This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు, ప్రభావాలు

Pregnancy
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భధారణ సమయంలో క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు, ప్రభావాలు
Likes5 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • క్యాలీఫ్లవర్‌లో ఫోలేట్, విటమిన్ C, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించి, శిశువు ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడతాయి.
  • క్యాలీఫ్లవర్‌లోని అధిక ఫైబర్ గర్భధారణ సమయంలో సాధారణంగా వచ్చే మలబద్దకాన్ని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ప్రీక్లాంప్సియా వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
  • అతిగా తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, కోలిక్ నొప్పులు, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు రావచ్చు. కిడ్నీస్టోన్స్, గౌట్ ఉన్న వారు క్యాలీఫ్లవర్‌ను నివారించాలి.
  • గర్భధారణ పోషణ కోసం ఏ ఉత్పత్తులు సహాయపడతాయి? Explore our Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g.
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7

గర్భంతో ఉన్న వారి విషయానికి వస్తే.. వారు తినాల్సిన పదార్థాల గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. ఇటువంటివి తినడం వలన పోషకాలు బాగా అందుతాయని కూడా చెబుతారు. పోషకాలు అనేవి తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి అవసరం. పోషకాల కోసం సమతుల ఆహారం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు తరచూ సిఫారసు చేసే ఒక కూరగాయ కాలిఫ్లవర్. గర్భవతులు క్యాలీఫ్లవర్ తినొచ్చా? అని మీరు ఆశ్చర్యపోతుంటే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. గర్భధారణ సమయంలో క్యాలీఫ్లవర్​ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల గురించి గర్భందాల్చాలని చూస్తున్న మహిళల మనసులో ఉన్న ప్రశ్నలకు ఈ బ్లాగ్ సమాధానాలను అందిస్తుంది.

క్యాలీఫ్లవర్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

క్యాలీఫ్లవర్​లో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ C, ఫోలేట్, పొటాషియం వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇందులో యాంటీయాక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ వంటివి ఉంటాయి. ఇవి అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు. గర్భధారణ సమయంలో క్యాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే నిర్దిష్ట ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

  • ముందుగా చెప్పుకోవాల్సింది క్యాలీఫ్లవర్​లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. న్యూరల్ ట్యూబ్ లోపాలతో పాటుగా పుట్టుకతో వచ్చే అనేక లోపాలను ఇది నివారిస్తుంది. కావున ఇది చాలా ముఖ్యం.
  • అంతే కాకుండా క్యాలీఫ్లవర్​లో విటమిన్ C అధిక మోతాదులో ఉంటుంది. ఈ విటమిన్ గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యమైనది. ఇది కడుపులో ఉన్న శిశువును ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ ఏర్పడేందుకు కూడా విటమిన్ C అవసరం. కొల్లాజెన్ అనేది శిశువు దంతాలు, ఎముకలు, రక్తనాళాల అభివృద్ధికి ఇది చాలా అవసరం.
  • క్యాలీఫ్లవర్​లో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడతాయని అంతా భావిస్తారు. ఇది ప్రీక్లాంప్సియా వంటి పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశాలను తగ్గిస్తుంది.
  • చివరగా చెప్పాల్సిందేంటంటే.. క్యాలీఫ్లవర్​లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కావున ఇది మలబద్దకాన్ని తగ్గించడంలో ప్రయోజకారిగా ఉంటుంది. మలబద్దకం అనేది గర్భధారణ సమయంలో చాలా సాధారణం.
  • కావున మీరు గర్భవతిగా ఉంటే.. మీ డైట్​లో క్యాలీఫ్లవర్​ను చేర్చుకోండి. ఇది మిమ్మల్ని, మీ బిడ్డను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు క్యాలీఫ్లవర్ తినడం సురక్షితమేనా?

గర్భవతిగా ఉన్నపుడు క్యాలీఫ్లవర్ తినడం సురక్షితమేనా అని గర్భవతి కావాలని ఆశించే వారు ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతారు. కానీ గర్భధారణలో క్యాలీఫ్లవర్ తినడం మంచిదే. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ కూరగాయను వారు తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాలీఫ్లవర్​ను ఏ ఆహారానికి జోడించినా అది ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. గర్భవతులు పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.

క్యాలీఫ్లవర్ అనేది గర్భధారణకు మంచిది. అంతే కాకుండా చాలా మంది గర్భిణీ స్త్రీలు ఎటువంటి సమస్యలు లేకుండా సురక్షితంగా క్యాలీఫ్లవర్​ను తినవచ్చు. ఏదేమైనా ఇది తినాలని అనుకుంటున్న గర్భవతులకు ఫుడ్ ఎలర్జీ ఉంటే వారు కేవలం క్యాలీఫ్లవర్​ అనే కాకుండా ఏదైనా కొత్త ఆహారాన్ని తీసుకునే ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి. అదీకాక క్యాలీఫ్లవర్​ను అధికంగా తినడం వల్ల గ్యాస్ మరియు ఉబ్బరం సమస్య ఏర్పడుతుంది.

