Pregnancy
18 May 2023 న నవీకరించబడింది
మన చర్మానికి హానికరంగా మారే అనారోగ్యకర జీవనవిధానాన్ని మనం అనుసరిస్తుంటాం. మరియు ఎండకు గురవ్వడం వలన మన చర్మం ఇంకా దెబ్బతింటుంది. దీనివల్ల చర్మ రంధ్రాలు పెద్దవి కావడం, చర్మం సాగిపోవడం వంటి సమస్యలకు లోనవుతాం. మనలో చాలా మందికి ఫేస్ టోనర్ గురించి తెలియదు. కేవలం జిడ్డు చర్మం ఉండే వారికి చర్మ రంధ్రాలను తగ్గించడానికే ఈ ఫార్ములా అనుకుంటాం. అయితే టోనర్స్ అనేవి అన్ని చర్మ రకాలకు సరిపోతాయి.మన ముఖాలను శుభ్రం చేశాక ఎక్కువగా ఉన్న ఆయిల్ ను మరియు మలినాలను తొలగించడానికి ఫేస్ టోనర్ రాస్తాము. మార్కెట్లో పలు రకాల టోనర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, విటమిన్-సి ఫేస్ టోనర్ మీ చర్మానికి మరికొన్ని అదనపు లాభాలను ఇస్తుంది. ఫేస్ టోనర్లు నీటి ఆధారిత చర్మ సంరక్షణ కలిగిన ఫార్ములా. ఇందులో గ్లిజరిన్ తో పాటు మాయిశ్చర్ ను నిలిపి ఉంచే ఏజెంట్లు ఉంటాయి. అవి మీ చర్మానికి మృదుత్వాన్ని, తడిని, కోమలాన్ని అందిస్తాయి. ఫేస్ టోనర్లను ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు:
స్కిన్ టోనర్ల లాభాలు ఇప్పుడు మనకు తెలిశాయి. ఇప్పుడు మనం చర్మానికి విటమిన్-సి ఫేస్ టోనర్లు ఇచ్చే లాభాలను చూద్దాం.
చర్మం అరిగిపోవడం వల్ల ఏర్పడే ముడుతలు మరియు గీతల పరిస్థితిని మనం ఎదుర్కొనే ఉంటాం. అలాంటి కేసుల్లో విటమిన్-సి ఫేస్ టోనర్లు సరైన ఏజెంట్లుగా పని చేస్తాయి. విటమిన్-సి టోనర్లలో చర్మ సమస్యలను ఎదుర్కొనే ప్రత్యేక రక్షణ పోషకాలు ఉంటాయి. అంతేగాక ఈ టోనర్లు మీ చర్మంపై ఉండే రాడికల్స్ ను తొలగించి పునర్జీవాన్ని ఇస్తాయి.
విటమిన్-సి మనంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మం బిగుతుగా ఉండటానికి మన శరీరం ఉత్పత్తి చేసే మూలకం అది. మన వయసు పెరిగే కొద్ది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అందుకే విటమిన్-సి టోనర్లు వాడటం వల్ల వయసు పెరగడం తగ్గుతుంది. సహజమైన గ్రీన్ టీ మరియు కీరదోసలోని గుణాల వల్ల విటమిన్-సి చర్మానికి తడిని అందిస్తూ ఎలాస్టిసిటీని పెంచుతుంది. రంధ్రాలను తగ్గించి మీ చర్మాన్ని ఫ్రెష్ గా మరియు యవ్వనంగా చూపిస్తుంది.
కొన్ని హానికారక ఏజెంట్ల మీద మన రోగనిరోధక వ్యవస్థ బలంగా పని చేయడం వల్ల చర్మంపై కొన్నిసార్లు ఎర్రని దద్దుర్లు, ఇన్ఫెక్షన్, అలర్జీ వచ్చిన అనుభూతి మనకు ఉండే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్య సలహా తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, కొన్ని పరిశోధనల ప్రకారం ఇలాంటి మొటిమలు, డెర్మటైటిస్, సొరియాసిస్ వంటివాటిపై విటమిన్-సి చక్కని హాయినిస్తుంది. విటమిన్-సి ఫేస్ టోనర్లలో ఉండే కీరదోస మండుతున్న మీ చర్మానికి చల్లదనాన్నిస్తుంది.
మనం చర్మం ఎక్కువగా మెలనిన్ ను ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే నల్లటి ప్రదేశాలు లేదా హైపర్ పిగ్మెంటేషన్. విటమిన్-సి టోనర్ల వల్ల టైరోసినాస్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మెలనిన్ ఉత్పత్తికి తోడ్పడే ఎంజైమ్ కావడం వల్ల చివరకు మెలనిన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. నల్లని ప్రదేశాలను తగ్గించడంలో, రంగును పెంచడంలో, చర్మ సహజ స్వరూపాన్ని కాపాడటంలో విటమిన్-సి సహాయపడుతుంది.
ఎక్కువ సమయం ఎండకు గురికావడం వల్ల చర్మానికి సన్ స్పాట్స్, గరుకుదనం, రోసాసియా, ఫ్లాకీనెస్ వంటి చర్మ సమస్యలు వస్తాయి. అయితే విటమిన్-సిని తరచుగా చర్మానికి రాయడం వల్ల ఈ సమస్యల నుంచి రక్షణ ఉంటుంది. మూడు నెలల కంటే ఎక్కువ కాలం విటమిన్-సి టోనర్లను వాడటం వల్ల మీ చర్మ రూపులో మార్పు ఉంటుంది. విటమిన్-సి టోనర్ తరచుగా వాడటం వలన అందులోని నారింజ, నిమ్మ గుణాలు మీ చర్మానికి హాని కలిగించే కారకాల నుంచి రక్షణ ఉంటుంది. రసాయనాలు, విషపూరితాలైన ఉత్పత్తులను వాడకుండా జాగ్రత్త పడండి. మైలో కేర్ విటమిన్-సి మాటిఫైయింగ్ స్కిన్ మిస్ట్ టోనర్ లో విటమిన్-సి, గ్రీన్ టీ, నారింజ, నిమ్మ మూలకాలు ఉన్నాయి. మీ చర్మం నుంచి ధూళికణాలు తొలగించి, చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి, మీ చర్మాన్ని మృదువుగా మరియు కోమలంగా చేయడానికి ఇందులో లైట్ వెయిట్ ఫార్ములా ఉంది.
విష రహిత, వేగన్-ఫ్రెండ్లీ (శాకాహార) మరియు క్రూయాల్టీ-ఫ్రీ (జంతు హింస చేయబడని) సర్టిఫైడ్ కంపెనీల ఉత్పత్తులను మాత్రమే చూడండి. టోనర్స్ తయారు చేయడంలో ఉపయోగించిన మూలకాలను పరిశీలించండి. పారబెన్స్, ఎస్ఎల్ఎస్, మినిరల్ ఆయిల్స్, ఫాతాలేట్స్, ఆల్కహాల్ వంటి రసాయనాలు లేని టోనర్స్ మాత్రమే ఎంచుకోండి. వీటితో పాటు సింథటిక్ రంగులు, నిల్వ ఉంచే పదార్థాలు ఉంటే అవి మీ చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి మంచి ఫలితాల కోసం, ఉత్తమమైన ఫలితాల కోసం కేవలం నాణ్యమైన ప్రాకృతిక పదార్థాల నుంచి చేసిన ఉత్పత్తులను మాత్రమే వాడండి.
Yes
No
Written by
dhanlaxmirao
dhanlaxmirao
9వ వారం గర్భం సమయంలో ఏమి తినకూడదు.
9 వారాల గర్భధారణలో అల్ట్రాసౌండ్: ఏమి ఊహించాలి మరియు చెడు శకునాలు ఏంటి
మైలోమెనింగోసెల్: లక్షణాలు, కారణాలు మరియు చికిత్స
హెర్పెస్: కారణాలు, లక్షణాలు, ప్రమాదం & చికిత్స
రెక్టోసెల్: కారణాలు, లక్షణాలు & చికిత్స
పిల్లలు సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్‌తో బాధపడుతుంటే మనకి ఎలా తెలుస్తుంది?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Potty Seat | Carriers | Diaper Bags | Stroller – Lightweight & Compact | Baby Pillow | Diapers & Wipes - Baby Clothing | Wrappers | Winter Clothing | Socks | Diapers & Wipes - Feeding & Lactation | Feeding Bottle | Grooved Nipple | Fruit Feeder | Manual Breast Pump | Diapers & Wipes - For Mom | Maternity Dresses | Maternity Pillows | Pregnancy Belt | Skin | Acne & Blemishes |