This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భవతిగా ఉన్నప్పుడు జామపండ్లు తినటం: లాభాలు, దుష్ప్రభావాలు& చిట్కాలు (Guava in Pregnancy: Benefits, Side Effects & Tips in Telugu)

Pregnancy Best Foods
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భవతిగా ఉన్నప్పుడు జామపండ్లు తినటం: లాభాలు, దుష్ప్రభావాలు& చిట్కాలు  (Guava in Pregnancy: Benefits, Side Effects & Tips in Telugu)
Likes7 Likes|
Read time7 min

ఒక మహిళ గర్భవతి అయినప్పుడు డాక్టర్లు ఆమె తీసుకునే ఆహారంపై చాలా ఆంక్షలు పెడతారు. అవి తన ఆహారం యొక్క క్యాలరీల సంఖ్య కావచ్చు, ఆహారం రకాలు, రోజూ భోజనం చేసే సమయాలు ఇంకా రోజుకి ఎన్ని సార్లు తినాలి అన్నది కూడా కావచ్చు. కడుపుతో ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండడానికి, పిండాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక కఠినమైన రొటీన్ ను పాటించి తీరాలి. తరచుగా, తల్లి కాబోతున్న స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో జామ పండ్లు తినడం సురక్షితమేనా అని అడుగుతూ ఉంటారు, ఎందుకంటే అది రుచికరమైన, అత్యంత సాధారణమైన పండ్లలో ఒకటి. జామపండ్లు ఏడాది పొడవునా అందుబాటులోనే ఉన్నా కూడా, దాన్ని సాధారణంగా వసంత కాలం అలాగే ఎండాకాలం రుతువులకి సంబంధించిన పండుగా పరిగణిస్తారు. అందుకనే ప్రెగ్నెన్సీ సమయంలో జామపండ్లు తినటం వలన లాభాల గురించి మరింత తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ ఆర్టికల్ ఈ సీజనల్ పండు గురించి, దానివల్ల వచ్చే ప్రభావాల గురించి (ఏవైనా ఉంటే), అలాగే మీ ఆహారంలో దీనిని భాగంగా చేర్చుకోవడానికి చిట్కాల గురించి తెలుపుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో జామపండ్ల వలన లాభాలు: (Guava Benefits During Pregnancy in Telugu)

1. విటమిన్లు, ఖనిజలవణాలతో నిండివుంటుంది (Boosts Immunity)

కడుపుతో ఉన్నప్పుడు జామపండు తినడం వలన వచ్చే శక్తివంతమైన లాభాల్లో ఒకటి, ఈ పండ్లలో టన్నులకొద్దీ విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. ఈ పండులో విటమిన్లు A,C,B2 ఇంకా E ఉంటాయి. ఇవేకాక, జామపళ్ళలో కాల్షియం, పొటాషియం, మాంగనీస్ సహా చాలా ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఈ పోషక పదార్థాలన్నీ తల్లీబిడ్డల రోగనిరోధక శక్తిని మెరుగుపర్చటంలో సాయపడి, అంటువ్యాధులు, వాపుల వంటి ఇబ్బందులతో పోరాడటానికి శక్తినిస్తాయి.

2. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వనరు (Rich Sources of Folic Acid)

ఫోలిక్ యాసిడ్లో విటమిన్ B9 లేదా ఫోలేట్ ఉంటుంది. గర్భవతిగా ఉన్న సమయంలో దీని సప్లిమెంట్లను తీసుకోవడం తల్లికి చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది పిండంలో న్యూరల్ ట్యూబ్ ఏర్పడడానికి సహాయపడుతుంది. ఇంతేకాక గర్భవతిగా ఉన్నప్పుడు జామ పండు తినడం ఎందుకు మంచిదంటే, ఫోలిక్ యాసిడ్ పుట్టుక నుంచి వచ్చే ఎనెన్సెఫలీ అలాగే స్పైనా బిఫిడాలాంటి తీవ్రమైన నాడీ సంబంధ జబ్బులను రాకుండా నివారిస్తుంది. చాలామంది డాక్టర్లు మీ ప్రెగ్నెన్సీ డైట్లో ఈ సీజనల్ పండును చేర్చాలని సూచిస్తారు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారంలో చిరుధాన్యాలని తినడం వలన వచ్చే లాభాలు

3. జీర్ణ సమస్యల్ని ఉపశమింపచేస్తుంది (Relieves Digestive Problems)

ఒంట్లో హార్మోన్ల మార్పుల వల్ల గర్భవతిగా ఉన్న మహిళలు తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవి విరోచనాలు, మలబద్ధకం, పొట్టలో పుండ్లు లేదా ఉబ్బరం కూడా కావచ్చు. అందుకని కడుపుతో ఉన్న సమయంలో జామ పండు తినటం వలన వారికి చాలా మంచి చేకూరుతుంది. ఎందుకంటే, అందులో ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం, నీరు ఉన్నందువల్ల పేగుల కదలికలు సరిగ్గా ఉంటాయి ఇంకా అది జీర్ణ సమస్యలు, మలబద్ధక సమస్యల్ని తగ్గించగలదు. ఇది ఆహార పైపులో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియాలను (గట్ ఫ్లోరా) కూడా తిరిగి పెరిగేలా చేస్తుంది. దానివల్ల గర్భవతిగా ఉన్న మహిళలు జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.

4. రక్తపోటుని నియంత్రిస్తుంది (Controls Blood Pressure)

ఒంట్లో హార్మోన్ల మార్పుల కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో రక్త పోటు క్రమ పద్ధతిలో ఉండకపోవడం చాలా సాధారణమైన విషయం. అంతేకాక, రక్తపోటుని పెంచడంలో ప్రీ-పార్టం డిప్రెషన్ కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో జామపండు తినడం మంచిదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, ఈ పండులోని పొటాషియం మొత్తం, రక్తపోటుని సులువుగా నియంత్రించగలదని చెప్పొచ్చు. దాంతోపాటు అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి, రక్తపోటుని ఆరోగ్యకరమైన స్థాయిలో మేనేజ్ చేయగలవు.

5. గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే గెస్టేషనల్ డయాబెటిస్ ని నివారిస్తుంది (Prevents Gestational Diabetis)

ప్రెగ్నెన్సీ సమయంలో జామ పండు తినడం వల్ల వచ్చే ముఖ్యమైన లాభాల్లో ఒకటి, తల్లి అలాగే పిండంతో గర్భవతిగా ఉన్న సమయంలో వచ్చే డయాబెటిస్ ను తగ్గించగల సామర్థ్యం కలిగి ఉండడం. శరీరంలో ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్ కు శరీరం స్పందించకపోవడాన్ని గెస్టేషనల్ డయాబెటిస్ స్థితి అంటారు లేదా రక్తంలో గ్లూకోస్ యొక్క గాఢతని నియంత్రించడానికి ఈ హార్మోన్ కావలసినంతగా స్రవించబడదు. దాని ఫలితంగా, బిడ్డ కూడా పుట్టినప్పటినుంచి డయాబెటిస్ బారిన పడాల్సి వస్తుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలో రక్తంలో చక్కెర స్థాయిల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేమిటి?

6. యాంటీఆక్సిడెంట్లతో నిండివుంటుంది (Loaded with Antioxidants)

గర్భవతిగా ఉన్నప్పుడు జామ పండ్లు తినడం మంచిదని చెప్పడానికి మరో మంచి కారణం, అందులో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు. ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటైన విటమిన్ E లేదా టోకోఫెరాల్, శరీరంలో ఆక్సీకరణం వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించి, పిండం ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

7. సంతాన సాఫల్యతకి అవకాశం ఉన్న లాభాలు (Potential Fertility Benefits)

గర్భం దాల్చడానికి సంబంధించి జామ పళ్ళతో సంతాన సాఫల్య లాభాలు చాలా ఉన్నాయి. ఈ పండు మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో కొన్ని మార్గాలని కింద చదివి తెలుసుకోండి.

  • ఫోలిక్ యాసిడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భవతి అయ్యే అవకాశాలు పెరుగుతాయి
  • అంతేకాదు, జామ పండులో విటమిన్ C ఉంటుంది. ఇది మహిళల్లో సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, గర్భం దాల్చడంలో సాయపడుతుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: జంటల కోసం ఫెర్టిలిటీ డైట్ ప్లాన్- ఇది ఉపయోగకరంగా ఉంటుందా?

గర్భవతిగా ఉన్నప్పుడు జామపండ్లు తినటం వలన వచ్చే దుష్ప్రభావాలు (Side Effects of Having Guava During Pregnancy in Telugu)

ప్రెగ్నెన్సీ సమయంలో జామ పళ్ళను తినటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేనప్పటికీ, కొన్ని ప్రత్యేక నెగిటివ్ ప్రభావాల గురించి మీకు అవగాహన ఉండి తీరాలి.

  • జామ పండ్లు ఎక్కువగా పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, ఎక్కువ పళ్ళని తినడం వల్ల విరోచనాలు సులభంగా కలుగుతాయి. దానివల్ల శరీరంలో త్వరగా నీరు శాతం తగ్గిపోతుంది. ఇది గర్భవతిగా ఉన్నప్పుడు సమస్యలను కలిగిస్తుంది
  • తరచుగా అందరూ కడుపుతో ఉన్నప్పుడు జామ పండ్లు తినొచ్చా అని అడుగుతుంటారు. జవాబు అయితే, అవును తినవచ్చు. కానీ ఆ పళ్ళని సరిగ్గా కడిగి పైన తొక్కను తీసివేసిన తర్వాత మాత్రమే తినాలి. అలా చేయటం ఏ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ని అయినా నివారించడంలో సాయం చేస్తుంది.

జామపండుని తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Precautions Should be Taken While Eating Guava in Telugu)

  • ప్రెగ్నెన్సీ సమయంలో జామ పళ్ళ వల్ల వచ్చే లాభాలని ఆస్వాదించడానికి సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ పండ్లని తినడం మంచిది. ఎందుకంటే వీటిల్లో మీ గర్భాన్ని మరింత సంక్లిష్టతరంగా మార్చే రసాయనాలు ఉండవు.
  • ఇంకా, జామ పళ్ళని అతిగా,ఎక్కువగా తినకూడదు ఎందుకంటే అవి విరేచనాలు. కడుపునొప్పులకి దారి తీయవచ్చు.
  • ప్రత్యేకించి గర్భవతిగా ఉన్న మహిళలు జామ పండ్లని ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు

ప్రెగ్నెన్సీ సమయంలో జామపళ్లని తినటానికి చిట్కాలు (Tips for Eating Guava During Pregnancy in Telugu)

  • జామపళ్ళలో ఎర్రగుజ్జు ఉన్న పళ్ళ కంటే తెల్ల గుజ్జు ఉన్న పండ్లు తింటే గర్భవతిగా ఉన్న స్త్రీలకి ఎక్కువ మేలు చేకూరుతుంది.
  • ఈ పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తనాలతో తినడం మంచిది. అవి జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి, పేగు కదలికలు చక్కగా ఉండడానికి సహాయపడతాయి
  • కడుపుతో ఉన్నప్పుడు జామ పండ్లని పొద్దున పూట బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనం అయ్యాక రెండు గంటల తర్వాత తినడం చాలా మంచిది.
  • జామ పళ్ళతోపాటు అరటిపండు, స్ట్రాబెర్రీ, రేగుపండ్లు, మామిడి పండ్లు, పైనాపిల్ అలాగే పుచ్చకాయ వంటి ఇతర పండ్లని కలిపి తినటం వల్ల శరీరానికి రకరకాల పోషకాలు అందుతాయి.
  • పచ్చి జామ పళ్ళ కంటే పండిన జామ పండ్లు తినడం చాలా లాభాన్ని చేకూరుస్తుంది.

చివరిమాట (Conclusion)

కడుపుతో ఉన్నప్పుడు జామపండ్లు తినటం వలన వచ్చే లాభాలు ఇప్పుడు తెలిసాయి కాబట్టి, ఈ రుచికరమైన, రసాలూరే, మెత్తని పండుని మీ డైట్లో చేర్చుకోవటం పెద్ద సమస్య కాదు. అయితే డైట్లో భాగంగా జామపళ్లని తినేముందు డాక్టరుని ఒకసారి సంప్రదిస్తే మంచిది.

Tags:

Guava during pregnancy in telugu, Benefits of eating Guava during pregnancy in telugu, side effects of eating Guava in telugu, Precautions to take while eating Guava in telugu, Guava nutritional value in telugu.

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.