This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your ovulation on mylo app

గృహిణి వృత్తి అంటే ఏమిటి? ఈ పోస్ట్ లో ఎన్ని బాధ్యతలుంటాయో తెలుసా?

Getting Pregnant
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గృహిణి వృత్తి అంటే ఏమిటి? ఈ పోస్ట్ లో ఎన్ని బాధ్యతలుంటాయో తెలుసా?
Read time11 min

మీరు రోజు మొత్తం ఇంట్లోనే ఉంటే మీ జాబ్​ ఏంటనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కనుక ఆసుపత్రికి లేదా ఆదాయపు పన్ను ఫారాలను నింపేటపుడు వృత్తి పక్కన ఉన్న ఖాళీలో ఏం నింపుతారు? మీరు ఇంతవరకు ఎప్పుడైనా గృహిణి లేదా హోమ్​మేకర్​ వృత్తిని చట్టబద్ధమైనదే అని ఆలోచించారా? లేక ఆ బ్లాంక్​ను అలాగే ఖాళీగా వదిలేసారా?

గృహిణికి అర్థం ఏమిటి?

తమ కోసం లేదా ఇతరుల కోసం ఇంటి పనిని నిర్వర్తించే బాధ్యతను తీసుకునే ఆడవారిని గృహిణులు అని అంటారు. వాస్తవం చెప్పాలంటే వీరు ఇల్లు నడిచేందుకు అవసరమైన వనరులను సమకూర్చేందుకు బాధ్యత వహిస్తారు. గృహిణిగా ఉన్నపుడు మీరు సాధారణ వ్యక్తిగత పనులతో పాటుగా ఇంటి కోసం అవసరం అయ్యే ఇతర పనులను కూడా చేయాల్సి ఉంటుంది. ఇంటిలోని పనులను వివిధ సభ్యులకు అప్పగించే అధికారం గృహిణికి కూడా ఉంటుంది. గృహిణికి తన రోజూవారీ పనుల్లో సాయం చేసేందుకు కుటుంబంలో భాగం కాని వ్యక్తులు అనేక సార్లు నియమించబడతారు. ప్రతి వ్యక్తికి కొన్ని పనులతో పాటుగా ప్రతి ఇంటికి కూడా ఒక కీర్తి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధులు వ్యక్తి అవసరాలు, వయస్సు, మొత్తం సంపాదన, అతని రోజువారీ అలవాట్లను బట్టి మారవచ్చు.

చాలా మంది వ్యక్తులు గృహిణిగా తమ వృత్తిని పేర్కొనేందుకు ఇబ్బందిగా ఫీలవుతారు. అది మాత్రమే కాకుండా ఏవైనా పత్రాలు నింపేటపుడు ఆక్యుపేషన్ (వృత్తి) పక్కన ఏమీ రాయకుండా ఖాళీగా ఉంచేందుకు ఇష్టపడతారు. మీరు కూడా ఇలాగే చేస్తుంటే.. నేటి సమాజంలో గృహిణి పాత్రకు ఉన్న విలువ ప్రయోజనాలు, ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు మీరు ఖచ్చితంగా ఈ ఆర్టికల్​ను చదవాలి.

గృహిణి చేసే కొన్ని రకాల పనులు ఏమిటి?

తమ ఇళ్లు సజావుగా సాగేలా చూసుకునే బాధ్యతను గృహిణులు తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా చక్కగా అందంగా అలంకరించిన ఉన్న ఇంటిని చూసినట్లయితే అలా అందంగా మార్చేందుకు గృహిణి ఎంత శ్రమించి ఉంటుందో అనే విషయం మీకు అర్థం అవుతుంది. తాము ఎటువంటి రకమైన ఇంటిపనిని చేపట్టాలనుకుంటున్నామో గృహిణులు నిర్ణయించుకోవచ్చు. గృహిణి హౌస్​వైఫ్, హౌస్ కీపర్, హౌస్ హస్బెండ్ వంటి వివిధ పేర్లతో పిలవబడుతుంది. నిజానికి గృహిణి అనే పదంతో ముడిపడి ఉన్న కొన్ని పదాలు మాత్రమే.

