


Conception
3 November 2023 న నవీకరించబడింది
అద్భుతమైన సెక్స్ జీవితాన్ని కలిగి ఉండడం అనేది ఎన్నో విషయాల కలయిక. అందులో ఒకటి మీ జీవిత భాగస్వామితో ఆకస్మికంగా జరిగే కలయిక. ఆకస్మిక కలయిక అనేది మీ జీవితభాగస్వామికి ఎక్కడా లేని ఎనర్జీని (బూస్ట్) అందజేస్తుంది. అటువంటి సమయాల్లో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి అంత తెలివిగా ఉండవు. ఎటువంటి రక్షణ (గర్భనిరోధకాలు వాడకుండా) లేకుండా సెక్స్ చేయడం చాలా సరదాగానే ఉంటుంది. కానీ అలా చేసే ముందు మనం చాలా విషయాల గురించి తెలుసుకోవాలి.
భర్త (మగ వ్యక్తి) భావప్రాప్తి పొందకపోతే ఎటువంటి గర్భనిరోధకాలు లేకుండా సెక్స్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా రోజుల నుంచి చేస్తూ వస్తున్నారు. కానీ మీరు ప్రీకమ్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఇలా చేయాలా వద్దా? అనే ఆలోచనలో పడిపోతారు. ప్రీకమ్ (ప్రీ స్ఖలనం) మరియు భావప్రాప్తి అనేవి రెండు వేర్వేరు భావనలు. ఇవి రెండూ వివిధ స్థాయిల్లో గర్భదాల్చేందుకు కారణం అవుతాయి. ఎటువంటి రక్షణ లేకుండా భావప్రాప్తి పొందడం అనేది గర్భానికి కారణం అవుతుందనేది ఇప్పటికే చాలా మంది జంటలకు తెలుసు. కానీ ప్రీకమ్ (ప్రీ స్ఖలనం) సంగతేంటి? ప్రీకమ్ ద్వారా గర్భం దాల్చే అవకాశం ఎంత? మీరు ఈ ప్రశ్నకు జవాబు గురించి చూస్తుంటే మీరు తెలుసుకునేందుకు సరైన ప్రదేశంలోనే ఉన్నారు.
ప్రీకమ్ అనేది మగవారి శరీరంలో ఉత్పత్తి చేయబడే సహజ ద్రవం. ఎప్పుడైతే వారు ఉద్రేకానికి లోనవుతారో అప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. ఇది సహజ లూబ్రికెంట్‌గా కూడా పని చేస్తుంది. ప్రీకమ్ను ప్రీ ఎజాక్యులేషన్ లేదా ముందస్తు స్ఖలనం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది స్ఖలనానికి ముందు విడుదల చేయబడుతుంది. సామాన్యుల పరంగా ఇది ఒక భావప్రాప్తి లాంటిదే. ప్రీకమ్ లో పురుష పునరుత్పత్తి వ్యవస్థలోని అనేక భాగాలు ఉంటాయి. వీటిల్లో ఎంజయంలు, ప్రొటీన్లు, శ్లేష్మం మొదలయినవి మరిన్ని ఉంటాయి.
పురుష పునరుత్పత్తి వ్యవస్థలో ప్రీకమ్ యొక్క రోల్.. సెక్స్ (కలయిక) మరియు పెనట్రేషన్ (చొచ్చుకుపోవడం) ఎటువంటి ఆటంకం లేకుండా స్మూత్‌గా ఉండేలా చేయడం. యోనిలో అధిక మోతాదులో ఆమ్ల వాతావరణం ఉంటుంది. వీర్యం జీవించే అవకాశాలను ఇది తగ్గిస్తుంది. ఎటువంటి అడ్డంకి (కండోమ్) వంటివి లేకుండా పురుషాంగం యోనిలోకి చొచ్చుకుపోయిన తర్వాత విడుదల చేసిన వీర్యం జీవించి ఉండేందుకు కావాల్సిన ph విలువలను మెయింటేన్ చేసేందుకు ప్రీకమ్ సహాయపడుతుంది. అంతే కాకుండా ప్రీకమ్ అనేది ఒక ద్రవంగా పని చేస్తూ సెక్స్ చేసేటపుడు వచ్చే బాధాకరమైన నొప్పులను తగ్గిస్తుంది.
పైన పేర్కొన్న విధంగా ప్రీకమ్ అనేది అనేక ఎంజయంలు, ప్రొటీన్లు, శ్లేష్మాలను కలిగి ఉంటుంది. ప్రీకమ్ యొక్క ముఖ్యమైన భాగం ఏమిటంటే.. అది విడుదలయినపుడు ఎటువంటి వీర్యకణాలను కలిగి ఉండదు. స్ఖలనం అనేది సెమినల్ ప్లాస్మా వంటి వీర్యకణాలు, ఇతర ద్రవాల మిశ్రమాన్ని విడుదల చేసే పురుష పునరుత్పత్తి వ్యవస్థను సూచిస్తుంది. చాలా సందర్భాల్లో స్ఖలనాన్ని వీర్యం అని కూడా పిలుస్తారు. సమయం మరియు సందర్భాన్ని బట్టి ప్రీకమ్ మరియు స్ఖలనాన్ని ఒకే చోట ఉంచబడినప్పటికీ అవి వేర్వేరుగా ఉంటాయి. పరిమాణం, రూపం మరిన్ని విషయాలను కాసేపు పక్కన పెడితే వీటి మధ్య అత్యంత పెద్ద వ్యత్యాసం ఏమిటంటే ప్రీకమ్ లో వీర్యం ఉండదు.
పైన పేర్కొన్న సమాచారం మిమ్మల్ని మరింత గందరగోళానికి గురి చేసి ఉండవచ్చు. కానీ ప్రీకమ్ వల్ల గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే.. వీర్యకణాలు లేకుండా గర్భం ఎలా సాధ్యమవుతుందని? వీర్యకణాలను ఉత్పత్తి చేయని పురుషాంగ గ్రంథి నుంచి ప్రీకమ్ విడుదలవుతుంది. మరియు ఉత్పత్తి చేయబడుతుంది. వృషణాలలో వీర్యం తయారవుతుంది. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. విడుదలయినపుడు ప్రీకమ్ లో వీర్యం లేకపోయినా కానీ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క మూత్రనాళంలో (మూత్రాశయం నుంచి మూత్రం బయటకు వచ్చేది) వీర్యం కలిసే అవకాశం ఉంది. మూత్రనాళం అనేది వీర్యాన్ని ఉత్పత్తి చేయదు. కానీ స్ఖలనం అనేది దాని ద్వారానే జరుగుతుంది. గత స్ఖలనాలకు సంబంధించి మూత్రనాళాల్లో ఏవైనా వీర్యకణాల అవశేషాలు ఉంటే అది ఇప్పుడు ప్రీకమ్ తో కలిసే అవకాశం ఉంటుంది.
ప్రీకమ్ ను భావప్రాప్తి పొందే ముందు వచ్చేది అని అంటారు. ప్రీకమ్ లో వీర్యకణాలు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ వీర్యకణాలతో గర్భం పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ అవకాశాన్ని కొట్టిపారేయలేం. ప్రీకమ్ నుంచి గర్భవతి అయ్యే అవకాశాలు ప్రామాణికమైవని మనకు ఇప్పుడు తెలుసు. ప్రీకమ్ వల్ల గర్భవతి అయ్యే అవకాశాల గురించి మనం ఆశ్చర్యపోవచ్చు. ప్రీకమ్ ద్వారా గర్భవతి అయ్యే అవకాశాలు దాదాపు 15-20 శాతం వరకు ఉన్నాయి. ఎవరైతే పుల్ అవుట్ పద్ధతి (ఎటువంటి రక్షణ లేకుండా సెక్స్ చేసి సరిగ్గా భావప్రాప్తి అయ్యే సమయానికి పురుషాంగాన్ని యోని నుంచి బయటకు తీయడం) ఉపయోగిస్తారో వారికి ఎక్కువగా ఈ పరిస్థితి సంభవిస్తుంది. పుల్ అవుట్ అనేది.. ఎటువంటి సేఫ్టీ (జనన నియంత్రణ లేదా కండోమ్స్) లేకుండా సెక్స్ చేయడం. మరియు పురుషుడు భావప్రాప్తి పొందే ముందు ఆపడం (వీర్యం స్ఖలనం) కాకుండా ఆపడాన్ని సూచిస్తుంది.
ప్రణాళికబద్దమైన గర్భం గురించి ఎటువంటి ఆలోచన లేనపుడు స్కిన్ టూ స్కిన్ పెనట్రేషన్ (చొచ్చుకుపోవడం) మంచిది కాదు. పుల్ అవుట్ పద్ధతులు మరియు ప్రీకమ్ (ప్రీస్ఖలనం)తో సంబంధం కలిగి ఉండడం కూడా ప్రమాదకరమే. మీరు గర్భం పొందే అవకాశాలు చాలా తక్కువగా అనిపించినప్పటికీ స్త్రీ చక్రం ఈ ప్రక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఒక స్త్రీ లోపలికి వీర్యం ఒవొల్యూషన్ (అండోత్సర్గము) సైకిల్ గుండా వెళితే అనుకోని గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దీని అర్థం. ప్రీకమ్ మోతాదు, మరియు వీర్యం పరిమాణం అనేవి హార్మోన్లు, ఉద్రేకస్థాయి, హైడ్రేషన్ లెవల్స్ మొదలయిన వాటి మీద ఆధారపడి ఉంటాయి. మీరు మరియు మీ భాగస్వామి గర్భం దాల్చాలని అనుకునేంత వరకు గర్భనిరోధకాలు ఉపయోగించడం ఉత్తమం.
కెన్ యు గెట్ ప్రెగ్నెంట్ ఫ్రమ్ ప్రీకమ్? వాట్ యు నీడ్ టు నో
రాసింది కోరిన్ మిల్లర్
జూలై 28, 2021న ప్రచురించబడింది.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |