hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

Article continues after adveritsment

  • Home arrow
  • మీ బిడ్డలో ఐరన్ లోపం ( Iron Deficiency in Your Baby in Telugu) arrow

In this Article

    మీ బిడ్డలో ఐరన్ లోపం ( Iron Deficiency in Your Baby in Telugu)

    Baby Care

    మీ బిడ్డలో ఐరన్ లోపం ( Iron Deficiency in Your Baby in Telugu)

    26 July 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    మీ బిడ్డ మంచి ఆరోగ్యానికి, అభివృద్ధికి తోడ్పడటానికి ఐరన్ అవసరం. హిమోగ్లోబిన్‌ను తయారు చేయడం కోసం మన శరీరానికి ఐరన్ అవసరం. ఇది శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్తుంది. ఐరన్ లోపించినప్పుడు, RBCలు చిన్నవిగా మారి, శరీర అవయవాలను రక్షించడానికి తగినంత ఆక్సిజన్‌ను తీసుకువెళ్లలేవు. దీని వల్ల రక్తహీనత ఏర్పడుతుంది.

    ఐరన్ లోపం లక్షణాలు (Symptoms of Iron Deficiency in Telugu)

    శిశువుల మెదడు అభివృద్ధికి ఐరన్ అవసరం. శిశువులకు తగినంత ఐరన్ లభించనప్పుడు, చలాకీగా ఉండరు. అలాగే పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కొన్ని లక్షణాలు కింద పేర్కొనబడ్డాయి:

    • పాలిపోయిన చర్మం
    • ఆకలి లేకపోవడం
    • నెమ్మదిగా బరువు పెరగడం
    • చిరాకుగా, గజిబిజిగా ఉండటం

    ఐరన్ స్థాయి తక్కువగా ఉండటం వలన పిల్లలలో ఏకాగ్రత లోపిస్తుంది. దాని ఫలితంగా అలసట, బలహీనత పెరుగుతుంది.

    శిశువులకు ఎంత ఐరన్ అవసరం? (How Much Iron Do Babies Require in Telugu?)

    మొదటి 6 నెలల్లో, చనుబాలు తాగే పిల్లలకు తల్లి పాల నుండి వారి అవసరానికి తగిననంత ఐరన్‌ లభిస్తుంది. అయినప్పటికీ 6 నెలల తర్వాత మీరు ఐరన్ లోపానికి గురి అయ్యే అవకాశాన్ని నివారించడానికి ఘన ఆహారాన్ని ప్రారంభించాలి. సిఫార్సు చేయబడిన ఆహార నియమాలు వయస్సు ప్రకారం మారతాయి. 7 నుండి 12 నెలల మధ్య వయస్సు గల శిశువుకు, రోజుకు 10-15 mg (బియ్యపు గింజ బరువులో దాదాపు సగం) మధ్య ఐరన్ అవసరం.

    ఐరన్ యొక్క ఉపయోగకరమైన మూలాలు- ఐరన్‌లో రెండు రకాలు ఉన్నాయి:

    • మాంసాహారంలో లభించే హీమ్ ఐరన్.
    • కూరగాయలు, తృణధాన్యాల వంటి మొక్కల వనరులలో లభించే నాన్ హీమ్ ఐరన్.

    ఐరన్ అధికంగా ఉండే ఆహారాలలో ఇవి ఉంటాయి (Foods Rich in Iron Includes):

    • మాంసాహారం: ఆవు మాంసం, గొర్రె మాంసం, పంది మాంసం, కోడి మాంసం, టర్కీ, చేపలు
    • శాకాహారం: ఐరన్ అధికంగా ఉండే తృణధాన్యాలు, బ్రెడ్, పాస్తా, పప్పు దినుసులు, పాలకూర, బ్రోకలీ
    • ఐరన్‌ను పొందడంలో సహాయపడటానికి, నారింజ, టమోటాలు, మిరియాల వంటి విటమిన్-సి మూలాలను కలిపి ఆహారాన్ని ఇవ్వండి.
    • ఆవు పాలు ఐరన్ యొక్క ఉపయోగకరమైన మూలం కాదు. ఆవు పాలలో మానవుల పాలతో సమానమైన ఐరన్ ఉన్నప్పటికీ, దాన్ని శరీరం సరిగా గ్రహించదు. ఐరన్ ఉన్న ఆహారాన్ని విటమిన్-సితో కలిపి ఇవ్వాలని గుర్తుంచుకోండి.

    మీరు ఇంకా ఏమి తెలుసుకోవాలి? (What Do You Need to Know?)

    • ఒకవేళ మీరు మీ పిల్లల ఆహారంలో ఐరన్ సప్లిమెంట్లను ఇవ్వడం ప్రారంభించి ఉంటే, దాని వల్ల మలం ఆకుపచ్చ లేదా నల్లని బూడిదరంగులో ఉండవచ్చు.
    • ద్రవ రూపంలోని ఐరన్ కూడా దంతాలపై మరక పడేలా చేస్తుంది. దంతాలపై శాశ్వత మరకను నివారించడానికి, మీరు మీ పిల్లల దంతాలను వస్త్రంతో తుడవచ్చు.

    Tags:

    Iron deficiency in kids in telugu, iron deficiency in telugu, Foods that are rich in iron in telugu, Iron rich foods for babies in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    Related Topics

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.