
ఎవరో సరిగ్గానే చెప్పారు.. ఇంటిమేట్ హైజీన్ వాష్ (ప్రయివేటు భాగాలను శుభ్రపరిచే ద్రవం) అనేది మహిళలకు మంచి స్నేహితురాలు లాంటిదని. తేమతో కూడిన పరిస్థితుల వల్ల యోనికి అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, దీనికున్న ఆమ్లత్వం ఇలాంటి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. ఈ ఆమ్ల పొర.. బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి అనేక సూక్ష్మజీవులతో పోరాడేందుకు సహాయపడుతుంది. మహిళలకు అత్యంత అనుకూలగా ఉండే ఇంటిమేట్ వాష్ ఎలా ఉండాలి అంటే అది pH స్థాయిని 3.5 నుండి 4.5 మధ్య ఉంచేలా సహాయాకారిగా ఉండాలి. ఇంటిమేట్ వాష్ యోనిని వాసన, దురద, పొడిబారడం ఇంకా చికాకు లాంటి సమస్యల నుంచి దూరం చేసేందుకు సహాయపడటమే కాకుండా, యోని సంపూర్ణ భధ్రతకు ఇంకా సంపూర్ణ రక్షణకు తోడ్పడుతుంది.
ఇంటిమేట్ హైజీన్ వాష్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. మీరు అత్యుత్తమమైనవి ఎంచుకొనేందుకు మీ డాక్టరు సలహాలు కూడా మీకు సహాయపడతాయి. ఇది భద్రత పట్ల మీకు అవగాన కల్పిస్తుంది. లాభానష్టాలను అర్థం చేసుకొనేందుకు మీకు సహాయపడుతుంది. ఇలాంటి అంశాలలోనే కొన్ని ఏమిటంటే:
ఇంటిమేట్ వాష్ కొనేటప్పుడు ధర ఎంతనేది పట్టించుకోవలసిన విషయమేమీ కాదు. తయారీకి వాడిన పదార్థాల పరంగా కొన్నిసార్లు చౌకైన వస్తువులు కూడా బాగానే పనిచేస్తాయి. సహజ పదార్థాలు ముఖ్యమైనవి. కృత్రిమ రంగు లేదా కృత్రిమ సువాసనలు కలపకుండా సహజ పదార్ధాలతో తయారు చేసినవి మన మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కృత్రిమ పదార్ధాలతో చేసిన వస్తువులను కొనడం వల్ల అంటువ్యాధులు, వాపు లేదా టాక్సిన్స్ వృద్ధి చెందుతాయి. ఇది మీకు సౌకర్యాన్నిఇవ్వడం కంటే హానినే ఎక్కువ కలిగిస్తుంది.
మాయిశ్చరైజర్ లేని ఉత్పత్తులతో పొడిబారడం వంటి సమస్య ఉంటుంది. అన్ని ఇంటిమేట్ హైజీన్ వాష్‌లలోని పదార్థాలు సున్నితమైన భాగాలను తేమగా ఉంచేలా చేయలేవు. ఇవి దురద, ఇంకా పొడిబారడం కలిగించవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో మహిళలు ఎక్కువగా చెమట పట్టడం వల్ల ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి సమయాల్లో చెమట, ధూళిని శుభ్రపరిచేందుకు వాడే ఉత్పత్తులు సున్నితమైన ప్రాంతాల్లో మరింత పొడిబారడానికి కారణమైతే, అది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందువల్ల, ఇంటిమేట్ వాష్‌లలో గ్లిజరిన్ లేదా మాయిశ్చరైజింగ్ పదార్థాలు కలిగి ఉన్నటువంటి వాటిని ఎంచుకోవడం తప్పనిసరి.
ఇంటిమేట్ హైజీన్ వాష్ ఉత్పత్తుల వాడకం అంతగా లేని సమయాల్లో వాటికి బదులుగా సబ్బులను వాడేవారు. ఆ కాలంలో ఈ వాష్‌లు ఇంకా తయారు కాలేదు. లేదా వాటి గురించి ప్రచారం లేదు లేదా అప్పటికి విరివిగా ఉపయోగంలో లేవు. అందువల్ల, ఇలాంటి ఉత్పత్తుల తయారీ మొదలైన తర్వాత, వీటి అత్యంత ముఖ్యమైన ఉపయోగం pHను సక్రమంగా ఉండేలా చూడటమే కాక దానిని సమతుల్యం చేయాలి. ఇంకా ఆమ్ల పొరలో మార్పులు రాకుండా చేయాలి. కాబట్టి, సబ్బు రహిత ఉత్పత్తులను ఉపయోగించడం ఎంతో అవసరం. ఇది పొడిబారనివ్వదు. చికాకు, మంట లాంటి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
ముందే చెప్పినట్లుగా, సహజ పదార్ధాలు మంచి ఫలితాలనిస్తాయి. కొన్ని ఇంటిమేట్ హైజీన్ వాష్‌లు కృత్రిమ సుగంధాలను కలిగి ఉంటాయి. ఇవి టాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల చర్మం నల్లబడటం కూడా జరుగుతుంది.
ఇంటిమేట్ హైజీన్ వాష్‌ను కొన్ననప్పుడు ఈ అంశాలు చెక్ చేయాలి. ఇంకా మహిళల కోసమైతే ఒకటికి రెండుసార్లు తరచి తరచి చూడాలి. అందువల్ల, మహిళలకు మైలో కేర్ ఇంటిమేట్ వాష్ వంటి అత్యుత్తమ ఇంటిమేట్ వాష్, ఆ భాగంలోని క్రిములను, చెమటను మాత్రమే కాక, టాక్సిన్‌లను తొలగిస్తుంది. ఇది సరైన pHని, ఆమ్ల పొరను కొనసాగించడానికి సహాయపడుతుంది. ఇది కాక వేరే ఉత్పత్తులు వాసన కోసం కృత్రిమ సుగంధాలను వాటికి కలుపుతాయి. ఇవి ఇప్పటికే ఉన్న టాక్సిన్స్‌తో కలసి మంచి చేయడం కంటే హానినే ఎక్కువ కలిగిస్తాయి.
ఇక దీనిని ఎలా వాడాలో తెలిపేదే తర్వాతి భాగం. ఇంటిమేట్ వాష్‌ను వాడేటప్పుడు, గుర్తుంచుకోవాల్సిన మొదటి అంశం ఎప్పుడూ దీనిని అతిగా ఉపయోగించకూడదు. వ్యక్తిగత పరిశుభ్రతలో ఇది కూడా ఒక భాగం కాబట్టి అన్నీ సమతుల్యంగా ఉండాలి. అతిగా వాడితే, అది ఆ ప్రాంతాన్ని పొడిబారేలా చేసి చికాకు పుట్టేలా చేస్తుంది; ఇలాగే చాలా కాలం అతిగా ఉపయోగిస్తే మరింత హానిని కలిగిస్తుంది. అందువల్ల సరైన సలహాలు తీసుకున్న తర్వాతే, దానిని మితంగా వాడటం అవసరం. మలద్వారంలోని క్రిములు ముందు భాగానికి చేరకుండా ఉండేందుకు దీనిని ముందు నుండి వెనుకకు కొద్ది మొత్తంలో అప్లయ్ చేయాలి. కొద్దిగా తీసుకొని సరిగ్గా వాడిన తర్వాత, దానిని పూర్తిగా కడిగివేయాలి. పూర్తిగా శుభ్రపరచిన తర్వాత, మెత్తని టవల్‌తో తేమ లేకుండా పొడిగా తుడిచేయాలి. ఇలా వారంలో కొన్ని రోజులు లేదా స్నానం చేసినప్పుడల్లా చేయవచ్చు. నెలసరి సమయంలో, మీకు పీరియడ్స్ ఉన్నప్పుడు సహజంగా జరిగే శుభ్రపరిచే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇంటిమేట్ వాష్‌ని మానుకోవాలి.
పీరియడ్స్ సమయంలో ఆరోగ్యకరమైన వ్యక్తిగత పరిశుభ్రత కోసం సహజంగా శుభ్రపరిచే పదార్థాలు ఇంకా మంచి ఆహారంతో పాటు ప్యాడ్‌లు లేదా టాంపోన్‌లను మార్చడం చాలా అవసరం.
పీరియడ్స్ సమయంలో ఇంటిమేట్ వాష్‌కి బదులు గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవచ్చు. అంతేకాకుండా, టవల్‌తో అక్కడ ఉన్న తేమ లేకుండా చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లాంటివి మీ ఈ సమయాన్ని సాఫీగా గడిచేందుకు సహాయపడుతుంది.
Intimate Wash for women in telugu, What is Intimate Wash for women in telugu, Benefits of Intimate Wash in telugu, Can pregnants use Intimate Wash in telugu, Side effects of using Intimate Wash in telugu, How to select Intimate Wash in telugu.
Yes
No


















Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me
Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .
Baby kicks KB Marta hai Plz tell mi
PCOD kya hota hai
How to detect pcos
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |