hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Teething arrow
  • మీ శిశువు యొక్క మొదటి సంవత్సరంలో దంతాలు తోమడానికి దశల వారీ గైడ్ (Step-by-Step Guide to Brush Your Baby's Teeth During the First Year of Life in Telugu) arrow

In this Article

    మీ శిశువు యొక్క మొదటి సంవత్సరంలో దంతాలు  తోమడానికి దశల వారీ గైడ్ (Step-by-Step Guide to Brush Your Baby's Teeth During the First Year of Life  in Telugu)

    Teething

    మీ శిశువు యొక్క మొదటి సంవత్సరంలో దంతాలు తోమడానికి దశల వారీ గైడ్ (Step-by-Step Guide to Brush Your Baby's Teeth During the First Year of Life in Telugu)

    26 July 2023 న నవీకరించబడింది

    కొత్తగా బాల దంతాలు (పాల దంతాలు) రావడంతో, మీ బిడ్డ చిరాగ్గా మరియు పిచ్చిగా ప్రవర్తించవచ్చు. ఈ ప్రక్రియ రాబోయే రెండు సంవత్సరాలలో మీ శిశువు యొక్క చిగుళ్ళను దంతాలతో (పళ్ళతో) నింపడానికి సహాయపడుతుంది. బాల దంతాలు పెద్దవాళ్ళయ్యాక వచ్చే దంతాల కోసం ప్లేస్‌హోల్డర్‌లుగా పనిచేస్తాయి. కాబట్టి దంతాలు బయటకు రావడం చాలా ముఖ్యం. సరైన పునాది లేకుంటే మీ బిడ్డ తినడానికి మరియు స్పష్టంగా మాట్లాడటానికి ఇబ్బంది పడవచ్చు. కాబట్టి శిశువు దంతాలలో క్రిములు (క్యావిటీ) లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

    ఇప్పుడే ప్రారంభించండి (Start Immediately)

    మొదటి నుండి మీ శిశువు చిగుళ్ళను జాగ్రత్తగా చూసుకోండి. మృదువైన కాటన్ గుడ్డను ఉపయోగించి పిల్లల చిగుళ్ళను రోజుకు రెండుసార్లు తుడవడం ద్వారా మీరు అలా చేయవచ్చు. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత మరియు నిద్రవేళకు ముందు తుడవండి. ఇలా చెయ్యడం వల్ల బ్యాక్టీరియా నోటిలో అతుక్కోకుండా నిరోధిస్తుంది మరియు దంతాలకు హాని కలిగించే ప్లేక్ ఏర్పడకుండా చేస్తుంది.

    బ్రషింగ్ రొటీన్ (Brushing Routine in Telugu)

    మొదటి దంతాలు బయటకు రావడం ప్రారంభించినప్పుడు, మీరు టూత్ బ్రష్‌కు మారవచ్చు. చిన్న తల, పెద్ద హ్యాండిల్ మరియు మృదువైన బ్రిసిల్స్ కూడిన ఒకదాన్ని ఎంచుకోండి. దంతాలు బయటకు రావడం మొదలెట్టాక, మీరు సాధారణంగా బియ్యం గింజల పరిమాణంలో ఉన్న టూత్‌పేస్ట్‌ను చిన్న మొత్తంలో ఉపయోగించవచ్చు మరియు దంతాల ముందు మరియు వెనుక సున్నితంగా బ్రష్ చేయవచ్చు. ఈ పని చేస్తున్నప్పుడు రంగు మారడం లేదా దంత క్షయం యొక్క ఏవైనా సంకేతాల కోసం వెతుకుతూ ఉండండి. మీకు ఏవైనా సమస్యలు కనిపిస్తే, దంతవైద్యుడిని వెంటనే సంప్రదించండి. దంతాల సంరక్షణ, దంతాలు మరియు బొటనవేలు చప్పరించడం వంటి సమస్యల గురించి వారు మీకు సరైన సలహా ఇవ్వగలరు.

    దంతాల సమస్యలు (Teething Problems in Telugu)

    అన్ని బాల దంతాలు బయటకు రావడానికి రెండు సంవత్సరాల వరకు పట్టవచ్చు. వాటి ఆవిర్భావ ప్రక్రియను టీతింగ్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియ మీ శిశువుకు అసౌకర్యం కలిగించడమే కాకుండా చిరాకు తో పాటు చిగుళ్ళు వాపు మరియు సాధారణం కంటే అధిక శరీర ఉష్ణోగ్రత వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. నొప్పిని తగ్గించడానికి, మీరు మీ బిడ్డ టీతింగ్ రింగ్స్ ను నమలడానికి అనుమతించవచ్చు. మీ బిడ్డ వాటితో ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉండటానికి, రింగ్‌లో ఏదైనా విరిగిపోయే చిన్న భాగాలు ఉన్నాయో లేదో జాగ్రత్తగా చెక్ చేయండి. మీరు మీ శిశువు చిగుళ్లను శుభ్రమైన వేళ్లతో రుద్దవచ్చు మరియు దంతాల కోసం వైద్యులు సూచించిన సమయోచిత నొప్పి నివారణలను కూడా వాడవచ్చు.

    డెంటల్ కావిటీస్ నివారించడం (Preventing Dental Cavities in Telugu)

    కావిటీస్ అభివృద్ధిని నివారించడానికి, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను నివారించండి ఎందుకంటే ఇది దంత క్షయానికి దారితీస్తుంది. మీ శిశువు యొక్క టీతింగ్ రింగ్స్ పై చక్కెర లేదా తేనె వాడకాన్ని కూడా నివారించండి.

    Tags:

    Teething rings precautions in telugu, teething rings in telugu, brushing routine for babies in telugu, brushing routine in telugu, dental cavities in babies in telugu.

    Baby Toothbrush - Green - Pack of 1

    Silicone Finger Toothbrush & Tongue Cleaner | Relieves Teething Discomfort | BPA Free

    ₹ 59

    4.4

    (2825)

    11048 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.