This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీ సమయంలో & తల్లిపాలని ఇచ్చే దశల కోసం మెటర్నిటీ ప్యాంటీలని ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన టాప్ 5 విషయాలు!

Maternity Fashion
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
ప్రెగ్నెన్సీ సమయంలో & తల్లిపాలని ఇచ్చే దశల కోసం మెటర్నిటీ ప్యాంటీలని ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన టాప్ 5 విషయాలు!
Read time14 min

ప్రెగ్నెన్సీ సమయంలో అలాగే ఆ తర్వాత కూడా మీరు తిరిగి త్వరగా మీ మునుపటి స్థితికి రావటానికి మీ శరీరంపై దృష్టిపెట్టాలని గుర్తుంచుకోవాలి. ఒక బిడ్డని కని ఇంటికి తీసుకురావడం అనేది అత్యంత సంతోషకరమైన, ఉప్పొంగిపోయే అనుభవం అని చెప్పవచ్చు. వారికి పాలివ్వడం అయితే పూర్తిగా మరో కథ. మీరు మీ ఇంట్లో, బట్టల అలమరలో, జీవనశైలిలో చాలా విషయాలని మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్తగా తల్లయ్యాక షాపింగ్ చేసేటప్పుడు, పాలివ్వడానికి సాయపడే మంచి నర్సింగ్ బ్రాలు అలాగే మెటర్నిటీ ప్యాంటీలు మీ లిస్టులో పైన ఉండాలి.

మీ శరీరంలో వచ్చే మార్పులు, మీ పొట్ట పెరగటం వలన క్రమంగా మీ పాత ప్యాంటీలు అలాగే బ్రాలని వేసుకోవటం అసాధ్యంగా మారుతుంది. గర్భం దాల్చిన మొదట్లో, మీరు మామూలుగా వేసుకునే ప్యాంటీలతో సౌకర్యంగానే అన్పించవచ్చు. కానీ నెలలు నిండుతున్నకొద్దీ.. అది కష్టంగా, అసౌకర్యంగా మారుతుంది. ప్రసవం తర్వాత సరైన ప్యాంటీలని ఎంచుకోవడం ఒక ముఖ్యమైన వ్యాయామంలాంటిది ఎందుకంటే అది తర్వాత మీ జీవితంలో సెక్సీగా ఉండేలా అలాగే శరీరాన్ని టోన్డ్‌గా ఉంచడంలో సాయపడుతుంది. ఈ కాలం మహిళలు వ్యక్తిగత జీవితాన్ని, వృత్త్తిపరమైన జీవితాన్ని సమానమైన నైపుణ్యంతో బ్యాలెన్స్ చేస్తున్నారు. అందుకని కేవలం మన అజ్ఞానం, అజాగ్రత్తల కారణంగా బాధపడాలి అని అనుకోము. ప్రెగ్నెన్సీ మన జీవితాలని, శరీర సైజుని, బరువులని మారుస్తుంది. అందుకని మీకు ఈ సమయంలో కొత్త బట్టల సెట్ ఎలా అవసరమో కొత్త లోదుస్తుల సెట్ కూడా అవసరం. ప్రసవం సమయం దగ్గరయ్యేకొద్దీ మీ స్తనాలు సున్నితంగా మారిపోతాయి. అలాగే మీ పొట్ట కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి సరిగ్గా సరిపోని, బిగుతైన లోదుస్తులు వేసుకోవటం చాలా చికాకుగా మారుతుంది.

మీకు మెటర్నిటీ ప్యాంటీలు ఎందుకు అవసరం?

మెటర్నిటీ లోదుస్తులు పెరుగుతున్న మీ పొట్టకి ఫిట్ అయ్యేలా, సరైన భాగంలో కదలకుండా నిలబడి ఉండేలా అలాగే మీ మామూలు లోదుస్తుల కంటే మీకు ఎక్కువ సౌకర్యంగా ఉండేలా రూపొందించబడతాయి. నెలలు నిండుతున్న కొద్దీ, మీ మామూలు ప్యాంటి యొక్క నడుము పట్టీ టైట్ అయిపోయి, నొప్పి కలిగించే ప్రదేశంలో బిగుసుకుని ఇబ్బంది పెడుతుంది. కానీ డెలివరీ తర్వాత మెటర్నిటీ ప్యాంటీలు మీ శరీర స్థితిని బట్టి అలవాటు అయ్యేలా రూపొందించబడతాయి. బిడ్డ ఉన్న మీ పొట్ట బంప్ పెరిగేకొద్దీ మీరు మామూలుగా వాడే లోదుస్తులు సాగిపోవచ్చు. అలా తర్వాత వాడటానికి పనికిరావు. అదే మెటర్నిటీ లోదుస్తులు కేవలం మీరు గర్భవతిగా ఉన్నప్పుడే కాదు; ప్రెగ్నెన్సీ తర్వాత లేదా డెలివరీ తర్వాత కూడా వాడుకోవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు వెజైనా నుండి స్రావం లేదా డిశ్చార్జి ఎక్కువగా ఉండటాన్ని మీరు గమనిస్తారు. ఈ సమయంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే రిస్కు ఉంది కాబట్టి, ప్రెగ్నెన్సీ కాలం అంతా గాలి ఆడే కాటన్ మెటర్నిటీ ప్యాంటీలని ఎంచుకోవడమే మంచిది.

మెటర్నిటీ లోదుస్తులు లేదా ప్యాంటీల యొక్క రకాలు

మీరు ఎంపిక చేసుకోవటానికి మెటర్నిటీ లోదుస్తులలో కొన్ని రకాల స్టైలులు కింద ఇవ్వబడ్డాయి :

  • బేబీ బంప్ పైన లేదా నడుము పైన వరకూ ఉండే హై వెయిస్ట్ మెటర్నిటీ ప్యాంటీలు: ఈ రకం ప్యాంటీలు మీ బంప్‌ను పూర్తిగా కవర్ చేస్తాయి. ఇవి కిందవరకూ-కట్ చేసిన స్టైలు ఉన్న ప్యాంటీల కంటే ఎక్కువ సపోర్టునిస్తూ, అంటిపెట్టుకుని ఉంటాయి.
  • బేబీ బంప్ కింద లేదా నడుము కింద వరకూ వచ్చే లో వెయిస్ట్ మెటర్నిటీ ప్యాంటీలు: ఈ ప్యాంటీలు బంప్ కింద కదలకుండా ఉంటాయి. అలాగే మీకు ఎండాకాలంలో ఏదన్నా అసౌకర్యంగా అన్పిస్తే, ఈ ప్యాంటీ రకం స్టైలు నడుము పైవరకూ వెళ్ళే హై వెయిస్ట్ ప్యాంటీలకన్నా మెరుగ్గా ఉంటుంది.
  • బేబీ బంప్ మధ్య వరకూ వచ్చే మెటర్నిటీ ప్యాంటీలు: ఈ రకం ప్యాంటీలు సరిగ్గా పొట్ట మధ్య వరకూ వస్తాయి. అలాగే పైన చెప్పిన రెండు స్టైల్‌ల ప్రత్యామ్నాయాలకి మధ్యస్థంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ ప్యాంటీల యొక్క నడుము పట్టీ లేదా వెయిస్ట్ బ్యాండ్ పూర్తిగా సాగేదిగా, సౌకర్యంగా ఉండేవిధంగా చెక్ చేసుకోండి. ఈ రకమైన మెటర్నిటీ ప్యాంటీల స్టైలులో ఎంచుకోడానికి పెద్దగా ఆప్షన్లు అందుబాటులో లేవు.

మెటర్నిటీ ప్యాంటీల యొక్క లాభాలు

మెటర్నిటీ ప్యాంటీలు ప్రధానంగా గర్భవతులకి సరైన సౌకర్యాన్ని అందించటానికి డిజైన్ చేయబడ్డాయి. ప్రెగ్నెంట్ మహిళల శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని, మెరుగైన కదలిక, స్ట్రెచ్ అయ్యేవిధంగా ఇవి తయారుచేయబడతాయి. ఇవి గర్భ సమయంలో కావల్సిన సపోర్టుని అందిస్తాయి. ఈ విధంగా తల్లులకి సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి, ఇటీవల భారతదేశంలో మెటర్నిటీ లోదుస్తుల వాడకం పెరిగింది. పెల్విక్ కండరాలపై ఒత్తిడి తగ్గించడానికి మెటర్నిటీ ప్యాంటీలు సాధారణంగా మెత్తని, ప్రీమియం కాటన్ వంటి మెటీరియళ్లతో తయారుచేయబడతాయి. చాలామంది తల్లులు నడుము పై వరకూ వచ్చే హై-వెయిస్టెడ్ కాటన్ ప్యాంటీలని కొనడానికి ఇష్టపడతారు. ఈ ప్యాంటీలు తగినంత సౌకర్యాన్ని అందిస్తాయి. అలాగే మీ పొట్టపై సరిగ్గా ఫిట్ అయ్యేలా సులభంగా సాగదీయవచ్చు.

నేను మెటర్నిటీ ప్యాంటీలు ఎప్పుడు కొనాలి?

మీరు మామూలుగా వేసుకునే ప్యాంటీలతో అసౌకర్యంగా అన్పించడం మొదలైన వెంటనే మెటర్నిటీ ప్యాంటీలని కొనాలి. గర్భానికి సంబంధించిన ప్రారంభ లక్షణాలు చాలా త్వరగా కన్పిస్తాయి. మొదటి కొన్ని వారాలలో.. మీరు స్పష్టమైన తేడాని అనుభవించవచ్చు.

సరైన మెటర్నిటీ లోదుస్తులని ఎంపిక చేసేటప్పుడు ఆ ఎంచుకునే దశలు లేదా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఒకవేళ మీకు ఈ విషయంలో గందరగోళంగా అన్పిస్తే, మీకు సరైన మెటర్నిటీ బట్టలని ఎంచుకోవటానికి సాయపడే ఒక సింపుల్ గైడ్ ఇక్కడ ఇవ్వబడింది, చదవండి.:

1. సరైన సైజుని ఎంచుకోండి.

మెటర్నిటీ ప్యాంటీలని కొనేటప్పుడు గుర్తుంచుకోవల్సిన విషయాలలో ఇది ముఖ్యమైన అంశం. మీకు సరైన సైజు ఏదో తెలుసుకోవడానికి, కొన్ని లెక్కలని ఖఛ్చితంగా ఉపయోగించాలి. అది సవాలుతో కూడుకున్న పని కావచ్చు. మీకు డెలివరీకి మిగిలి ఉన్న వారాల సంఖ్యని అలాగే మీరు పెరగగలిగే బరువుని అంచనా వేయండి. కావల్సినంత సౌకర్యంగా ఉండటానికి మీ లెక్క కన్నా ఒక సైజు పెద్ద లోదుస్తులే ఎంచుకోవటం మంచిది.

2. మీ ఆకృతిని బట్టి ఆలోచించండి

తర్వాత ఆలోచించాల్సిన ముఖ్య విషయం మీ ఆకృతి అలాగే మీ నడుము రకం. ప్రెగ్నెన్సీ ప్యాంటీలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నడుము కిందగా వచ్చే లోవెయిస్ట్ ప్యాంటీలు, మరొకటి నడుము పైవరకూ వచ్చే హై వెయిస్ట్ ప్యాంటీలు. హై వెయిస్ట్ మెటర్నిటీ ప్యాంటీలు మీ బేబీ బంప్ పొట్టని పూర్తిగా కవర్ చేస్తాయి. అయితే లోవెయిస్ట్ మెటర్నిటీ ప్యాంటీలు బంప్‌కి కింద వరకే వస్తాయి. అందుకని, మీ ఆకృతి అలాగే సౌకర్యం స్థాయి ఆధారంగా మీరు ఏ మెటర్నిటీ ప్యాంటీలనైనా ఎంచుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో బెస్ట్ మెటర్నిటీ ప్యాంటీలని వెతికి చాలా ఆప్షన్లని కనుగొనవచ్చు.

3. ఒంటికి సరిపడే మెటీరియల్ ఎంచుకోండి

ప్రెగ్నెన్సీ సమయం మొత్తంలో శుభ్రమైన, గాలి ఆడే, సాగే గుణం ఉన్న బట్టలని వేసుకోవటం చాలా మంచిది. అలా మీకు సౌకర్యంగా ఉండి, బట్టల వలన చికాకు కలగకుండా ఉంటుంది. అన్ని రకాల బట్టలలో, కాటన్ ఇంకా మైక్రోఫైబర్ ఆధారంగా తయారుచేసే బట్టలు మేటి ఆప్షన్లని చెప్పవచ్చు. కాటన్, ఎలాస్టెన్ ఇంకా వెదురుతో చేసిన మెటర్నిటీ ప్యాంటీలు పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి. మెటర్నిటీ ప్యాంటీలను కొనేటప్పుడు హై-వెయిస్ట్ అంటే నడుము పై వరకు వచ్చే కాటన్ మెటర్నిటీ ప్యాంటీలను కొనవచ్చు. వీటితో వాసన రాదు అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణంతో ఉంటాయి కాబట్టి వెజైనా నుండి వచ్చే స్రావాల కారణంగా చికాకు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

4. మన్నిక గురించి ఆలోచించండి

ఇది కూడా లెక్కలోకి తీసుకోవలసిన ముఖ్యమైన విషయం. మెటర్నిటీ ప్యాంటీలను కొనేటప్పుడు మీరు ఎక్కువ కాలం ఉండే, మన్నికైన ప్యాంటీల కోసం వెతకాలి. తప్పనిసరిగా గుడ్డతోపాటుగా, ప్యాంటీలు సాగే గుణాన్ని కలిగి ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేయాలి. మన్నికైన మెటర్నిటీ ప్యాంటీలను కొంటే అవి త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం ఉంటాయి.

5. వెన్నుకి సపోర్టునిచ్చే లోదుస్తులని తీసుకోండి

వెన్ను భాగానికి సంబంధించి వచ్చే సపోర్టు కోసమైతే మెటర్నిటీ ప్యాంటీలను కొనడం చాలా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో వీపు యొక్క కింద భాగంలో చాలా ఒత్తిడి పడుతుంది. కాబట్టి బడ్జెట్లోనే వచ్చే మెటర్నిటీ ప్యాంటీలను కొనడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఎలాగో వీటిని తక్కువ కాలం మాత్రమే వాడగలరు, మీ ప్యాంటీల సైజు కూడా త్వరగా మారే అవకాశాలు ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో దొరికే కొన్ని రకాల మెటర్నిటీ ప్యాంటీల గురించి కింద ఇవ్వబడ్డాయి:

  • మెటర్నిటీ బ్రీఫ్‌లు గాలాడుతూ ఇంకా పట్టీ లేదా బ్యాండ్‌పై మడవగలిగేలా ఉంటాయి. వీటిని పొట్ట బంప్‌పై లేదా కింది భాగంలో కూడా ఉపయోగించవచ్చు. వీటిల్లో సైజుల ప్రకారం ఎక్కువ ఖరీదు ఉండవచ్చు. ఇవి కాటన్ అలాగే స్పాండెక్స్‌లతో తయారు చేయబడతాయి. ఇవి సాగుతాయి ఇంకా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. తేలిగ్గా, మెత్తగా కూడా ఉంటాయి కాబట్టి దురదలు పెట్టవు. పొట్ట సైజు పెరిగినప్పుడు, ఈ మడవగలిగే ఫోల్డ్-ఓవర్ పట్టీని సర్దుబాటు చేసుకోవచ్చు. మీకు సౌకర్యంగా ఉండేలాగా, వీటిని పొట్ట మీదకి లేదా కిందకి లాక్కోవచ్చు.
  • తక్కువ-ఎత్తు వరకూ వచ్చే మెటర్నిటీ బ్రీఫ్లు: ఈ ప్యాంటీలు ముందువైపున చాలా కిందకి తక్కువ ఎత్తులో ఉంటాయి. కాబట్టి వీటిని మీ పొట్ట కింద వరకూ వేసినా వెనుక వైపు పూర్తిగా కప్పి ఉంచి మీరు కూర్చునేందుకు వీలుగా ఉంటాయి. ఈ ప్యాంటీలలో కాటన్ యొక్క లోపలి లైనింగ్ ఉంటుంది. బయటేమో స్పాండెక్స్ అలాగే కాటన్ యొక్క మిశ్రమ లైనింగ్ ఉంటుంది. ప్యాంటీ యొక్క రంగుతో సంబంధం లేకుండా ఈ లైనింగ్ లేత రంగులో ఉంటుంది అందుకని ఈ రకం ప్యాంటీలని చాలామంది ఇష్టపడతారు. ఈ లైనింగ్ లేత రంగులో ఉన్నందువల్ల ఎలాంటి స్పాటింగ్ లేదా స్రావం జరిగినా మీరు వెంటనే గుర్తించగలరు. సి-సెక్షన్ ఆపరేషన్ జరిగినవారికి నయం కావడంలో ఈ రకం ప్యాంటీలు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే.. ముందు వైపు గుడ్డ భాగం చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది అలాగే సర్జరీకి పెట్టిన కోతల గాయాలకి తగులుతూ వాటిని మరింత పెద్దగా చేయదు.
  • కిందకి జారిపోతూ ఉండని మెటర్నిటీ లోదుస్తులు: ఇవి పాక్షికకంగా కొంతవరకూ పొట్టకి సపోర్టునిచ్చే ప్యాంటీల రకం. ఇవి జారకుండా పొట్ట మీద కదలకుండా నిలబడతాయి. వీటిల్లో తయారుచేసేటప్పుడే పెట్టే పొట్ట కింద తేలికపాటి సపోర్టు బ్యాండు (ఇంటిగ్రేటడ్ అండర్-బెల్లీ లైట్ సపోర్ట్ బ్యాండ్), వీపు కింది భాగంపై పొట్ట బరువు వలన పడే ఒత్తిడిని తగ్గించటంలో సాయపడుతుంది. దీని స్టాండర్డ్ ఆకారం రోజువారీ వాడుకోటానికి అనువుగా ఉండి కొనేలా చేస్తుంది.
  • బంప్ సగం వరకూ వచ్చే లోదుస్తులు: ఈ రకం ప్యాంటీలు నైలాన్ ఇంకా స్పాండెక్స్‌లతో‌ తయారు చేయబడతాయి. ఇవి చక్కగా ఎక్కువగా సాగుతాయి. అలాగే సౌకర్యంగా ఫిట్ అవుతూ పెరిగిన పొట్టకి మధ్య వరకూ వస్తాయి. కొన్ని అందమైన లేసులతో సునిశితంగా తయారు చేసినవి కూడా ఉంటాయి. అందుకని మీరైతే ఇక మొహం ముడుచుకోరు.
  • మెటర్నిటీ బాయ్ షార్టులు: ఒకవేళ మీరు మెత్తనైన, సౌకర్యవంతంగా ఉండే, అలాగే పూర్తిగా బంప్ కవర్ అయ్యేట్లు, మీ బట్టల కింద వేసుకున్నట్లు తెలియకుండా మాయమైపోయే లోదుస్తుల కోసం వెతుకుతున్నట్లయితే ఇవి సరైన మెటర్నిటీ లోదుస్తులు అని చెప్పవచ్చు. ఇవి ఏకంగా రొమ్ముల వరకూ కవర్ చేస్తాయి. ఇవి 11% స్పాండెక్స్‌తో రూపొందించబడతాయి. అందుకని మీరు ఎటు కదిలితే అటు, ఎటు నడిస్తే అటు మీతోపాటు సాగుతాయి.
  • సపోర్టునిచ్చే మెటర్నిటీ బ్రీఫ్‌లు: ఇవి మరింత సపోర్టునిచ్చే బంప్‌పై వరకూ వచ్చే మెటర్నిటీ బ్రీఫ్‌లు. ఇవి నాలుగువైపులా సాగుతాయి. మైక్రోఫైబర్ మెష్ కలిగివుంటాయి. అలా గాలాడుతూ ఉంటాయి. తడి ఏదన్నా ఉంటే పీల్చుకోవడానికి కూడా సాయపడతాయి. ఇవి పొట్ట వద్ద సపోర్టు ప్యానెల్‌తో అంటే అక్కడ పట్టి ఉండేట్లుగా వస్తాయి. అప్పుడు మీరు రోజంతా బెంగ లేకుండా ఉంటారు. ఇవి పీల్చుకునే గుణం ఉండే కాటన్ లోపలి లైనింగ్ ఉన్న నైలాన్ అలాగే స్పాండెక్స్‌ల మిశ్రమంతో ఏర్పడింది.
  • నెమ్మదిగా అనుకూలించే/అలవాటు పడే అడాప్టివ్ లోదుస్తులు: ఈ లోదుస్తులు సొంతంగా బట్టలు వేసుకోవడానికి లేదా మీకు బట్టలు వేసుకోవడంలో సహకరించే వారి పనిని సులభతరం చేసే పక్క జిప్పులు లేదా ఫాస్టెనర్లు కలిగివుంటాయి. వీటికి లోపల కాటన్ లైనింగ్ ఉంటుంది. అలాగే యాంటీ మైక్రోబియల్ టెక్నాలజీతో తయారయ్యి, ట్యాగులు కూడా కలిగివుండవు. ఇవి మీకు రోజంతా తాజాగా ఇంకా పొడిగా ఉన్న భావనని అందిస్తాయి.
  • మెటర్నిటీ థాంగ్: ఇవి సాంకేతికంగా మెటర్నిటీ లోదుస్తులు కాకపోయినప్పటికీ.. వీటిని చాలామంది మహిళలు సిఫారసు చేస్తారు. ఎందుకంటే ఈ ప్యాంటీలకి ముందువైపు అలాగే వెనకవైపు V ఆకారాన్ని కలిగివుండి, నడుము పట్టీ బంప్ కింద చక్కగా నిలబడి ఉంటుంది. ఇవి అద్భుతమైన సాగేగుణం కల బట్టలతో తయారవుతాయి. నెలల నిండేకొద్దీ వీటి పరిమాణం కూడా సాగుతూ పెరుగుతుంది.
  • ఏ అతుకులు లేని మెటర్నిటీ లోదుస్తులు: మీకు ఒకవేళ ప్యాంటీ లైన్లు కనిపించడం నచ్చకపోతే, ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఇవి ఏ అతుకులు లేని బట్టలతో తయారుచేయబడతాయి. అలాగే పొట్ట బంప్‌పై వరకూ పూర్తిగా ఇంకా మధ్యవరకూ కవర్ చేస్తూ ఉండే స్టైలులలో వస్తాయి.
  • గాలి ఆడే మెటర్నిటీ లోదుస్తులు: ఇది బంప్ రకం స్టైలు మెటర్నిటీ లోదుస్తుల తరగతి కిందకి వస్తుంది. సి-సెక్షన్ ఆపరేషన్ల నుండి కోలుకుంటున్నవారికి ఈ రకం ప్యాంటీలు ప్రత్యేకంగా సాయపడతాయి. ఈ ప్యాంటీలు వెదురు పదార్థంతో తయారవుతాయి. అందుకనే చాలా తేలికగా, సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి పూర్తిగా కవర్ చేయడానికి ముందువైపు V ఆకృతిని, వెనుకవైపు నిలువు గీత ఆకృతిని కలిగివుంటాయి.
  • ఒకటి కంటే ఎక్కువ ట్రైమిస్టర్లకి ఉపయోగపడే లోదుస్తులు: ఈ మెటర్నిటీ లోదుస్తులు కాటన్ అలాగే స్పాండెక్స్ పదార్థాలతో తయారు చేయబడుతాయి. బంప్‌పై వరకూ వచ్చే స్టైలులో వస్తాయి. ఇవి తడిని పీల్చుకునే, గాలి ఆడే బట్టలతో తయారవడంతో పాటు, అడ్జస్ట్ చేసుకోడానికి వీలున్న బ్యాండ్‌తో వస్తాయి. ఇవి నడుము చుట్టూ 360 డిగ్రీలలో చుట్టబడి పొట్టకి సపోర్టునిస్తాయి. మీ బంప్‌ని ఇవి పూర్తిగా కవర్ చేయగలిగినప్పటికీ మరీ పైవరకూ లాగి వేసుకోకూడదు.
  • రక్షణ కల్పించే మెటర్నిటీ లోదుస్తులు: ఈ రకమైన ప్యాంటీల రకం గర్భసమయంలో లేదా డెలివరీ తర్వాత కూడా లీకవ్వకుండా అదనపు లీక్-ప్రూఫ్ రక్షణని జోడిస్తుంది. దీని యొక్క తడిని పీల్చుకునే ఎలాస్టెన్ ఫ్యాబ్రిక్ ప్యాంటీని పొడిగా ఉంచుతుంది. దీనికి రెండు-లేయర్ల నడుము పట్టీలు ఉంటాయి. కానీ వాటిని ఒకటి నుండి నాలుగు ట్రైమిస్టర్లలో మాత్రమే వాడుతారు.
  • అన్నిటికన్నా సెక్సీగా ఉండే ప్రెగ్నెన్సీ లోదుస్తులు: ఇవి ప్రెగ్నెన్సీ ప్యాంటీలంటే రకరకాలుగా గందరగోళంగా ఉండాల్సిన అవసరం లేదని నిరూపించే లేసుల బ్రీఫ్‌లు. ఇవి ముందువైపు బంప్ పెరగటానికి వీలునిస్తూ V ఆకారంలో ఉంటాయి. వెనుక తెరవబడి ఉండి మరింత ఆకర్షణనిస్తుంది. ఇది సన్నని సాగే ఎలాస్టిక్ నడుము పట్టీ, సున్నితమైన ఫ్యాబ్రిక్ కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా 100 శాతం కాటన్‌తో తయారు చేయబడుతుంది.
  • అన్నిటికన్నా ఎక్కువగా అడ్జస్ట్ చేయగల లోదుస్తులు: ప్రెగ్నెన్సీ సమయంలో, మీ శరీరం చాలా మారుతుంది. అందుకని మీ బట్టలు కూడా దానికి అనుకూలంగా మారితే మంచిది. ఈ బంప్‌పై నిలిచే మెటర్నిటీ లోదుస్తుల రకం, అడ్జస్ట్ చేయగల నడుము పట్టీ డిజైన్‌తో వస్తాయి. వీటిని మీ అవసరం బట్టి మీకు కావల్సిన విధంగా నడుముపై బిగుతుగా లేదా లూజుగా పెట్టుకోవచ్చు.
  • \చర్మానికి అనుకూలమైన మెటర్నిటీ లోదుస్తులు: ఈ రకం ప్యాంటీలు మరీ తక్కువ ఎత్తు వరకు వస్తాయి. కాటన్, స్పాండెక్స్‌లతో తయారవుతాయి. ఇవి మీ పెరుగుతున్న పొట్ట కింద వరకూ వస్తాయి. వెనకవైపు మధ్యస్థంగా కప్పి ఉంచుతాయి. అలా వీపుకి కూడా సపోర్టు అందిస్తాయి. వీటి మెత్తనైన, ల్యాబ్-సర్టిఫై చేసిన మెటీరియల్ చర్మంపై ర్యాషెస్ రాకుండా నివారిస్తుంది. దీని లోపల క్రోచ్‌తో తయారైన లైనింగ్ ఉంటుంది. ఇవి స్పాటింగ్ లేదా స్రావాలు జరిగినప్పుడు సులభంగా గుర్తించడానికి సాయపడతాయి.
  • పర్యావరణానికి అనుకూలమైన లోదుస్తులు: ఈ రకం ప్యాంటీలు అధిక నాణ్యత కలిగిన కాటన్ ఇంకా స్పాండెక్స్‌లతో తయారుచేయబడి, ఎక్కువకాలం మన్నుతాయి. ఇవి పొట్టపై ఒత్తిడిని నివారించడానికి కాటన్ క్రోచ్‌ల యొక్క మిశ్రమ లేదా క్రాస్ ఓవర్ డిజైన్ని కలిగివుంటాయి.
  • తడిని పీల్చుకునే మెటర్నిటీ లోదుస్తులు: ఈ రకమైన ప్యాంటీలు ఎలాస్టిక్‌తో ముడివేసి ఉంటాయి. లోపల క్రోచ్ లైనింగ్ ఉంటుంది. ఇవి సరైన పరిశుభత పాటించడంలో సాయపడతాయి. అదనంగా కాళ్ళు నిలపడానికి ఉండే వెడల్పాటి పట్టీలు తొడలపై ఏ రాపిడి రాకుండా అడ్డుకుంటాయి.

సి-సెక్షన్ తర్వాత వేసుకునే లోదుస్తులు

ఒకవేళ మీకు సి-సెక్షన్ జరిగినట్లయితే, మీకు డెలివరీ అయిన తర్వాత నొప్పిగా అన్పించవచ్చు కాబట్టి వదులుగా ఉండే ప్యాంట్లు వేసుకోవటం మంచి ఆలోచన. నడుముకి పైవరకూ వచ్చే హై వెయిస్ట్ లోదుస్తులు వేసుకోవడం మంచిది. అప్పుడు అవి మీ గాయానికి రాపిడి తగలకుండా చూసుకుంటాయి. ఒకవేళ మీకు సి-సెక్షన్ ఆపరేషన్ జరిగినట్లయితే కాటన్ లోదుస్తులు వేసుకోమని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారు.

చివరిమాట

మీరు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఆకర్షణీయంగా ఉండే విధంగా మెటర్నిటీ లోదుస్తులు ఇదివరకు కాలంలో వాటికన్నా ఇప్పుడు చాలా మారాయి. బరువు పెరగటం ఇంకా స్ట్రెచ్ మార్క్స్ లాంటి వచ్చే చాలా శారీరక మార్పుల కోసం, మారుతున్న మీ ఆకృతి ఇంకా మీ గురించి మీరు సెక్సీగా ఫీలవడానికి కూడా కొన్ని అందమైన లోదుస్తులు కొనడం సాయపడవచ్చు. ప్రస్తుతకాలంలో మెటర్నిటీ లోదుస్తులు అందమైన శైలులు, లేసులతో, పుష్కలంగా అనేక రకాల డిజైన్లు, రంగులలో అందుబాటులో ఉన్నాయి. మెటర్నిటీ లోదుస్తులకి, డెలివరీ ముందైనా, తర్వాతైనా కాటన్ అలాగే సహజ పదార్థాలతో తయారైన బట్టలు చాలా మంచివి. ఎందుకంటే వాటిల్లో గాలి ఆడుతుంది. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు సౌకర్యంగా ఉండటం చాలా ముఖ్యం.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.