
ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నపుడు అనేక రకాలైన ఆహారాలను తినాలని ఆమెకు వింత కోరికలు పుడతాయి. మీరు గర్భవతిగా ఉన్నపుడు మీ ఆరోగ్యానికి మంచివి కాని పదార్థాలను కూడా తినాలని మీకు అనిపించవచ్చు. మీరు ఏమి తింటున్నారనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ చిన్నారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయొచ్చు. లిచీస్ అనేవి మీరు గర్భధారణలో ఉన్నపుడు మీకు ఎన్నో ప్రయోజనాలను కలిగించే ఒక పండు. లిచీ పండులో పెద్ద మొత్తంలో మినరల్స్, విటమిన్స్ మాత్రమే కాకుండా అధిక మోతాదులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీని స్వీట్ టెస్ట్ మరియు అధిక పోషక విలువలు గర్భవతిగా ఉన్న మహిళలు త్వరగా బరువు పెరిగేందుకు ఉపయోగపడతాయి. వారి ఆహారంలో విటమిన్స్, మినరల్స్‌తో ఆరోగ్యకరంగా మారుస్తుంది. మీరు లిచీస్ తినేందుకు ఇష్టపడితే గర్భవతిగా ఉన్నపుడు వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి తెలుసుకునేందుకు ఈ కథనం చదవండి.
లిచీని తక్కువ మోతాదులో తినడం సురక్షితం. ఈ పండులో విటమిన్ C, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. స్త్రీ గర్భవతిగా ఉన్నపుడు ఈ పోషకాలను ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. లిచీ పండ్లలో ఎక్కువగా చక్కెర మరియు నీరు ఉంటుంది. కాబట్టి కొంత మంది గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గర్భధారణ మధుమేహం (GDM) ఉన్న వారు వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. తల్లి కావాలని ఆశించే వారు లిచీలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల గర్భం దెబ్బతినే ప్రమాదం ఉంది.
బెస్ట్ లిచీలు గట్టిగా ఉంటాయి. మృదువుగా ఉండవు. బరువుగా అనిపిస్తాయి. పొడిగా ఉండి.. గులాబీ గోధుమ రంగును కలిగి ఉంటాయి. పట్టుకుంటే మృదువుగా ఉండే వాటిని లేదా నలుపు రంగులో ఉన్న వాటిని లేదా పగుళ్లు మచ్చలు ఉన్న వాటిని ఎంచుకోకూడదు. లిచీలు ఎక్కువ సేపు ఉండవు కాబట్టి.. వాటిని మీరు తర్వాత ఉపయోగించాలని అనుకుంటే.. ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. వాటిని ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడితే కనీసం రెండు వారాల పాటు తాజాగా ఉంటాయి. లిచీలను ఎక్కువ సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచకుండా వెంటనే తినడం మంచిది.
లిచీ అనేది విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లతో కూడిన పండు. 100గ్రాముల (3.5 ఔన్స్) లిచీ పండులో పోషకాలు కింది విధంగా ఉంటాయి.
లిచీల వల్ల కలిగే మీరు తెలుసుకోవాల్సిన 5 ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:
ఈ రుచికరమైన పండ్లను ఆస్వాదించేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:
లిచీలను గర్భిణీ స్త్రీ తినడం వలన తనకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. తనకు తన బిడ్డకు అవసరమైన పోషకాలను పొందుతూ తన కోరికలను తీర్చుకోవచ్చు. ఆమెకు మరియు ఆమెకు పుట్టబోయే బిడ్డకు ఇది మేలు చేస్తుంది. మీ శిశువు ఎదుగుదల కోసం అవసరమైన ముఖ్యమైన పోషకాలను లిచీ కలిగి ఉంటుంది. లిచీ పండ్లను తగినంతగా తీసుకోలేని గర్భిణీ స్త్రీలలో మీరు ఒకరైతే వాటిని మితంగా తీసుకోవడం మంచిది. మీరు ఎక్కువగా తిననంత కాలం మీ ఆహారంలో చేర్చుకోవడానికి లిచీ ఒక ఆరోగ్యకరమైన పండు. మీరు గర్భవతిగా ఉన్నట్లయితే లిచీని తీసుకునే ముందు మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. భారతదేశంలో అత్యధిక మంది విశ్వసిస్తున్న పేరెంటింగ్ ప్లాట్‌ఫాం మైలో ఫ్యామిలీ ద్వారా పేరెంటింగ్ గురించి మరింత తెలసుకోండి. దానికి మీరు చేయాల్సిందల్లా కేవలం సైన్అప్ చేయడం మాత్రమే.
అవును.. లిచీ పిల్లలకు మంచిదే. మీ పిల్లవాడిని అతడికి ఇష్టమైనన్ని లిచీలను తిననివ్వాలి. అతడు ఆరోగ్యకరమైన డైట్‌ను పొందుతున్నాడని మీరు నిర్దారించుకోవాలి. అతడు తినే ఆహారంలో అన్ని ప్రధాన ఆహారాలను చేర్చాలి.
లిచీలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కావున మధుమేహంతో బాధపడే వారు వీటిని తీసుకోవడం తక్కువ చేయాలి. కొంత మందిలో లిచీ వలన అలర్జీ రియాక్షన్స్ కలిగే అవకాశం కూడా ఉంది. హార్మోన్ల అంతరాయం అనేది లిచీ తినడం వల్ల కలిగే ఇంకో దుష్ప్రభావం. అంతర్గత రక్తస్రావం, జ్వరం, ఇతర లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి.
లిచీ అనేది శరీరంలో వేడిని కలుగజేసే పండు. దీనిని అధికంగా తినడం వల్ల మొటిమలు, గొంతు నొప్పి మరియు ఇతర సమస్యలకు కారణం అవుతుందని ప్రజలు చెబుతున్నారు.
Litchi in pregnancy, Benefits of Litchi during pregnancy in telugu can pregnants eat Litchi during pregnancy in telugu, Nutritional value of Litchi in telugu, precautions to take care while eating Litchi in pregnancy
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |