


Baby Sleep Management
3 November 2023 న నవీకరించబడింది
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా అమ్మానాన్నలైన వారిని వేధించేది నిద్రలేని రాత్రులు. అప్పుడే పుట్టిన పసిపిల్లలని నిద్రపుచ్చడం చాలా కష్టం. నిపుణులు అప్పుడే పుట్టిన పిల్లలు రోజుకు 16-20 గంటలు నిద్రపోవాలని అంటున్నారు, కానీ పసిపిల్లలకి చాలాసార్లు మెలకువ వచ్చేస్తుంది, ప్రధానంగా వారు ఆకలితో లేస్తారు.
అది బిడ్డని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కొందరు మంచంపైకి ఎక్కగానే వెంటనే పడుకుంటారు, అయితే మరికొంతమంది పిల్లలు గాఢంగా పడుకోలేరు, వారితో ఇంకాస్త శ్రమ పడుతుంది. కానీ సహనంగా ఇంకా ప్రాక్టీసుతో, మీరు మీ బిడ్డ రాత్రంతా పడుకునేలా సాయం చేయవచ్చు. కొత్తగా అమ్మానాన్నలైన వారందరూ అనుసరించాల్సిన 10 టిప్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి:
రోజూ ఒకే టైములో పడుకునే దినచర్య పసిబిడ్డకి అది పడుకునే సమయం అని సిగ్నల్ అందిస్తుంది. ఈ దినచర్యలో స్నానం చేయించడం, కథ చదివి వినిపించడం లేదా లాలీపాట పాడడం వంటివి ఉండవచ్చు.పసిపిల్లలు రాత్రంతా లేవకుండా నిద్రపోయేలా చేయడానికి ఒక రొటీన్ సహాయపడుతుంది. కానీ ఏదైనా అలవాట్లలాగానే, పడుకునే రొటీన్ ఏర్పడటానికి కూడా సమయం పడుతుంది, కాబట్టి ఓపికగా ఇంకా రోజూ ప్రయత్నిస్తూ ఉండండి.
మీ బిడ్డను చేతుల్లో ఉయ్యాలలూపుతూ పడుకునేలా చేసి, ఆ తర్వాత వారిని మంచంపై పడుకోబెట్టాలని మీకు అన్పించవచ్చు, కానీ అది వారికి సొంతంగా పడుకోవడం ఎలానో నేర్చుకోవడం కష్టతరం చేస్తుంది. దానిబదులు, వారు నిద్రమత్తులో ఉండి పూర్తిగా పడుకోకుండా ఉన్నప్పుడే బేబీ పడుకునే బెడ్‌పై పడుకోబెట్టండి. అప్పుడు వారికి స్వంతంగా ఎలా తననితాను శాంతపర్చుకుంటూ స్వతంత్రంగా నిద్రపోవడం ఎలాగో తెలుస్తుంది.
రోజు ముగియడంతో, పసిపిల్లలకి అది పడుకునే సమయం అని తెలియడానికి ఇంట్లో లైట్లను డిమ్ చేయడం మొదలుపెట్టండి. పడకగదిని కూడా చీకటిగా చేయడం నిద్రకు మరింత అనుకూలిస్తుంది. అలాగే, పూర్తిగా చీకటిగా ఉండకుండా ఉండటానికి గదిలో రాత్రి లైట్లను ఉపయోగించి చూడండి.
పెద్దవాళ్లలాగానే, పసిపిల్లలు కూడా నిశ్శబ్ద వాతావరణంలో మెరుగ్గా నిద్రపోతారు. అందుకని లైట్లలాగానే, చీకటి పడుతున్నప్పుడు ఇంట్లో కూడా చప్పుళ్లని తగ్గించడానికి ప్రయత్నించండి.
దీని అర్థం పడుకునే సమయానికి ముందు ఇంట్లో అందరూ టీవీ, ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లకి దూరంగా ఉండాలి లేదా కఠినంగా, హింసాత్మకంగా వ్యవహరించకూడదు. దానిబదులుగా, బేబీని శాంతపరిచి తను పడుకునే మంచంపై పడుకోబెట్టే ముందు కథలు చదివి వినిపించడం లేదా పసిపిల్లల యోగా వంటి సాయపడే పనులు ఎంచుకుని చేయండి.
దృఢమైన పరుపు అలాగే శుభ్రమైన బెడ్షీట్‌లతో తయారుచేసిన సౌకర్యవంతమైన క్రిబ్ లేదా బాసినెట్ పసిపిల్లలకి అనువైనది. గది యొక్క ఉష్ణోగ్రత కూడా 68 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద చల్లగా ఉంచాలి. పసిపిల్లల స్లీపింగ్ బ్యాగ్‌లను కూడా ఉపయోగించవచ్చు, ఇవి పసిపిల్లలు మరియు పసిబిడ్డల కోసం పాపులర్ అవుతున్న నిద్ర దుస్తుల ఆప్షన్ అని చెప్పవచ్చు. వాటిల్లో వదులుగా ఉండే దుప్పట్లకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి ఇంకా మీ బిడ్డ రాత్రంతా వెచ్చగా మరియు హాయిగా ఉండేలా సాయం చేస్తాయి. బేబీ స్లీపింగ్ బ్యాగ్‌లలో అనేక రకాలు మరియు శైలులు అందుబాటులో ఉంటాయి. మీరు మీ బిడ్డ బరువు అలాగే ఎత్తుకు తగినదాన్ని ఎంచుకోవచ్చు.
ఒకవేళ మీ బిడ్డ గాఢంగా పడుకోలేకపోతుంటే, వైట్ నాయిస్ వారు మెరుగ్గా పడుకోవడానికి సాయపడవచ్చు. మార్కెట్లో అనేక రకాల వైట్ నాయిస్ మెషిన్లు లభిస్తాయి. లేదా మీ గదిలో ఫ్యానుని వేయండి. శబ్దాలు ఏవైనా వస్తుంటే పసిపిల్లలు నిద్రపోగలరు. అది ఫ్యాను కావచ్చు, శ్రావ్యమైన సంగీతం కావచ్చు, గడియార శబ్దం కావచ్చు లేదా బేబీ స్లీప్ మ్యూజిక్ అంటే పసిపిల్లలని నిద్రపుచ్చే సంగీతం కావచ్చు. ఇంటర్నెట్ నిండా బేబీ స్లీప్ మ్యూజిక్ నిండి ఉంటుంది.
మీ బిడ్డ రాత్రంతా లేవకుండా పడుకుంటున్నట్లయితే, వారిని పాల కోసం నిద్ర లేపాల్సిన అవసరం లేదు. కానీ, ఒకవేళ వారు మేల్కొని లేదా ఏడుస్తూ ఉంటే, రాత్రిపూట పాలు ఇస్తే వారు తిరిగి నిద్రపోవడానికి సాయపడవచ్చు.
మీ పాప లేదా బాబు ఏడ్చిన ప్రతిసారీ వారి వద్దకు వెళ్ళి లాలించాలని వెంటనే అన్పించవచ్చు, కానీ ఇది వారి నిద్రకు భంగం కలిగించి మళ్ళీ శాంతపడటాన్ని కష్టతరం చేస్తుంది. వారు కేవలం ఆకలితో ఉంటే లేదా డైపరుని మార్చాల్సిన అవసరం ఉన్నట్లయితే మాత్రమే, వారిని ఒక నిమిషం పాటు ఎత్తుకోండి. దాదాపుగా వారంతట వారే పడుకుండిపోతారు.
పిల్లలకి రాత్రంతా లేవకుండా ఎలా నిద్రపోవాలో తెలుసుకోవడానికి సమయం పడుతుంది. పసిబిడ్డ మేల్కొని ఏడ్చే రాత్రులు ఎన్నో ఉంటాయి, కానీ సహనంగా, నెమ్మదిగా ప్రయత్నిస్తూ ఉంటే వారికి అలవాటు అవుతుంది.
అప్పుడే పుట్టిన పిల్లలు రోజులో పగటిపూట ఇంకా రాత్రిపూటలలో అధికభాగం నిద్రపోతారని అలాగే మొదటి నెలలో, పిల్లలు 16 గంటలు నిద్రపోవడం సాధారణమని, తినడానికి మాత్రమే నిద్ర లేస్తారని పీడియాట్రిక్స్ సొసైటీ తెలుపుతోంది. పడుకునే గంటల సంఖ్య నెమ్మదిగా తగ్గుతుంది. పుట్టిన మొదటి రోజుల నుండి, వాళ్ళకి రాత్రి సమయం పడుకోటానికి అని అలాగే వారి క్రిబ్లోకి చేరగానే పడుకోవాలని ఈ విధంగా అలవాటు చేసుకోవాలి.
Baby sleeping tips in Telugu, How to get your baby to sleep peacefully at night In Telugu, 10 Baby Sleep Tips to Help Your Baby Sleep Through the Night In English, 10 Baby Sleep Tips to Help Your Baby Sleep Through the Night In Hindi, 10 Baby Sleep Tips to Help Your Baby Sleep Through the Night In Tamil, 10 Baby Sleep Tips to Help Your Baby Sleep Through the Night In Bengali
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips


డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |