


Pregnancy Journey
3 November 2023 న నవీకరించబడింది
టాపియోకా(కర్రపెండలం పిండి) గురించి ఇది వరకెపుడూ వినలేదా? ఈ పేరే ఆశ్చర్యకరంగా ఉందా.. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రధాన ఆహారంగా పరిగణించబడుతుంది. టాపియోకా(కర్రపెండలం పిండి) అనేది కసావా రూట్స్ (వేర్లు) నుంచి లభిస్తుంది. దాని నుంచి పిండిపదార్థం(స్టార్చ్) సంగ్రహించబడుతుంది. గర్భవతిగా ఉన్నపుడు టాపియోకా(కర్రపెండలం పిండి) తీసుకోవడం వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారా? గర్భవతిగా ఉన్నపుడు టాపియోకా(కర్రపెండలం పిండి) తినొచ్చా, లేదా అనే విషయం మీద వైద్యులు, న్యూట్రీషియన్లు, ఆరోగ్య నిపుణులు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది గర్భవతులకు మంచిదని కొంత మంది అంటుంటే.. టాపియోకా(కర్రపెండలం పిండి) ఇతర పిండిలాగే ఉంటుందని ఇందులో శిశువు పెరుగుదలకు ఉపయోగపడే ఎటువంటి ప్రత్యేక పోషకాలు లేవని కొంత మంది చెబుతారు.
గోధుమలు, బియ్యం, మొక్క జొన్న వంటి పదార్థాల నుంచి వచ్చే పిండి కంటే ఈ పిండి చాలా రుచిగా ఉంటుంది. టాపియోకా(కర్రపెండలం పిండి) ఫైబర్‌కు మంచి మూలం. అంతే కాకుండా ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మీరు గర్భధారణ సమయంలో టాపియోకా(కర్రపెండలం పిండి) తీసుకోవచ్చా? లేదా అని ఆశ్చర్యపోతున్నారా.. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నపుడు కర్రపెండలం ఉపయోగించి ఎటువంటి వంటలు చేసుకోవచ్చు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
టాపియోకా (కర్రపెండలం పిండి)లో తక్కువ పరిమాణంలో ఉన్నా కానీ.. వివిధ రకాల వెరైటీ మినరల్స్, న్యూట్రియంట్స్ ఉన్నాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్స్, ఫోలేట్, మాంగనీస్, ఐరన్, విటమిన్ బి ఉన్నాయి. కానీ.. ఈ న్యూట్రియంట్స్ మరియు మినరల్స్ చాలా తక్కువ పరిమాణంలో ఉండడం వలన ఇవి గర్భవతులకు పూర్తి ప్రయోజనకరంగా ఉండవని చాలా రకాల థియరీస్ ఉన్నాయి. గర్భవతిగా ఉన్నపుడు టాపియోకా (కర్రపెండలం పిండి) ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు కాబట్టి గర్భవతిగా ఉన్నపుడు టాపియోకా (కర్రపెండలం పిండి) నుంచి పోషకాలను పొందడం కొంచెం కష్టమే.
ఎన్నో అధ్యయనాలు మరియు ఫలితాల నివేదిక ప్రకారం.. టాపియోకా (కర్రపెండలం పిండి) అనేది ఎక్కువ కేలరీలను కలిగి ఉండదు. టాపియోకా (కర్రపెండలం పిండి) కసావా (కర్రపెండలం) వేర్ల నుంచి తయారవుతుంది. తాజా కసావా(కర్రపెండలం) వేర్లు పోషకవిలువలను కలిగి ఉంటాయని పరిగణించబడింది. ఈ కారణం చేతే గర్భధారణ సమయంలో ప్రయోజకరంగా పరిగణించబడుతుంది. ఏదేమైనా ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉండవు. అందువల్ల కేవలం టాపియోకా (కర్రపెండలం పిండి) మాత్రమే తీసుకోవడం వలన గర్భధారణ సమయంలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. చాలా మంది ప్రజలు టాపియోకా(కర్రపెండలం పిండి)ను వివిధ రకాలుగా వండుతారు. వంట చేయడం వల్ల దీనిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. వంట చేసిన తర్వాత దీనిలో ఎంతో ప్రయోజకరమైన పోషకాలు ఉండవు. అందువల్ల గర్భిణీ స్త్రీకి పెద్దగా ప్రయోజకరంగా ఉండదు.
గర్భధారణ సమయంలో టాపియోకా (కర్రపెండలం పిండి) శరీరానికి మంచిదేనా అనే ప్రశ్నకు చాలా సులువుగా సమాధానం చెప్పొచ్చు. దీనిలో అధిక పోషక విలువలు లేనందున అధిక మోతాదులో తినవలసి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో అధిక మొత్తంలో టాపియోకా (కర్రపెండలం పిండి) తీసుకోవడం మంచిది కాదు. టాపియోకా(కర్రపెండలం పిండి)ను చిన్న మొత్తాల్లో తినాలి. అలా చిన్న మొత్తాల్లో గర్భవతులు కూడా తినొచ్చు. కానీ ప్రతి రోజు తినకూడదు. గర్భవతులు టాపియోకా (కర్రపెండలం పిండి) మీద మాత్రమే ఆధారపడకుండా అన్ని రకాల పోషక విలువలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.
గర్భధారణ సమయంలో టాపియోకా (కర్రపెండలం పిండి) తీసుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
టాపియోకా(కర్రపెండలం పిండి) గర్భవతులకు చాలా మంచిది. కానీ దానిని ఎక్కువగా తీసుకోవడం వలన గర్భవతులలో కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. గర్భవతిగా ఉన్నపుడు టోపియోకా(కర్రపెండలం పిండి) తీసుకునే ముందు దాని దుష్ర్పభావాల గురించి కూడా తెలుసుకోవాలి.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips


డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |