This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో సబ్జా గింజలు: ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

Pregnancy Best Foods
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 28, 2026
గర్భధారణ సమయంలో సబ్జా గింజలు: ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
Likes1 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • సబ్జా గింజలు లేదా బేసిల్ సీడ్స్ ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో పండుతాయి. వీటిని నీళ్లల్లో నానబెట్టి తినాలి, పీచు, క్యాల్షియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
  • గర్భధారణ సమయంలో సబ్జా గింజలు ఈస్ట్రోజెన్ స్థాయిల్ని తగ్గిస్తాయి, గర్భాశయ సంకోచాలను ప్రేరిపిస్తాయి, రక్తాన్ని పల్చగా చేస్తాయి. అందుకే గర్భవతులకు వీటిని ఎక్కువ తినమని సూచించరు.
  • మితంగా తీసుకుంటే సబ్జా గింజలు బ్లడ్ షుగర్ నియంత్రణ, మలబద్ధక నివారణ, ఎసిడిటీ ఉపశమనం, శరీరానికి చలువను అందించడం వంటి ప్రయోజనాలను కలిగిస్తాయి.
  • గర్భధారణ సమయంలో ఆరోగ్యానికి ఏ ఉత్పత్తులు సహాయపడతాయి? Explore our Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g.
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Compression Stocking Socks - S
Compression Stocking Socks - S
Rating4.5

గర్భవతి అయిన మహిళ ఆనందానికి, సంతోషానికి, ఉత్సాహానికి అవధులు ఉండవు. అయితే అనేక సందేహాలు కూడా ఉంటాయి. ఏం తినాలి? ఏం తినకూడదు? ఏం తింటే కడుపులో పెరుగుతున్న బిడ్డకు మంచిది? లాంటి సందేహాలు ఉంటాయి. చాలావరకు తరతరాలుగా పాటిస్తున్న సలహాలు, సూచనలన్నీ పెద్దల నుంచి వస్తుంటాయి. అయితే ఈ సలహాలు, సూచనల్లో విరుద్ధమైనవి ఉంటే అది గందరగోళానికి దారితీయొచ్చు. ఇలాంటి సందర్భంలో కాబోయే తల్లులకు ఏది మంచిదో, ఏది కాదో చెప్పేందుకు అనేక పరిశోధనలు తోడ్పడుతుంటాయి. ఈ ఆర్టికల్‌లో మేము భారతదేశంలోని వంటకాల్లో ఒకటైన బేసిల్ సీడ్స్ లేదా సబ్జా గింజల ప్రయోజనాలను, ప్రభావాలను మైక్రోస్కోపిక్ పరిశీలనలో వివరిస్తాం. గర్భవతులకు ఇది ఎంత మేలు చేస్తుందో, ఎలా హానికలిగిస్తుందో మీరు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోవచ్చు.

సబ్జా గింజలు అంటే ఏంటీ?

సబ్జా గింజల్ని బేసిల్ సీడ్స్, టుక్మరియా సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదిక్, చైనీస్ మెడిసిన్‌లో ఇవి ఓ భాగం. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పండుతాయి. సబ్జా గింజలు చూడటానికి నువ్వులలా కనిపిస్తాయి. కానీ నలుపు రంగులో ఉంటాయి. స్వీట్ బేసిల్ నుంచి సబ్జా గింజల్ని సంగ్రహిస్తారు. వీటిని నేరుగా తినడం కష్టం. నమలడానికి ఇబ్బందిగా ఉంటుంది. నీళ్లల్లో 15 నిమిషాలు నానబెట్టి తినాలి. సబ్జా గింజలు నీళ్లల్లో నానితే గింజల చుట్టూ గుజ్జు ఏర్పడుతుంది.

సబ్జా గింజల్లో పోషక విలువలు

100 గ్రాముల సబ్జా గింజలలోని పోషక విలువలు ఈ కింది విధంగా ఉంటాయి-

కేలరీలు

23

కార్బోహైడ్రేట్స్

2.65 గ్రాములు

పీచుపదార్థం

3.9 గ్రాములు

క్యాల్షియం

177 మిల్లీ గ్రాములు

పొటాషియం

462 మిల్లీ గ్రాములు

ఐరన్

3.17 మిల్లీ గ్రాములు

మొత్తం కొవ్వు

0.64 గ్రాములు

సోడియం

4 మిల్లీ గ్రాములు

చక్కెర

0.3 గ్రాములు

ఫోలేట్

68 ug

విటమిన్ బీ6

0.155 మిల్లీ గ్రాములు

రైబోఫ్లేవిన్

0.076 మిల్లీ గ్రాములు

నీరు

92.1 గ్రాములు

గర్భధారణ సమయంలో బేసిల్ సీడ్స్/సబ్జా గింజలు తినడం సురక్షితమేనా?

బేసిల్ సీడ్స్‌లో ముఖ్యమైన పోషకాలు ఉన్నప్పటికీ, గర్భవతిగా ఉన్నప్పుడు వీటిని తినమని సూచించరు. సబ్జా గింజలు శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తాయని వైద్య రంగ నిపుణుల్లో ఏకాభిప్రాయం ఉంది. ఇది గర్భధారణ సమయంలో కీలకమైన హార్మోన్ అని తెలిసిందే. గర్భవతి కడుపులోని పిండంలో నాళాలు ఏర్పడటానికి, శిశువుకు పోషకాలను బదిలీ చేయడానికి ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం శిశువు యొక్క పెరుగుదలకు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.

ఇంకా సీ సెక్షన్ డెలివరీకి ముందు సబ్జా గింజలు తీసుకుంటే, తీవ్ర రక్తస్రావం ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు కారణం సబ్జా గింజలు రక్తాన్ని పల్చగా చేస్తాయని , రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మది చేస్తుందని చెబుతుంటారు. కొన్ని జంతువులపై జరిగిన అధ్యయనాల్లో సబ్జా గింజలు వీర్యంపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తాయని, గర్భధారణలో సంకోచాలను ప్రేరిపిస్తుందని తేలింది. అందుకే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, గర్భవతి అయినా సబ్జా గింజల్ని అతిగా తినకపోవడమే మంచిది.

గర్భవతిగా ఉన్నప్పుడు బేసిల్ సీడ్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. బేసిల్ సీడ్స్‌ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అప్పుడప్పుడు రెండు స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. అయితే గర్భధారణ సమయంలో సబ్జా గింజల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే–
  2. బ్లడ్ షుగర్ కంట్రోల్– సబ్జా గింజలు లేదా బేసిల్ సీడ్స్ టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న గర్భవతులకు రక్షణగా నిలుస్తాయి. భోజనానికి ముందు సబ్జా గింజలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించవచ్చు.
  3. మలబద్ధక నివారణ– గర్భధారణ సమయంలో మహిళలకు మలబద్ధకం ఉండటం సాధారణమే. ఈ సమస్యకు సబ్జా గింజలు సహజమైన పరిష్కారంగా చెప్పొచ్చు. సబ్జా గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా, ఫైబర్ ఎక్కువగా ఉన్న సబ్జా గింజల్ని తినడం వల్ల ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోటాకు దోహదపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
  4. ఎసిడిటీ నుంచి ఉపశమనం– గర్భవతుల్ని వేధించే మరో సమస్య ఎసిడిటీ. సబ్జా గింజలు శరీరానికి చలువను అందిస్తాయి కాబట్టి, తక్షణ ఉపశమనాన్ని అందిస్తుందని, కడుపులో మంటను తగ్గిస్తాయని చెబుతుంటారు.
  5. వెంటనే చల్లబరుస్తుంది – కడుపులోని, శరీరంలోని వేడిని చల్లార్చేందుకు ఆయుర్వేదంతో పాటు ఇతర మెడిసిన్స్‌లో సబ్జా గింజల్ని ఉపయోగిస్తున్నారన్న విషయం తెలిసిందే. వేసవి సమయంలో మీరు గర్భవతిగా ఉన్నట్టైతే, అప్పుడప్పుడూ సబ్జా గింజలతో చేసిన స్మూతీ లేదా ఫలూదా తాగితే మండుతున్న వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

గర్భధారణ సమయంలో బేసిల్ సీడ్స్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

సబ్జా గింజలతో పలు రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గర్భిణీలపై ఇవి ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. కాబట్టి కాబోయే తల్లులు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.

  • బేసిల్ సీడ్స్ గర్భాశయ సంకోచాలకు కారణం అవుతాయి. అందుకే గర్భధారణ సమయంలో మొదటి ట్రమిస్టర్‌లో వీటిని తీసుకోకూడదు.
  • సబ్జా గింజల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అధిక వినియోగం అతిసారం లేదా పొత్తికడుపులో తిమ్మిరికి కారణం కావచ్చు.
  • బేసిల్ సీడ్స్ రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని పల్చగా చేస్తుంది. ఒకవేళ మీరు సిజేరియన్ డెలివరీ ప్లాన్ చేస్తున్నట్టైతే డెలివరీకి రెండువారాల ముందే వీటిని తినడం ఆపెయ్యాలి.
  • చివరగా, సబ్జా గింజలు గర్భవతుల్లో ఈస్ట్రోజెన్ స్థాయిల్ని తగ్గిస్తాయి. కడుపులో పిండం అభివృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.
  • ముఖ్యమైన విషయం ఏంటంటే, గర్భధారణ సమయంలో సబ్జా గింజల్ని మితంగా తీసుకోవడం అవసరం. అయితే బేసిల్ సీడ్స్ తినే విషయంలో మీ గైనకాలజీ డాక్టర్ సలహాలు తీసుకోవాలి.

తరచూ అడిగే ప్రశ్నలు

1. బేసిల్ సీడ్స్ తినడం పిండంపై ప్రభావం చూపిస్తుందా?

జవాబు: గర్భవతులు సబ్జా గింజలు తింటే ఈస్ట్రోజెన్ స్థాయిల్ని తగ్గిస్తుంది. ఈస్ట్రోజెన్ ఒక సమగ్ర హార్మోన్. ఇది పిండంలో రక్తనాళాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. బిడ్డకు కావాల్సిన పోషకాలను తల్లి నుంచి బదిలీ చేస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గితే, పుట్టబోయే బిడ్డపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే సబ్జా గింజలు కడుపులోని పిండానికి హాని కలిగించవచ్చు.

2. గర్భధారణ విషయానికి వస్తే, సబ్జా గింజలు తినడం వల్ల వేడి చేస్తుందా చలువనిస్తుందా?

జవాబు: గర్భధారణ విషయానికి వస్తే, సబ్జా గింజలు శరీరానికి చలువను చేస్తాయి.

3. బేసిల్ సీడ్స్ రుతుక్రమం సమయంలో ప్రయోజనకరంగా ఉంటాయా?

జవాబు: సబ్జా గింజలు ఋతుస్రావం క్రమబద్ధతను మెరుగుపరుస్తాయి. తిమ్మిరిని తగ్గిస్తాయి.

గర్భిణీ తల్లుల చేత నమ్మకంగా ఎంచుకోబడిన ఉత్పత్తులు

మీ గర్భధారణ ప్రయాణంలో పోషకాహారం, సురక్షితమైన ఎంపికలతో మీ ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు మద్దతు ఇచ్చే ఉత్పత్తులు.

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Compression Stocking Socks - S

Compression Stocking Socks - S

Compression Stockings for Varicose Veins | Reduces Swelling | Boosts Blood Circulation

460 Moms bought
₹364₹59939% Off
Rating
4.5
(31)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.