This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భవతిగా ఉన్నప్పుడు పాలకూర తినటం | ప్రయోజనాలు & దుష్ప్రభావాలు

Pregnancy Best Foods
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భవతిగా ఉన్నప్పుడు పాలకూర తినటం | ప్రయోజనాలు & దుష్ప్రభావాలు
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భవతి మహిళలకి పాలకూర అద్భుతమైన ఆహారం, ఇందులో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అలాగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, కానీ మితంగా తినాలి.
  • పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ పుట్టుక సమయంలో వచ్చే వైకల్యాలని నివారిస్తుంది, ఐరన్ రక్త పరిమాణాన్ని పెంచుతుంది, కాల్షియం రక్తపోటుని నియంత్రించడంలో సాయపడుతుంది.
  • అతిగా పాలకూర తినటం వలన కిడ్నీ రాళ్ళు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు, మూడవ ట్రైమిస్టరులో రక్తస్రావం వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు.
  • ప్రెగ్నెన్సీలో పోషకాహారానికి ఏ ఉత్పత్తులు సాయపడతాయి? Explore our Baby Wellness Kit | Skincare Gift Set for Newborns.
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9

కడుపుతో ఉన్న మహిళలు తినే డైట్లో కావలసిన అన్ని రకాల పోషకాలు చేర్చి తీరాలి. పాలకూర గర్భవతి మహిళలకి కావలసిన ప్రొటీన్, కాల్షియం, ఐరన్ అలాగే విటమిన్లు అన్నీ కలిగివుండే అద్భుతమైన ఆహారపదార్థం. ఇది అమరాంథసీ అనే వృక్ష కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క, అలాగే దీనితో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

కడుపుతో ఉన్నప్పుడు పాలకూర తినటం మంచిదేనా?

ప్రెగ్నెన్సీ సమయంలో పాలకూర తినడం మంచిదేనా? అవును, కానీ మితంగా తింటే మాత్రమే. గర్భవతులైన మహిళలు తమ డైట్లో తప్పనిసరిగా జోడించుకోవాల్సినది ఫోలిక్ యాసిడ్ ఉన్న పదార్థాలు. ఈ ఫోలిక్ యాసిడ్ పాలకూరలో ఎక్కువగా లభిస్తుంది. ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్లని తీసుకోవడం వలన పుట్టుక సమయంలో వచ్చే వైకల్యాలని నివారించవచ్చు. ఈ ఆకుకూరలో ఐరన్ కూడా ఉంటుంది, ఇది ప్రెగ్నెన్సీ సమయంలో కావలసిన మరొక విటమిన్. కానీ పాలకూరని కూడా అతిగా తినకుండా చూసుకోవాలి. ఉదాహరణగా చెప్పాలంటే కిడ్నీలలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉన్న గర్భవతులైన మహిళలు పాలకూరని పరిమితంగానే తినవలసి ఉంటుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారంలో చిరుధాన్యాలని తినడం వలన వచ్చే లాభాలు

పాలకూర యొక్క పోషక విలువ

ప్రెగ్నెన్సీ సమయంలో పాలకూరని తినడం మంచిది. పాలకూరలో విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, అలాగే రాగి ఎక్కువగా ఉంటాయి. అదనంగా, పాలకూర పీచుపదార్థానికి, ఫ్లేవనాయిడ్లు ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకి మంచి వనరు కూడా. పాలకూరలో తల్లీబిడ్డ ఇద్దరికీ మంచి చేసే చాలా రకాల పోషకాలు ఉన్నాయి.

100 గ్రాముల పాలకూర ఈ కింది పోషకాలని అందిస్తుంది:

  • 23 కిలోకేలరీలు.
  • 99 మిల్లీగ్రాముల కాల్షియం.
  • 79 మిల్లీగ్రాముల మెగ్నీషియం.
  • 558 మిల్లీగ్రాముల పొటాషియం.
  • 28.1 మిల్లీగ్రాముల విటమిన్ C.
  • 194 గ్రాముల ఫోలేట్.
  • 49 మిల్లీగ్రాముల ఫాస్పరస్.
  • 79 మిల్లీగ్రాముల సోడియం.

గర్భవతిగా ఉన్నప్పుడు పాలకూర తినటం వలన వచ్చే లాభాలు

గర్భవతిగా ఉన్నప్పుడు పాలకూర తినటం ఈ కింది మార్గాలలో లాభదాయకంగా ఉండవచ్చు.-

1.ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్: కడుపుతో ఉన్నప్పుడు శరీరంలో రక్త పరిమాణం 30% నుండి 50% వరకూ పెరుగుతుంది. దీనివల్ల శరీరానికి ఐరన్ ఇంకా ఫోలిక్ యాసిడ్ అవసరం పెరుగుతుంది. క్రమం తప్పకుండా పాలకూరని తినడం వలన శరీరానికి అవసరమైన ఐరన్ అందటంలో సాయపడుతుంది.

2. కాల్షియం: ఒంట్లో కాల్షియం ఎక్కువ అవటం వలన తక్కువ రక్తపోటుకి దారితీస్తుంది. అయితే కాల్షియం స్థాయి తక్కువ అవటం వలన ప్రెగ్నెన్సీ-సంబంధిత రక్తపోటుకి కారణం కావచ్చు. పాలకూరలో కాల్షియం యొక్క జీవలభ్యత బిపి స్థాయిని నియంత్రించడంలో సాయపడుతుంది.

3. విటమిన్లు: విటమిన్లకి అద్భుతమైన వనరు అయిన పాలకూర వలన రోగనిరోధక వ్యవస్థ బలపడవచ్చు. గర్భవతులైన మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో పాలకూరని తింటే, వారు రోజువారీ సూచించబడిన విటమిన్ A పరిమాణాన్ని చేరుకోగలరు. పాలకూరలో విటమిన్ B కూడా ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డ యొక్క నాడీ వ్యవస్థ యొక్క ఎదుగుదలకి అవసరం.

గర్భవతిగా ఉన్నప్పుడు పాలకూరని తినటం వలన వచ్చే దుష్ప్రభావాలు

ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా పాలకూర మంచిదే. కానీ మరీ ఎక్కువగా పాలకూరని తినడం వలన కొన్ని ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు, అవేంటంటే:

  • ప్రెగ్నెంట్ మహిళలలో, ముఖ్యంగా రెండవ అలాగే మూడవ ట్రైమిస్టరులలో కాల్షియం ఫాస్ఫేట్ కిడ్నీ రాళ్ళు ఎక్కువగా రావచ్చు. అంతేకాదు, ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలని తినడం వలన మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రావచ్చు. కానీ, పాలకూరని మితంగా తినడం వలన ఈ ఇబ్బందులు తలెత్తవు.
  • తల్లి కాబోయే మహిళలని సాల్మోనెల్లొసిస్ అలాగే లిస్టెరోసిస్లు ప్రభావితం చేయగలవు. పాలకూర ఆకులలో బ్యాక్టీరియా చేరి ఉంటే అవి తిన్నప్పుడు డయేరియాకి కలగవచ్చు. అందుకని, తినేముందు ఆ ఆకులని బాగా కడిగి వండుకోవటం చాలా ముఖ్యం.
  • సాలిసిలేట్ ముఖ్యంగా మూడవ ట్రైమిస్టరులో రక్తస్రావం జరిగేలా చూడగలదు, ప్రసవాన్ని పొడిగించగలదు. చివరి నెలలలో పాలకూరని తినడాన్ని తగ్గించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇందులో సాలిసిలేట్ ఉంటుంది.
  • పీచుపదార్థం ఉండే పాలకూర జీర్ణక్రియ సాఫీగా కొనసాగేలా సాయపడుతుంది. కానీ కొంతమంది గర్భవతులైన మహిళలు దీన్ని ఎక్కువగా, ముఖ్యంగా పచ్చిగా తినడం వలన గుండెల్లో మంట అలాగే గ్యాస్ ను పొందుతారు.

కడుపుతో ఉన్నప్పుడు పాలకూరని ఎంత మొత్తంలో తినటం సురక్షితమైనది?

కడుపుతో ఉన్నప్పుడు భోజనంలో భాగంగా అరకప్పు పాలకూరని తినవచ్చు. గర్భసమయంలో పాలకూరని మితంగానే తినాలి ఎందుకంటే అతిగా తింటే చాలా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. పాలకూర ఆకులు తాజాగా, మచ్చలు, రంధ్రాలు లేనంతవరకూ గర్భవతి మహిళలు దాన్ని సలాడ్ గా తినవచ్చు. అదనంగా, సలాడ్లో ఆకులని వేసేముందు వాటిని బాగా కడగాల్సి ఉంటుంది, అలాగే వెంటనే తినాలి కూడా.

ప్రెగ్నెన్సీ సమయంలో తినే డైట్లో పాలకూరని ఎలా చేర్చుకోవాలి

కడుపుతో ఉన్నప్పుడు పాలకూరని చాలా విధానాలలో తిని ఆనందించవచ్చు-

  • మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజన సమయంలో ఒక బౌల్ నిండా పాలకూర సూప్.
  • రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన, చీజ్ తో కూడిన పాలకూర ఆమ్లెట్.
  • ఒక గ్లాసు ఆరోగ్యకరమైన పాలకూర స్మూతీ కూడా మంచి ప్రత్యామ్నాయం కావచ్చు.
  • పాలకూరని వెజిటబుల్ సలాడ్ కి కూడా జత చేయవచ్చు.
  • పాలకూరని వేగంగా వేయించటానికి వెల్లుల్లి అలాగే ఆలివ్ నూనెని కూడా ఉపయోగించవచ్చు. దీన్ని బ్రెడ్ తో కలిపి సర్వ్ చేస్తారు.
  • ప్రెగ్నెన్సీ సమయంలో పాలకూరని తినటం మంచిదే, అది గర్భవతులకి కావలసిన ప్రొటీన్, కాల్షియం, ఐరన్,అలాగే విటమిన్ల వంటి పోషకాలని అందిస్తుంది. కాకపోతే పాలకూరని అతిగా తినకుండా మితంగా తినటం మంచిది.

అలాగే, కడుపుతో ఉన్నప్పుడు ఆహారంలో ఏ రకమైన మార్పులు లేదా చేర్పులు చేసేముందు స్పెషలిస్టుని సంప్రదించటం ఎప్పుడూ మంచిది. గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా అవసరమైన ఆహారాన్ని, మందులని చేర్చేటప్పుడు లేదా తొలగించేటప్పుడు మీ గైనకాలజిస్టుని తప్పక సంప్రదించండి.

గర్భిణీ తల్లుల పోషణకు నమ్మకమైన తోడు

ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం కావలసిన పోషకాలని అందించే ఉత్పత్తులు మీ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

419 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2006 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.