This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

పిల్లలు తమంతట తాముగా ఎప్పుడు తినగలుగుతారు? దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?

Written by - Nayana MukkamalaLast updated: Feb 9, 2026
పిల్లలు తమంతట తాముగా ఎప్పుడు తినగలుగుతారు? దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?
Likes3 Likes|
Read time6 min

పిల్లలలో మార్పు వస్తుంది ఇంకా ప్రతిరోజూ కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. వారు 1 సంవత్సరం వయస్సులో నవ్వడం, పాకడం, తామంతట తామే కూర్చోవడం మొదలైనవి నేర్చుకుంటారు. ఈ అన్ని నైపుణ్యాలతో పాటు, తామంతట తాము ఎలా తినవచ్చో కూడా నేర్చుకుంటారు. బేబీ-లెడ్ వీనింగ్ అనేది పిల్లలకు మొదటిసారిగా ఆహారాలను పరిచయం చేసే ఒక ప్రసిద్ధ పద్ధతి.

బేబీ-లెడ్ వీనింగ్ అంటే ఏమిటి?

వీనింగ్ అంటే తల్లిపాలనే కాకుండా శిశువులు ఘనమైన ఆహారాన్ని కూడా తినడం ప్రారంభించడం. BLW అంటే పిల్లలు సాధారణంగా తమంతట తామే తినడం నేర్చుకోవడం. శిశువులు ద్రవపదార్థాల నుండి జావా ఇంకా మెదిపిన ఘనమైన ఆహారాలను తీసుకొనేలా మారతారు. సాధారణ పరిస్థితులలో, పిల్లలకు చెంచాతో ఆహారం అందిస్తారు. బేబీ-లెడ్ వీనింగ్‌లో శిశువు-తనకు తానుగా ఆహారాన్ని ఎంచుకొని, తల్లితండ్రులు వారికి ఆహారం తినపించకుండా తామే తినడం నేర్చుకుంటారు.

బేబీ-లెడ్-వీనింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలి?

అందుకోసం బిడ్డ సిద్ధమయ్యే వరకు వేచి చూడటం మంచిది. శిశువు మెడ బలం చక్కగా ఉండాలి ఇంకా ఎవరి సహాయం లేకుండా కాస్త ఎత్తైన కుర్చీపై కూర్చోగలగాలి. వారు తమ నోటిలోని ఆహారాన్ని పైకి క్రిందికి ఆడించగలగాలి. 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న చాలా మంది పిల్లలు స్వయంగా ఆహారం తీసుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వారు క్లిష్టమైన ఈ నమిలే పనిని సరిగ్గా చేయలేకపోవచ్చు కానీ మెత్తనైనా, వండిన ఆహారాన్ని సౌకర్యవంతంగా తినగలుగుతారు. చేతిలోని బొటనవేలు కాకుండా ఇతర వేళ్లను అరచేతి వైపుకి ఒకచోట చేర్చి, పళ్ళెంలోని ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ సామర్థ్యం దాదాపు 9 నెలల వయస్సులోనే వృద్ధి చెందుతుంది. దాదాపు 6-9 నెలల తర్వాత బేబీ-లెడ్ వీనింగ్ మొదలుపెట్టడం మంచిది.

బేబీ లెడ్ వీనింగ్ ప్రయోజనాలు

  • శిశువుకు తినిపించే ఆహారాల ఖరీదు కాస్త ఎక్కువ కనుక ఈ పద్ధతి సమయాన్ని ఇంకా డబ్బుని ఆదా చేస్తుంది. దీనితో తల్లులు విడిగా భోజనం సిద్ధం చేయాల్సిన పనిలేదు.
  • పిల్లలు సామాజికంగా ఎలా మెలగాలో నేర్చుకుంటారు మరియు కుటుంబం ఇంకా బంధం అనే భావనను అర్థం చేసుకోవడం మొదలుపెడ్తారు.
  • ప్యాక్ చేసిన ఇంకా జావా లాంటి ఆహారాలు ఒకేలా ఉండడమే కాకుండా దొరికే రుచులు ఎక్కువగా లేనందున, దీనివల్ల వారు అనేక రకాల ఆహారాలను తినగలుగుతారు. ఇంట్లో తయారుచేసిన ఆహారాలు విభిన్నమైన దినుసులు ఇంకా రుచులను కలిగి ఉంటాయి.
  • మంచి ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది.
  • ఇది పిల్లలలో ఊబకాయం రాకుండా నిరోధిస్తుంది. పిల్లలు తమ ఆకలిపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉంటారు ఇంకా వారు కడుపు నిండినప్పుడు తినడం మానేయవచ్చు.
  • ఆహారాన్ని తీసుకోవడం, నమలడం మరియు మింగడం వంటి వాటికి నిర్దిష్ట స్థాయి నైపుణ్యాలు అవసరం కాబట్టి వారికి చక్కటి చలన సామర్ధ్యమే కాక నోటిని ఉపయోగించే నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి.
  • భోజన సమయంలో టీవి, ఇంకా మొబైల్ చూడటాన్ని తగ్గిస్తుంది.

బేబీ లెడ్ వీనింగ్ ఎంతవరకు సురక్షితం?

పిల్లలని స్వయంగా తినగలిగే స్వేచ్ఛనివ్వడం సురక్షితం. ఒక్కొక్క బిడ్డకి ఒక్కో సమయంలో ఆహారం తీసుకోవడం అలవరచుకుంటుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు వారికి తగిన సమయాన్ని దీనికోసం కేటాయించాలి. కొందరికి కొన్ని నెలలు ఎక్కువ సమయం పట్టవచ్చు. పిల్లలకి వారు జారిపోకుండా లేదా క్రిందికి జారకుండా, వారి వీపుకి బాగా ఊతమిచ్చే హైచైర్‌పై కూర్చోబెట్టాలని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి.

బేబీ-లెడ్ వీనింగ్ మొదలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన భద్రతా టిప్స్

  • గ్యాగింగ్ అనేది గొంతుకు ఏదైనా అడ్డుపడినప్పుడు వచ్చే చాలా సాధారణ ప్రతిచర్య, దీని వలన పిల్లలకి దగ్గు వస్తుంది ఇంకా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. కానీ గ్యాగింగ్ అనేది గొంతుకు ఏదైనా అడ్డుపడినప్పుడు దానిని బయటకు పంపేందుకు అసంకల్పితంగా భద్రతనిచ్చే ప్రతిచర్య
  • అలా కాకుండా, ఆహారం గొంతులో చిక్కుకుపోయినప్పుడు ఉక్కిరిబిక్కిరి అవడం ఇంకా శిశువు ఒక రకమైన శబ్దాలు చేయడం జరుగుతుంది.
  • పాప్‌కార్న్, ద్రాక్ష, ఎండుద్రాక్ష, హాట్ డాగ్‌లు ఇంకా పచ్చి కూరగాయలు వంటి గొంతుకి అడ్డుపడే వాటిని నివారించడం ద్వారా ఆహారం గొంతుకి అడ్డుపడకుండా ఆపవచ్చు.
  • తల్లిదండ్రులు హీమ్లిచ్ యుక్తి(గొంతులోని అడ్డంకిని తొలగించడానికి చేసే ప్రధమ చికిత్సా విధానం)ని అవగాహన చేసుకుంటే కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ముందుజాగ్రత్తగా, ఈ దశలను అనుసరించాలి:
  • శిశువు తినేటప్పుడు వారి చుట్టూ ఉంటూ వారిని ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి.
  • తినేటప్పుడు శిశువు నిటారుగా కూర్చుని ఉండే విధంగా చూడాలి.
  • తినేందుకు సులువుగా ఉండే ఆహారం అందించాలి. యాపిల్స్, ద్రాక్ష, సాసేజ్‌లు, బాదం పప్పులు, ఎండుద్రాక్షలు మొదలైన ఆహారాలకు దూరంగా ఉండాలి.
  • శిశువుపై హేమ్లిచ్ యుక్తిని ఎలా వాడాలో అనే వాటి ప్రాథమికాలను నేర్చుకోవాలి.
  • బిడ్డ గగ్గోలు పెట్టి ఏడ్చినప్పుడు భయపడకూడదు ఎందుకంటే తల్లితండ్రులు భయపడటం చూసి పిల్లలు కూడా భయపడవచ్చు. ఇది పిల్లలు ఆహారం తీసుకోవడంపై మరింతగా ప్రతికూల ప్రభావాలను పెంచుతుంది.

బేబీ-లెడ్ వీనింగ్ ఎలా ప్రారంభించాలి?

  • తల్లిదండ్రులు మొదట బిడ్డలు ఇందుకు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేది గుర్తించగలగాలి. ఇంకా శిశువైద్యునితో సంప్రదించాలని తెలుసుకోవాలి.
  • శిశువుకి చెంచాతో తినడం సౌకర్యంగా ఉంటే, అది మానడానికి సమయం ఇవ్వాలి. 6 నెలల్లో చాలా మంది పిల్లలు గోరుముద్దలకు సిద్ధంగా ఉండరు. అంతేకాకుండా, బేబీ-లెడ్ వీనింగ్ మొదలుపెట్టిన 2 నెలలలో, వారు ఆహారాన్ని, తాకడం, చప్పరించడం ఇంకా అవి ఏమిటో అని గమనిస్తారే తప్ప తినడం ఎక్కువగా ఉండదు.
  • పిల్లలు తినడం నేర్చుకునేటప్పుడు వారు ఆహారాన్ని గమనిచడం, తెలుసుకోవడమే కాక నేలపై, తమపై ఎక్కడ పడితే అక్కడ పారవేస్తుంటారు, అందువల్ల వీటన్నిటికి సిద్ధపడి ఉండాలి, ఇలా చేయలేని ఆహారాన్ని అందించడం ద్వారా ఇలాంటివి ఎక్కువ అవకుండా చేయవచ్చు.
  • అందరితో కలిసి టేబుల్‌పై బొంచేస్తున్నప్పుడు పిల్లలను కూడా ఆహ్వానించాలి. కొద్దిగా మెత్తగా వండిన అవే పదార్ధాలను వారికి అందించాలి. ఇతరులను చూసి వారు కూడా తినడం నేర్చుకుంటారు.
  • ఈ వయస్సులో చాలా మంది శిశువులకు తల్లిపాలు పడుతున్నందువల్ల, పిల్లలకి సరైన పోషకాహారం అందడం లేదనే దిగులు మాని తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండవచ్చు.
  • తినడమనేది ప్రతిరోజూ సహజంగా జరిగే చర్యగా భావించాలి. వారిని తిట్టడం లేదా పొగడటం చేయకూడదు.

ఉత్తమ బేబీ-లెడ్ వీనింగ్ ఆహారాలు

తగిన పరిమాణాలు ఇంకా దినుసులతో కూడిన ఆహారాన్ని మొదలుపెట్టడం వలన ఆహారం గొంతులో ఇరుక్కొనే ప్రమాదాలను నివారించడం ద్వారా శిశువులకు మంచి ప్రోత్సాహం దొరుకుతుంది. బిడ్డకు పాలు పట్టేటప్పుడు, తల్లిపాలు లేదా ఫార్ములా పాలు శిశువుకు అవసరమైన ఎన్నో కేలరీలను అందిస్తూనే ఉంటుంది. వారు తల్లి పాలు లేదా ఫార్ములా పాలపై ఆధారపడటం క్రమంగా తగ్గుతుంది, ఎందుకంటే వారు తీసుకొనే ఘనపదార్థాల పరిమాణం పెరుగుతుంది కాబట్టి.

ప్రారంభపు ఆహారాలు:

  • ఉడికించిన గుమ్మడికాయ
  • అవకాడో
  • పొట్టు తీసిన నారింజ తొనలు
  • అరటిపండు
  • కాల్చి తొక్క తీసిన బంగాళాదుంప
  • ఉడికించిన క్యారెట్లు, బ్రోకోలీ ఇంకా బీన్స్
  • మెదిపిన బెర్రీలు
  • తియ్యని పెరుగు
  • సాల్మన్
  • ఉడికించిన గుడ్డు
  • వోట్మీల్

ముగింపు

బేబీ-లెడ్ వీనింగ్ అనేది పిల్లలకు ఘనమైన ఆహారాన్ని పరిచయం చేసే ప్రత్యామ్నాయ పద్ధతి. ఇది వివిధ ప్రయోజనాలను కలిగి ఉంది, కానీ జాగ్రత్తగా ఉండటం అవసరం. బేబీ-లెడ్ ఫీడింగ్ ఆరోగ్యకరమైన సామాజిక ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది ఇంకా శిశువులకు ఆహారాన్ని ఎక్కువ ఇవ్వడాన్ని తగ్గిస్తుంది. పిల్లలు ఈ ప్రక్రియను నేర్చుకోవడానికి, అన్వేషించడానికి ఇంకా ఆనందించడానికి ఇది మొదలుపెట్టే ముందు సరైన రకమైన ఆహారం ఇంకా దినుసులను ఎంచుకోవడం కీలకం.

z

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.