This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి? | Childhood Disorders: Meaning, Symptoms & Treatment in Telugu

Baby Care
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 22, 2023
చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి? | Childhood Disorders: Meaning, Symptoms & Treatment in Telugu
Read time6 min

ఇతర పిల్లల నుంచి వేరుగా ఉండే పిల్లలను మీరు చూసే ఉండవచ్చు. వారు ఎందుకలా ఉన్నారని ఎప్పుడైనా ఆలోచించారా? వారు పుట్టుకతో వచ్చే లోపాలు లేదా అభివృద్ధి సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. కానీ వారు పాఠశాలకు వెళ్లినపుడు మాత్రమే ఈ వ్యాధి ఉందని నిర్దారణ అవుతుంది. పిల్లల డిజార్డర్స్ అనేవి లెర్నింగ్ లేదా డెవలప్​మెంటల్ కావొచ్చు. చాలా మంది పిల్లలలో జీవితంలో లేటు వయసులో ఇది నిర్దారణ అవుతుంది. పిల్లల టీనేజ్​లో లేదా వారు పెద్దవారిగా మారినపుడు ఇలా జరుగుతుంది.

పిల్లలు ఒకటి కంటే ఎక్కువ చైల్డ్​హుడ్ డిజార్డర్స్​తో బాధపడడం సాధారణంగా జరిగే విషయమే. వాస్తవం చెప్పాలంటే కేవలం USAలో మాత్రమే 20 శాతం మంది పిల్లలు చైల్డ్​హుడ్ డిజార్డర్స్ లేదా మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. అది వారి పెరుగుదలలో అభివృద్ధిని అడ్డుకుంటుంది. చైల్డ్​హుడ్ డిజార్డర్స్​ను చిన్నవయసులోనే గుర్తించడం, నిర్దారించడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల పిల్లలు అదే బాధతో పెద్దవారిగా మారకుండా ఆపవచ్చు. డిజార్డర్​ను గుర్తించడం వల్ల అది పూర్తిగా తొలగిపోకపోవచ్చు. కానీ పిల్లవాడు దానిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా వారి కుటుంబం పిల్లవాడి బలాలు మరియు బలహీనతలు ఏంటో బెటర్​గా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అన్నింటికంటే ముందుగా.. ఒక పిల్లవాడు తమ కుటుంబంతో, సమాజంతో ఉండేందుకు చికిత్స పొందేందుకు అర్హుడు. చైల్డ్​హుడ్ డిజార్డర్స్ మరియు చైల్డ్​హుడ్ మెంటల్ డిజార్డర్స్ వంటి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

చిన్నతనం నాటి రుగ్మతలు (చైల్డ్​హుడ్ డిజార్డర్స్) అంటే ఏమిటి? (What are childhood disorders in Telugu)

చైల్డ్​హుడ్ డిజార్డర్స్ అనేవి పిల్లలు నేర్చుకునే లేదా వారి అభివృద్ధిపై ప్రభావం చూపెట్టే సమస్యలుగా తలెత్తుతాయి. వీటిలో ప్రవర్తనా లోపాలు, శారీరక వైకల్యాలు, భాష లేదా నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉండవచ్చు. సాధారణంగా చైల్డ్​హుడ్ డిజార్డర్​తో బాధపడుతున్న పిల్లవాడికి దైనందిన జీవితంలో చేసుకోవాల్సిన పనులకు ఇబ్బంది కలుగుతుంది. అంతే కాకుండా చైల్డ్​ డిజార్డర్స్​తో బాధపడని పిల్లవాడికి కూడా. సాధారణంగా చైల్డ్​హుడ్ డిజార్డర్స్​ శాశ్వతంగా ఉంటాయి. అవి వ్యక్తి జీవితాంతం ఉంటాయి. అవి పూర్తిగా నయం చేయలేనపుడు వాటిని ఎలా ఎదర్కోవాలో నేర్చుకోవాలి.

