


Pregnancy Journey
11 December 2025 న నవీకరించబడింది
గర్భం దాల్చినపుడు చాలా రకాల పోషకాహారాలు అవసరం. గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండడం కోసం సరైన సమతుల్య పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది మహిళలకు కంకులు (కార్న్) వారి డైట్లో అద్భుతమైన భాగం కావొచ్చు. కంకులు (కార్న్) గర్భిణీ స్త్రీలకు కావాల్సిన శక్తి, విటమిన్స్, మరియు మినరల్స్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి. గర్భధారణ సమయంలో కంకులు (కార్న్) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఈ ఆర్టికల్‌లో అందించాం. మీ ప్రినేటల్ డైట్లో కంకులు (కార్న్) చేర్చుకోవడం ఎందుకు అవసరమో దాని వలన కలిగే ప్రయోజనాలు, పొటెన్షియల్ రిస్క్స్ గురించి మేము మీకు వివరిస్తాం. సమతుల్య మరియు పోషకాలు ఉన్న ఆహారం కోసం గర్భధారణ సమయంలో స్వీట్ కార్న్‌ని ఉపయోగించడం గురించి మరింత తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
గర్భధారణ సమయంలో కంకులు(కార్న్) తినడం సురక్షితమేనా? కాదా అనే విషయంలో చాలా మంది చాలా రకాలుగా వాదనలు వినిపిస్తున్నారు. కొన్ని సోర్సెస్ ఇది మంచిదని చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం తినకూడదని వాదిస్తున్నారు. గర్భధారణ సమయంలో స్వీట్ కార్న్ తినొచ్చా? అని మీరు ఆశ్చర్యపోతున్నట్లయితే.. ఇక్కడ సమాధానం ఉంది.
కార్న్ అనేది కామన్ ఫుడ్ ఎలర్జీ కారకం. గర్భిణీ స్త్రీలు తమకు ఎలర్జీ కలిగించే ఆహారాలను తినొద్దని డాక్టర్లు సిఫారసు చేస్తారు. అంతే కాకుండా కంకులలో (కార్న్) ఫ్యూమోసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తుంది. అయినప్పటికీ కంకులలో ఫ్యూమోసిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి పిల్లలకు హాని చేసే స్థాయిలో ఉండవు. మీరు గర్భంతో ఉన్నపుడు కార్న్‌కు దూరంగా ఉండాలా అని మీకు సందేహం తలొత్తచ్చు. మీకు కనుక కార్న్ ఎలర్జీ ఉంటే.. లేదా పుట్టబోయే బిడ్డకు వచ్చే లోపాల గురించి ఆందోళన చెందుతుంటే.. జాగ్రత్త వహించడం, కార్న్ తినకుండా ఉండడం ఉత్తమం. మీకు ఎటువంటి ఆందోళనలు లేకుంటే కార్న్ తినడం సురక్షితం.
[Oi1] కంకులు (కార్న్) అనేది ఎన్నో పోషకాలు ఉన్న ఆహారం. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణ డైట్లో ఇది ఖచ్చితంగా ఉండాలి. దీనిలో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కార్న్‌లో కొవ్వులు, కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. అంతే కాకుండా దీనిలో విటమిన్ C మరియు B6 ఉంటాయి.
100 గ్రాముల కార్న్‌ను సర్వ్ (వడ్డించినపుడు) పోషక విలువలు కింది విధంగా ఉంటాయి.
గర్భధారణ సమయంలో స్వీట్ కార్న్‌తో సహా.. రోజుకు ఆరు సార్లు ధాన్యాలు స్త్రీలు తినాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ధాన్యాలు సులభంగా జీర్ణమయ్యేలా ఉడికించుకోవాలి లేదా ప్రాసెస్ చేయాలి.
కంకుల(కార్న్) వలన గర్భిణీ స్త్రీలకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి:
గర్భధారణ సమయంలో కంకులు(కార్న్) ఎందుకు తీసుకోకూడదనే విషయాలు ఇక్కడ ఉన్నాయి.
మీరు గర్భవతిగా ఉండి మీ ఆహారంలో మొక్కజొన్నను చేర్చుకోవాలని మీరు ఆలోచిస్తుంటే.. అప్పుడు మీరు గుర్తుంచుకుని పాటించాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
ఎవరైనా గర్భిణీ స్త్రీ తినే ఆహారాన్ని కంకులు (కార్న్) మరింత పోషకమయంగా మారుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో అవసరమైన అనేక విటమిన్లు, పోషకాలు ఉంటాయి. అయినా కానీ అధిక చెక్కెర కంటెంట్ మరియు జీర్ణసమస్యల వంటి వాటి వల్ల ఎవరైతే గర్భిణీ స్త్రీలు కంకులు(కార్న్) ను తమ ఆహారానికి జోడించుకోవాలని భావిస్తారో వారు వైద్యుడితో మాట్లాడడం ఉత్తమం. గర్భధారణ సమయంలో కంకులు(కార్న్) తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. అటువంటి సమయంలో గర్భవతి కావాలని ఆశించే తల్లులు పూర్తి సమాచారంతో నిర్ణయం తీసుకునేందుకు వీలు పడుతుంది.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips


స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి? దీన్ని ఎలా నయం చేయాలి?

గర్భధారణ సమయంలో పచ్ఛళ్లు | ప్రయోజనాలు & ప్రమాదాలు

సెప్సిస్: లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు ప్రమాదాలు (Sepsis: Reasons, Symptoms, Treatment and Problems in Telugu)

గర్భధారణ సమయంలో ఇంటి వద్దనే శిశువు హృదయ స్పందనను ఎలా తనిఖీ చేయాలి

గర్భవతులలో బంప్ సైజు పెద్దగా లేదా చిన్నగా ఉండడం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? (Everything You Need to Know About Carrying High & Carrying Low in Telugu)

నవజాత శిశువులో వెక్కిళ్లు సాధారణమా? (Are Hiccups Normal in New-Born Babies?)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |