


Baby Bump
3 November 2023 న నవీకరించబడింది
10 వారాల గర్భిణీ పొట్ట చాలా పెద్దగా కనిపించదు. కానీ కొంతమంది ఈ సమయంలో గర్భాన్ని గమనించడం ప్రారంభించవచ్చు. 10వ వారం దాటగానే చుట్టూ పొత్తికడుపు దిగువ భాగం చాలా గుండ్రంగా మారుతుంది. చాలా మంది తల్లులు తమ గర్భంలో మొదటి మూడు నెలలు దాటగానే పొట్ట కొద్దిగా కనిపిస్తుంది. మరికొందరికి కొంత సమయం తరువాత కనిపించడం మొదలవ్వవచ్చు. ఈ సమయానికి పిండం పండిన నారింజ పరిమాణానికి పెరుగుతుంది. కాబట్టి 10 వారాల ప్రెగ్నెన్సీలో పొట్ట కనిపిస్తుంది. ఇక్కడ పొట్ట ప్రతి వారం పెరుగుతూనే ఉంటుంది. ఇది పిండం ఆరోగ్యకరమైన పెరుగుదల కలిగి ఉందనే విషయాన్ని సూచిస్తుంది.
పొట్ట పరిమాణం, ఆకారం సాధారణంగా ఒక తల్లి నుండి మరొక తల్లికి మారుతూ ఉంటాయి. అందువల్ల గర్భధారణ సమయంలో బేబీ బంప్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారంలోనూ.. పరిమాణంలోనూ ఉండవచ్చు. 10 వారాల ప్రెగ్నెన్సీలో బేబీ బంప్ విషయంలో ఈ కింది కారకాలు కీలక పాత్ర పోషిస్తాయి:
అందువల్ల మహిళలు తమ బంప్‌ని ఇతర గర్భవతులతో పోల్చుకొని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మనిషి మనిషికి మారుతూ ఉంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: 10-వారాల ప్రెగ్నెన్సీ పొట్ట పరిమాణం: ఏది సాధారణం? ఏది కాదు?
తరచుగా సినిమాల్లో చక్కని బేబీ బంప్ ఉంటుంది. పుష్టిగా, ముందుకు పొడుచుకు వస్తుంది. అయితే నిజానికి చాలా మంది మహిళలకు బేబీ బంప్ అలా ఎత్తుగా కనిపించదు. విశాలమైన నడుము ఉన్న స్త్రీలకు గర్భం యొక్క ప్రారంభ దశలో పొట్ట పెద్దగా అభివృద్ధి కాకపోవచ్చు. వారికి పక్కలలోను, పొత్తికడుపు క్రింద ఉన్న కొవ్వు కణజాలం పొట్ట కొట్టొచ్చినట్లు కనిపించకుండా చేస్తుంది. అయితే శరీరంలో తక్కువ కొవ్వు ఉన్న స్త్రీలకు సాధారణంగా ఇతరులకన్నా ముందుగానే బేబీ బంప్ వస్తుంది.
ఒక మహిళకు ఇంతకు ముందు ఎన్నిసార్లు గర్భం ధరించింది అనేది కూడా 10వ వారంలోని గర్భం పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఇంతకు ముందు గర్భవతి అయిన స్త్రీకి 10వ వారంలో పెద్దగా ఉండే, గుండ్రని పొట్ట కనిపిస్తుంది. అలాగే రెండవ నెల, మూడవ నెల వచ్చేసరికి అది పెద్దదిగా ఉండవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇంతకు ముందే గర్భవతులు అయిన స్త్రీలకు పొత్తికడుపులో మృదువైన కండరాలు ఉంటాయి. అందువల్ల వేగంగా సాగుతుంది. ఇది పొట్ట పెద్దగా పెరగడానికి సహాయపడుతుంది.
కవలలు లేదా ముగ్గురు శిశువులను మోస్తున్న గర్భిణీ స్త్రీలకు సహజంగానే 10 వారాల తర్వాత పొత్తికడుపు బాగా పెరుగుతుంది. 10 వారాల ప్రెగ్నెన్సీ మార్క్ దాటిన స్త్రీలు తమ పొట్ట పరిమాణం, ఆకృతి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గర్భవతి అనే భావన చాలా ప్రత్యేకమైనది. అది పెద్ద పొట్టతో మాత్రమే రాదు.
10 వారాల గర్భిణీ పొట్ట గురించి మీరు తెలుసుకోవలసినవి ఇవే. సాధారణంగా, గర్భం దాల్చిన మొదటి 10 వారాల తర్వాత డాక్టర్‌ని తరచుగా కలుస్తుంటారు. అందువల్ల నిరంతరం గర్భాన్ని పర్యవేక్షిస్తున్నందువల్ల ఆందోళన చెందడానికి ఏమీ లేదు. అయినప్పటికీ వారి పొట్ట లోపల పెరుగుతున్న పిండం మంచి ఆరోగ్యంగా పెరిగేలా చూసుకోవడానికి తమను తాము మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
pregnancy belly, pregnant belly size at 10 weeks in telugu, What does a 10-week pregnant belly look like in English, What does a 10-week pregnant belly look like in Hindi, What does a 10-week pregnant belly look like in Bengali, What does a 10-week pregnant belly look like in Tamil
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |