This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టగొడుగులు : రకాలు, లాభాలు & ప్రమాదాలు (Mushrooms During Pregnancy: Types, Benefits & Risks in Telugu)

Pregnancy Best Foods
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టగొడుగులు : రకాలు, లాభాలు & ప్రమాదాలు (Mushrooms During Pregnancy: Types, Benefits & Risks in Telugu)
Likes1 Likes|
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టగొడుగులు ప్రొటీన్, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ D, విటమిన్ B, రాగి, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలను అందిస్తాయి, తక్కువ కేలరీలతో గుండె ఆరోగ్యానికి సాయపడతాయి.
  • షిటేక్, వైట్ బటన్, చెస్ట్ నట్, పోర్సిని, మైటేక్ పుట్టగొడుగులు ప్రెగ్నెన్సీలో సురక్షితమైనవి. మ్యాజిక్ మష్రూమ్స్, విషపూరిత లేదా భ్రాంతి కలిగించే పుట్టగొడుగులకు పూర్తిగా దూరంగా ఉండాలి.
  • పుట్టగొడుగులని బాగా కడిగి, కనీసం 60 డిగ్రీల సెల్సియస్ వద్ద పూర్తిగా ఉడికించి తినాలి. సరిగ్గా వండని పుట్టగొడుగులు బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లకి దారితీస్తాయి.
  • ప్రెగ్నెన్సీలో సరైన పోషణ కోసం ఏం ఎంచుకోవాలి? Explore our MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes).
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9

కడుపుతో ఉన్నప్పుడు పుట్టగొడుగులు తినడం మంచిదేనా? ఒకవేళ ఇది మీ మనస్సులో ఉన్న ప్రశ్న అయితే, మీరు దానికి సంబంధించిన సమాచారం కోసం సరైన చోటకే వచ్చారు. గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టగొడుగులని తినడం, వాటి ఆరోగ్య లాభాలు అలాగే కలిగించే హాని ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి ఇక్కడ చదివి తెలుసుకోండి.

పుట్టగొడుగుల యొక్క పోషక వాస్తవాలు, ఆరోగ్య లాభాలు (Nutritional Value and Health Benefits of Mushrooms in Telugu)

మీకు పుట్టగొడుగులంటే ఇష్టమా? మంచి వార్త ఏంటంటే, అవి ప్రొటీన్, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న తక్కువ కేలరీ ప్రత్యామ్నాయం. పుట్టగొడుగులని చాలా రుచికరమైన పద్ధతులలో వండుకోవచ్చు – సూప్లు, సలాడ్లు అలాగే ఆకలి పెంచే అపెటైజర్లలాగా కూడా. పుట్టగొడుగులు గుండె జబ్బులు రాకుండా సాయపడతాయి. ఇంకా డయాబెటిస్, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి జబ్బులని తగ్గించడంలో కూడా మంచివి. పోషకవిలువల ప్రకారం చెప్పాలంటే, పుట్టగొడుగులు రాగి, మెగ్నీషియం, సెలీనియం, ఫాస్పరస్ అలాగే థయామిన్ వంటి ఖనిజలవణాలు ఎక్కువగా కలిగివుంటాయి. పుట్టగొడుగులలో ఉండే తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం పదార్థం రక్తపోటుని తగ్గించడంలో సాయపడుతుంది, అలా గుండె జబ్బులకి సంబంధించి శరీరాన్ని అదుపులో ఉంచుతుంది. చాలామంది వైద్య నిపుణులు యాసిడ్ రిఫ్లక్స్ ఇంకా ఎసిడిటీని తగ్గించడానికి పుట్టగొడుగులు ఉన్న సూప్లని తీసుకోమని కూడా సూచిస్తారు.

గర్భవతిగా ఉన్నప్పుడు తినదగిన సురక్షితమైన పుట్టగొడుగుల రకాలు (Safe Types of Mushrooms to Consume During Pregnancy in Telugu)

గర్భవతిగా ఉన్నప్పుడు, మహిళలు కొన్నిరకాల పుట్టగొడుగులని మాత్రమే తినవచ్చు. అవేంటంటే షిటేక్ పుట్టగొడుగులు, వైట్ బటన్ పుట్టగొడుగులు, చెస్ట్ నట్ పుట్టగొడుగులు, పోర్సిని పుట్టగొడుగులు అలాగే మైటేక్ పుట్టగొడుగులు. పుట్టగొడుగుల ప్రతి రకం తినడానికి అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో తినడానికి పూర్తిగా సురక్షితమైనది కూడా.

మీకు ఇది కూడా నచ్చుతుంది: సెప్సిస్: లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు ప్రమాదాలు

గర్భవతిగా ఉన్నప్పుడు దూరంగా ఉండాల్సిన పుట్టగొడుగుల రకాలు (Avoid These Mushrooms During Pregnancy in Telugu)

కడుపుతో ఉన్న సమయంలో మహిళలు మ్యాజిక్ మష్రూమ్స్ లేదా ఏదైనా విషపూరిత లక్షణాలను కలిగి ఉన్న సైకిడెలిక్ లేదా భ్రాంతి కలిగించే పుట్టగొడుగులని అసలు తినకూడదని గుర్తుంచుకోండి. అలాంటి పుట్టగొడుగులను తినడం వల్ల ఎదుగుతున్న పిండానికి చాలా హాని కలుగుతుంది. దయచేసి తెలియని చోట్ల నుంచి సేకరించిన పుట్టగొడుగులని అస్సలు తినవద్దు. పుట్టగొడుగులని కొనేటప్పుడు లేబుల్స్ ని, అవి ప్యాక్ చేయబడ్డాయా, లేదా అలాగే నమ్మదగిన ప్రదేశాల నుండి మాత్రమే కొన్నారో, లేదో చెక్ చేసుకోండి.

గర్భవతులైన మహిళలు పుట్టగొడుగులని తినవచ్చా? (Can Women Eat Mushrooms While Pregnant in Telugu)

క్లుప్తంగా చెప్పాలంటే, ఆడవారు కడుపుతో ఉన్న సమయంలో పుట్టగొడుగులని తినడం ఖచ్చితంగా మంచిదే. కాకపోతే, పుట్టగొడుగులని ఎక్కడి నుంచి సేకరించారు, తెలిసిన ప్రదేశాల నుండి కొన్నారని, వండుకోవడానికి తగినవేనని అలాగే విషపూరితం, బ్రాంతి కలిగించే పదార్థాలు ఉన్నవి కావని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. తినడం కోసం పుట్టగొడుగులని వాడుతున్నప్పుడు, అవి పూర్తిగా కడిగాక వండబడ్డాయి, ఉడికాయి అని నిర్ధారించుకోండి. ఒకవేళ మీరు వాటిని వండాలి అనుకోకపోయినా, వాటిని సరిగ్గా ఉడకబెట్టండి. అలా ఏవైనా మలిన పదార్థాలు విడుదలైనా వాటిని శుభ్రం చేయవచ్చు. శుభ్రం చేసాక, గర్భవతులు హాని కలిగించని పుట్టగొడుగులని తినవచ్చు, ప్రత్యేకించి వాటిలో చాలా ఉపయోగపడే పోషకాలు ఉంటాయి.పుట్టగొడుగులు విటమిన్ D, విటమిన్ B అలాగే ఇతర ముఖ్యమైన ఖనిజలవణాలకి వనరులు కూడా.

ప్రెగ్నెన్సీ సమయంలో తినగలిగిన పుట్టగొడుగులని ఏ విధంగా తయారుచేసుకోవాలి? (How to Prepare Edible Mushrooms During Pregnancy in Telugu?)

మీరు కడుపుతో ఉండి, మీకు పుట్టగొడుగులని తినడం ఇష్టం అయితే, మీరు వాటిని తినడానికి మార్గం ఉంది. అన్నిటికన్నా ముందు మీరు కొన్న పుట్టగొడుగులు తినదగినవేనా అని నిర్థారించుకోండి. చాలా దుమ్ము, క్రిములు, సూక్ష్మజీవులు ఉండవచ్చు కాబట్టి పుట్టగొడుగులని బాగా కడగండి. వీటిని కుళాయి కింద నేరుగా నీటిలో పెట్టి కడగండి, తర్వాత వాటి మురికి, ధూళి అంతా పోయిందని నిర్ధారించుకున్నాక పొడి గుడ్డతో తుడవండి. పుట్టగొడుగులను కడిగేసిన తర్వాత మీరు వాటిని సరిగా వండారో, లేదో చెక్ చేసుకోండి. ఉడికించడం వల్ల పుట్టగొడుగులు కలిగించే ఇతర ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియా వాటిల్లో ఏమైనా ఉంటే తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, సరిగ్గా వండని, ఉడకని పుట్టగొడుగులు, వండకుండా తినే పుట్టగొడుగులతో సమానం. అవి రెండూ హానికరమే. కాబట్టి, మీరు వాటిని కనీసం 60 డిగ్రీల సెల్సియస్ వద్దనైనా ఖచ్చితంగా ఉడికించండి. ఆహారం ద్వారా కలిగే జబ్బులను నివారించడానికి, బ్యాక్టీరియా ఎదుగుదలను తగ్గించడానికి, పుట్టగొడుగులను ఉడికించాక ఫ్రిజ్లో సరిగ్గా నిల్వ చేసుకోండి.

విషపూరిత పుట్టగొడుగులని తినటం వలన వచ్చే ప్రమాదాలు ఏంటి? (Risks of Taking Toxic Mushrooms During Pregnancy)

విషపూరితమైన పుట్టగొడుగులని తినడం వల్ల చాలా ప్రమాదాలు వస్తాయి. మొదటగా చెప్పాలంటే, అలాంటి పుట్టగొడుగులు చాలా విషపూరితంగా ఉండి కడుపు నొప్పి, వికారం, తీవ్రమైన గ్యాస్ లేదా ఉబ్బరం, వాంతులు మరియు లేదా విరోచనాలు వంటి చాలా శరీర లోపల ఇబ్బందులకు దారితీస్తాయి. ఈ లక్షణాలు తిన్న వెంటనే కనిపించకపోవచ్చు. కనిపించడానికి కొంత టైం పడుతుంది. పుట్టగొడుగుల్ని తిన్న ఒకటి, రెండు గంటల తర్వాత, మీకు ఈ లక్షణాల్లో ఏదైనా కనిపిస్తే దాన్ని తగ్గించుకోవడానికి డాక్టర్ను సంప్రదించడం తెలివైన పని. ఒకవేళ మీరు విషపూరిత పదార్థాలున్న పుట్టగొడుగులు తిన్నారని అన్పిస్తే, తిన్న వెంటనే ఎక్కువ ద్రవపదార్థాలు – అంటే నీరు, ఎలక్ట్రోలైట్లు ఉన్న పానీయాలని తాగండి. ఇవి నొప్పి, ఇతర లక్షణాలని కొంతవరకు ఉపశమించేలా చేస్తాయి. కానీ బిడ్డకి హాని జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా డాక్టరుని సంప్రదించండి.

Tags:

Mushrooms during pregnancy in telugu, Mushrooms recipes in telugu, Benefits of eating Mushrooms during pregnancy in telugu, Side effects of eating Mushrooms during pregnancy in telugu, Eating Mushrooms during pregnancy in telugu

గర్భవతుల పోషణ ప్రయాణానికి నమ్మకమైన తోడు

ప్రెగ్నెన్సీలో మీకు, మీ బిడ్డకి అవసరమైన పోషకాలను అందించే సురక్షితమైన ఉత్పత్తులు మీ ఆరోగ్యానికి అదనపు మద్దతుగా నిలుస్తాయి.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

418 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.