
సారాంశం




అత్యంత పోషక విలువలున్న పండ్లలో అంజీర్ ఒకటి. అంజీర్ లేదా అత్తి పండ్లను వాటి అద్భుతమైన రుచి కోసం మాత్రమే కాకుండా వాటిలోని అమూల్యమైన పోషకాల కోసం కూడా పండిస్తారు. నిజానికి అత్తి పండ్లు ఫలాలు కావు, ఇవి పుష్పాలు. పండిన అంజీర్ పూర్తిగా వికసించిన పుష్పం, ఇంకా దీనిని పూర్తిగా కాసిన పండుగా అనుకోవచ్చు. అంజీర్‌ను తాజాగా లేదా ఎండబెట్టి కూడా తినవచ్చు. దీనిని పొడి అంజీర్ల రూపంలో సంవత్సరాల తరబడి భద్రపరచుకొంటారు. అత్తిపండ్లు ఆరోగ్య ప్రయోజనాలెన్నో కలిగి ఉన్నాయి. ఇది మల బద్ధకం నుండి ఉపశమనం ఇస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మంచి నిద్రను ఇస్తుంది, పైల్స్‌ను(మొలలు) నయం చేస్తుంది, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది, చక్కని యాంటీఆక్సిడెంట్ స్వభావం కలిగిఉంది, రక్తహీనతకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది, చర్మాన్ని మృదువుగా చేస్తుంది, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది రక్తపోటు ను నియంత్రిస్తుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల, ఇది ఆరోగ్యకరమైన ఇంకా బలమైన ఎముకల పెరుగుదలకు దోహదపడుతుంది. గర్భధారణ సమయంలో అత్తి పండ్లను ఎక్కువగా తినడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు. గర్భధారణ సమయంలో అత్తి పండ్ల నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోవడానికి చదవడం కొనసాగించండి.
గర్భధారణ కాలములో అత్తిపండ్లను తీసుకోవడం సురక్షితమే. కానీ అతిగా తింటే ఏదైనా హాని తలపెట్టవచ్చు, కాబట్టి సరైన మోతాదును అనుసరించి తీసుకోవాలి. గర్భధారణ సమయంలో అత్తి పండ్లను తినాలనుకుంటే.. అవసరమైన వాటికంటే ఎక్కువ మోతాదులో తీసుకొనే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
అత్తిపండ్లు కాల్షియం, కాపర్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలే కాక మంచి విటమిన్లను అందించే సహజ వనరు. ఇవి సహజమైన ఐరన్ ను సమృద్ధిగా అందిస్తాయి. ఈ సూక్ష్మపోషకాలు ఆరోగ్యకరమైన జుట్టు ఇంకా చర్మాన్ని, మేధస్సును పెంచడంలో ప్రయోజనకారిగా ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో, అత్తి పండ్లను తీసుకోవడానికి ఇంకా ఆరోగ్యకరమైన ఇంకా తెలివిగల బిడ్డలు జన్మించడానికి అవినాభావ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. గర్భధారణ సమయంలో అత్తిపండ్లు A, K, E, D మరియు B వంటి అన్ని అవసరమైన విటమిన్‌లను అంచివ్వడమే కాకుండా ఆరోగ్యకరమైన బరువు పెరిగేందుకు సహాయపడతాయి. అత్తి పండ్లు ఆరోగ్యకరమైన పిండం ఎదుగుదలతో సంబంధం కలిగి ఉంది. ఎముకల ఆరోగ్యం, రక్త వృద్ధి ఇంకా మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది. తాజావి లేదా ఎండిన అత్తిపండ్లు కూడా అంతే మొత్తంలో పోషకాలను అందిస్తాయి. కాబట్టి ఎండిన అత్తి పండ్లను కూడా తినడానికి ఎలాంటి సంశయం అవసరం లేదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో సపోటా ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్(దుష్ప్రభావాలు)
గర్భధారణ సమయంలో తల్లిపై ఇంకా కడుపులోని శిశువుపై తీవ్ర ప్రభావం చూపే రక్తహీనతను, అత్తి పండ్లను తినడం ద్వారా అధిగమించవచ్చు. అత్తిపండ్లు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇంకా ప్రేగు కదలికలను సాఫీగా జరిగేందుకు అవసరమైన సహజ ఫైబర్‌లను అందిస్తాయి. అత్తిపండ్లలోని సహజ చక్కెరల కారణంగా.. ఇది గర్భధారణ సమయంలో ఎక్కువగా ఉండే గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో అత్తిపండ్లు, తీపి తినాలనే కోరికలను తీర్చడంలో సహాయపడుతుంది. గర్భధారణలో అంజీర్ ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి వీలైనప్పుడు వాటిని తీసుకోవాలి. గర్భధారణ సమయంలో కలిగే మార్నింగ్ సిక్‌నెస్ నుండి ఉపశమనం కలిగిస్తాయని తెలుస్తోంది. అత్తి పండ్లలో ఉండే తేనె లాంటి తీపితనం మనస్సుకి ఇంకా నోటికి మధురమైన ప్రభావాన్ని ఇస్తుంది.
అత్తి పండ్లలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉండటం వలన తరచుగా కొందరు అతిగా తినడంతో.. అవి దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. ఎంత మొత్తంలో తీసుకోవాలో ఇంకా శరీరం ఎంతవరకు తట్టుకోగలదో తెలుసుకోవడం కీలకం. అత్తిపండ్లను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
మీకు ఇది కూడా నచ్చుతుంది: 10 మధుమేహ లక్షణాలు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి జీవనశైలి మార్పు
1. తాజా అత్తి పండ్లు జూన్ నుండి అక్టోబర్ వరకు అందుబాటులో ఉంటాయి. పై తొక్క మృదువుగా ఇంకా నునుపుగా ఉన్న తాజా అత్తి పండ్లను గమనించాలి. కొద్దిగా పుల్లగా ఉన్నా లేదా దుర్వాసన వేస్తున్న అత్తి పండ్లు త్వరగా పాడైపోతాయి. పూర్తిగా పండిన అత్తి పండ్లను పూర్తిగా వికసించినట్లు కనిపిస్తుంది. అత్తి పండ్ల మూతి దగ్గర ఆకుపచ్చ రంగుతో మొదలై ముదురు గోధుమ రంగుతో ఉంటుంది.
2. వాటి తాజాదనాన్ని అలాగే ఉంచడానికి, వాటిని ఫ్రిజ్‌లోని అత్యంత చల్లని ప్రదేశంలో ఉంచాలి.
3. ఫ్రిజ్ లోపల నిల్వ చేయాలనుకొంటే.. వాటిని మూసివున్న దబ్బలలో నిల్వ చేయకూడదు. మూతలేని దబ్బలలోనే ఉంచాలి.
4. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన అత్తి పండ్లు 6-7 రోజులు మాత్రమే తాజాదనాన్ని నిలుపుకోగలవు. కాబట్టి వాటిని తాజాగా ఉన్నప్పుడే తినాలి.
5.అత్తిపండ్లను ఇంట్లోనే ఎండబెట్టుకోవచ్చు లేదా వివిధ రకాల లేదా ఎండిన అత్తి పండ్లను మార్కెట్ నుండి నేరుగా పొందవచ్చు. ఎండిన అత్తి పండ్లను గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచినపుడు అవి ఏడాది పొడవునా తాజాగా ఇంకా తినదగిన స్థితిలో ఉంటుంది.
తాజా అత్తి పండ్లను దానిమ్మ ఇంకా నారింజతో కలిపితే మరింత రుచిగా ఉంటాయి. వాటిని ఆలివ్ ఆయిల్, తేనె, నిమ్మ మరియు ఉప్పుతో చేసిన డ్రెస్సింగ్‌తో సలాడ్‌లకు జోడించుకోవచ్చు. వాటిని ఎండిన లేదా తాజా అత్తి పండ్ల వలె అల్పాహారం లాగా తృణధాన్యాలకు జోడించుకోవచ్చు. అదనపు రుచి కోసం ఎండిన అత్తి పండ్లను వెచ్చని పాలు ఇంకా సువాసన కోసం కాస్త వెనిల్లా ఎసెన్సును జోడించి తినవచ్చు.
Anjeer during pregnancy in telugu, can pregnants eat Anjeer in telugu, Is it safe to eat Anjeer during pregnancy in telugu, Anjeer benefits during pregnancy in telugu, Anjeer side effects during pregnancy in telugu.
అత్తిపండ్లతో పాటు, మీ ప్రెగ్నెన్సీ ప్రయాణంలో అవసరమైన పోషకాలను అందించే ఉత్పత్తులు మీకు మరింత బలాన్ని ఇస్తాయి.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest




Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress




Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each




Organic Aloe Vera (300 ml)
Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |