
గర్భధారణ సమయంలో శరీరం ఇది వరకు ఎప్పుడూ లేనంత శారీరక, భావోద్వేగ లక్షణాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడం కొంచెం కష్టం. మీరు గర్భవతిగా ఉన్నా లేదా గర్భం దాల్చాలనుకుంటున్నా, ఏ ఆహారాలు తింటే సురక్షితమో గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు తినకూడని ఆహారాల జాబితా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సురక్షితమైన ఆహారాలు తెలుసుకోవడం కొన్ని సార్లు కష్టంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఆలోచించకుండా తినగలిగే ఆహారం ఆపిల్స్. మేము మిమ్మల్ని తినమని ప్రోత్సహిస్తున్నాం. గర్భధారణ సమయంలో యాపిల్స్ తీసుకోవడం వల్ల మీకు మీ బిడ్డకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.గర్భధారణ సమయంలో యాపిల్స్ తినడం వల్ల కలిగే ఎనిమిది ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం:
యాపిల్స్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. “రోజుకు ఒక ఆపిల్ డాక్టర్‌ను దూరంగా ఉంచుతుంది” అనే సామెత కేవలం సామెత మాత్రమే కాదు. యాపిల్స్‌లో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు బిడ్డను మోస్తున్నప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, కాబట్టి గర్భిణీలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
రక్త హీనత వల్ల తక్కువు బరువు ఉన్న బిడ్డ పుట్టడం, నెలలు నిండకముందే శిశువు జన్మించడం జరుగుతుంది. యాపిల్స్‌లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి గర్భధారణ సమయంలో యాపిల్స్ తినడం ద్వారా రక్తహీనత వచ్చే ప్రమాదం తగ్గుతుంది. యాపిల్స్‌లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. మీ రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, గర్భధారణ సమయంలోలో రక్తహీనతను నివారించడానికి అవసరమైన ఖనిజం. గర్భధారణ సమయంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న రక్తహీనత నివారించడానికి, యాపిల్స్‌ను క్రమం తప్పకుండా తినడం మంచిది (ఐరన్ అధికంగా ఉన్న ఇతర ఆహారంతో పాటు).
గర్భధారణ సమయంలో సహజంగా వచ్చే శక్తిని ఎవరు వద్దనుకుంటారు? యాపిల్స్ ఖచ్చితంగా ఇస్తాయి. బిడ్డను కనడం చాలా కష్టమైన పని. ఎవరికైతే తక్షణ శక్తి అవసరమో కానీ కెఫిన్ తీసుకోలేరో, అలాంటి వారికి ఆపిల్స్ ఉపయోగపడతాయి. ఆపిల్స్‌లో ఉండే సహజ చక్కర మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, తద్వారా మీకు శక్తిని ఇస్తుంది.
యాపిల్స్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వాటిని తినడం వలన గర్భధారణ సమయంలో జీర్ణక్రియకు సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలలో మలబద్ధకానికి రెండు సాధారణ కారణాలు ఉంటాయి. ఒకటి హార్మోన్ల మార్పులు, రెండు పెరుగుతున్న శిశువు యొక్క అదనపు ఒత్తిడి. దీనిని తగ్గించడానికి రోజూ యాపిల్స్ వంటి అధిక ఫైబర్ ఫుడ్స్ తినడం వల్ల ప్రేగుల కదలిక బాగుంటుంది, గ్యాస్ తగ్గుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ ప్రారంభంలో మలబద్ధకం
క్రిటికల్ రివ్యూస్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లోని ఒక కథనం 16 అధ్యయనాలను పరిశీలించింది, ఇది గుండెపై ఆపిల్స్ తినడం వల్ల కలిగే ప్రభావాలను పరిశీలించింది. అందులో రచయితలు రోజుకు ఒక మీడియం ఆపిల్ తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, వాపు తగ్గుతుందని నిర్ధారించారు. తొక్క తీయని యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మీ గుండెకు మేలు చేసే పాలీఫెనాల్స్ రసాయనాలు ఉంటాయి. అంతే కాకుండా, గుండెల్లో మంటతో (ముఖ్యంగా గర్భం దాల్చిన చివరి సమయంలో) బాధ పడే గర్భిణీ స్త్రీలకు యాపిల్స్ బాగా ఉపయోగపడతాయి. యాపిల్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబర్, రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, పాచి చేరడం ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది.
యాపిల్స్‌లో ఉండే ఫైబర్, ఫ్లెవనాయిడ్స్ కారణంగా, గర్భధారణ సమయంలో యాపిల్స్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల గర్భధారణతో వచ్చే మధుమేహాన్ని తగ్గిస్తుంది. ఇంకా, యాపిల్స్‌లో ఉండే ఫైబర్ రక్త నాళాల్లో చక్కర కలవడాన్ని తగ్గిస్తుంది. ఒకేసారి చాలా యాపిల్స్ తింటే తప్ప రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగడానికి కారణం కాదు.
యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. తల్లి బిడ్డ ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు చాలా అవసరం. అవి మిమ్మల్ని, మీకు పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది, కాబట్టి మీరు శ్వాసకోస వ్యాధి భారిన పడకుండా ఉంటారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువు శ్వాసలోపం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
మీరు వినే ఉంటారు గర్భధారణకు ముందు, గర్భధారణ తర్వాత తగినంత ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలేట్ తీసుకోవడం వల్ల శిశువు అసాధారణంగా జన్మించడాన్ని నివారించవచ్చు. కాబట్టి గర్భధారణ సమయంలో యాపిల్ తినడం వల్ల పోలేట్ అధికంగా వస్తుంది, ఎందుకంటే యాపిల్స్‌లో పోలేట్ అధికంగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో యాపిల్ తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. చాలా రకాల యాపిల్స్ ఉంటాయి, అవి మీకు ఎలా కావాలో అలా తినొచ్చు. మీకు తీయగా లేదా పుల్లగా తినాలనిపిస్తే గ్రానీ స్మిత్ లేదా రెడ్ డెలీషియస్ యాపిల్స్ దొరుకుతాయి. ఏ రకమైన యాపిల్స్ అయినా మీకు, మీ బిడ్డకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందిస్తాయి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా అందరికీ విలువైన సమాచారాన్ని తెలియజేయవచ్చు. యాపిల్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎంత ఎక్కువమందికి తెలిస్తే, భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లలు ప్రయోజనం పొందవచ్చు!
Apple during pregnancy in telugu, Eating Apple during pregnancy in telugu, Benefits of Apple during pregnancy, Can pregnants eat Apple during pregnancy in telugu.
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |