This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

అప్పుడే పుట్టిన పసిపాప/బాబుని చలికాలం అంతటా వెచ్చగా ఉంచటానికి మీకు ఎన్ని కార్డిగాన్స్(బేబీ స్వెటర్స్‌) అవసరమవుతాయి?

Written by - Nayana MukkamalaLast updated: Nov 3, 2023
అప్పుడే పుట్టిన పసిపాప/బాబుని చలికాలం అంతటా వెచ్చగా ఉంచటానికి మీకు ఎన్ని కార్డిగాన్స్(బేబీ స్వెటర్స్‌) అవసరమవుతాయి?
Read time13 min

ఇప్పుడిప్పుడే మీ పాపాయి ప్రపంచంలోకి రాగానే చలికాలం మొదలైందనే ఆందోళనలో ఉన్నారా? మీ బిడ్డని వెచ్చగా ఉంచడానికి కొత్త మార్గాలని వెతకడం ఇబ్బందికరంగా ఉందా? అయితే సరే.. ఇక మీరు అంతగా ఆలోచించాల్సిన పనిలేదు. ఈ చలికాలంలో మీ పాప లేదా బాబు బయట ఆడినా లేదా ఇంట్లో ఆడినా ఇక ఖఛ్చితంగా ఏ జబ్బు చేయకుండా లేదా జ్వరం రాకుండా వారి ఆటలని ఆనందించవచ్చు! మీ బిడ్డ యొక్క చలికాలం బట్టలని ఎలా సిద్ధం చేసి పెట్టుకోవాలి అలాగే ఎప్పటినుండి ఇవన్నీ చేయాలి అనేవాటి గురించి గైడ్ లైన్స్‌ని ఈ ఆర్టికల్లో చదవండి!

వాతావరణం తీవ్ర పరిస్థితులలో ఉన్నప్పుడు.. మీరు చలికాలం మొత్తం మీ బిడ్డని వెచ్చగా ఉంచేందుకు ఒక ఐదు కార్డిగాన్లని లేదా అప్పుడే పుట్టిన బేబీల స్వెట్టరుని కొనవచ్చు. అంతే కాకుండా.. వచ్చే కొన్ని నెలల్లో మీ బిడ్డ అనుకోని విధంగా పరిమాణంలో ఎదుగుతూ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా కార్డిగాన్లు కొని పేర్చుకోకుండా ఉండటం మంచిది. కొన్ని నెలలలో పనికిరాకుండా పోయే ఒకే సైజు కార్డిగాన్లు ఎక్కువగా కొనటంలో కూడా అర్థం లేదు. మీరు కార్డిగాన్ని కొనడానికి వెళ్ళే ముందు.. బయట వాతావరణం హఠాత్తుగా మారవచ్చు అందుకని బేబీకి తగిన బట్టలు వేయడం అవసరం అని గ్రహించండి. అంతే కాకుండా మీరు కారులో వెళ్తున్నప్పుడు మీ బిడ్డ మందపాటి బట్టలని లేయర్లుగా వేసుకున్నా లేదా మందపాటి దుప్పటిలో పడుకోబెట్టినా అదనంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే, మీ పిల్లలని చలికాలంలో చలి నుండి కాపాడుకోవటానికి ఏమేం చేయవచ్చో తెలుసుకోవడానికి మీరు తప్పనిసరిగా ఈ ఆర్టికల్ని చదవాలి.

పసిపిల్లలకి చల్లని వాతావరణం హాని చేస్తుందా?

పిల్లలకి చిన్న చిన్న వాతావరణ మార్పులు కూడా పడవని మీరు అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. మీకు ఉపయోగపడే మంచి సలహా ఏంటంటే.. అదే వాతావరణ పరిస్థితులలో మీరు ఎన్ని లేయర్ల బట్టలు వేసుకుంటారో దానికి అదనంగా ఇంకొక పొర దుస్తులు మీ బేబీకి వేయాలి. అంతేకాదు, మీ బిడ్డ కళ్ళని కప్పేయకుండా వెచ్చని ఊలు టోపీతోపాటు, మిటెన్లు ఇంకా సాక్సులు కూడా వేయవచ్చు. ఒకవేళ మీ బేబీని స్ట్రోలర్ లో బయటకి తీసుకువెళ్ళాలని అనుకుంటుంటే, మీరు బయట చలి కారణంగా వివిధ చర్మసమస్యలు రాకుండా మీ బిడ్డ సున్నితమైన చర్మాన్ని రక్షించటానికి వెచ్చని స్లీపింగ్ బ్యాగు కూడా జతచేయవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: చలికాలంలో మీ పిల్లలకు ఎన్ని లేయర్స్ ఉన్న దుస్తులు వేయాలి? నిపుణుల సలహాలు ఇవే

మీ బిడ్డని చల్లని వాతావరణం నుండి ఎలా కాపాడవచ్చు?

ఒకవేళ మీ బేబీ ఏడ్చినా, చికాకుగా కన్పించినా, కళ్లల్లో నీళ్ళు వచ్చినా, అలాంటి ఏ లక్షణాలు చూపించినా దాని అర్థం బహుశా బయట చలి వారికి పడట్లేదు అని కావచ్చు. ఇంకా హైపోథెర్మియా సంకేతాలైన పెదవులు నీలంగా మారటం, జ్వరం, వణుకు రావటం అలాగే మొత్తంగా పాలిపోయి కన్పించటం ఇవన్నిటిని మీ బిడ్డలో గమనిస్తూ ఉండటం కూడా ముఖ్యం. ఒకవేళ మీకు పై లక్షణాలలో ఏ ఒక్కటి కన్పించినా, కొన్ని మందపాటి చలికాలం బట్టలని కొనటం ఇంకా మీ చలికాలం ప్రయాణాలని తగ్గించుకోటానికి ఇది సరైన సమయం! ఒకవేళ మీరు ఎప్పుడూ మంచు పడే ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, మంచులో ఆడుకునేటప్పుడు కూడా మీ బేబీని వెచ్చగా, సౌకర్యంగా ఉంచే బట్టలని వెతకడం కష్టం కావచ్చు. మీరు ఇక్కడ లెక్కలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మంచులో తడిసినప్పుడు కూడా పొడిగానే ఉండే బట్టలని వేసుకోవటానికి వెతకడం. మీ బిడ్డ కోసం నీటికి తడవని ప్యాంట్లు ఇంకా నీటిలో తడవని జాకెట్ తో సహా మంచి నాణ్యమైన స్నోసూట్ కూడా కొనడానికి ఆలోచించవచ్చు. అంతేకాకుండా, మిటెన్లు, టోపీని కూడా జతచేయండి. అవి కూడా వాటర్ ప్రూఫ్ వే అయి ఉండాలని గుర్తుంచుకోండి!

అదేవిధంగా ఇంట్లో ఆడుకునేటప్పుడు మీ బిడ్డ వేసుకునే బట్టల గురించి కూడా మీరు ధ్యాస పెట్టాలి. చలికాలంలో ఇంట్లో ఆడుకునేటప్పుడు కూడా మీ బేబీ అదనంగా మరొక లేయరులా పసిపిల్లల స్వెట్టరు సెట్లని వేసుకునేలా చూడాలి. మామూలుగా అయితే.. ఒకవేళ మీకు రెండు పొరల్లో ఒకదానిపై మరొకటి వేసుకునే బట్టలు సౌకర్యంగా అన్పిస్తే, మీ బిడ్డకి మూడవ సెట్ దుస్తులు కూడా అవసరం కావచ్చు. మీ పాప లేదా బాబుకి ఒంట్లో చాలా చల్లగా లేదా వెచ్చగా ఉందో లేదో చెక్ చేయటానికి మీ చేతిని వారి వీపు మీద ఉంచి చూడటం ఒక మంచి పద్ధతి. వీపు వెచ్చగా ఉండాలి మరీ చెమటగా ఉండకూడదు. ఇవేకాకుండా, మీ బేబీకి రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా ఒళ్ళు వెచ్చబడవచ్చు, ప్రత్యేకించి మీరు వారి ఒంటిని మరీ బట్టల లేయర్లతో ఎక్కువగా నింపేస్తే అలా జరగవచ్చు.ఇది ఆఖరికి SID లేదా ఆకస్మిక శిశు మరణ సిండ్రోంకి కారణమవుతుంది. అందుకని, మీరు మీ బిడ్డని పడుకునేటప్పుడు పడుకునే సంచీలో (స్లీపింగ్ సాక్) జిప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ జిప్ వారి చంకల కింద వరకే వస్తుంది, ఏ రకంగానూ మొహం లేదా మెడను కప్పివేయలేదు. మందంగా ఉండే ఊలు దుప్పటికన్నా ఇది మంచి ప్రత్యామ్నాయం. మందంగా ఉండే దుప్పట్లని వాడటం వలన కూడా ఆకస్మిక శిశు మరణ సిండ్రోం వచ్చే రిస్కులు కూడా పెరగవచ్చు.

పడుకునేటప్పుడు ఒళ్ళు వెచ్చబడటం యొక్క కొన్ని పెద్ద లక్షణాలు తడి జుట్టు, శ్వాస సక్రమంగా లేకపోవటం, అలాగే బుగ్గలు ఎర్రబడటం. ఒకవేళ మీరు మీ బిడ్డలో ఈ లక్షణాలు గమనిస్తే, వెంటనే వారి ఒంటి మీద నుండి ఒక పొర బట్టలని తీసివేయటం ముఖ్యం. అదే సమయంలో.. మరీ అదే పనిగా చెక్ చేయనవసరం కూడా లేదు. ఒకవేళ మీ బేబీ అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉండి, పై లక్షణాలు ఏవీ కన్పించకపోతే, మీ బిడ్డని సరైన ఉష్ణోగ్రత వద్దనే ఉంచినట్లు అర్థం.

కారులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు మీ బిడ్డని ఎలా కాపాడవచ్చు?

చాలామంది డాక్టర్లు మామూలుగా మందంగా ఉండే బంటింగ్ కోట్లు లేదా హాయిగా ఉండే స్లీపింగ్ బ్యాగులని వాడటం అవసరం లేదని సూచిస్తారు. ప్రత్యేకంగా కారు సీట్లలో ఇవి వాడితే ప్రమాద సమయంలో కుదించుకుపోయి బేబీకి మరింత ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. ఈ ఉత్పత్తులు పెద్దగా మరీ అవసరమైనవి కూడా కాదు. అసలు మీ బిడ్డని చలికాలానికి తగ్గట్టుగా సరైన బట్టలలో ప్రత్యేకంగా తయారుచేస్తే వీటి అవసరమే రాదు. కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు మీ బిడ్డకి చాలా లేయర్స్ ఉన్న దుస్తులు వేయవచ్చు. బకిల్ పెట్టేసిన తర్వాత ఒక మందపాటి దుప్పటిని వారి పైన కప్పవచ్చు. కానీ గుర్తుంచుకోండి, వారికి సరిగ్గా సరిపోయే దుప్పటినే కొనటం ముఖ్యం. మరీ పెద్దదిగా ఉండకూడదు.. అలాగని మరీ చిన్నదిగా ఉండకూడదు. నిజానికి వాటిని మీ బేబీ అలాగే వారిని పట్టి ఉంచే బకిల్ పట్టీల మధ్య ఇరుక్కుపోకుండా ఉండేలా చూసుకోండి. మీ బిడ్డని సౌకర్యవంతంగా ఉంచడానికి పూర్తి చేతుల స్లీవ్స్ ఉన్న వన్సీని కూడా ఉపయోగించవచ్చు. మీ ప్రాంతంలో ఉండే వాతావరణ రకాన్ని బట్టి కాటన్‌తో తయారుచేసిన స్వెట్టరుని కూడా మీ బట్టలలో చేర్చవచ్చు. ఒకవేళ మీ కారులో హీటరుని బిగించి ఉంటే, కారు వెచ్చగా మారిన తర్వాత మీరు మీ బిడ్డపై కప్పిన మందపాటి దుప్పటిని లేదా కార్డిగాన్ని తీసివేయవచ్చు. మందపాటి దుప్పటి బదులుగా, మీరు మీ బిడ్డని చలి నుండి కాపాడటానికి ఒకటి లేదా రెండు పెద్ద సైజుల కోటుని కూడా ఉపయోగించవచ్చు.

మీ బేబీ కోసం కొనడానికి మీరు నిజానికి ఎన్ని కార్డిగాన్లని ప్లాన్ చేయవచ్చు?

కార్డిగాన్ మెటీరియల్ రకాన్ని ఇంకా ఎన్ని కార్డిగాన్లు కొనాలి అన్నది నిర్ణయించడానికి చాలా అంశాలు ప్రధాన పాత్రని పోషిస్తాయి. వాతావరణ పరిస్థితులు అలాగే మీ బేబీ ఆరోగ్యం వంటివి పరిగణనలోకి తీసుకుంటే.. ఆఖరి నిర్ణయం తీసుకునేముందు చాలా అంశాలని గుర్తుపెట్టుకోవాలి! అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రస్తుత కాలంలో ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ ఉన్నట్టు. అందుకని మీ బిడ్డ కోసం చలికాలం బట్టలు పేర్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనండి! అదనపు లేయరు బట్టల జతని కొంటే చాలని నిర్ణయించుకున్నప్పటికీ, అప్పుడే పుట్టిన పసిబిడ్ద విషయానికి వస్తే అదే కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. అందుకని సాధారణంగా మీ పసిబిడ్డకి ఎన్ని లేయర్ల బట్టలు తప్పనిసరిగా అవసరం అన్న సంఖ్య స్పష్టంగా తెలుసుకుంటే మీకే సులభమవుతుంది. మీ బేబీ కోసం కార్డిగాన్స్ కొనేముందు వచ్చే ఇబ్బందులని నివారించడానికి మీరు ఈ కింద లిస్టులో ఇవ్వబడిన ముఖ్యమైన కొన్ని అంశాలని గమనించండి.

1. లేయర్స్ ఉన్న దుస్తుల కంటే స్నగ్స్ ను ఎంచుకోండి!

ఎన్ని లేయర్ల బట్టలు అవసరం అన్నది నిర్ణయించడం గజిబిజిగా ఉన్నా కూడా, ఒంటికి హత్తుకుని ఉండే స్నగ్లని ఎంచుకోవడం సాధారణంగా చాలా మంచిది. ఇవి పసిబిడ్డలకి సరైన ఎంపికలు. మరింత వెచ్చదనం అలాగే చలి నుండి కాపాడుకోటానికి మీరు స్నగ్ మీద అదనంగా కార్డిగాన్‌ను కూడా జతచేయవచ్చు. అలా మొత్తం మీద నాలుగు లేయర్ల బట్టల జతలు అవుతాయి. లోదుస్తులు, థర్మల్ దుస్తులు, ఇంకా ఈ కార్డిగాన్ ఉంటాయి.

2. మీ బిడ్డని వెచ్చని టోపీ, మిటెన్లు ఇంకా సాక్సులతో కవర్ చేయండి

మిటెన్లు, టోపీలు అలాగే సాక్సులు, నిజానికి చలికాలంలో బట్టలకి జతగా కావలసిన ముఖ్యమైన యాక్సెసరీలు కావచ్చు. మారుతున్న ఉష్ణోగ్రతల వలన మీ బిడ్డ చేతులు, పాదాలు అలాగే తలపై చాలా హానికరమైన ప్రభావాలు ఉండవచ్చు. అందుకని, ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది, అప్పుడు మీ బేబీ చర్మం ఫ్రాస్ట్ బైట్‌కి గురవకుండా ఉంటుంది.

3. మంచు కురిసే విషయమై ముందే ప్రిపేర్ అవ్వండి!

ఒకవేళ మీరు తరచుగా మంచు కురిసే ప్రాంతంలో నివసిస్తుంటే.. మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తగినన్ని లేయర్లలో స్నో ఫ్రూఫ్ అలాగే సులభంగా తడవని బట్టల జతలు చేర్చుకోవడం మర్చిపోకండి. ప్రత్యేకించి, మంచు కురిసే కాలంలో మీ బేబీని బయటకి తీసుకెళ్ళినప్పుడు ఇది లాభదాయకంగా ఉంటుంది.

4. మందపాటి ఉన్ని కోటు వేసేముందు మెత్తని లోపలి దుస్తులు వేస్తే ఇక తయారు చేయడం పూర్తయినట్టే

మీ బిడ్డ చర్మం నాజూకుగా అలాగే సున్నితంగా ఉంటుంది. అందుకని దురదలు పెట్టే ర్యాషెస్ లేదా ఇతర చర్మ సమస్యలు రాకుండా నివారించడానికి, మీ అప్పుడే పుట్టిన పాప కోసం స్వెట్టరు కింద ఒక జత మెత్తని బట్టలని వేయటం మంచిది.

అప్పుడే పుట్టిన పసిబిడ్డలకి లేయర్లుగా బట్టలు వేయడం ఎందుకు ముఖ్యం?

నిజానికి, చలికాలంలో పుట్టే పిల్లలకి లేయర్లలో బట్టలు వేయాలి. అంతే కాకుండా.. ఆ లేయర్ల ప్రకారం బట్టలని మీ బిడ్డకి మరీ వేడి లేదా వణుకు పుట్టేంత చలిని కూడా ఇవ్వకుండా ఖచ్చితంగా చూసుకుని వేయాలి.అందుకని, మీరు అదనపు లేయర్ బట్టలుగా మెత్తని సాగే గుణంతో మెడ వున్న టర్టిల్ నెక్ షర్టుని వేయవచ్చు. ఈ ప్రకారం మీ బిడ్డకి బట్టలు వేయడంతోపాటు, తీసివేయడం కూడా సులభమవుతుంది. మొదటి కొన్ని నెలలలో, చలికాలం సమయంలో మీ బేబీ కోసం నాలుగు కార్డిగాన్లని కొనవచ్చు. టర్టిల్ నెక్ బట్టల సంగతికి వస్తే, అదనపు బట్టల లేయర్‌గా మీరు వాటిని ఒక ఐదింటిని కొనవచ్చు.

మీరు ఒకవేళ చలికాలంలో మీ బేబీతో కలిసి పిక్నిక్‌కి వెళ్తున్నట్లయితే, తనకి వన్సీ వేయటం గురించి ఆలోచించవచ్చు. మీరు వెళ్ళే సమయంలో వాతావరణం బట్టి, బట్టల మెటీరియల్ని బట్టి కార్డిగాన్ని పైన వేయవచ్చు. వాతావరణం మరీ చల్లగా ఉన్నట్లు అన్పిస్తే, మీరు మందంగా ఉంటూనే మరింత సౌకర్యంగా ఉండే కార్డిగాన్ని ఎంచుకోవాలి. మీ అందాల పసిపాపని వెచ్చగా కప్పివుంచే హుడీ లేదా సౌకర్యవంతమైన జాకెట్లలో కూడా ఒకటి ఎంచుకోవచ్చు!

మీ బిడ్డ కోసం ఎన్ని చలికాలం బట్టలు కొనాల్సి ఉంటుంది?

మామూలుగా అయితే కేవలం ఒక జాకెట్ కొంటే సరిపోతుంది, కానీ కొన్నిసార్లు మీ బిడ్డ వాంతులు చేసుకునో లేదా వారి బట్టలపై తినే పదార్థాలని ఒలకబోసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇంకో జాకెట్‌ని అదనంగా కొని ఉంచుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా.. ప్రత్యేకించి కారులో ప్రయాణిస్తున్నప్పుడు, మీ బిడ్డ ఎలా ఉందనే ధ్యాస ఉంచుకోవాలి. బేబీని వారి సీటులో ఉంచేముందే వారి మీద నుండి బరువైన బట్టలని తీసివేయండి.

మీరున్న ప్రాంతంలో వాతావరణం గడ్డకట్టే ఉష్ణోగ్రతలకి పడే అవకాశం ఉంటే.. మీరు మీ బిడ్డని గడ్డకట్టే చలిగాలికి వారి చర్మం ఏ రకంగానూ తగలకుండా ఉండేలా బట్టలతో పూర్తిగా కప్పివేయవచ్చు. పొడవైన జిప్పులు ఉండే తేలికపాటి జాకెట్లని వెతకండి. మీరు కొనగలిగే సామర్థ్యం అలాగే సౌలభ్యత ఆధారంగా బట్టలనుండి విడిగా వచ్చేసే డిటాచబుల్ బూట్లు లేదా బట్టలతోనే అతుక్కుని ఉండే బూట్లని కూడా కొనేవాటికి జతచేయవచ్చు. చల్లని ఉష్ణోగ్రతల నుండి మెరుగ్గా రక్షించబడటానికి ముడవగలిగే పాదాలు అలాగే పూర్తి స్లీవ్స్‌తో‌ ఉండే చాలా రకాల స్నోసూట్లు ఈ కాలంలో అందుబాటులో ఉన్నాయి.

1. మిటెన్లు/సాక్సులు/టోపీలు

మీ బిడ్డ యొక్క తల, చెవులు, చేతులు అలాగే పాదాలని కప్పి వుంచడం చాలా ముఖ్యం. ఉష్ణోగ్రతలు గడ్డకట్టేలా ఉన్నప్పుడు, ఇన్సులేట్ చేసే (చలి తగలకుండా ఆపివేసే) అదే సమయంలో ఒంటికి హాయిగా గాలి పీల్చుకునేలా ఉండే మెటీరియల్ ఉన్న బట్టలని కొనవలసి ఉంటుంది. మీ బేబీని వెచ్చగా ఉంచడానికి మిటెన్లు, సాక్సులు కూడా కొనవచ్చు. పిల్లలు మామూలుగా వారి వేళ్లని కొరుకుతూ లేదా చొంగ కారుస్తూ ఉంటారు. అది వారి బట్టలని తడి చేయవచ్చు. అందుకని అవసరమైతే ఉండటానికి అదనంగా కార్డిగాన్ల లేదా స్వెట్టరు జతని పెట్టుకోండి. మీ బేబీ కోసం సుమారుగా ఆరు జతల ఊలు సాక్సులు అలాగే రెండు టోపీలని కొనవచ్చు. అంతేకాకుండా, మీ బిడ్డ కోసం మూడు జతల మిటెన్లు కూడా కొనవచ్చు.

2. చలికాలం బూట్లు

చాలా చల్లగా ఉన్న రోజుల్లో, మీరు మీ బేబీ పాదాలకి వెచ్చని బూట్లని వేయవచ్చు. దానికోసం మీ బిడ్డకి నాలుగు జతల బూట్లని కొనవచ్చు. ఇవన్నీ ఎక్కువగా అన్పించినప్పటికీ, వచ్చే కొన్ని నెలలలో వేగంగా ఎదగబోయే మీ బిడ్డకి ఇవన్నీ అనుకూలమైనవి.

3. పైజమాలు

చలికాలంలో, అప్పుడే పుట్టిన బిడ్డ కోసం ఊలు స్వెట్టరుతో లేయర్లని చేయడానికి పైజమాలు ఖఛ్చితంగా మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. పడుకునేటప్పుడు, సౌకర్యంగా ఉండే పొడవాటి జిప్పులు, చిన్న చిన్న బటన్లు ఉండే పైజమాలని కొన్నిటిని మీ బేబీకి తొడగవచ్చు. ఈ పైజమా లేయరుపై స్వెట్టరు లేదా కార్డిగాన్ని వేయవచ్చు. డైపరు మార్చాల్సి వచ్చినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా సులువుగానే మార్చగలిగేలా ఉంటుంది.

4. మంచు బూట్లు

మంచుబూట్ల సంగతికి వస్తే, మీరు మరీ తీవ్రంగా మంచు కురిసే ప్రాంతంలో నివసిస్తూ ఉంటున్నట్లయితే తప్ప ఇది తప్పనిసరి ప్రత్యామ్నాయం కానే కాదు. కాకపోతే మీ బిడ్డ, బట్టలకి అతుక్కుని వచ్చే మంచు బూట్లతో ఉండే వన్సీ స్నోసూట్‌ని వేసుకునే అవకాశం ఉంది.ఈ మంచుబూట్లు మీ బేబీ పాదాలని వెచ్చగా ఉంచుతాయి. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇప్పటికీ మంచు బూట్లని కొనాలి అనుకుంటుంటే, ఇది లాజికల్ విషయమే కాబట్టి ఒక జత కొనవచ్చు. ఇన్సులేటడ్ అలాగే తేలికపాటి మంచుబూట్లని కొనండి.

చివరిమాట

కొన్నిసార్లు.. మీ బిడ్డ ఒళ్ళు వేడెక్కడం లేదా వణకటం నివారించడానికి సరైన సంఖ్యలో కార్డిగాన్స్ కొనాల్సి ఉంటుంది. ఇవన్నీ నిజానికి చాలా గందరగోళంగా ఉన్నప్పటికీ, మీరు అన్ని సమయాల్లో మీ బేబీని చాలా కార్డిగాన్ల లేయర్లతో నింపనక్కర్లేదు. మీరు లోపల పల్చని బట్టలు వేసి పైన మందపాటి కార్డిగాన్‌తో లేయర్లు చేయవచ్చు. వాతావరణాన్ని బట్టి మీరు గరిష్టంగా రెండు కార్డిగాన్స్ వేయవచ్చు. మళ్ళీ గుర్తుచేస్తున్నాం, ఈ పరిస్థితిలో అతిపెద్ద రూలు ఏంటంటే మీరు ఎన్ని లేయర్ల బట్టలైతే వేసుకుంటారో మీ బిడ్డకి దానికన్నా ఒక్క లేయరు బట్టలు అదనంగా వేయాలి. మొదటి కొన్ని నెలలలో, మీరు దీని కోసం ఐదు కార్డిగాన్లని కొనవచ్చు.

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.