సాధారణ చైల్డ్​హుడ్ డిజార్డర్స్​లో బిహేవియర్ సమస్యలు(ప్రవర్తనా సమస్యలు), ఆందోళన, ADHD మరియు నిరాశ ఉంటాయి. చాలా మంది పిల్లలు తరచూ ఈ మానసిక రుగ్మతలతో బాధపడతారు. ఆటిజం, మేధో వైకల్యం, లేదా ప్రవర్తన రుగ్మత కావచ్చు. శుభవార్త ఏమిటంటే.. ఇవి చైల్డ్​హుడ్ డిజార్డర్స్​గా పరిగణించబడినా పిల్లలు వారి ప్రవర్తన గురించి మరింత అభిజ్ఞాపరంగా తెలుసుకునేందుకు కోపింగ్ మెకానిజమ్స్ (వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవడం) నేర్చుకోవాలి. తద్వారా వారు సమాజంలో సాధారణంగా పని చేసుకుంటూ ఉండవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ఈటింగ్ డిజార్డర్స్: అర్థం, కారణాలు, రకాలు & చికిత్స

చిన్నతనం నాటి రుగ్మతల లక్షణాలు (Symptoms of childhood disorders in Telugu)

ఒక పిల్లవాడు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకునేందుకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. చైల్డ్​హుడ్ డిజార్డర్స్ అనేవి పిల్లలకు ఎదురయ్యే సమస్యలపై ఆధారపడి మారుతూ ఉంటాయి. కొన్ని రకాల సాధారణ లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే..

  1. పిల్లలు ఎంత కృషి చేసినప్పటికీ పాఠశాలలో సరైన విధంగా పర్ఫామ్ చేయకపోవడం లేదా పేలవమైన గ్రేడ్స్
  2. ఇతరులతో సరిగ్గా సోషలైజ్ కాకపోవడం
  3. పాఠశాలలో కార్యకలాపాలను భరించలేకపోవడం లేదా నిరంతరం చిరాకు
  4. నిరంతరం ఏదో కోల్పోయినట్లుగా ఉండడం లేదా బాధ
  5. ఎక్కువగా రియాక్ట్ కావడం
  6. ఇతరులకు హాని కలిగించేలా ప్రవర్తించడం
  7. తనను తాను బాధించుకోవడం లేదా తనను తాను బాధించుకోవడం గురించి మాట్లాడడం; ఆత్మహత్య లేదా చావు గురించి మాట్లాడడం
  8. ఇతరులతో ఇంటరాక్షన్స్​ను నియంత్రించడం
  9. తరచుగా జరిగే ఎమోషనల్ ఔట్​బరస్ట్ (విస్పోటనం చెందడం)
  10. ఆందోళన, ఒత్తిడి, లేదా టెన్షన్ గురించి స్థిరమైన ఫీలింగ్స్
  11. ఎవరూ ఊహించని విధంగా మాట్లాడడం మరియు అసాధారణమైన ఆలోచనలు రావడం
  12. ప్రవర్తనా, ఆహారం లేదా నిద్ర అలవాట్లలో ఆకస్మిక మార్పులు

చైల్డ్​హుడ్ డిజార్డర్​కు చికిత్స (Treatment of childhood disorders in Telugu)

చైల్డ్​హుడ్ డిజార్డర్స్ పిల్లలకు మాత్రమే కాకుండా వారి చుట్టూ ఉన్న పిల్లలకు కూడా సవాలుగా మారవచ్చు. కానీ ఇందులో శుభవార్త ఏమిటంటే.. వాటికి చికిత్స చేయవచ్చు. చైల్డ్​హుడ్ డిజార్డర్​కు సరైన నివారణ లేకపోయినా కానీ ఆ లక్షణాలను ఎలా అదుపులో ఉంచాలో పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలకు వచ్చిన డిజార్డర్​ను బట్టి.. వైద్యులు మరియు థెరపిస్ట్​లు అభిజ్ఞా ప్రవర్తనా చికిత్స లేదా మందులను సిఫారసు చేస్తారు.

సాధారణ చైల్డ్​హుడ్ డిజార్డర్స్​కు ఉన్న చికిత్సలు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం.

1. మందులు (Medication)

చైల్డ్​హుడ్ డిజార్డర్స్​కు సంబంధించి.. యాంటీ డిప్రెసంట్స్ లేదా మూడ్ స్టెబిలైజర్ల రూపంలో మందులను వైద్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులు సిఫారసు చేయవచ్చు. బ్రేక్​అవుట్స్ మరియు సైకోటిక్ ఎపిసోడ్​లతో బాధపడుతున్న పిల్లలకు యాంటీ సైకోటిక్ మందులు కూడా ఇవ్వవచ్చు. ఎటువంటి మందులు ఇచ్చారనేది పిల్లలకు నిర్దారణ కాబడిన పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది.

2. థెరపీ (Therapy)

తరచూ పిల్లలలో ఉన్న లక్షణాలను అరికట్టేందుకు చికిత్సకు వెళ్లమని సిఫారసు చేయవచ్చు. చికిత్స అనేది వారి అభిజ్ఞా సామర్థ్యాలు లేదా ఇంటర్ పర్సనల్ కోసం కావచ్చు.

3. విశ్లేషణ (Analysis)

పిల్లలను మానసిక విశ్లేషణ లేదా సహాయక మానసిక చికిత్స లేదా సైకోడైనమిక్ సైకోథెరపీ కోసం వెళ్లమని సిఫారసు చేయొచ్చు.

చైల్డ్​హుడ్ డిజార్డర్స్​కు కారణాలు (Causes of Childhood Disorders in Telugu)

దురదృష్టవశాత్తు పిల్లలు పుట్టిన నాటి నుంచే చైల్డ్​హుడ్ డిజార్డర్ లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. ఈ రుగ్మతలు జన్యుపరమైన కారణాలు లేదా పుట్టుకతో వచ్చే లోపాల వల్ల కావచ్చు. పిల్లలు కూడా తమంతట తామే చైల్డ్​హుడ్ డిజార్డర్స్​ను డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు జీవితంలోని ప్రారంభదశలో ఎమోషనల్ ట్రామా(మానసికంగా గాయం కావడం) లేదా ఒత్తిడికి లోనవుతారు. అంతే కాకుండా మెదడులోని రసాయనాల అసమతుల్యత లేదా చిన్నతనంలోనే మెదడు ఇంజూరీ కావడం వల్ల కూడా చైల్డ్​హుడ్ డిజార్డర్స్ సంభవించవచ్చు. జీవిత అనుభవాలైన ఒత్తిడి, నిందలు, లేదా నష్టం వంటి ఇతర కారణాలు కూడా పిల్లలు చిన్నతనంలోనే బలమైన మానసిక డిజార్డర్స్ డెవలప్ చేసే అవకాశం ఉంది. గర్భవతులు లేదా ఆశించే తల్లులు తమ ప్రెగ్నెన్సీ జర్నీలో వివిధ రకాల వైరస్ దాడులకు లేదా విషపూరిత రసాయనాలకు గురికావచ్చు. ఈ కారణాలు వారికి పుట్టబోయే పిల్లలకు చైల్డ్​హుడ్ డిజార్డర్స్ వచ్చేలా చేస్తాయి.

References

1. Scott JG, Mihalopoulos C, Erskine HE. (2016). Childhood Mental and Developmental Disorders. In: Patel V, Chisholm D, Dua T, et al., editors. Mental, Neurological, and Substance Use Disorders: Disease Control Priorities.

2. Reiss AL. (2009). Childhood developmental disorders: an academic and clinical convergence point for psychiatry, neurology, psychology and pediatrics. J Child Psychol Psychiatry.

Tags

What is Childhood Disorder in Telugu, Symptoms of Childhood Disorder in Telugu, Treatment of Childhood Disorder in Telugu, Causes of Childhood Disorder in Telugu, Childhood Disorders in English, Childhood Disorders in Hindi, Childhood Disorders in Tamil, Childhood Disorders in Bengali

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.