అధిక మోతాదులో క్యాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే ప్రభావాలు (దుష్ప్రయోజనాలు)

అతిగా క్యాలీఫ్లవర్​ను తినడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు:

  • గ్యాస్
  • ఉబ్బరం (కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం)
  • పిత్తులు (గ్యాస్ వల్ల వచ్చే సమస్య)
  • కోలిక్ పెయిన్స్ (పదునైన నొప్పి)
  • కడుపునొప్పి
  • యాసిడ్ రిఫ్లక్స్ (మీ కడుపులో యాసిడ్ ఉత్పత్తి అయి.. మీ అన్నవాహిక గుండా గొంతు వరకు ప్రయాణిస్తుంది. గుండెల్లో మంట వస్తుంది)
  • జీర్ణక్రియ సమస్యలు
  • టాక్సోప్లాస్మోసిస్ వంటి ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులు

గర్భధారణ సమయంలో క్యాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే ప్రమాదాలు

క్యాలీఫ్లవర్ అనేది మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక కూరగాయ. ఇది గర్భిణీ స్త్రీలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ అధిక మోతాదులో క్యాలీఫ్లవర్​ను తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ అనేది క్రూసిఫరస్ కుటుంబానికి చెందినది. కాబట్టి ఇందులో సల్ఫర్​కు సంబంధించిన సమ్మేళనాలు ఉంటాయి. దీనిని అతిగా తినడం వల్ల గ్యాస్ మరియు ఉబ్బరం సమస్యలు వస్తాయి. ఇది కోలిక్(పదునైన నొప్పి) నొప్పులకు కూడా దారితీస్తుంది.

అంతే కాకుండా కిడ్నీస్టోన్స్, గౌట్​ వచ్చే ప్రమాదం ఉన్న గర్భిణీ స్త్రీలు క్యాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ప్యూరిన్​లు ఉంటాయి. మూడో త్రైమాసికం చివర్లో ఉన్న గర్భవతులు క్యాలీఫ్లవర్ తినడం వల్ల వచ్చే గ్యాస్ నొప్పిని పురిటినొప్పులు అనుకొని పొరబడతారు. అందుకోసమే గర్భిణీ స్త్రీలు అధిక మోతాదులో క్యాలీఫ్లవర్​ తినకూడదు.

క్యాలీఫ్లవర్​ను మీ డైట్​కు ఎలా యాడ్ చేయాలి?

క్యాలీఫ్లవర్​ను వండేందుకు సిద్ధం చేసేటపుడు నీటిలో బాగా కడగాలి. దాని కాండం మరియు ఆకులను పూర్తిగా కత్తిరించాలి. అలాగే దాని తలను(పువ్వు ఉండే ప్రదేశం) చిన్న చిన్న భాగాలుగా చేయాలి. ఆ కత్తిరించిన తల భాగాలను వేడి నీటిలో 5-10 వరకు మరిగించాలి. ఇలా చేయడం వల్ల దానిలో ఉన్న మలినాలు క్లీన్ అవుతాయి.

గర్భవతులు ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్​ను తాము తినే ఆహారంలో సైడ్ డిష్​గా ఉపయోగించొచ్చు. అంతే కాకుండా ఉడికించిన క్యాలీఫ్లవర్ నుంచి రుచికరమైన క్రీమ్ సూప్​​ను కూడా వారు తయారు చేసుకోవచ్చు. ఇది చప్పగా ఉండే క్యాలీఫ్లవర్ ఆవిరితో చేసిన దానిలా కాకుండా భలే టేస్ట్​గా ఉంటుంది. కాలిఫ్లవర్​ను చిన్నముక్కలుగా చేసి ఆపై రైస్​తో రుచికరమైన సైడ్ డిష్ చేయొచ్చు. అంతే కాకుండా క్యాలీఫ్లవర్​ను తయారు చేసేందుకు ఎన్నో ఆధునిక మార్గాలు ఉన్నాయి.

మీరు క్యాలీఫ్లవర్​ను తినేటపుడు ఎటువంటి సేఫ్టీ చర్యలు తీసుకోవచ్చు?

  • మీరు గర్భం ధరించి ఉన్న సమయంలో క్యాలీఫ్లవర్​​ను తినడం మంచిదే అయినప్పటికీ.. మీరు దానిని తినే ముందు కొన్ని భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు క్యాలీఫ్లవర్​ను ఎన్నుకునేటపుడు గోధుమ రంగు మచ్చలు లేకుండా తెలుపు లేదా క్రీమ్​ కలర్​లో ఉండే దానిని ఎంచుకోండి. చిన్నగా ఉండే వాటిని దూరం పెట్టండి. ఆకులు వాడిపోయినా లేదా పసుపురంగులో ఉన్న వాటిని తీసుకోకండి.
  • వండేటపుడు క్యాలీఫ్లవర్​ను పూర్తిగా ఉడికే వరకు ఉంచండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. దీని ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా రాకుండా ఉండాలంటే దానిని పూర్తిగా ఉడికించాలి. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు క్యాలీఫ్లవర్ తినేటపుడు దానిని బాగా నమలండి.
  • మిగతా ఆహారాల్లాగే క్యాలీఫ్లవర్​ను కూడా తక్కువ మోతాదులో తినండి. గర్భధారణ సమయంలో క్యాలీఫ్లవర్​ తీసుకోవడం గురించి మీకు ఏవైనా సందేహాలుంటే మీ వైద్యుడిని సంప్రదించండి.

గర్భిణీ తల్లులు నమ్మే పోషణ సహచరులు

సమతుల ఆహారంతో పాటు, మీకు మరియు మీ బిడ్డకు అవసరమైన పోషకాలను అందించే ఉత్పత్తులు మీ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి.

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.