అంతే కాకుండా వారు నిర్వర్తించే పనిని గడువులోగా పూర్తయ్యేలా చూసుకుంటారు. ఊడ్చి ఇంటిని శుభ్రం చేయడం, వ్యాక్యూమ్ చేయడం, వరండాలో ఉన్న దుమ్ము దులపడం వంటి కొన్ని పనులను గృహిణి చేస్తుంది. నిజం చెప్పాలంటే గృహిణి విధులు అంత సులభం కాదు. గృహిణిగా విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పుకోవడానికి చాలా మంది వెనకడుగు వేస్తారు. ఈ వృత్తి అంత గౌవరవించదగ్గది కాదని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. గృహిణుల వల్లే నేడు ఇండ్లు సజావుగా సాగుతున్నాయి. అంతే కాకుండా ఇంటిలోని వారందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండేలా చేసేది గృహిణి. గృహిణి లేకుండా ఇంటి బాధ్యతలను వారి ఆఫీసు బాధ్యతలను చూసుకోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. పిల్లలను కలిగి ఉన్న జంటలకు ఇంట్లో గృహిణి ఉండడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కనుక గృహిణి పాత్రను చేపట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. దాని గురించి ఇంకా ఎటువంటి అపోహలు లేకుండా ఎస్ అనండి.

ఇంటిని నిర్వర్తించడంలో ఏం ఉంటుంది?

ఇంటిని నడిపించేందుకు సహాయపడే గృహిణి విధులు కొన్ని కింద లిస్ట్ చేయబడ్డాయి. మరింత తెలుసుకునేందుకు చదవండి.

1. ఇంటిపనులు

అనేక సందర్భాల్లో​ గృహిణులు ఇంట్లోని ఇతర సభ్యులకు కూడా వంట చేస్తారు. అంతే కాకుండా ఇంట్లో భోజనాలకు వారు వివిధ రకాల ఏర్పాట్లు చేస్తారు. ఆహారం, బట్టలు ఇతర గృహ అవసరాల కోసం షాపింగ్ చేసేందుకు కూడా సమయం వెచ్చిస్తారు. బట్టలు ఉతకడం లేదా డ్రై క్లీనింగ్ చేయడం అనేది గృహిణులు చేసే మరో విధి. వాస్తవం చెప్పాలంటే గృహిణి పాత్ర అనేది ఎంతో విలువైనది. ఇది చట్టబద్ధమైనదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంట్లో గృహిణి లేకపోతే.. ఇంట్లోని విషయాలు అస్తవ్యస్తంగా మారవచ్చు. ఎవరైతే ఆఫీసుల్లో పనులు చేస్తారో వారికి మరింత తలనొప్పిగా మారవచ్చు.

2. బడ్జెట్​ (పొదుపు, ఖర్చులు) మెయింటేన్ చేయడం

గృహిణి కూడా ఇంటికి ఎంత మొత్తం వస్తుంది. ఎంత ఖర్చులకు వెళ్తుందని బడ్జెట్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. బిల్స్​, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పన్ను షెడ్యూల్స్ విషయానికి వస్తే.. గృహిణి అనేక రకాల విధులు మరియు బాధ్యతలను ప్లాన్ చేయాలి. మీరు కనుక గృహిణిని కలిగి ఉంటే.. మీ ఖర్చులు భారీ మొత్తంలో తగ్గించబడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

3. ఇంటికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం

గృహిణుల గురించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వారు రుణాలు, సెలవులు, ఇన్సూరెన్స్​కు సంబంధించిన అనేక విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. నిజం చెప్పాలంటే ప్రతి గృహిణి ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంటిని నిర్వహించే సమయంలో ఈ ప్రత్యేకతలే వారిన మరింత స్మార్ట్​గా తయారు చేస్తాయి. ప్రత్యేకంగా ఉంచుతాయి.

4. బిడ్డ సంరక్షణను చూసుకోవడం

మీకు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే గృహిణులు మరింత ప్రయోజనకరంగా మారవచ్చు. వాస్తవం చెప్పాలంటే మీ బిడ్డకు ఆహారం ఇచ్చేందుకు, దుస్తులు వేసేందుకు, స్నానం చేయించేందుకు కూడా మీకు గృహిణి అవసరం కావొచ్చు. మీ బిడ్డ పెరిగే కొద్దీ బిడ్డకు ఆరోగ్యంగా ఉండే సంతోషకరమైన వాతావరణం ఉండేలా గృహిణి చూసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల పర్యావరణం లేదా భావోద్వేగ సమస్యతో డీల్ చేసేటపుడు పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇది పిల్లలకు సహాయపడుతుంది. అంతే కాకుండా గృహిణి పిల్లలకు వ్యక్తిగత శుభ్రత, మంచి దంత సంరక్షణ అలవాట్లను కూడా నేర్పించవలసి ఉంటుంది. పిల్లల హోం వర్క్​లో సహాయపడడం, వారికి స్నానం చేయించడం, వారిని సరైన మార్గంలో నడిపించడం గృహిణి యొక్క ఇతర కొన్ని బాధ్యతలు. చాలా సందర్భాల్లో గృహిణులు అనారోగ్యంతో ఉన్నవ్యక్తులకు చెందిన గృహాలను జాగ్రత్తగా చూసుకుంటారు.

5. ప్రయాణం

హోమ్ మేకర్స్ వారి కుటుంబసభ్యులను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లే బాధ్యతను కూడా నిర్వర్తిస్తారు. చాలా మంది గృహిణులు తమ కార్లకు చిన్న చిన్న మరమ్మతులు నిర్వహించడంలో మరియు వారి వాయిదాలను చెల్లించడంలో కూడా ముందుంటారు. గృహిణిగా ఆరితేరిన నిపుణులు తమ ఉద్యోగుల ఇళ్లను అలంకరించడం అలవాటు చేసుకుంటారు. కొన్ని సార్లు ఇంటికి పెయింటింగ్ వంటివి వేయించడం కోసం ఎంత దూరమైనా వెళతారు. అంతే కాకుండా గార్డెనింగ్, సామగ్రని క్లీన్ చేయడం కూడా చేస్తారు. దాదాపు ప్రతి ఇంటి అవసరాలు కాలానుణంగా మారవచ్చు. అంతే కాకుండా హోమ్ మేకర్స్ కూడా వేరే చోట్ల ఫుల్ టైమ్ ఉద్యోగాలు లేదా పార్ట్​టైమ్ ఉద్యోగాలలో నియమితులు కావచ్చు. సాధారణంగా చెప్పాలంటే గృహిణులు చాలా సరళమైన అంతే కాకుండా విభిన్న రకాల డ్యూటీలను కలిగి ఉంటారు. ఇదే వారిని సమాజంలో అత్యంత గౌరవమైన మరియు విలువైన వ్యక్తులుగా తయారు చేస్తుంది.

గృహిణిగా మారేందుకు కావాల్సిన విద్యార్హతలు ఏమిటి?

గృహిణిగా కొనసాగేందుకు ఎటువంటి నిర్దిష్ట వయసు, విద్యార్హతలు అక్కర్లేదు. మీరు వంట చేయడం, పిల్లల సంరక్షణ, అంతే కాకుండా క్లీనింగ్ వంటి కొన్ని విషయాలను నేర్చుకుంటే సరిపోతుంది. దేశంలో అనేక కళాశాలలు నేడు హోమ్ మేకింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మీ సంతానం హోమ్ మేకర్ కావాలని అనుకుంటే ఈ కోర్సును చదివితే సరిపోతుంది. హోమ్ మేకింగ్ సిలబస్​లో ఉండే కొన్ని సబ్జెక్టులు కన్య్సూమర్ సైన్స్, సోషియాలజీ, ప్రథమ చికిత్స, గణితం. అంతే కాకుండా అనేక పుస్తకాలు మరియు మ్యాగజైన్స్ కూడా గృహిణి బాధ్యతలను తెలుసుకుని సిద్ధమయ్యేందుకు సాయం చేస్తాయి.

ఇక ఉద్యోగం పొందే విషయానికి వస్తే.. అనేక మంది గృహిణులు ఈ బాధ్యతలను తమ పిల్లలు మరియు భర్తల కోసం తీసుకుంటారు. అనేక సందర్భాల్లో ఇంటి పెద్దలు ఆదాయం సమకూర్చుకునేందుకు బయటే పని చేస్తారు. ఈ ఆదాయాన్ని సాధారణంగా వివిధ రకాల ఇంటి పనుల కోసం గృహిణులు ఉపయోగిస్తారు.

ఈ వృత్తిని చేపట్టాలని అనుకున్నపుడు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి?

మీరు ఈ వృత్తిని కెరీర్​గా తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ వృత్తి కెరీర్ ఆకాంక్షగా పరిగణించబడుతుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. వాస్తవం చెప్పాలంటే మహమ్మారి సమయంలో కూడా ఈ ఉద్యోగం తన వృద్ధిని పెంచుకోగలిగింది. అప్పుడు చాలా మంది వ్యక్తులు వర్క్​ఫ్రం హోంకి మారాల్సి వచ్చింది. అటువంటి సమయంలో వారు తమ పిల్లలు లేదా పెంపుడు జంతువుల అవసరాలను ఎల్లప్పుడూ తీర్చలేరు.

ప్రస్తుతానికి ప్రతి ఇంటికి సాధారణ గృహిణి అవసరం అనే విషయాన్ని పరిగణలోనికి తీసుకుంటే ముందు చూపుతో ఈ కెరియర్​ను ఎంచుకున్నవారు ఎటువంటి ఢోకా లేకుండా నిశ్చింతగా ఉండవచ్చు. ఈ ఉద్యోగం అనేది అధికారిక వృత్తి కాదు కాబట్టి ఈ రంగంలో నిర్దిష్టమైన పురోగతి ఎక్కువగా కనిపించదు. మరో విషయమేమిటంటే.. గృహిణులు అనుభవం ద్వారానే ఈ వృత్తిలో అద్భుతంగా రాణించగలుగుతారు. అన్ని ఉద్యోగాల మాదిరిగానే ఇక్కడ కూడా అనుభవం అనేది కౌంట్ అవుతుంది. గృహిణి ఈ రంగంలో ఎక్కువ దృష్టిని కేంద్రీకరించినందు వలన అందుబాటులో ఉన్న వనరులను ఎలా సమర్దవంతంగా ఉపయోగించుకోవాలో వారు త్వరగానే నేర్చుకుంటారు.

కెరియర్ ఔట్ లుక్ మరియు మొత్తం పురోగతి ఎలా ఉంటుంది

ఒక గృహిణిగా మీరు ఇంటిని నిర్వర్తించే పద్ధతితో సంతృప్తి చెందడం ద్వారా గొప్ప విజయాన్ని సాధించవచ్చు. అంతే కాకుండా మీ ఇంటిలోని ఇతర వ్యక్తులు కూడా మీరు సాధించిన దాని పట్ల చాలా గర్వంగా ఉంటారు. వారు మీపై ఎక్కడలేని అభిమానాన్ని పెంచుకుంటారు. మీరు కూడా తమ విజయంలో ఒక భాగం అని వారు నమ్ముతారు. మీరు లేకుండా ఇంటిని వారు నడిపించలేరు. ఎందుకంటే చాలా మంది వ్యక్తుల జీవితాల్లోకి గృహిణి వచ్చిన తర్వాత వారి పనులు తగ్గడం, ఆదాయం పెరగడం వంటి అనేక మార్పులను గమనించారు. అంతే కాకుండా ఇంటి పనుల నుంచి కూడా వారికి ఉపశమనం కలుగుతుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా గొప్ప విజయంగా కూడా భావించొచ్చు. అయినప్పటికీ గృహిణి పాత్ర అనేది ఆమె చేయాల్సిన పనుల జాబితా అనేది మరియు కెరియర్ కూడా ఇంటిలో నివసించే ఇతర వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంటికి ఉండే అవసరాలు మారుతూ ఉంటాయి. అందుకే కొంత మంది ఫుల్ టైమ్ హోమ్ మేకర్​కి బదులు పార్ట్​ టైమ్ హోమ్ మేకర్​ని నియమించుకోవాలని అనుకోవచ్చు.

గృహిణిగా ఉండటం కష్టమేనా?

గృహిణులు నిరంతరం తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు తమను తాము అన్వయించుకోవాలి. కుటుంబం యొక్క ఆదాయం లేదా గృహిణికి ఉన్న నైపుణ్యాల ద్వారా చుట్టూ ఉన్న పరిసరాలు ప్రభావితం అవుతాయి. గృహిణి వృత్తిలో ఒక నిర్దిష్టమైన టైమింగ్స్ అంటే ఏమీ ఉండవు. ఆ టైమింగ్స్​ను బట్టి పని చేయాల్సిన అవసరం లేదు. అది మాత్రమే కాదు గృహిణి ప్రేరణ మరియు క్రమశిక్షణ అనే రెండు ముఖ్యలక్షణాలను కలిగి ఉండాలి. ఓర్పు, మానవత్వం, అర్థం చేసుకునే గుణం అనేవి ఇంటిని విజయవంతంగా నడపడంలో సహాయం చేసే ఇతర లక్షణాలు. తద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతున్న ఇల్లు ఒక గృహిణికి బహుమతిగా లభిస్తుంది.

గృహిణికి జీతం చాలా ఎక్కువగా ఉంటుందా?

నిజం చెప్పాలంటే గృహిణులు ఎటువంటి జీతాలు సంపాదించరు. కానీ ఇంటి మొత్తం ఆదాయాన్ని ఇంటిలోని ఇతర పనులు చేసేవారితో పంచుకుంటారు. ఈ ఉద్యోగాన్ని ఎంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్. ఇది పని చేయడాన్ని సులభం చేస్తుంది. ఇంటిలోపల మరియు వెలుపల విశ్రాంతి కార్యకలాపాలను కొనసాగించడానికి గృహిణులు కూడా అర్హులే. కొన్ని సార్లు గృహిణులు తమ సొంత ప్రయోజనాలైన హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వాటిని పొందాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గృహిణులు తమ ఇళ్ల వెలుపల ఉద్యోగాలు చేస్తున్న కంపెనీల నుంచి ప్రయోజనం పొందుతారు. ఈ ప్రయోజనాలను కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఆస్వాదించవచ్చు. అనేక న్యాయస్థానాలు మరియు న్యాయవాదులు గృహిణుల ఆర్థిక స్థితి మెరుగుపడేలా అనేక చట్టాలను తయారు చేస్తున్నారు. గృహిణి పాత్రను ఒక విలువైన పాత్రగా పరిగణించాలి. అంతేకానీ ఇబ్బందికరంగా ఉండే జాబ్​గా పరిగణించకూడదు.

గృహిణి అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడకూడదు?

గృహిణిగా ఉంటున్నామని చెప్పుకునేందుకు మీకు ఇబ్బందిగా అనిపిస్తే.. ఇది మీరు సంతృప్తికరంగా మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం లేదని సూచిస్తుంది. చాలా మంది వ్యక్తులు బయటివారు ముఖ్యంగా అపరిచితులు ఏమని అనుకుంటారో అని భయపడతారు. అలాంటప్పుడు వివిధ పత్రాలపై వారు చేస్తున్న పనిని పేర్కొనడం చాలా కష్టం అవుతుంది. అంతే కాకుండా మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. వారు ఏదో అనుకోవడం వల్ల మీ జీవితంలో ఏదీ చేంజ్ కాదు. మీరు దానిని పర్సనల్​గా తీసుకుని మానసికంగా క్షోభ చెందితే తప్ప ఏదీ చేంజ్ కాదు. గృహిణి పాత్ర అనేది ఈ సమాజానికి ఈ కల్చర్​కు చాలా ముఖ్యమైనది. వారు తాము చేసే పనికి విలువ ఇస్తున్నారా? లేదా అనే విషయం మీద ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతి ఇంటిని అందులో నివసించే వ్యక్తే తీర్చిదిద్దుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి వ్యక్తులు సంస్కృతి, దేశం అదే విధంగా మంచి సమాజాన్ని రూపొందించడంలో కూడా సహాయం చేస్తారు. చివరికి ఇది వివిధ రంగాల్లో పురోగతికి దారి తీస్తుంది.

గృహిణి ఎందుకు ముఖ్యం?

నిజానికి ఇంటిని మెయింటేన్ చేయడం ఒక గౌరవప్రదమైన పని. గృహిణిగా ఉన్న వ్యక్తులు ఇక్కడ ‘‘డొమెస్టిక్ ఇంజనీర్” వంటి పెద్ద పెద్ద పదాలను జోడించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా గౌరవప్రదమైన పోస్ట్. ఒక వేళ గృహిణి ఇంట్లో రోజూ నిర్వహించే పనులకు డబ్బు చెల్లించాల్సి వస్తే తల్లి యొక్క ఉద్యోగ పాత్రను పోలి ఉంటుంది. మీరు నివసించే ప్రాంతం, మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ, ఉండే కల్చర్​తో సంబంధం లేకుండా గృహిణి వృత్తి అనేది ఎల్లప్పుడూ విలువైందే.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.