
వాల్నట్లతో పాటు, మీ ప్రెగ్నెన్సీ డైట్‌ను పూర్తి చేయడానికి సహాయపడే పోషకాహార ఉత్పత్తులు మీకు మరింత బలాన్ని అందిస్తాయి.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest




Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress




Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each




Baby Wellness Kit | Skincare Gift Set for Newborns






This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |