This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీ సమయంలో లో దుస్తులు ధరిస్తే చర్మం ఎందుకు దురద పెడుతుంది?

Pregnancy
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: Apr 4, 2023
ప్రెగ్నెన్సీ సమయంలో లో దుస్తులు ధరిస్తే చర్మం ఎందుకు దురద పెడుతుంది?
Read time5 min

గర్భం దాల్చిన సమయంలో మహిళలను ఎక్కువగా చికాకు పెట్టే అంశం దురదలు. సాధారణంగా ప్రెగ్నెన్సీతో స్త్రీల హార్మోన్లలో, శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వాటిలో బరువు పెరగడం, అలసట, అస్వస్థత, వికారం వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఎక్కువ దురదల సమస్య వేధిస్తుంది. యోని, బ్రెస్ట్‌ వద్ద కూడా దురదలు వస్తాయి. బ్రెస్ట్‌ ప్రాంతంలో దురద ఉంటే మెత్తని బ్రాని కొనుగోలు చేయడంతో సమస్య తగ్గుతుంది. చాలా సందర్భాల్లో మహిళలు శరీరంలో ఊహించని భాగాల్లో దురదను అనుభవించొచ్చు.

ప్రెగ్నెన్సీ సమయంలో ధరించే బ్రా వలన దురద వస్తుందా?

ప్రెగ్నెంట్ వుమెన్ ధరించే బ్రా వలన కొన్ని సార్లు తీవ్రమైన దురదను అనుభవించొచ్చు. బ్రెస్ట్‌ దురదగా అనిపిస్తే చర్మం స్ట్రెచ్ అయిందని అర్థం. అంతే కాకుండా బ్రెస్ట్‌ పరిమాణంలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. బ్రెస్ట్‌ పరిమాణంలో ఎక్కువ మార్పును గమనించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో చేయాల్సిందల్లా మెత్తని లైట్ వెయిట్ నర్సింగ్ బ్రా కొనుగోలు చేయడం. బ్రెస్ట్‌లో కొవ్వు అనేది పేరుకుపోతుంది, క్షీరగ్రంథులు (బిడ్డకు పాలిచ్చేందుకు ఉపయోగపడేవి) అభివృద్ధి చెందుతాయి. శిశువు రాకకోసం శరీరం సిద్ధమవుతున్న దశలుగా వీటిని గుర్తించాలి. బ్రెస్ట్‌ వద్ద దురద, లేదా సెన్సిటివ్ నిపుల్స్ అనుభవించొచ్చు. చాలా సందర్భాల్లో ఈ దురద అనేది అరియోలా (నిపుల్స్ చుట్టూ ఉండే ప్రాంతం) వరకే పరిమితం అయి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో దురద అనేది మొత్తం బ్రెస్ట్‌లకు వ్యాపిస్తుంది. అటువంటి సమయంలో తేలికగా ఉండే ప్యాడెడ్ వైర్​ఫ్రీ నర్సింగ్ బ్రా ఉపయోగకరంగా ఉంటుంది. హార్మోన్ల హెచ్చుతగ్గుల వలన చర్మం ఎలాస్టిసిటీ (స్థితిస్థాపకత) మారుతుంది. అందువల్ల శరీరం చర్మం చుట్టూ దురద కలుగుతుంది. బొడ్డు, తొడలు, భుజాలు, బ్రెస్ట్‌, మొదలయిన ప్రదేశాలలో తీవ్రమైన దురదను అనుభవించొచ్చు.

ప్రెగ్నెన్సీ సమయంలో అందరూ బ్రెస్ట్‌ వద్ద దురదను అనుభవిస్తారా?

ప్రెగ్నెన్సీ సమయంలో అందరు స్త్రీలు దురదను అనుభవించరు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడైనా దురద సంభవించొచ్చని తెలుసుకోవడం ముఖ్యం. నిజానికి ఊహించిన దానికంటే ఎక్కువగా కూడా దురదలు రావొచ్చు. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సాధారణ దశ. దురద భరించలేనంతగా ఉంటే వైద్యుడిని సంప్రదించొచ్చు. మరింత సౌకర్యం కోసం బెస్ట్ లైట్లీ ప్యాడెడ్ నర్సింగ్ బ్రా వినియోగించవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరం దురదలను భరించడం శారీరకంగా, మానసికంగా సవాలు. ప్రసవం తర్వాత ఈ దురదలు తగ్గుతాయి. దురదను తగ్గించుకునేందుకు కొన్ని రకాల చికిత్సలను తీసుకోవాలి. శరీరంలోని హార్మోన్ స్థాయిలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం వలన దురదతో పాటుగా శరీరం మీద కొన్ని సాగిన గుర్తులను కూడా గమనించొచ్చు. నిజానికి ఈ సాగిన గుర్తులు పొట్ట, పిరుదులు, చేతుల మీద కూడా కనిపించవచ్చు. ఈ సాగిన గుర్తులను బ్రెస్ట్‌ మీద కూడా గమనిస్తే ఫుల్లీ కవరేజ్ లైట్లీ ప్యాడెడ్ బ్రా ధరించడం మేలు .

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ బ్రా వేసుకోవడం ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడు?

దురద నుంచి ఉపశమనం ఎలా పొందాలి?

దురద వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం సహాయకరంగా ఉన్నప్పటికీ.. చికాకు తగ్గించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని ఇంటి చిట్కాలు చర్మం మరింత మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతాయి. ఇవి చర్మానికి ఉపశమనాన్ని అందజేస్తాయి. చికాకును అదుపులో ఉంచుతాయి. అటువంటి కొన్ని చికిత్సలు ఇవే..

1. మాయిశ్చరైజ్

రోజంతా హైడ్రేట్​గా ఉండేలా చూసుకోవాలి. కొన్ని శరీర ప్రాంతాలలో తేమ ఉండకుండా చూసుకోవాలి. హార్మోన్ లెవల్స్​ హెచ్చుతగ్గులకు లోనవుతున్నడు స్కేలీ ఎపిడెర్మిస్​ను అనుభవించొచ్చు. ఈ సమయంలో ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం మేలు చేస్తుంది. దురద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నూనె లేదా క్రీమ్ రాస్తే ఉపశమనం కలుగుతుంది.

2. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి

బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వలన శరీరంపై దద్దుర్లు ఏర్పడొచ్చు. అందువల్ల శరీరానికి గాలి బాగా తగిలేలా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. వదులుగా ఉండే దుస్తులు శరీరాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుతాయి. బ్రెస్ట్‌ వద్ద దురదగా ఉంటే ఉపశమనం పొందేందుకు లైట్ వెయిట్ ప్యాడెడ్ బ్రా కొనుగోలు చేయడం మంచిది. బిగుతుగా ఉండే దుస్తులు చర్మాన్ని వేడిగా ఉంచుతాయి. ఇది ఒక రకమైన దురదకు దారితీస్తుంది.

3. దురద నుంచి ఉపశమనం పొందేందుకు మెడికేటెడ్ క్రీమ్ ఉపయోగించాలి

దురద నుంచి తక్షణ ఉపశమనాన్ని అందించేందుకు నేడు మార్కెట్లో అనేక సంఖ్యలో క్రీములు ఉన్నాయి. ఈ క్రీములు కాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందేందుకు ముఖ్యమైన నూనెలతో తయారు చేసిన కాటన్ ప్యాడ్లను కూడా ఉపయోగించొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో నోటి ద్వారా తీసుకునే మందులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే ఈ మందులు బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపించవచ్చు.

4. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి

కొన్ని సార్లు తినే ఆహారాలు చర్మాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. పేగులను సురక్షితంగా ఉంచుకునేందుకు పండ్లు, కూరగాయలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో సురక్షితమైన ఫైబర్ సప్లిమెంట్ గురించి తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించండి.

డెలివరీ తర్వాత కూడా దురదలు ఉంటే..

ప్రెగ్నెన్సీ సమయంలో దురద చాలా అసౌకర్యంగా, చికాకుగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బ్రెస్ట్‌ ప్రారంతంలో దురద ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డెలివరీ తర్వాత దురద సాధారణంగా పోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా దురద అలాగే వైద్యుడిని సంప్రదించండి.

32C - Maternity Bras Non-Wired, Non-Padded- Classic White (Buy 2 Get 1 Free)

32C - Maternity Bras Non-Wired, Non-Padded- Classic White (Buy 2 Get 1 Free)

Supports Growing Breasts | Eases Pumping & Feeding

41 Moms bought
₹293₹2992% Off
Rating
4.8
(56)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.